కొనసాగుతున్న చమురు తెట్టు తొలగింపు పనులు
పొన్నేరి: సముద్రతీరంలోని చమురు తెట్టు తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల తీరును తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎ.సుందరవల్లి, రెండురోజులుగా అక్కడే ఉండి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. చెన్నై శివారులోని ఎన్నూర్ కామరాజర్ నౌకాశ్రయం సమీపంలో రెండు భారీ నౌకలు ఢీకొన్న సంగతి తెలిసిందే. దీంతో నౌకల్లోని చమురు ట్యాంకర్లు పగిలిపోవడంతో చమురు మొత్తం సముద్రంలో కలిసింది. దీంతో అక్కడ నీరు మొత్తం కలుషితమైంది. దీంతో సముద్రంలోని చేపలు, తాబేళ్లు పెద్దసంఖ్యలో మృతిచెందాయి. అలాగే సముద్ర తీరంలోకి చమురు తెట్టు కొట్టుకుని వచ్చింది.
దీంతో ఆ నీరు తాకిన వారికి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో జాలర్లు నాలుగు రోజులుగా చేపలవేటకు పోవడం లేదు. దీంతో వారు పస్తులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. చమురుతెట్టు ఎన్నూర్, కాశిమేడులకు ఎక్కవగా చేరింది. దీంతో చమురు తెట్టు తమకు అంటుకుంటే చర్మవ్యాధులు వస్తాయని జాలర్లు ఇళ్లలోనుంచి బయటకు రావడం లేదు. కోస్టుగార్డులు రంగంలోకి దిగి స్విమ్మర్లు, యంత్రాలతో చమురు తెట్టును తొలగిస్తున్నారు. వీరితోపాటు అగ్నిమాపక దళ సిబ్బంది, మద్రాస్ పోర్టు ట్రస్టు సిబ్బం ది, ఎన్నూర్ పోర్టు ఉద్యోగులు, రాష్ట్ర రహదారుల శాఖ ఆదాని పోర్టు, ఐవోసీ, చెన్నై మెట్రోవాటర్, తిరువళ్లూరు జిల్లా రెవెన్యూ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు మొత్తం 1,100 మందికిపైగా సిబ్బంది వచ్చి చమురుతెట్టును తొలగిస్తున్నారు.
అయితే ఇప్పటికీ దాదాపు 44 టన్నుల మేరకు నూనె ని ల్వలు, 29 టన్నుల ఆయిల్ నీటి మిశ్రమాలను తొలగించినట్టు కలెక్టర్ సుందరవల్లి పేర్కొన్నారు. అలాగే సముద్రపునీరు కలుషితం కావడంతో అక్కడ పట్టే చేపలు తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రజల్లోకి ఒక వార్త వెళ్లడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్, మంత్రి బెంజిమెన్ ఎన్నూర్, కుప్పాలలో పర్యటించి జాలర్లతో మాట్లాడి వారి సమక్షంలోనే చేపల వంటతో సహపంక్తి భోజనం చేశారు.ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు ధైర్యం చెప్పారు. మంత్రి డి.జయకుమార్ మాట్లాడుతూ చమురుతెట్టు వలన సముద్రతీరంలో దుర్గంధం వస్తుందని దీంతో బీచ్‌కు సరిగ్గా జనం రావడం లేదని చెప్పారు. అధికారులు చమురుతెట్టు తొలగింపు పనులను సాధ్యమైనంత త్వరగా చేయాలని కోరా రు. ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మంత్రులతో పాటు పొన్నేరి ఎమ్మెల్యే బలరామన్ ఉన్నారు.