యువకులను మోసగిస్తున్న యువతి అరెస్ట్‌ | young women held for cheating many Youth in Mysore | Sakshi
Sakshi News home page

యువకులను మోసగిస్తున్న యువతి అరెస్ట్‌

Published Wed, Aug 30 2017 8:28 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

యువకులను మోసగిస్తున్న యువతి అరెస్ట్‌ - Sakshi

యువకులను మోసగిస్తున్న యువతి అరెస్ట్‌

మైసూరు: సామాజిక మాధ్యమాలు, ఫోన్ల ద్వారా యువకులతో పరిచయం పెంచుకొని వారిని నిర్జన ప్రదేశాలకు పిలిపించుకొని తన ముఠాతో బెదిరిస్తూ దోపిడీకి పాల్పడుతున్న యువతిని మంగళవారం మైసూరు దక్షిణ గ్రామీణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలోని అశోకపురానికి చెందిన మాలా సామాజిక మాధ్యమాలు, ఫోన్ల ద్వారా యువకులతో పరిచయం చేసుకుంటుంది. అనంతరం ప్రతిరోజు వారితో ఫోన్లలో మాట్లాడుతూ వారితో మరింత చనువు పెంచుకొని వారికి ఎటువంటి అనుమానం కలుగకుండా ఖాళీ చెక్కులను తీసుకుంటుంది.

ఇలా కొద్ది రోజులు సాగిన అనంతరం కలవాలంటూ యువకులు నిర్జన ప్రదేశానికి తీసుకెళుతుంది. అనంతరం అప్పటికే అక్కడే మాటు వేసిన తన ముఠా సభ్యులతో కలసి యువకులను మారణాయుధాలతో బెదిరించి నగదు, ఆభరణాలు దోచుకోవడంతో పాటు బలవంతంగా ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకుంటుంది. ఇలా ఇటీవల మాలా దోపిడీకీ గురైన జే.పీ.నగర్‌కు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం మాలాను అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement