గర్రెపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి (ఫైల్)
సాక్షి, పెద్దపల్లి : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో జిల్లాలో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికలకు క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు మొదలు పెట్టాయి. అభివృద్ధి కార్యక్రమాలు, క్యాడర్ సమావేశాలతో అధికార టీఆర్‌ఎస్ వేగం పెంచింది. ఇక ఆందోళన కార్యక్రమాలతో ప్రజల్లో స్థానం సంపాదించడంపై
ప్రతిపక్ష కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో గట్టెక్కాలనుకుంటున్న బీజేపీ యాత్రతో జనాలను చైతన్యం చేసే పనిలోపడింది.
టీఆర్‌ఎస్ అభివృద్ధి మంత్రం
ముందస్తు ఎన్నికలు రానున్నాయనే సంకేతాలను స్వయంగా సీఎం కేసీఆర్ ఇవ్వడంతో అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీడ్ పెంచారు. పలు అభి వృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ వస్తే అభివృద్ధి పనులకు బ్రేక్ పడనుండడంతో, ఆలోగానే వీలైనన్ని పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గ్రామాలను యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. పెద్దపల్లి, రామగుండం, మంథని ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిత్యం ఏదో ఒక గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేలా చూసుకొంటున్నారు. పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరిచేందుకు సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు, గ్రామస్థాయి పర్యటనలు విని యోగించుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ నిర్వహిస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న నేతలను మచ్చిక చేసుకునేపనిలో పడ్డారు. క్యాడర్‌ను సమాయత్తం చే స్తూ, ప్రజల్లో పార్టీని మరింత విస్తృత పరిచేందుకు ప్రభు త్వ పథకాలను వినియోగించుకుంటున్నారు.
ప్రజాసమస్యలపై కాంగ్రెస్ ఆందోళన బాట..
ఎప్పటినుంచో డిసెంబర్‌లో ఎన్నికలు వస్తాయని బహిరంగ వేదికలపై చెబుతూ వస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా సన్నాహాలు చేసుకొంటోం ది. ప్రజాసమస్యల సాధనకు ఆందోళనలతో ముందస్తు బాటలు వేసుకుంటోంది. మంథని ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించే డిమాం డ్‌తో ఇటీవల పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో బుధవారం పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన చేశారు. రామగుండం ప్రాంత సాగునీటి సమస్యల పరిష్కారానికి గతంలోనే శాప్ మాజీ చైర్మన్ మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పాదయాత్రతోపాటు పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాఆరు. ఈ నెల 10వ తేదీలోగా పార్టీ కమిటీలను పూర్తి చేసే దిశగా పార్టీ అధిష్టానం చర్యలు చేపడుతోంది. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు, ఆశావహులు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి, ఈర్ల కొమురయ్య, చేతి ధర్మయ్య, గీట్ల సవితారెడ్డి, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ తదితరులు ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు పెంచారు.
జన చైతన్యానికి బీజేపీ యాత్ర..
ప్రధాని నరేంద్రమోదీ చరిష్మా, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యూహాత్మకతతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పట్టు సాధించాలని భావిస్తు న్న బీజేపీ మార్పు కోసం పేరుతో జన చైతన్య యాత్ర చేపట్టింది. గతంలో పెద్దపల్లి అసెంబ్లీ స్థానాన్ని సొంతం చేసుకున్న చరిత్ర బీజేపీకి ఉండడంతో, జిల్లాపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ రెండు రోజులపాటు జిల్లాలో జనచైతన్య యాత్ర నిర్వహించారు. మంగళవారం గోదావరిఖనిలో బహిరంగసభ, బుధవారం పెద్దపల్లిలో రోడ్‌షో చేపట్టారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి నుంచి గర్రెపల్లి వరకు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. రెండు రోజుల లక్ష్మణ్ పర్యటన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, దుగ్యాల ప్రదీప్‌కుమార్, ఎస్.కుమార్, బల్మూరి వనిత తది తరులు యాత్రలో పాల్గొన్నారు. ఏదేమైనా ముం దస్తు సంకేతాలతో జిల్లాలో అన్ని పార్టీల కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. అసలే రాజకీయ సందడి కాస్త ఎక్కువగా ఉండే జిల్లాలో, ముం దస్తు ప్రచారం రాజకీయ వేడిని మరింత పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment