సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గట్లేదు. శుక్రవారం మళ్లీ 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 33 నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. మరో 7 కేసులు వలసదారులకు సంబంధించినవని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిపై శుక్రవారం బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో మొ త్తం కరోనా కేసుల సంఖ్య 1,454కు చేరుకుందని పేర్కొన్నారు. శుక్రవారం 13 మం ది కోలుకున్నారు. వారిలో హైదరాబాద్‌కు చెందినవారు ఐదుగురు ఉన్నారు. వికారా బాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరున్నారు. ఈ 13 మంది తో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 959 మం ది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 34 మంది చనిపోగా, ప్రస్తు తం 461 మంది చికిత్స పొందుతున్నారన్నారు.
(చదవండి: తెలంగాణ: ఆ నాలుగు జోన్లలోనే యాక్టివ్ కేసులు)
ఒకే చోట 16 కేసులు నమోదు
జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో మంగళ్‌హాట్‌లోనే ఏకం గా 16 కేసులు నమోదయ్యాయి. మలక్‌పేట్ అక్బర్‌బాగ్‌లో ఒకే ఇంట్లో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇరుకైన గదుల్లో 5 నుంచి 10 మంది కలసి నివసిస్తుండటం, భౌతిక దూరం పాటించక పోవడంతో ఇక్క డ ఈ వైరస్ వ్యాపిస్తోంది. మంగళ్‌హా ట్ కామటిపురలో ఓ వస్త్రదుకాణంలో పని చేసే 45 ఏళ్ల వ్యక్తికి ఈ నెల 11న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒకేచోట ఉ న్న ఆరు కుటుంబాలకు కలిపి.. ఒకే బాత్‌రూమ్ ఉండటంతో పాజిటివ్ వచ్చిన వ్యక్తి వాడిన మరుగుదొడ్డినే అక్కడే ఉన్న మరో 30 మంది ఉపయోగించినట్లు గుర్తించి వారిని క్వారంటైన్‌కు పంపారు. వారికి పరీక్షలు నిర్వహించగా, 15 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
(చదవండి: అనుబంధ వ్యవ‘సాయా’నికి!)
తెలంగాణ: కరోనా బారిన మరో 40 మంది
Published Fri, May 15 2020 9:08 PM | Last Updated on Sat, May 16 2020 3:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment