మెదక్: మెదక్ మండలం పోచారం వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో వన్యప్రాణుల గుర్తింపు ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. అయిదు రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు ఆరు చిరుతలను గుర్తించారు.
మెదక్ మండలం రాజిపేట బీట్‌లో రెండు రామాయంపేట మండలం పర్వతాపూర్ బీట్‌లో రెండు, నిజామాబాద్ జిల్లా పెద్దాయిపల్లి బీట్‌లో రెండు చిరుతలు మొత్తం ఆరు ఉన్నట్లు తేల్చారు. తాగునీటి వనరుల వద్ద అడుగులు, మలమూత్రాల ఆధారంగా వీటి జాడలను పసిగడుతున్నట్లు అధికారులు తెలిపారు.