యాదాద్రి (నల్లగొండ) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలోని యాదాద్రి ఆలయం 8 రాజగోపురాలతో అందంగా తయారుకానుంది. ఈ ఆలయం సుమారు రెండున్నర ఎకరాల్లో రూపుదిద్దుకోనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పిల్లర్ల పనులు మొదలయ్యాయి. శివాలయం ఎదుట 150 అడుగుల ఆంజనేయ స్వామి కంచు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహం బెంగళూరులో తయారవుతున్నట్లు సమాచారం.
ఆలయం చుట్టూ రిటైనింగ్ వాల్, తిరుమాడ వీధులు ఉంటాయి. రాజగోపురాలపై ప్రత్యేక శిల్పాలను చెక్కిస్తున్నారు. ఈ శిల్పాలు తయారు చేయడం కోసం ప్రత్యేక కళాకారులను ఆహ్వానించారు. వచ్చే వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండాలనే లక్ష్యంతో నిర్మిస్తున్నారు. ఆర్కిటెక్టులు, స్థపతులు, శిల్పకళాకారులు, అనుభవం కలిగిన ఇంజనీర్లు నిర్మాణ రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు.