ఆదిలాబాద్ క్రైం : మావోయిస్టు బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. మావోయిస్టుల దాడుల్లో అమాయక ప్రజలు నేలకొరిగారు. అనేక కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయాయి. 1996 సంవత్సరం కంటే అనేక మంది అమాయాక ప్రజలు చనిపోయారు. గత ప్రభుత్వాలు 1996 మావోయిస్టు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు 2014 ఫిబ్రవరి 21న జీవో ఎంఎస్-50ని జారీ చేశాయి. జీవో ప్రకారం 1996 కంటే ముందు మావోయిస్టు చేతుల్లో చనిపోయిన బాధిత కుటుంబాలను గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి.
ఆ కుటుంబాలకు అర్హత ఉన్న వారికి ఉద్యోగం లేదా రూ.5 లక్షల నష్టపరిహారాన్ని అందించేందుకు ముందుకొచ్చాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీలు కూడా బాధిత కుటుంబాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా 57 మంది బాధిత కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో జారీ అయింది. ప్రస్తుతం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైనే బాధితులు ఆశలు పెట్టుకున్నారు. కాగా బాధిత కుటుం బాలు తమకు ఉద్యోగమే కల్పించాలని కోరుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొంతమంది కుటుంబాల్లో ఉద్యోగులు ఉండడంతో ఆ కుటుంబంలో ఉద్యోగం కల్పించాలా? రూ.5 లక్షలు ఇవ్వాల అనే దానిపై చర్చ సాగుతున్నట్లు సమచారం. ఏదేమైన దీనిపై త్వరగా నిర్ణయం తీసుకొని తమను ఆదుకోవాలని మావోయిస్టు బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
మావోయిస్టు బాధిత కుటుంబాలకు అందని సాయం
Published Tue, Aug 12 2014 2:01 AM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM
Advertisement
Advertisement