సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ స్థాయీ సంఘాలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. బుధవారం జెడ్పీ చైర్‌పర్సన్ అధ్యక్షతన సమావేశమైన జిల్లా పరిషత్ పాలకవర్గం ఏడు స్థాయీ సంఘాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, విద్య-వైద్య ఆరోగ్యం, మహిళ -శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనులు, ఆర్థిక కమిటీలకు చైర్మన్లతోపాటు సభ్యుల పేర్లను ప్రకటించింది.
ఇందులో ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్య-వైద్య ఆరోగ్యం, పనుల కమిటీలకు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సునీతారెడ్డి చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. వ్యవసాయ కమిటీకి జెడ్పీ వైస్ చైర్మన్ పి.ప్రభాకర్‌రెడ్డి, మహిళ-శిశు సంక్షేమ కమిటీకి మేడ్చల్ జెడ్పీటీసీ జేకే శైలజ, సాంఘిక సంక్షేమ కమిటీకి బషీరాబాద్ జెడ్పీటీసీ కే.సునీత చైర్‌పర్సన్లుగా నియమితులయ్యారు.
మిత్రపక్షానికి రెండు..
జెడ్పీ స్థాయి సంఘాల ఏర్పాటులో అధికారపక్షం తనదైన ముద్ర వేసింది. మొత్తం ఏడు స్థాయి సంఘాలకుగాను ఐదింటికిటీఆర్‌ఎస్ పార్టీ జెడ్పీటీసీలే చైర్‌పర్సన్లుగా నియమితులయ్యారు. జెడ్పీ చైర్మన్ ఎన్నికలో సహకరించిన టీడీపీ జెడ్పీటీసీలకు మిగతా రెండు కమిటీలకు చైర్‌పర్సన్లుగా కట్టబెట్టారు. జిల్లాపరిషత్‌లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చైర్మన్‌గిరీ దక్కకపోవడంతో.. కేవలం కమిటీలకు సభ్యులగానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇవే కీలకం..
జిల్లా పరిషత్ ద్వారా చేపట్టే ప్రతి పనికి స్థాయిసంఘాల ఆమోదం తప్పనిసరి. నిర్దేశిత ఏడు స్థాయి సంఘాలు తమ పరిధిలోని అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి అభివృద్ధికి కార్యచరణ రూపొందిస్తాయి. అనంతరం వీటిని జిల్లా పరిషత్ సమావేశంలో ఆమోదించిన అనంతరం కార్యరూపం దాల్చుతాయి. ఇంతటి కీలకమైన స్థాయి సంఘాల ఏర్పాటులో ప్రతిపక్షానికి నామమాత్రపు సభ్యత్వం ఇవ్వడంపై కాంగ్రెస్‌పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి.
ఎట్టకేలకు..
Published Wed, Sep 10 2014 12:10 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement