వచ్చే జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భూపాలపల్లిలో కేటీపీసీ స్టేజ్-02లోని నిర్మించిన 600 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. వరంగల్ నగర అభివృద్ధి, టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం, మిషన్ భగీరథ, కాకతీయ కాల్వల మరమ్మతులు, మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనున్నారు.