కాంగ్రెస్ ‘రైతు భరోసా’ యాత్ర
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గురువారం జిల్లాలో పర్యటించనుంది. జి ల్లాలో కరువు పరిస్థితులు, కరెంట్ కోత లు, రైతుల ఆత్మహత్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ మేరకు కా ర్యాచరణ సిద్ధం చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో టీపీపీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం జిల్లా లో పర్యటించాలని నిర్ణయించినట్లు తెలి సింది. పీసీసీ మాజీ చీఫ్, శాసనమండలిలో కాంగ్రెస్‌పక్ష నేత డి.శ్రీనివాస్, మా జీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ అలీ షబ్బీర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా ప ర్యటనలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ తదితర నియోజకవర్గాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా వ్యాప్తంగా మూడు నెలల వ్యవధిలో 12 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం, దోమకొండ, మాచారెడ్డి, లింగంపేట తదితర మండలాలలో పంటచేలకు రైతులు నిప్పంటించడం.. వరి చేలలో పశువులను వదిలిన సంఘటనలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కూడ పరామర్శిస్తారని తెలిసింది. ‘రైతు భరోసా’ యాత్రలో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, పార్టీ సీనియర్లు కె.జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డి.శ్రీనివాస్, మహ్మద్ అలీ షబ్బీర్‌తో పాటు పలువురు పాల్గొననున్నారు.