హైదరాబాద్ రక్షకభటులకు చిక్కిన మాజీ మిలటరీ మ్యాన్
వేములవాడ : జల్సాలకు అలవాటు పడిన వేములవాడకు చెందిన ఓ యువకుడు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఇటీవల హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. ఈ విషషయం మంగళవారం ఆలస్యం గా వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చజరుగుతోంది. వేములవాడ పట్టణానికి చెందిన ఓ యువకుడు నాలుగేళ్ల క్రితం మిలటరీలో చేరాడు. తుపాకీ మిస్‌ఫైర్ అరుున కేసులో అతడిని విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి సదరు యువకుడు జల్సాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో హైదరాబాద్, చుట్టుపక్క ప్రాంతాల్లో రాత్రి పూట ద్విచక్ర వాహనాలు అపహరించడంతోపాటు దొం గతనాలకు పాల్పడుతున్నాడు.
పోలీసులు తనిఖీ లు నిర్వహించిన క్రమంలో తన మిలటరీ కార్డు చూపించడం లేకపోతే ఎస్సైనంటూ, డిపార్టుమెం టు మనిషినని చెప్పుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా తనకున్న బొలెరోపై ప్రభుత్వ వాహనమని రాయించుకుని తిరుగుతున్నాడు. ఇతడికి వేములవాడకు చెందిన మరో యువకుడు సైతం తోడు కావడంతో వీరి ఆగడాలు యథేచ్ఛగా కొనసాగాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ బైక్ దొంగతనం కేసులో ఆనవాళ్లు దొరకడంతో సదరు యువకుడిని సికింద్రాబాద్ పోలీసులు పట్టుకుని కూపీ లాగారు.
దీంతో డొంకంతా కదలింది. పూర్తి వివరాలు సేకరించిన సికింద్రాబాద్ పోలీసులు కరీంనగర్ పోలీ సులకు సమాచారం అందించగా అతడిని కరీంనగర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది. అతడితో ఉన్న మరో యువకుడిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పొద్దంతా పోలీసు.. రాత్రంతా చోరీలు
Published Wed, Aug 12 2015 4:29 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement