కరీంనగర్(రాయికల్): కరీంనగర్ జిల్లా రాయికల్ మం అల్లీపూర్‌లో ఓ యువరైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన గంగారెడ్డి(25) మోటారు వేసేందుకు వెళ్లగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో గంగారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతుడి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.