కోమటిరెడ్డిపై మంత్రి ఫైర్‌ | Harish rao fires komiti Reddy | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డిపై మంత్రి ఫైర్‌

Published Tue, May 16 2017 7:21 PM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM

కోమటిరెడ్డిపై మంత్రి  ఫైర్‌

కోమటిరెడ్డిపై మంత్రి ఫైర్‌

నల్లగొండ: బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సభలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రవర్తించిన తీరుఫై మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. కోమటిరెడ్డి మార్కెట్ శంకుస్థాపన సభను చెడగొట్టాలని ఉద్దేశ్యంతో గొడవ చేశాడని ఆరోపించారు. తాము రైతుల బాగు కోసం కృషి చేస్తుంటే అడ్డుకోవడం సరి కాదన్నారు. రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవనే  ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణా అదో గతి పాలైందన్నారు.

ఇకనైనా కాంగ్రెస్ నాయకులు నాటకాలు ఆపాలని కోరారు. కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్నదని  కాంగ్రెస్  పార్టీ వాళ్లేనని ఆరోపించారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు అనంతరం మిర్యాలగూడ డీఎస్పీ ఆఫీసుకు తరలించారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు డీఎస్పీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement