కాళోజీ జీవితం దేశానికి ఆదర్శం
హన్మకొండ అర్బన్ : అస్తిత్వం కోసం జాతిని జాగృతం చేసిన ప్రజాకవి, మహనీయుడు కాళోజీ నారాయణరావు అని, ఆయన జీవితం దేశానికే ఆదర్శమ ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో తెలంగాణ భాషాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటాని కి పూలమాల వేసి నివాళి అర్పించారు. పలువు రు కవులు, కళాకారులు కాళోజీ జీవిత చరిత్ర తెలిపేల ప్రసంగాలు చేశారు. పాటలు పాడా రు.
కవితలు చెప్పారు. కలెక్టర్ వాకాటి కరుణ, ఎమ్మెల్యే టి.రాజయ్య పాల్గొన్న కార్యక్రమంలో వినయ్‌భాస్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మా ట్లాడారు. ఉమ్మడిరాష్ట్రంలో కాళోజీ మ్యూజి యం నిర్మాణానికి 300గజాల స్థలం కోసం ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. అదే స్వ రాష్ట్రంలో కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటుకు ప్రభుత్వం 3ఎకరాల భూమి కేటాయించిందని తెలి పారు. నైతిక విలువలు, మానవత్వం అంతరిం చి పోతున్న ప్రస్తుత తరుణంలో కాళోజీ వంటి మహనీయులు మళ్లీ పుట్టాలని ఆకాంక్షించారు.
కాళోజీ మార్గ్‌గా బాలసముద్రం రోడ్..
బాలసముద్రం ప్రధాన రోడ్డును కాళోజీ మార్గ్‌గా నామకరణం చేస్తున్నట్లు కలెక్టర్, కమిషనర్ ప్రకటించారు. ఇకపై అదేపేరుతో వ్యవహరించాలని వినయ్‌భాస్కర్ కోరారు.
నా.. నుంచి మ.. వరకు రాలేదన్నారు..
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ కరుణ మాట్లాడుతూ ‘నేను నా నుంచి మా వరకు రాలేద’ని కాళోజీ చెప్పడం ఆయన సా దారణ జీవితానికి అద్దం పడుతుందన్నారు. కాళోజీ ఓరుగల్లువాసి కావడం మనమంతా గ ర్వించదగ్గ విషయన్నారు. వల్లంపట్ల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. కాళోజీ యువతను ప్రో త్సహించేవారన్నారు. తన సహజశైలిలో పాట లు పాడి వల్లంపట్ల ఆకట్టుకున్నారు. గిరిజా మనోహర్‌బాబు మాట్లాడుతూ తక్కువ పదాలతో ఎక్కువ భావాన్ని వ్యక్తీకరించిన వ్యక్తి కా ళోజీ అన్నారు. జితేందర్ మాట్లాడుతూ కాళోజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు.
తెలంగాణ, కాళోజీ పైనా రచయిత్రి అనిశె ట్టి రజిత కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి. కలెక్టర్ సీసీ శ్రావణ్ వినిపించిన‘కాళోజీ... ను వ్వు మళ్లీ పుట్టాలి’కవిత అందరికీ ఆకట్టుకుం ది. కాళోజీ జీవితచరిత్రను తన వాగ్ధాటితో విని పించిన చిన్నారి మాస్టర్ అర్జున్‌ను సభికులు అ భినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా గిరిజా మనోహర్‌బాబు, వెలిపాటి రాంరెడ్డి, అనిశెట్టి రజిత, మహ్మద్ సిరాజుద్దీన్, బాలరా జులను అతిథులు శాలువాలతో సత్కరించా రు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఏజేసీ తిరుపతిరావు, డీఆ ర్వో శోభ, ఉద్యోగ సంఘాల నాయకులు రాజేష్‌కుమార్, జగన్మోహన్‌రావు, కాళోజీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.