కారు ఢీకొని వ్యక్తి మృతి
Published Thu, Jan 28 2016 2:37 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
పర్వతగిరి: కారు రివర్స్ తీస్తున్న సమయంలో కారు వెనక భాగాన ఉన్న వ్యక్తికి ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రంగు వీరవెంకయ్య(60) గ్రామంలోని తమ బంధువు ఇంటికి వెళ్లాడు. అదే ప్రాంతానికి వచ్చిన ఓ వ్యక్తి తన కారు రివర్స్ తీస్తూ వెనుక ఉన్న వెంకయ్యను గమనించకుండా ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement