'పాలన చూస్తే.. దొరలే బాసులు'
నిజామాబాద్ టౌన్: ప్రజలే బాసులని అని కేసీఆర్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని, పాలన చూస్తే దొరలే బాసులని అర్ధమౌతుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. నిజామాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. పేదల భూపంపిణీకి కాలపరిమితి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అవినీతి నిర్మూలనే ధ్యేయం అని టీఆర్‌ఎస్ చెప్పినప్పుడల్లా ఎస్సీలకు భయమేస్తుందన్నారు. ప్రతిసారి ఎస్సీలను బలిపశువులను చేస్తున్నారని అన్నారు. మంత్రులపై ఆరోపణలు వచ్చినపుడు ఎందుకు వేటు వేయడం లేదని ప్రశ్నించారు. దళితులను మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసే పనిలో పడ్డారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారని సూటిగా ప్రశ్నించారు.