మైనార్టీలపై చిన్న చూపేలా..!
బాన్సువాడ : ‘బాన్సువాడకు చెందిన లియాఖత్ అనే యువకుడు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణం కోసం ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. తనకు మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణం ఇవ్వాలని వేడుకున్నాడు. బ్యాంకులో రుణం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు అధికారులతో అనుమతి పత్రం పొందాడు. తీరా మైనార్టీ కార్పొరేషన్‌కు వెళితే బాన్సువాడకు కేటాయించిన టార్గెట్ పూర్తయిందని, ఈ ఏడాది రుణం ఇవ్వలేమని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు అతడి దరఖాస్తును పక్కనపెట్టారు. ఇలా సుమారు 46 మంది దరఖాస్తులను పక్కన పెట్టారు.
అయితే జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇంకా లక్ష్యం పూర్తి కాలేదు. అయినప్పటికీ వచ్చిన దరఖాస్తులను పక్కనపెట్టడంతో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది. ఇదీ ఎంఎఫ్‌సి(ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్) తీరు.’
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ నిరుద్యోగ యువకులకు 50 శాతం సబ్సిడీ రుణాల కోసం ఇచ్చిన లక్ష్యం జిల్లా వ్యాప్తంగా 1440 యూనిట్లు. అయితే జిల్లా వ్యాప్తంగా 1389 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా నిజామాబాద్ నగరం నుంచి 609 మంది దరఖాస్తు చేసుకోగా, కామారెడ్డి నుంచి 119, బాన్సువాడ నుంచి 102, ఏడపల్లి నుంచి 74, బీర్కూర్ మండలం నుంచి 50, కోటగిరి మండలం నుంచి 40, వర్నీ మండలం నుంచి 43 దరఖాస్తులు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు వచ్చాయి ఆయా మండలాలకు కేటాయించిన టార్గెట్ కంటే ఈ మండలాల్లో అధికంగా దరఖాస్తులు రాగా, మిగితా మండలాల్లో కేవలం 20లోపే దరఖాస్తులు వచ్చాయి.
వీటిలో ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ల ద్వారా 842 దరఖాస్తులు రాగా, పబ్లిక్ రిజిస్ట్రేషన్ ద్వారా 547 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఫీడ్ అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టార్గెట్ 1440 యూనిట్లు. కాగా, 1389 దరఖాస్తులే వచ్చారుు. ఇంకా 51 దరఖాస్తులు రావాల్సి ఉంది. అయితే ఎంఎఫ్‌సీ అధికారులు ఆయా మండలాలకు కేటాయించిన టార్గెట్‌నే పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన ప్రాంతాల్లోనూ టార్గెట్ ప్రకారమే ఎంపిక చేసి, మిగతా దరఖాస్తులను పక్కన పెడుతున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
తాము బ్యాంకు మేనేజర్లను ఒప్పించి రుణాల కోసం ఒప్పించామని, ఎంతో కష్టపడి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, ఎంఎఫ్‌సీ అధికారులు టార్గెట్ అయిపోయిందంటూ దరఖాస్తులను పక్కనపెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. 1389 దరఖాస్తులు రాగా, వాటిలో లక్ష్యం మించిపోయిన మండలాల నుంచి 432 ద రఖాస్తులను పక్కన పెట్టారనే సమాచారంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 1440 యూనిట్ల లక్ష్యం ఉండగా వాటిలో కేవలం 957 దరఖాస్తులనే పరిశీలించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా 51 దరఖాస్తులు తక్కువగా ఉన్నా, వాటిని భర్తీ చేయకుండా, ఏకంగా 432 దరఖాస్తులను పక్కన పెట్టడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీస్తున్నారు.
పబ్లిక్ రిజిస్ట్రేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న వాటిలో అసంపూర్తి పత్రాలు ఉన్నా, వాటిని పరిశీ లించలేదని తెలుస్తోంది. లక్ష్యం చేరుకోవడంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, బ్యాంకర్లతో ఎంపీడీఓలకు సమన్వయ లోపం కారణంగా లక్ష్యం దరిచేరడం లేదనే ఆరోపణలు ఉన్నా రుు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికల్లా ఈ లక్ష్యం పూర్తి కావాలి. గతంలో మైనారిటీ కార్పోరేషన్ ద్వారా ’లక్ష రుణం తీసుకుంటే గరిష్టంగా లక్షకు రూ.30 వేల రూపాయల సబ్సిడీ అందించే వారు. ఇప్పుడు దీన్ని సగానికి పెంచారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో జనాభా ప్రాతిపదికన వీటిని కేటాయించారు. ఈ రుణాల్లో 33 శాతం రుణాలను మహిళలకు అందజేయనున్నారు. అయితే బ్యాంకర్లు, ఎంఎఫ్‌సీ అధికారులు, మండల పరిషత్ అధికారుల సమన్వయ లోపం కారణంగా అర్హులైన నిరుద్యోగులకు రుణాలు అందడం లేదని తెలుస్తోంది. కొందరికే సంక్షేమ పథకాలు అందుతున్నాయి తప్ప అర్హులకు అందడం లేదని సమాచారం. రెండు నెలల్లోపు అర్హులను గుర్తించి వారికి రుణాలు అందించడంలో ఆ శాఖ ప్రచార లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీని వల్ల నిధులు వెనక్కి వెళ్ళే అవకాశాలున్నాయని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్య సాధనకు కృషి చేస్తున్నాం
ప్రభుత్వం జిల్లాకు 1440 యూనిట్లకు మంజూ రీ ఇచ్చింది. అయితే బాన్సువాడ, నిజామాబా ద్ తదితర ప్రాంతాల నుంచి అధికంగా దరఖాస్తులు వచ్చాయి. జేసీ ఆదేశా ల మేరకే లక్ష్యానికి మించి దరఖాస్తులు వచ్చిన వాటిని పక్కన బెట్టాం. ప్రస్తుతం 957 దరఖాస్తులను ఎంపిక చేశాం. మిగతా దరఖాస్తుల గురించి నిర్ణయం తీసుకుంటాం.
-ప్రేంకుమార్, ఎంఎఫ్‌సి ఈడీ