సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు మరింత పెరుగుతుంది. తాజాగా మంగళవారం 40 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు 404 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా నుంచి 45 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 348 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 11 మంది కరోనాతో చనిపోయారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 150 కేసులు నమోదు కాగా, నిజామాబాద్‌లో 36, వరంగల్ అర్బన్‌లో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment