నిజామాబాద్: జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత భరోసా ఇచ్చారు. ప్రాజెక్ట్ నీటిని నిజామాబాద్ జిల్లా రైతులకు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అందిస్తామని స్పష్టం చేశారు. పంటల సాగుకు రైతులు సన్నద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా రైతులకు నీరు అందించే విషయమై ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిశామని తెలిపారు. ఈ విషయంలో రైతులు అపోహలకు గురికావద్దని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతల ఆరోపణలు, ఆందోళనలు అర్థరహితమని ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment