ధన్వాడ (మహబూబ్‌నగర్): మిషన్ కాకతీయ పనుల్లో పాలమూరు జిల్లా పోలీసులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట డివిజన్ పోలీసుల శాఖ దత్తత తీసుకొన్న చెరువులో ఆదివారం పూడికతీత పనులు మొదలయ్యాయి.
ధన్వాడ మండలం హన్మాన్‌పల్లిలోని తిమ్మనోని చెరువు పూడికతీత పనులను ఏఎస్పీ మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనుల్లో డివిజన్ పరిధిలోని ముగ్గురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, 200 మంది పోలీసులు పాల్గొన్నారని తెలిపారు. ఇందుకు గాను 20 జేసీబీలు, 220 ట్రాక్టర్టను ఏర్పాటు చేశామన్నారు. నారాయణపేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు రవీంద్రప్రసాద్, శ్రీనివాస్, విశ్వప్రసాద్, ఎస్‌ఐలు మధుసూదన్‌గౌడ్, రామలింగారెడ్డి, సంతోష్, ప్రవీణ్, మురళి, అబ్దుల్జ్రాక్, భాగ్యలక్ష్మారెడ్డి, రాఘవేందర్, రవికాంత్‌రెడ్డి, సత్యానారాయణరెడ్డి, నవీన్‌సింగ్, నర్సయ్య, జడ్పీటీసీ సభ్యురాలు కవిత, ఎంపీపీ శశికళ, సర్పంచి గాయత్రి, ఎంపీటీసీ నాగిరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
'మిషన్ కాకతీయ'లో పాలమూరు పోలీసులు
Published Sun, May 17 2015 6:11 PM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM
Advertisement