తెలంగాణలో కేబుల్ ఆపరేటర్లకు పోల్ టాక్సును రద్దు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సుముఖత వ్యక్తం చేశారు. ఆయనను తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ సభ్యులు గురువారం నాడు సచివాలయంలో కలిశారు. సెట్ టాప్ బాక్సులు తప్పనిసరన్న విధానం తమకు ఇబ్బందికరంగా మారిందని కేబుల్ ఆపరేటర్లు ఆయనకు చెప్పారు.
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కేబుల్ ఆపరేటర్లకు తాను అండగా ఉండి.. ప్రభుత్వం తరఫున వారికున్న సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ వారికి చెప్పారు. ప్రధానంగా పోల్ టాక్సును రద్దు చేసే అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తామన్నారు.
కేబుల్ ఆపరేటర్లకు పోల్ టాక్స్ రద్దు
Published Thu, Dec 18 2014 8:15 PM | Last Updated on Mon, Sep 17 2018 5:59 PM
Advertisement
Advertisement