సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల బందోబస్తులో ఎన్నికల కమిషన్, పోలీస్ శాఖ వినూత్న పద్ధతిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టబోతున్నాయి. గత ఎన్నికల పై పలుమార్లు సమీక్ష, అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు పోలింగ్ స్టేషన్లు, అక్కడ గతంలో అల్లర్లు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈసారి భద్రతా ఏర్పాట్లు చేయబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం 32,574 పోలింగ్ స్టేషన్లు ఉండగా వీటిలో 32,054 సాధారణ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మిగతా 520 పోలింగ్‌స్టేషన్లు హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ కేంద్రా లుగా ఉన్నాయని పోలీస్ శాఖ గుర్తించి ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను సైతం సాధారణ, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ విధాలుగా విభజించారు.
చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు: సాధారణ పోలింగ్ కేంద్రాల వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లే బందోబస్తులో ఉం డేలా కార్యాచరణ రూపొందించారు. సెన్సిటివ్ కేం ద్రాల వద్ద నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హెడ్‌కానిస్టే బుల్‌ను కేటాయించారు. హైపర్ సెన్సిటివ్ కేంద్రాల వద్ద ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అ«ధికారి నేతృత్వంలో నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హెడ్‌కానిస్టేబుల్ భద్రత ను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ, సెన్సిటివ్ కేంద్రాల ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ విస్తృతం చేయడంతోపాటు ఆయా గ్రామాలు, మండలాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
మావో ప్రభావిత ప్రాంతాల్లో పారామిలిటరీ..
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లం దు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 10 కిలోమీటర్లకు ఒక చెక్‌పోస్టు ఏర్పాటు, భారీస్థాయిలో పారామిలిటరీ బలగాలను మోహరించాలని ఈసీ, పోలీస్ శాఖ నిర్ణయించాయి. ఈ నెల 18 నుంచి 13 నియోజకవర్గాల్లో బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు ఎక్కడికక్కడ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించేందుకు ఎస్పీలు, కమిషనర్లు చర్య లు చేపట్టాలని సూచించాయి. సున్నితమైన ప్రాంతా ల్లో ప్రజల్ని చైతన్యవంతులు చేయడం, వదంతులను నమ్మకుండా ఉండేలా చూడాలని ఆదేశించాయి. ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల్లోపే పోలింగ్ పూర్తయ్యేలా చూడాలని సూచించాయి.
మూడు విధాలుగా పోలింగ్ కేంద్రాలు
Published Tue, Nov 13 2018 2:20 AM | Last Updated on Tue, Nov 13 2018 2:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment