ఎదులాపురం(ఆదిలాబాద్): ఉద్యోగం రాదనే నిరాశతోనే తన కొడుకు సిడాం మహేందర్ ఆత్మహత్య చేసుకున్నాడని జైనథ్ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన మహేందర్ తల్లి పార్వతి తెలిపింది. సోమవారం హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన కొలువుల కొట్లాట సభలో ఆమె మాట్లాడింది. జిల్లా నుంచి టీజేఏసీ నేతలు పార్వతిని హైదరాబాద్ తీసుకెళ్లారు. ఆమె నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత ఆత్మహత్య చేసుకోవద్దని, కొలువులను కొట్లాడి సాధించుకోవాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా చైర్మన్ దుర్గం రాజేశ్వర్, కన్వీనర్ దర్శనాల దేవేందర్, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ వై.సంజీవ్‌రెడ్డి, కోఆర్డినేటర్ రావుల శంకర్, సాంస్కృతిక కళాబృందం నాయకులు కిరణ్ వైద్య తదితరులు పాల్గొన్నారు. a
Comments
Please login to add a commentAdd a comment