5, 6 తేదీల్లో నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటన | Telangana CM KCR will visit Nizamabad on 4th and 5th of July | Sakshi
Sakshi News home page

5, 6 తేదీల్లో నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటన

Published Fri, Jul 3 2015 8:31 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

5, 6 తేదీల్లో నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటన - Sakshi

5, 6 తేదీల్లో నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటన

నిజామాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటన ఖరారైంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా జూలై 5, 6 తేదీలలో ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఆదివారం రాత్రి బస, ఆ మరుసటి రోజు పర్యటన నేపథ్యంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

సుమారు ఐదు నియోజకవర్గాల పరిధిలో సీఎం సుడిగాలి పర్యటన చేయనుండగా... ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎ.జీవన్‌రెడ్డిలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కాగా ఈ నెల 5వ తేదీ రాత్రి కేసీఆర్ వేల్పూర్‌కు చేరుకొని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంట్లో బస చేసే అవకాశం ఉండటంతో ఆయన ఇంటిని కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రధాన రహదారి నుంచి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే రహదారిలో ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులను అదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement