2019లో కాంగ్రెస్‌దే అధికారం
యాదగిరిగుట్ట : తెలంగాణ ప్రజల ఏన్నో ఏళ్ల కళను సకారం చేసి ప్రత్యేక రాష్ట్రాని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలే 2019లో అధికారంలోకి తీసుకువస్తారని మాజీ ఎంపీ, శిక్షణ తరగతుల కమిటీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట పట్టణ సమీపంలోని శివసాయి గార్డెన్స్‌లో సోమవారం డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. మాటకు కట్టుబడి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు.
తన కుటుంబ రాజకీయ లబ్ధి కోసమే టీఆర్‌ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతూ రెండే ళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుపుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతి నిధులు దాసోజు శ్రావణ్‌కుమార్, అద్దంకి దయూకర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారిని కాంగ్రెస్ కచ్చితంగా గుర్తుపెట్టుకుం టుందన్నారు. కాంగ్రెస్‌ను 2019లో అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.ముందుగా దివంగత నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్‌బాపూజీల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటాపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
శిబిరంలో పార్టీసీనియర్ నేతలు పీసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, ప్రేమ్‌లాల్, ఎస్సీసెల్ టీపీసీసీ అధ్యక్షుడు జగన్‌లాల్, జిల్లా ఎస్సీసెల్, బీసీసెల్ నాయకులు వెంకన్న, రవీందర్, రవిబాబు, రవీందర్‌రెడ్డి, దుంపల శ్రీను, చింతపండు నవీన్, బీర్ల అయిలయ్య, నరేందర్‌గుప్త, సుధాకర్, మహేందర్, రవీందర్, మల్లేష్, హరినాథ్, ద్యాస లక్ష్మారెడ్డి, శంకర్‌నాయక్, యాదగిరి, సర్పంచ్ ఇమ్మడి మాధ వి రాంరెడ్డి, సత్యనారాయణ, ఎంపీటీసీ కానుగు కవిత బాలరాజు, గొట్టిపర్తి జయమ్మ బాల రాజు, స్థానిక నాయకులు గుండ్లపల్లి భరత్‌గౌడ్, బాలనర్సయ్య, మిట్ట వెంకటయ్య, శ్రీధర్, బాలలక్ష్మి, నీలం వెంకటస్వామి, ఆకుల పద్మ పాల్గొన్నారు.