సమీకృత ఆర్థిక నిర్వహణ విధానాన్ని తెచ్చిన టీసర్కారు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాలకు సం బంధించిన ఆర్థిక వ్యవహారాలన్నింటినీ మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ ఆర్థిక శాఖ సమీకృత ఆర్థిక నిర్వహణ విధానం(సీఎఫ్‌ఎంఎస్) అమలుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. బడ్జెట్‌తో సహా బిల్లులు, చెల్లింపులు, జమా ఖర్చు లు, ఉద్యోగుల జీతభత్యాలు ఇలా ఆర్థిక లావాదేవీలన్నింటినీ పారదర్శకంగా, మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ సాంకేతిక పరి జ్ఞానం ఉపమోగపడుతుందని ఆయన తెలిపా రు.
దీంతో అక్రమాలకు తావు లేకుండా పోతుం దన్నారు. వచ్చే జూన్ నాటికి ఈ విధానం సంపూర్ణంగా అన్ని విభాగాల్లో అందుబాటులోకి వస్తుం దని చెప్పారు. జనవరి 2నుంచి ఆర్థిక శాఖ పరిధిలోని ట్రెజరీ.. పే అం డ్ అకౌంట్స్, లోకల్ ఫండ్, స్టేట్ ఆడిట్ విభాగాల వ్యవహారాలన్నీ సీఎఫ్‌ఎంఎస్ పరిధిలోకి వస్తాయని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు ప్రకటించారు.
ఉమ్మడి రాష్ట్రం లో ప్రాజెక్టుకు రూ.180 కోట్లు ఖర్చు అవుతుం దని అంచనా వేయగా, తెలంగాణలో రూ.75 కోట్ల ఖర్చుతో రూపుదిద్దుకున్నట్లు చెప్పారు. బడ్జెట్, పే రోల్స్, ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలన్నీ ఇందులోనే క్రోడీకరించినట్లు తెలిపారు. ఫిబ్రవరిలో మొత్తం సచివాలయానికి, మార్చిలోగా అన్ని విభాగాల ప్రధాన కార్యాలయాలు, జూన్ నాటికి అన్ని కార్యాలయాలకు ఈ విధానం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఎన్‌ఐఐటీతో పాటు డెలాయిట్ కంపెనీ సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది.
లెక్కలన్నీ పారదర్శకంగా..
Published Thu, Jan 1 2015 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM
Advertisement
Advertisement