'ప్రజల ప్రాణాలు తీసిన సర్కారు నిబంధనలు'
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పెన్షన్లనే ఆసరా పథకంగా తెలంగాణ ప్రభుత్వం పేరు మార్చిందని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలొ 32 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని ఆమె తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే తప్పులతడకగా సాగిందని విమర్శించారు. పెన్షన్లు ఇవ్వడానికి సర్కారు పెట్టిన నిబంధనలు ప్రజలు ప్రాణాలు తీశాయని మండిపడ్డారు. పెన్షన్లు రానివారు ఇంకా చాలా మంది ఉన్నారని అరుణ అన్నారు.