రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రామేశ్వర్‌రావు
డీఎస్పీ ఆధ్వర్యంలో దాడి
నగదు స్వాధీనం.. వీఆర్‌ఓ రిమాండ్
సంగారెడ్డి క్రైం : ఏసీబీ వలలో వీఆర్‌ఓ చిక్కాడు. ఓ రైతుకు పట్టా చేసే విషయంలో లంచం తీసుకుంటూ సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి వీఆర్‌ఓ రామేశ్వర్‌రావు గురువారం ఏసీబీ అధికారులకు దొరికాడు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అందిపురం బాలయ్య, అందిపురం అనంతయ్య, అందిపురం అంజయ్యకు సంబంధించి సర్వే నంబరు 71,71/1లోని 90 గుంటల భూమి రికార్డులో తప్పుగా నమోదైంది.
రికార్డును ఆన్‌లైన్‌లో సరి చేయడానికి వారు రెండు నెలల క్రితం జమీన్‌బందీ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. రికార్డును సరిచేయడానికి గాను పోతిరెడ్డిపల్లి వీఆర్‌ఓ రామేశ్వర్‌రావు వారిని నెలన్నర రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఆ తరువాత రూ.45 వేలు డిమాండ్ చేశాడు. దీంతో విసిగిన బాధితుల మనవడు అందిపురం ఆనంద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వారి సూచన మేరకు గురువారం పోతిరెడ్డిపల్లిలోని వీఆర్‌ఓ ఇంట్లో రూ.8 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు ప్రతాప్, నవీన్ దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం వీఆర్‌ఓను రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ లంచం తీసుకుంటే ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు 9440446149 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
ఏసీబీ వలలో వీఆర్‌ఓ
Published Fri, May 8 2015 12:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement