నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని కాపాడుతాం: కవిత
బోధన్: నిజాం షుగర్స్ కార్మికులెవరూ అధైర్యపడొద్దని, ఫ్యాక్టరీని కాపాడేం దుకు ప్రభుత్వం దృష్టిసారిం చిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్ శక్కర్‌నగర్ చౌరస్తాలో మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్‌రాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో ఎంపీ కవిత మాట్లాడారు. నిజాం షుగర్స్ సమస్య తన నియోజకవర్గం పరిధిలోని బోధన్ , మెట్‌పల్లి, సీఎం కేసీఆర్ నియోజకవర్గ పరిధిలోని మెదక్ ఫ్యాక్టరీలున్నాయన్నారు.
నిజాం షుగర్స్ సమస్య పరిస్కారానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ వేసిందని, మరో కమిటీని నియమించిందని తెలిపారు. ఈ కమిటీల నివేదికలు వస్తున్నాయని, ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిజాం షుగర్స్ సమస్యను పరిష్కరించడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. మూడు చక్కెర ఫ్యాక్టరీల పరిధిలోని కార్మికుల బకాయి వేతనాల చెల్లింపు విషయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావుతో కార్మికుల సమక్షంలో చర్చించాననివివరించారు.