కార్యకర్తలు సైనికుల్లా పనిచేయూలి
- పార్టీని బలోపేతం చేయూలి
- పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి
మహబూబాబాద్ : పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి కోరా రు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆది వారం20వ వార్డు పరిధిలోని జగన్‌నగర్‌కాలనీ, నందమూరినగర్‌కాలనీకి చెందిన వివిధ పార్టీల్లోని సుమారు 50 మంది కార్యకర్తలు మహేం దర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత సీఎం వైఎస్సార్‌పై ప్రజలకు అమితమైన అభిమానం ఉందన్నారు. పేదల సంక్షేమానికి ఆయన అహర్నిశలు శ్రమించారని అన్నారు.
ఇందిరమ్మ గృహాలు, ఆరోగ్యశ్రీ, 108, 104, పావ లా వడ్డీ రుణాలు, రైతులకు రుణమాఫీ ఆయన చలవేనన్నారు. కార్పొరేట్ వైద్యాన్ని పేదల చెం తకు తెచ్చిన ఘనత మహానేతకే దక్కిందన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు ఫీజురీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయన మారణాన్ని తట్టుకోలేక వందలాది మంది తనువు చాలించారని ఆవేదన చెందారు. వైఎస్సార్‌పై అభిమానంతోనే వందలాదిమంది వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని మహేందర్‌రెడ్డి వివరించారు. కార్యక్రమం లో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గుగులోతు రాములు నాయక్, పట్టణ అధ్యక్షుడు సప్పిడి రంజిత్, నాయకులు సోమ నరేందర్‌రెడ్డి, పటాన్, నవీన్, కార్యకర్తలు పాల్గొన్నారు.