నేడు వరంగల్ ఎన్నికల తీరుపై సమీక్ష | ysrcp to be held review on warangal election on monday | Sakshi
Sakshi News home page

నేడు వరంగల్ ఎన్నికల తీరుపై సమీక్ష

Published Mon, Nov 30 2015 4:16 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

ysrcp to be held review on warangal election on monday

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్
 సాక్షి, హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సమీక్ష సమావేశంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కూడా చర్చిస్తారని పేర్కొన్నారు. వరంగల్ ఉపఎన్నికల్లో పాల్గొన్న పార్టీ నాయకులు, జీహెచ్‌ఎంసీ నేతలు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్రకార్యాలయానికి చేరుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement