తమిళనాడు/చిత్తూరు: శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్ కౌంటర్ ఘటనపై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం జరిపిన ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన కూలీలు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు లో ఆందోళనలు చేపట్టడంతో తిరుమల తమిళనాడు మధ్య బస్సు సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. ఆందోళనలు ఇంకా కొనసాగుతుండటంతో ఆరో రోజూ కూడా సర్వీసులను రద్దు చేసినట్టు ఆర్టీసీ పేర్కొంది.
అయితే తమిళనాడు అధికారులతో ఏపీయస్ ఆర్టీసీ మంతనాలు జరుపుతోంది. కానీ, ఈ విషయంలో తమిళనాడు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. సర్వీసులను రద్దు చేయడంతో ఏపీయస్ ఆర్టీసీకి ఇప్పటికే 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిలినట్టు అంచనా. దాంతో ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇదిలా ఉండగా, శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తమిళనాడులో కొనసాగుతున్న ఆందోళనలు
Published Sun, Apr 12 2015 6:36 PM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM
Advertisement