రూ. 50 కోసం.. సవతితల్లి దారుణహత్య | boy beats to death his step mother for not giving pocket money | Sakshi
Sakshi News home page

రూ. 50 కోసం.. సవతితల్లి దారుణహత్య

Published Wed, Oct 5 2016 11:57 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

రూ. 50 కోసం.. సవతితల్లి దారుణహత్య - Sakshi

రూ. 50 కోసం.. సవతితల్లి దారుణహత్య

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణం జరిగింది. తనకు 50 రూపాయల పాకెట్ మనీ ఇవ్వలేదన్న కోపంతో.. ఓ బాలుడు తన సవతి తల్లిని దారుణంగా కొట్టి చంపేశాడు. అంతేకాదు.. ఆమెను దేవుడి దగ్గరకు పంపేశానని కూడా ఆ తర్వాత చెప్పాడు. ఉజ్జయినిలోని మహీద్‌పూర్ ప్రాంతానికి చెందిన ఈ నిందితుడు.. ధాపు బాయి (45) అనే తన సవతి తల్లిని ఓ కర్రతో కొట్టేశాడు. ఆ దెబ్బలు తాళలేని ఆమె అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు.

బాలుడు తన సవతి తల్లి మీద దాడి చేసే సమయానికి అతడి తండ్రి బలరాం అక్కడకు దగ్గరలోనే పడుకున్నాడు. గొడవతో నిద్రలేనిచ అతడు మధ్యలో కలగజేసుకోడానికి ప్రయత్నించినా, బాలుడు తండ్రికి కూడా నాలుగు దెబ్బలు తగిలించి, అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత నిందితుడిని అరెస్టుచేసి బాలనేరస్థుల కర్మాగారానికి పంపారు. తాను తన సవతి తల్లిని చంపలేదని, దేవుడి దగ్గరకు పంపానని అతడు చెబుతున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement