‘అమ్మ’ కోసం అవమానాలు భరించా | had faced many insults for Amma, says O.Panneerselvam | Sakshi
Sakshi News home page

‘అమ్మ’ కోసం అవమానాలు భరించా

Published Mon, Feb 13 2017 2:42 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

‘అమ్మ’ కోసం అవమానాలు భరించా

‘అమ్మ’ కోసం అవమానాలు భరించా

- తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌ సెల్వం వెల్లడి
- ‘అమ్మ’ వారసుడిని తయారు చేసుకోకుండా శశికళ అడ్డుకున్నారు
- పార్టీలో ఎవరినీ ఎదగనివ్వలేదు


సాక్షి, చెన్నై:
‘‘అమ్మ నన్ను ఆప్యాయంగా పలకరిస్తే చాలు... క్షణాల్లో శశికళ నుంచి చీవాట్లు పడేవి. పదిహేను, పదహారేళ్లు అడుగ డుగునా అవమానాలు మౌనంగానే భరించా.. నాలో నేను రోదించా. అమ్మ తన వారసుడిని తయారు చేసుకునే ప్రయత్నం చేసినా శశికళ అడ్డుకున్నారు. పార్టీలో ఉన్న వారందరినీ బయటకు వెళ్లేలా చేశారు.

‘అమ్మ’ కోసం ఇవన్నీ భరించి ఆమెతోనే ఉన్నా’’ అని తమిళ నాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం చెప్పారు. క్యాంప్‌(శశికళ శిబిరం)లో ఉన్న ఎమ్మెల్యేలు దయచేసి నియోజకవర్గాల్లోకి వెళ్లాలని, ప్రజలతో చర్చించి మనస్సాక్షికి కట్టు బడి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచిం చారు. ఆదివారం కువత్తూరు వేదికగా ఎమ్మె ల్యేలను ఉద్దేశించి శశికళ ప్రసంగం ముగిసిన కాసేపటికి సీఎం పన్నీర్‌ సెల్వం గ్రీన్‌వేస్‌ రోడ్డులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని వివరించారు.

నేను సింహాన్ని కాదు
‘‘నేను ఎదుర్కొన్న కష్టాలు, చేసిన సేవలను జయలలిత స్వయంగా కార్యకర్తలకు వివరించి న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శశికళ నుంచి ఎన్నో అవమానాలు ఎదురైనా, ఎన్నడూ ‘అమ్మ’ దృష్టికి తీసుకెళ్లలేదు. ‘అమ్మ’ తన  రాజకీయ వారసుడిని తయారు చేసుకునేం దుకు సిద్ధపడ్డా, శశికళ ఎవరినీ ఎదగనివ్వ లేదు. నన్ను బయటకు పంపించేందుకు కుట్రలు పన్నినా కేవలం జయలలిత కోసం అన్నీ దిగమింగుకున్నా. ఇతరులపై చాడీలు చెప్పడం, నిందలు వేయడం నాకు చేతకాదు. నేను సింహాన్ని కాదు’’ అని పన్నీర్‌ సెల్వం పరోక్షంగా శశికళను ఎద్దేవా చేశారు.

అప్పుడు నిస్సహాయుడినే..
‘‘జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కనీసం దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా శశికళ అడ్డుకున్నారు. అమ్మ మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదనన్‌ పేరు ప్రతిపాదనకు వచ్చింది. కానీ, శశికళ ఆ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చు కున్నారు. అమ్మ రక్త సంబంధీకులు దీప, దీపక్‌లను పార్థివదేహం దగ్గరకు రానివ్వ కుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను పదవిలో ఉన్నా, అప్పుడు స్వతం త్రంగా వ్యవ హరించలేని నిస్స హాయుడిగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని పన్నీర్‌ వెల్లడించారు.

నేటి నుంచి సచివాలయానికి వెళ్తా..
‘‘శశికళ క్యాంపులోని పలువురు ఎమ్మెల్యేలు నాతో ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. నేనే అక్కడికి వెళ్లి వారిని బయటకు తెచ్చేంత అధికారం, చేతిలో ఉన్నా, నావల్ల శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకూడదని సంయమ నం పాటిస్తున్నా. రాజకీయ సంక్షోభం కారణం గా ప్రజలు ఇబ్బందులు పడకూడదు. పరిపా లన సజావుగా సాగేందుకు సోమవారం నుంచి సచివాలయానికి వెళ్తా. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజల్లోకి రావాలి’’ అని పన్నీర్‌ సెల్వం పిలుపునిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement