దుబ్బాక: ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్ననాటి మిత్రుడు చెప్యాల రాజయ్య మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన రాజయ్య కొన్నిరోజులుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. రాజయ్య, కేసీఆర్ దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి వరకు విద్యనభ్యసించారు.
మృతుడికి మానసిక వికలాంగురాలైన కూతురుతో పాటు భార్య మణెమ్మ, కుమారుడు ఉన్నారు. కాగా, రాజయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కనకవ్వ కోరారు.
కేసీఆర్ చిన్ననాటి మిత్రుడు కన్నుమూత
Published Wed, Aug 5 2015 1:57 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement
Advertisement