న్యూఢిల్లీ:ఈ నెల 6వ తేదీ నుంచి మూడు రోజులపాటు నగరంలో కొరియా చలన చిత్రోత్సవం సాగనుంది. కొరియన్ కల్చరల్ సెంటర్... సినీ దర్బార్ ఫిల్మ్ క్లబ్ సహాకారంతో ఈ చలన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తోంది. మూడు రోజులపాటు సాగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జూన్-హో బోంగ్ దర్శకత్వంలో రూపొందిన ‘బార్కింగ్ డాగ్స్ నెవర్ బైట్’ అనే చిత్రంతో ప్రారంభమవుతుందని సంబంధిత ప్రతినిధి ఒకరు తెలిపారు.
మూడు రోజుల్లో మొత్తం ఏడు చిత్రాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. చాంగ్-డాంగ్ లీ, సీక్రెట్ సన్‌షైన్, ఇక్-జూన్‌యాంగ్ ‘బ్రిత్‌లెస్’, జిన్-హో హుర్ ‘క్రిస్ట్మస్ ఇన్ ఆగస్టు’ చిత్రాలు ప్రదర్శిస్తారు. ప్రధానంగా హస్య, శృంగార చిత్రాలుగా ఉంటాయని, వీటిలో భారతీయులు పునర్నిర్మించిన కొరియా చిత్రాలు కూడా ఉంటాయన్నారు.