తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన గోదావరి పుష్కరాలతో అంతటా ఆధ్మాత్మికత విరాజిల్లుతోంది. పుష్కరాలకు ప్రముఖ పీఠాధిపతులు రావడం మంత్రోచ్ఛరాణల మధ్య, మంగళ స్నానాల మధ్య పుష్కరాలు ప్రారంభంకావడంతో అప్పటి వరకు ఎదురుచూసిన భక్తులు ఒక్కసారిగా గోదావరి వెంట ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ల వద్ద బారులు తీరారు. లక్షల సంఖ్యలో ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పుణ్యస్నానం ఆచరించేందుకు తరలివస్తున్నారు. కొన్ని కొన్ని ఘాట్లవద్ద నీళ్లు లేకపోవడం నడిచి వెళ్లాల్సి రావడంతో ఎలాంటి అపశృతి చోటుచేసుకోకుండా భారీ సంఖ్యలో క్యూలైన్లు ఏర్పాటుచేశారు.
అయితే, వాటివెంట మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేయకపోవడంతో ఇప్పటికే చాలామంది సొమ్మసిల్లి పడిపోతున్నట్లు తెలుస్తోంది. గోదావరిలో ఇప్పటికే చేరిన పుష్కరుడు తమ పాపాలను కడిగివేస్తాడని, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాధిస్తాడనే నమ్మకంతో భక్తులు గోదావరి తల్లికి భక్తిశ్రద్ధలతో నీరాజనాలు ఇచ్చేందుకు కదులుతున్నారు. చాలామంది గోదావరి మాతకు పసుపుకుంకుల పూలు పండ్లతోపాటు చీరసారెలు గాజులతో తరలివస్తున్నారు. అయితేవారికోసం సౌకర్యాలు మాత్రం అరకొరగా ఉండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. గోదావరి ఘాట్లవద్దే ఉన్న ఆలయాల ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. ఈ శోభ పన్నెండు రోజుల పాటు దేధీప్యమానంగా వెలుగొందనుంది.
అంతటా ఆధ్మాత్మికం.. లక్షల్లో భక్తులు
Published Tue, Jul 14 2015 8:02 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement
Advertisement