జాతీయ ఆహార భద్రత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం! | Parliament passes Food Security Bill | Sakshi
Sakshi News home page

జాతీయ ఆహార భద్రత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం!

Published Mon, Sep 2 2013 11:53 PM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

జాతీయ ఆహార భద్రత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం!

జాతీయ ఆహార భద్రత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం!

యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఆహార భద్రత బిల్లుకు సోమవారం రాత్రి పార్లమెంట్ ఆమోదం లభించింది. పార్లమెంట్ ఆమోదం ద్వారా 1.2 బిలియన్ల భారతీయ జనాభాలో రెండింతల్లో మూడవ వంతు మందికి లబ్ది చేకూరనుంది. పదిగంటలపాటు సుధీర్ఘ చర్చ జరిగిన అనంతరం రాజ్యసభలో ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. గతవారం లోకసభలో ఆహార భద్రత బిల్లుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. 
 
ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో భారతీయ జనతా పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు 237 సవరణలు ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదానికి పంపుతారు. ఆతర్వాతనే బిల్లు చట్టంగా మారుతుంది. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ ప్రవేశపెట్టారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement