వానదేవుడా! | prayers for rain god | Sakshi
Sakshi News home page

వానదేవుడా!

Published Sun, Jun 19 2016 12:20 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

వానదేవుడా! - Sakshi

వానదేవుడా!

మధ్యప్రదేశ్‌లో తికమ్‌గఢ్ అనే ప్రాంతం రెండేళ్ల నుంచి కరువుకాటకాలతో అలమటిస్తోంది. జైసింగ్ యాదవ్ అనే రైతు వర్షం కోసం ఓ పని చేశాడు. అయితే ఆయన కప్పల్ని ఊరేగించలేదు. వరుణ జపాలు చేయించలేదు. గత ఏడాది వేసవిలోనూ, మొన్నటి దారుణమైన గ్రీష్మంలోను కూడా ఆయన మండుటెండలో నిలబడి వర్ష దేవుడిని ప్రార్థించాడు.
 

 తికమ్‌గఢ్‌తో పాటు బుందేల్‌ఖండ్ ప్రాంతం అంతా వర్షాభావ పరిస్థితులే నెలకొని ఉన్నాయి. కానీ జైసింగ్ మొదటి బాలికల సంక్షేమం పేరుతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు. తరువాత ఒక్క బాలికలనే కాకుండా, సమాజంలో అన్ని వర్గాల వారి క్షేమం కోసం వర్షాల కోసం ప్రార్థన మొద లుపెట్టాడు. వేసవికాలం మొదలైన తరువాత మధ్యాహ్నం 12 గంటల నుంచి, సాయంత్రం నాలుగు గంటల వరకు అతడు ఎండలో నిలబడి వానదేవుడిని ప్రార్థించాడు. ఒక ఆలయ ప్రాంగ ణంలో తనదైన ఈ యజ్ఞాన్ని సాగించాడు.

ఒంటి మీద చొక్కా కూడా లేకుండా నాలుగు గంటల పాటు అతడు ఎండలో నిలబడి ఉండేవాడు. ఇంతకీ జైసింగ్ వయసు 90 ఏళ్లు. కానీ ఎండలో నిలబడి ఉన్నంతసేపూ, అంటే వానదేవుడిని ప్రార్థి స్తున్నంత సేపూ మంచినీళ్లు కూడా ముట్టే వాడు కాదు. అదేం చిత్రమో బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఎండా ఎక్కువే. చలీ ఎక్కువే. ఇంత పాటు పడినా వానదేవుడు కరుణించలేదు. మూడు గంటల పాటు వర్షంలో తడిస్తే కలిగే అనుభూతి కోసం అతడు తహతహలాడిపోతున్నాడు. జైసింగ్ ఒక ప్పుడు మంచి ఆటగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement