1/14
నేడు హనీ రోజ్ 'రాహేలు' సినిమా మొదలైంది. ఇది తన మొదటి పాన్ ఇండియా సినిమా. ఈ ప్రాజెక్టు తన జీవితంలో మరో మెట్టు ఎక్కేందుకు దోహదపడుతుందని పూజా కార్యక్రమంలో ఆమె తెలిపింది.
2/14
ఏ వేదికపైనైనా రాణిలా కనిపించే నటి హనీ రోజ్. ఆమెకు అభిమానుల సంఖ్య భారీగానే ఉంది. ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణకు జోడీగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హనీ రోజ్. ఆమెకు మన దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా హనీకి అభిమానులు ఉన్నారు.
3/14
ఆమె తెలుగులో పెద్దగా సినిమాలు చేసింది కూడా ఏమీ లేదు కానీ ఒక టాప్ హీరోయిన్ కంటే ఆమెకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు.
4/14
ఏదైనా ఆమె ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హనీ అతిథిగా హాజరైతే చాలా మంది లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు.
5/14
హనీ రోజ్ మలయాళ చిత్రసీమలో 18 ఏళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వినయన్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్‌ఫ్రెండ్' సినిమా ఆమెకు తొలి చిత్రం.
6/14
హనీ ఆనాటి లుక్‌తో పాటు ప్రేక్షకుల ఆదరణ నేడు చూస్తుంటే ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. ఇదంతా ఆమెకు ఒక్కరోజులో రాలేదు. సుమారు 18 ఏళ్ల పాటు కష్టపడితే ఇప్పుడా గుర్తింపు తెచ్చుకుంది.
7/14
హనీ రోజన్ తొలి రెమ్యునరేషన్‌ను 'బాయ్‌ఫ్రెండ్' సినిమా దర్శకుడు వినయన్ అందజేశారు. ఆ సినిమాకు గాను ఆమెకు రూ. 10 వేలు ఇచ్చారు. అదే ఆమె మొదటి సంపాదన అని చెప్పింది.
8/14
హనీ లుక్స్‌తో పాటు ఆమె వేషధారణ పట్ల కొందరు సైబర్ నేరగాళ్లు ఎన్నో విధాలుగా బాడీ షేమ్‌కు గురిచేశారు. అయనప్పటికీ హనీ ఏ మాత్రం తగ్గలేదు. వాటంన్నిటినీ అదిగమించి జీవితంలో ముందుకు సాగింది.
9/14
ప్లాస్టిక్ సర్జరీ వల్లే ఆమెకు ఇంత అందం వచ్చింది అనే ప్రశ్న వచ్చినా.. హనీ వాటన్నింటినీ తుంగలో తొక్కి వెటకారంగా సమాధానం ఇచ్చింది. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన మాన్‌స్టర్ చిత్రం హనీకి చివరి చిత్రం.
10/14
బాలయ్య చిత్రం వీరసింహా రెడ్డితో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇందులో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.
11/14
హనీ అభిమానులు ఇప్పుడు తన పాన్ ఇండియా సినిమా అయిన 'రేచల్' కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందెన్నడూ చూడని హనీ ఇప్పుడు తెరపైకి వచ్చిందనే హింట్ ఇస్తూ పోస్టర్ ఇప్పటికే వైరల్‌గా మారింది.
12/14
మలయాళంలో రానున్న ఆ సినిమాను ఆనందిని బాల తెరకెక్కిసున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణను కేరళలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
13/14
ఈ చిత్రం తన సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పిందామె. పూజకు సంబంధించిన వీడియోను తాజాగా తన సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది హనీ రోజ్.
14/14
హనీ రోజ్