-
ప్రపంచంలోనే ఏఆర్ అత్యుత్తమ వ్యక్తి: సైరా భాను
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ , ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారంపై రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 29 ఏళ్లు అన్యోన్యంగా సంసార జీవితాన్ని సాగించిన ఈ జంట విడిపోవాలనుకోవడానికి గల కారణాలను నెటిజన్లు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. ఏఆర్ రెహమాన్ వద్ద చాలా కాలంగా పని చేస్తున్న గిటారిస్ట్ మోనికా దేను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు.దీంతో తన గురించి అసత్య ప్రచారాన్ని చేస్తున్న సామాజిక మాధ్యమాలకు రెహమాన్ తన న్యాయవాది ద్వారా నోటీసులు జారీ చేశారు. ఆదివారం సైరా భాను ‘నేను సైరా రెహమాన్ మాట్లాడుతున్నా’ అంటూ ఓ వీడియో వాయిస్‌ను విడుదల చేశారు. అందులో ‘‘ఏఆర్ గురించి దయచేసి అసత్య ప్రచారం చేయకండి. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి ఆయన. అలాంటి అద్భుతమైన మనిషిని చూడలేం. నా శారీరక అనారోగ్యం కారణంగా కొన్ని నెలలుగా ముంబైలో ఉంటూ, చికిత్స పొందుతున్నాను.అందువల్లే ఏఆర్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలనుకున్నా. విడిపోవాలనుకోవడానికి కారణం నా అనారోగ్యమే. ఏఆర్ రెహమాన్ ఎంతో బిజీగా ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నా పిల్లలనూ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఏఆర్పై నాకున్న నమ్మకం నా జీవితానికంటే పెద్దది. నేను ఆయన్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. నన్ను కూడా ఆయన అంతే ప్రేమించారు. ఇంకా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మా స్వేచ్ఛను గౌరవించండి. చికిత్స పూర్తయ్యాక త్వరలోనే చెన్నైకి తిరిగి వస్తాను. ఏఆర్ రెహమాన్ పేరుకు దయచేసి కళంకం ఆపాదించకండి’’ అని సైరా భాను కోరారు. – సాక్షి చెన్నై, తమిళ సినిమా -
కొత్త బస్సులు సమకూర్చుకోండి
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన ఆర్టీసీ ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా సేవలను అందించడానికి కొత్త బస్సులను సమకూర్చుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సీఎండీ సజ్జనార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులతో మంత్రి పొన్నం శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 1,389 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసిందన్నారు. మొదటి విడతలో మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మహి ళా స్వయం సహాయక సంఘాల మండల సమాఖ్యలకు అద్దె బస్సులను అందజేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిందన్నారు. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఒక్కటి చొప్పున అద్దె బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల ప్రారంభించిన కార్గో హోం డెలివరీ సదుపాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మరణించిన, మెడికల్లీ అన్‌ఫిట్ అయిన సిబ్బంది జీవిత భాగస్వాములకు, పిల్లలకు ఇచ్చే కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రూ. 3,747 కోట్ల మేర చార్జీల ఆదా! మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 20 వరకు మొత్తం 111 కోట్ల జీరో టికెట్లను సంస్థ జారీ చేసిందని, రూ.3747 కోట్ల చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం తెలిపారు. జీరో టికెట్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు.రవాణా ఆదాయ లక్ష్యాలను సాధించాలి.. ఆదాయ పెంపుదల లక్ష్యాలను సాధించాలని శాఖ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఆదాయార్జన మార్గాలను అన్వేషించాలని సమీక్షలో సూచించారు. -
IPL 2025: కేఎల్ రాహుల్‌కు భారీ షాక్..
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు షాక్ తగిలింది. భారీ ధరకు అమ్ముడుపోతాడనుకున్న రాహుల్‌ను నామమాత్రపు ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. రూ. 14 కోట్లకు రాహుల్‌ను ఢిల్లీ సొంతం చేసుకుంది.రూ. 2 కోట్ల కనీస ధరతో ఈ వేలంలో వచ్చిన రాహుల్ కోసం తొలుత రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ పోటీ పడ్డాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు అతడిని దక్కించుకోవడానికి ప్రయత్నించాయి. అయితే మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఆర్సీబీ, కేకేఆర్ వెనక్కి తగ్గాయి. అయితే ఆఖరికి సీఎస్కే కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో రాహుల్ ఢిల్లీ సొంతమయ్యాడు. అతడికి ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు పగ్గాలను అప్పగించే అవకాశముంది. కాగా ఈ వేలంలో ఆర్సీబీ రాహుల్‌ను కొనుగోలు చేస్తుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ వేలంలో మాత్రం అతడికి కోసం ఆర్సీబీ ప్రయత్నించలేదు.కాగా ఐపీఎల్-2022 నుంచి 2024 వరకు రాహుల్ లక్నో కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండుసార్లు ఆ జట్టును ప్లే ఆఫ్స్చేర్చాడు. కానీ అతడిని ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు లక్నో రిటైన్ చేసుకోలేదు. అందుకు జట్టు యాజమాని సంజీవ్ గోయెంకాతో విభేదాలే కారణమని వార్తలు వినిపించాయి.కాగా ఐపీఎల్లో రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. 45.47 సగటుతో 4683 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 37 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.చదవండి: Yuzvendra Chahal: వేలంలో చహల్‌కు కళ్లు చెదిరే ధర.. జాక్‌పాట్ కొట్టేశాడు -
ఆ నలుగురు ఫ్రెండ్స్.. గౌతమ్ శత్రువన్న యష్మి.. అతడిపైనే బిగ్‌బాంబ్
ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్లు చదవడంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. యష్మి వెళ్లిపోతూ.. ఎవరేమనుకున్నా నిఖిల్ తన ఫ్రెండ్ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నేను చెప్పేదే నిజంనాగార్జున.. ప్రేరణను సేవ్ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత హౌస్మేట్స్ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ.. తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్లిపోతాడు, నేను చెప్పేదే నిజం అన్న మైండ్‌సెట్ నుంచి బయటకు రావాలని నబీల్, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడటం చాలాసార్లు చూశా.. అని పృథ్వీ కంప్లైంట్స్ చేశారు. గౌతమ్‌పై వచ్చిన కంప్లైంట్స్..అన్‌ప్రిడక్టబుల్‌గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ ఫిర్యాదు చేసింది. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వు ఎవరనేది అర్థం కావట్లేదు.. అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఫుడ్ అందరితో షేర్ చేసుకో అని పృథ్వీ.. కొన్నిసార్లు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్ .. గౌతమ్ గురించి అభిప్రాయపడ్డారు. ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలీదునీకు అవినాష్ రక్షణ కవచంలా అనిపిస్తోంది.. అవినాష్, తేజతోనే ఎక్కువగా ఉంటున్నావ్ అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తోందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్‌లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్, మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్ చేశాం. తనను గెలిపించినవారికంటే యూనివర్స్కే ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుంది అని నబీల్.. విష్ణు గురించి కంప్లైంట్ చేశారు.ఎక్కువ విని తక్కువ మాట్లాడాలినువ్వొక్కడివే బలవంతుడివని ఆలోచించడం మానేయ్.. ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంది. కాబట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకు అని రోహిణి.. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తున్నావ్.. అభ్యంతరకర పదాలతో అటాక్ చేస్తావ్.. అని గౌతమ్.. పృథ్వీ గురించి ఫిర్యాదు చేశారు. ఆటలో అయినా, చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్, మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదని అవినాష్.. ప్రేరణకు చెప్పారు.నబీల్‌పై ఫిర్యాదులుకామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం చూపించాలని ప్రేరణ, నీ అరుపు ఎక్కువైందని యష్మి.. అవినాష్‌పై ఫిర్యాదు చేశారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ, ఒక్కోవారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించినవారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావని గౌతమ్.. నబీల్ గురించి తెలిపారు.యష్మి ఎలిమినేట్మనసులో మాట డైరెక్ట్‌గా చెప్పుంటే నా గేమ్ ఎఫెక్టయ్యేదే కాదు. ఈ జర్నీలో నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్గానే ఎక్కువ కనిపించావని యష్మి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావ్.. అతడి గేమ్ ప్లానేంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ.. నిఖిల్ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున.. నబీల్, పృథ్వీని సేవ్ చేసి యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడ్కోలు తీసుకుంది. నిఖిల్ నా ఫేవరెట్ ఫ్రెండ్స్టేజీపైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు? అన్న గేమ్ ఆడించాడు నాగ్. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ తన ఫ్రెండ్స్ అంది. నిఖిల్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అని, ఎవరేమన్నా తమ స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్‌లో గౌతమ్, అవినాష్, రోహిణిని చేర్చింది. స్నేక్ అండ్ లాడర్ గేమ్‌లో గౌతమ్, నిఖిల్ పాములని మెజారిటీ హౌస్మేట్స్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకర్ని నామినేట్ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్. దీంతో ఆమె గౌతమ్‌పై బిగ్‌బాంబ్ వేసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'మీరు ఒక చాట్ జీపీటీ సార్'.. అల్లు అర్జున్‌పై శ్రీలీల ప్రశంసలు
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప పేరే వినిపిస్తోంది. ఇటీవల పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ కాగా.. మూవీ కోసం ఎప్పుడెప్పుడా అంటూ రోజులు లెక్క పెడుతున్నారు ఫ్యాన్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు. కిస్సిక్ పేరుతో విడుదలైన పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్లో కిస్సిక్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల తన అనుభవాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. తమిళంలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.(ఇది చదవండి: అల్లు అర్జున్ పుష్ప-2.. శ్రీలీల కిస్సిక్ ఫుల్ సాంగ్ వచ్చేసింది)ఈవెంట్లో హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ..' అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సెట్స్‌లో ఆయన చాలా ఫన్‌గా ఉంటారు. నాకు మొదట కొంచెం భయంగా అనిపించింది. కానీ బన్నీ సార్‌తో మాట్లాడాక ఆ భయం పోయింది. మీరు ఒక చాట్ జీపీటీ.. అంతేకాదు మీరు ఒక వైబ్ సార్. థ్యాంక్ యూ సోమచ్ సార్. అల్లు అర్జున్‌తో డ్యాన్స్ అంటే ప్రాక్టీస్ చేయాలి. కానీ నేను సెట్స్‌లో వెళ్లాక అవసరం లేదనిపించింది. నేను ఇక్కడ అల్లు అర్జున్ కాదు.. పుష్ప అని చెప్పారు' అంటూ శ్రీలీల ప్రశంసలు కురిపించింది. కాగా పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
మాజీ సీఎంకు షాకిచ్చిన ‘ఆటోవాలా’
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. రాష్ట్రంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైంది. ఎన్డీయే కూటమిలో బీజేపీ అత్యధికంగా 125, శివసేన 56, 39 చోట్ల ఎన్సీపీ హవా కొనసాగుతోంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 56 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉద్దవ్ వర్గం శివసేన 18 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ కేవలం 12 స్థానాల్లో ఆధిక్యంతో సరిపెట్టుకోగా.. అటు కాంగ్రెస్ కూడా అంతంత మాత్రంగానే 23 చోట్ల తమ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.అయితే ఈ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్ర ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల కౌంటింగ్ పరిశీలిస్తే.. నిజమైన శివసేన ఏదనే విషయంలో మరాఠీ ప్రజలు స్పష్టం తీర్పును వెల్లడించారు. ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేననే అసలు పార్టీలుగా ప్రజలు తేల్చినట్లు తెలుస్తోంది. బాలాసాహెబ్ ఠాక్రే వారసుడు ఏక్నాథ్ షిండే అని మహా ఓటర్లు తేల్చి చెప్పారు.ఆటో డ్రైవర్ నుంచి సీఎం దాకాఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఏక్‌నాథ్‌షిండే.. ఆర్థిక కారణాలతో చదువును మధ్యలోనే ఆపేశారు,.. ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్, బీర్లు తయారు చేసే సంస్థలోపనిచేశారు. శివసేన ఫైర్‌బ్రాండ్ నేత దివంగత ఆనంద్ దిఘే ఆశిస్సులతో 1997లో థానే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీచేసి నెగ్గడంతో శిండే రాజకీయ ప్రయాణం ఊపందుకుంది. 4 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఏక్నాథ్.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. శిండే శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌కు ప్రియశిష్యుడు కూడా.మహారాష్ట్రలో బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. 2022 జూన్‌లో పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి భారతీయ జనతా పార్టీతో కలిసి మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. .ఉద్దవ్ వర్గం కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహా వికాస్ ఆఘాడీ కూటమిలో కొనసాగుతున్నాయి. అసలు శివసేన పార్టీ ఎవరిదని శివసేన చీలిక వర్గాలు పిటిషన్లు వేయగా.. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించారు. సీఎం ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన అని ఈసీ అధికారికంగా గుర్తించింది. ధనుస్సు, బాణం గుర్తును కూడా షిండే వర్గానికే కేటాయించింది.ఇక శనివారం వెలువడుతున్న మహారాష్ట్రలో ఫలితాల్లో ఎన్డీయే కూటమి కూటమి సంచలన విజయాన్ని సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 288 స్థానాలకు గానూ 221 చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. బీజేపీ అత్యధికంగా 125, శివసేన 56, ఎన్సీపీ 39 చోట్ల ఆధిక్యాన్ని హవా కొనసాగుతోంది. మరోసారి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఎన్డీయే శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. బీజేపీ కేంద్ర పరిశీలకులు నేటి సాయంత్రం ముంబై వెళ్లనున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలతో భేటీ కానున్నారు. ఇక నవంబర్ 26లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. -
వ్యాపారవేత్తతో పెళ్లి.. ఐటమ్ సాంగ్ కోసం రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్
చిత్రపరిశ్రమలో ఐటమ్ సాంగ్స్‌కు చాలా క్రేజ్ ఉంటుంది. అందుకే చాలామంది హీరోయిన్లు అవకావం వస్తే కాదనకుండా ఓకే చెప్పుతున్నారు. ప్రస్తుతం క్రేజ్‌లో ఉన్న హీరోయిన్లు నటించిన ఐటమ్ సాంగ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. అలా ఇంతకు ముందు పుష్ప చిత్రంలో నటి సమంత పాటను, ఇటీవల జైలర్ చిత్రంలో తమన్నా పాటను చూశారు. ఈ తరహా పాటలు సినిమాకు అదనపు ఆకర్షణ కావడంతో స్టార్ హీరో చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ ఉండడం పరిపాటిగా మారుతోంది. తాజాగా నటుడు సూర్య చిత్రంలోనూ ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ చోటు చేసుకుంటోందని సమాచారం. కంగువ చిత్రం తరువాత ఈయన నటించిన తన 44వ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటించారు. స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థ, 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ యాక్షన్ కథా చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో శ్రియ నటించనున్నట్లు తాజా సమాచారం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి స్టార్ స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని నటనకు కాస్త విరామం తీసుకున్నారు. ఈమె తమిళంలో చివరిగా 2017లో విడుదలైన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ తరువాత ఎక్కడా కనిపించని శ్రియ ఆ మధ్య కన్నడంలో ఉపేంద్రకు జంటగా ఒక చిత్రంలో నటించడంతో రీ ఎంట్రీ ఇచ్చారు. అలాంటిది తాజాగా తమిళంలో ఏడేళ్ల తరువాత నటుడు సూర్య హీరోగా నటిస్తున్న ఆయన 44వ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో మెరవనున్నట్లు తెలిసింది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. అయితే దీని గురించి నటి శ్రియ ఒక భేటీలో పేర్కొనడం విశేషం. ఈ పాట బాగా వచ్చిందని, త్వరలోనే వెలువడనుందనీ ఆమె తెలిపారు. అంతే కాదు ఈ పాటను గోవాలో చిత్రీకరించినట్లు చెప్పారు. కాగా ఈమె నటుడు సూర్యతో నటించిన తొలి చిత్రం ఇదే అవుతుంది. -
మహాసునామీ.. మహాయుతి హవా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి సాధించిన కనీవినీ ఎరగనంతటి ఘనవిజయం రాజకీయ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. 288 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా నాలుగింట మూడొంతులకు పై చిలుకు సీట్లను అధికార సంకీర్ణం కైవసం చేసుకోగా విపక్ష మహా వికాస్ గఘాడీ (ఎంవీఏ) కేవలం 49 సీట్లకు పరిమితం కావడం తెలిసిందే. బీజేపీ ఏకంగా 132 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ కేవలం 16 స్థానాలకు పరిమితమైంది. ఇవి రాష్ట్ర చరిత్రలోనే బీజేపీకి అత్యధిక, కాంగ్రెస్‌కు స్థానాలు కావడం విశేషం! మహారాష్ట్రలోని ఆరు ప్రాంతాలకు గాను అన్నిచోట్లా మహాయుతి జైత్రయాత్ర అప్రతిహతంగా సాగడమే ఈ అఖండ విజయానికి కారణమైంది.పశ్చిమ మహారాష్ట్ర షుగర్ బెల్ట్‌గా పిలిచే ఈ ప్రాంతం నిజానికి ఎంవీఏకు కంచుకోట వంటిది. ఇక్కడ కూడా ఈసారి విపక్ష కూటమికి దారుణ ఫలితాలే ఎదురయ్యాయి. 70 స్థానాలకు గాను మహాయుతి ఏకంగా 53 చోట్ల విజయనాదం చేస్తే ఎంవీఏ కేవలం డజను సీట్లకు పరిమితమైంది. మరీ ముఖ్యంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 12 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ ఈసారి కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ప్రాంతం నుంచి బరిలో దిగిన పృథీ్వరాజ్ చవాన్, బాలాసాహెబ్ థోరట్ వంటి కాకలుతీరిన కాంగ్రెస్ నేతలు కూడా ఓటమి చవిచూశారు. శివసేన (యూబీటీ)కీ రెండే సీట్లు దక్కాయి. వాటితో పోలిస్తే ఎంవీఏలోని మూడో పక్షమైన శరద్ పవార్ ఎన్సీపీ మెరుగైన ప్రదర్శన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నెగ్గిన 10 స్థానాల్లో ఏకంగా 8 పశి్చమ మహారాష్ట్రలోనే కావడం విశేషం. ఈ ప్రాంత పరిధిలోని కొల్హాపూర్ జిల్లాలోనైతే మహాయుతి ఏకంగా 10కి 10 స్థానాలు కైవసం చేసుకుంది.మరాఠ్వాడాఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఏడు స్థానాల్లో ఏకంగా 6 ఎంవీఏ ఖాతాలోకి వెళ్లాయి. ఆర్నెల్లకే పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఇక్కడి 46 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 41 చోట్ల మహాయుతి జెండా ఎగిరింది. ఎంవీఏ కేవలం 5 సీట్లకు పరిమితమైంది. బీజేపీ 20 చోట్ల పోటీ చేస్తే ఏకంగా 19 స్థానాలు గెలుచుకుంది. శివసేన (షిండే) 16 స్థానాల్లో 13, ఎన్సీపీ (అజిత్) 9 సీట్లకు ఏకంగా 8 నెగ్గాయి. మరాఠా రిజర్వేషన్ల అంశానికి విరుగుడుగా ఓబీసీలను మహాయుతి పక్షాలు విజయవంతం సంఘటితం చేయగలిగాయి. ఈ సోషల్ ఇంజనీరింగే ఈ ప్రాంతంలో అధికార కూటమి విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఇక్కడి నాందేడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నెగ్గడం ఎంవీఏ కూటమికి కాస్తలో కాస్త ఊరటనిచి్చంది. విదర్భ లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో 7 ఎంవీఏ పరమయ్యాయి. ఇప్పుడు మహాయుతి 62 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 49 స్థానాలను నెగ్గింది. వీటిలో ఒక్క బీజేపీ వాటాయే 39 కావడం విశేషం! కాంగ్రెస్ ఇక్కడ కేవలం 8 స్థానాలు గెలవగలిగింది. ఇక్కడి సాకోలీ స్థానం నుంచి పీసీసీ చీఫ్ నానా పటోలే కూడా కేవలం 208 ఓట్ల మెజారిటీతో అతి కష్టమ్మీద గట్టెక్కారు!కొంకణ్ ఈ ప్రాంతాన్ని మహాయుతి దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసేయడం విశేషం. 39 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 35 స్థానాలు అధికార కూటమి ఖాతాలో పడ్డాయి. ఇక్కడ కాస్తో కూస్తో పట్టున్న శివసేన (యూబీటీ) ఒక్కటంటే ఒక్క స్థానమే గెలవగలిగింది. ఆరెస్సెస్ దన్నుతో పాటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు కొంకణ్‌పై ఉన్న పట్టు ఈ ఫలితాలకు ప్రధాన కారణంగా నిలిచింది. ఉత్తర మహారాష్ట్రమహాయుతి దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసిన మూడు ప్రాంతాల్లో ఇదొకటి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 7 స్థానాల్లో ఆరు ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. ఈసారి మాత్రం 35 అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి ఏకంగా 33 చోట్ల గెలిచింది. ఎంవీఏ కూటమి ఇక్కడ కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది. సోదిలో లేని చిన్న పార్టీలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కీలక పాత్ర పోషిస్తాయని అంతా భావించిన చిన్న పార్టీలు సోదిలో కూడా లేకుండా పోవడం విశేషం. రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్), అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ సారథ్యంలోని వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) వంటివి కూడా ప్రభావం చూపలేకపోయాయి. 125 చోట్ల పోటీ చేసిన ఎంఎన్ఎస్, 200 స్థానాల్లో బరిలో దిగిన వీబీఏ కనీసం ఖాతా కూడా తెరవలేదు! అత్యధికంగా 237 చోట్ల పోటీ చేసిన బీఎస్పీ కూడా ఒక్కచోటా గెలవలేదు. 28 చోట్ల పోటీ చేసిన ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం)దీ అదే పరిస్థితి. రైతుల్లో బాగా ఆదరణ ఉన్న స్వాభిమాని పక్ష, ప్రహార్ జనశక్తి వంటివి కూడా సున్నా చుట్టాయి. సమాజ్‌వాదీ, జన్ సురాజ్య శక్తి పార్టీలు కాస్త మెరుగ్గా రెండేసి స్థానాలు నెగ్గాయి. సీపీఎం, మజ్లిస్‌తో పాటు రా్రïÙ్టయ యువ స్వాభిమాన్ పార్టీ, రా్రïÙ్టయ సమాజ్ ప„Š , పిజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, రాజర్షి సాహూ వికాస్ అఘాడీ ఒక్కో స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఈసారి మహారాష్ట్రలో ఏకంగా 158 పార్టీలు ఎన్నికల బరిలో దిగడం విశేషం. ముంబై ఎంవీఏ కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన ఏకైక ప్రాంతం. రాజధాని నగరంతో పాటు శివారు ప్రాంతాలతో కలిపి 36 సీట్లుంటే విపక్ష కూటమి 14 సీట్లు దక్కించుకుంది. వాటిలో 10 స్థానాలు ఉద్ధవ్ శివసేనకే దక్కగా మూడుచోట్ల కాంగ్రెస్ నెగ్గింది. శరద్ పవార్ పార్టీకి ఒక్క సీటూ రాలేదు. మహాయుతి 22 చోట్ల గెలిచింది. వాటిలో 15 బీజేపీకే దక్కడం విశేషం.ముఖాముఖిల్లో షిండే, అజిత్ పార్టీల హవా 36 చోట్ల ఉద్ధవ్ సేనపై షిండే సేన గెలుపు 29 చోట్ల శరద్ పార్టీపై నెగ్గిన అజిత్ ఎన్సీపీ శివసేన, ఎన్సీపీ వర్గ పోరులో సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గాలు స్పష్టంగా పై చేయి సాధించాయి. ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీ), షిండే శివసేన 50 అసెంబ్లీ స్థానాల్లో ముఖాముఖి తలపడ్డాయి. వాటిలో 36 చోట్ల షిండే సేన నెగ్గింది. 14 చోట్ల మాత్రం ఉద్ధవ్ సేన గెలిచింది. ఆ పార్టీ మొత్తం 95 చోట్ల బరిలో దిగినా కేవలం 20 సీట్లే గెలుచుకుంది. షిండే సేన 81 చోట్ల పోటీ చేయగా 57 స్థానాలు కైవసం చేసుకుంది. 2022లో షిండే మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి శివసేనను చీల్చడం, బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇక రెండు ఎన్సీపీలు 35 చోట్ల ముఖాముఖి తలపడ్డాయి. అజిత్ ఎన్సీపీ 29 స్థానాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని ఓడించింది. ఆరుచోట్ల మాత్రం ఆ పార్టీ చేతిలో ఓటమి చవిచూసింది. అజిత్ పార్టీ మొత్తం 59 చోట్ల పోటీ చేయగా ఏకంగా 41 స్థానాలు గెలుచుకుంది. శరద్ పార్టీ మాత్రం ఏకంగా 86 చోట్ల పోటీ చేస్తే కేవలం పదింట మాత్రమే నెగ్గింది. శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీని గతేడాది అజిత్ చీల్చి బీజేపీ–షిండే సేన సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. రెండు వర్గాల్లో అసలైన పార్టీలు ఎవరివంటూ నాటినుంచీ సాగుతున్న చర్చకు ఈ ఫలితాలతో తెర పడింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా?
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) హద్దుగా జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) పేరు చెబితే ఇప్పుడు అందరూ ఉలిక్కిపడుతున్నారు. ఈ ప్రత్యేక విభాగం ఆపరేషన్స్ నేపథ్యంలో స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి సామాన్యుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని విభాగాలతో పాటు కొందరు వ్యక్తులూ రెచ్చిపోతున్నారు. ఓ పక్క నోటీసులు, మరోపక్క బెదిరింపులతో తమ ‘పని’ పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ అంశాలను ‘సాక్షి’.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లింది. వివరాలు ఆయన మాటల్లోనే.. అక్రమ నిర్మాణం అయినప్పటికీ ఇప్పటికే ప్రజలు నివసిస్తుంటే ఆ జనావాసాల జోలికి హైడ్రా వెళ్లదు. జలవనరుల పరిరక్షణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న వాటిపైనే చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలవాలనే స్పష్టం చేస్తోంది. ఎవరైనా ప్లాట్, ఫ్లాట్ ఖరీదు చేసుకునే ముందు దానికి సంబంధించిన వివరాలు సరిచూసుకోండి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కుంట, చెరువు కనిపించకపోయినప్పటికీ ఒకప్పుడు అక్కడ ఉండొచ్చు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం అక్కడ జలవనరు ఉన్నట్లు రికార్డు ఉంటుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న పట్టాభూములు సైతం కేవలం వ్యవసాయం చేసుకోవడానికి ఉద్దేశించినవి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, ఈ భూములు క్రయవిక్రయాలు చేయకూడదు.రాజధానిలోని భూములకు సంబంధించిన సమగ్ర వివరాలు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కి (ఎన్ఆర్ఎస్సీ) ఆధీనంలోని భువన్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ధరణి వెబ్సైట్లలో, జలవనరులకు సంబంధించిన వివరాలు హెచ్ఎండీఏ లేక్స్ వెబ్‌సైట్స్‌లో ఉంటాయి. వీటితో పాటు రెవెన్యూ రికార్డులను సైతం సరిచూసుకున్న తర్వాతే క్రయవిక్రయాల విషయంలో ముందుకు వెళ్లాలి. రాజధానిలో ఎక్కడైనా స్థిరాస్తి కొనుగోలు చేసేప్పుడు మరికొన్ని అంశాలనూ సరిచూసుకోండి. ఆ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? అవి ఇవ్వాల్సిన విభాగాలే ఇచ్చినవి సక్రమ అనుమతులేనా? ఆ అనుమతుల్ని రద్దు చేయడం వంటివి జరిగాయా? కోర్టు వివాదాలు ఉన్నాయా? అనేవి చూసుకోండి. కొన్ని నిర్మాణాలకు హెచ్ఎండీఏకు బదులు పంచాయితీ సెక్రటరీ, ఆర్ఐలు అనుమతులు మంజూరు చేసిన ఉదంతాలు ఉన్నాయి. లేఅవుట్లలో ఉన్న కామన్ ఏరియాలు, పార్కులు, రహదారులు సైతం కాలక్రమంలో ఆక్రమణలకు గురవుతున్నాయి. కేవలం రికార్డుల్లో మాత్రమే ఇవి ఉంటూ.. వాస్తవంలో కనుమరుగు అవుతున్నాయి. ఈ విషయాన్ని హైడ్రా సీరియస్‌గా తీసుకుంటోంది. ఇలా ఆక్రమణలకు గురైన వాటినీ పునరుద్ధరిస్తుంది. వీటిని పరిరక్షించడం కోసం నిర్దిష్ట విధానాన్ని రూపొందించింది. -
మనసులు గెలిచిన సివంగి.. టాప్ 5లో బెర్త్ కన్ఫామ్!
'అందరికంటే వీక్, ఒక్క టాస్క్ అయినా గెలిచావా? జీరో.. అసలు పరిగెత్తగలవా?' కొన్ని వారాల క్రితం రోహిణిని నామినేట్ చేసేటప్పుడు పృథ్వీ అన్న మాటలివి! నిన్న విష్ణు కూడా రోహిణిపై నోరేసుకుని పడిపోయింది.. నీలో ఫైర్ లేదు, నువ్వు జీరో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది.. ఓటమిని తీసుకోలేవ్.. ఇలా తన నోటికి అడ్డూఅదుపే లేకుండా పోయింది. నిజానికి రోహిణి వచ్చినప్పటినుంచి తనవంతు ఆడటానికే ప్రయత్నించింది. ఎంటర్టైన్ చేయడం మరింత అదనం!అందరి కడుపు నింపిందితన ఎంటర్టైన్మెంట్ వల్ల బిగ్‌బాస్ పలుమార్లు కిచెన్‌లో రెండు గంటలపాటు వంట చేసుకునే అవకాశం కల్పించాడు. అలా ఎక్కువగా అవినాష్, రోహిణి వల్లే హౌస్మేట్స్ అందరూ కడుపునిండా తినగలిగారు. ఇక్కడ అర్థం కాని విషయమేంటంటే.. విష్ణు, రోహిణి ఇదివరకే మంచి ఫ్రెండ్స్. కానీ బిగ్‌బాస్ షోలో మాత్రం బద్ధ శత్రువులయ్యారు. పాత స్నేహితుల కంటే కొత్తగా పరిచయమైన పృథ్వీయే ఎక్కువయ్యాడు. రోడ్డు యాక్సిడెంట్లో గాయాలుఅతడు ఒక్కడుంటే చాలు.. మరెవరూ అవసరమే లేదన్నంతగా దిగజారింది. అందుకే ముందూవెనకా ఆలోచించకుండా ఏది పడితే అది అనేయడం తర్వాత తీరికగా సారీ చెప్పడం అలవాటైపోయింది. కానీ తన ఫ్రెండ్‌నే కించపరచడంతో విష్ణు స్వభావం ఎలాంటిదో బయటపడింది. రోహిణి విషయానికి వస్తే 2016లో ఆమెకు యాక్సిడెంట్ అయింది. అప్పట్లో తన కుడి కాలికి రాడ్ వేశారు. ఆ తర్వాత నటిగా బిజీ ఉండటంతో రాడ్‌ను తీయించుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ పోయింది. రెండుసార్లు ఆపరేషన్గతేడాది కాలినొప్పి మొదలవడంతో వైద్యుల్ని సంప్రదించింది. వారు ఆపరేషన్ చేశారు కానీ రాడ్ బయటకు తీయలేకపోయారు. బలవంతంగా తీస్తే ఎముక విరిగిపోతుందని ఆపేశారట! దీంతో తనకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్లగా 10 గంటలపాటు ఆపరేషన్ చేసి రాడ్డును బయటకు తీశారు. ఇదంతా జరిగింది తన కుడికాలికే! నిన్న అదే కుడికాలితో గంటలకొద్దీ కుండను బ్యాలెన్స్ చేసింది. 'హీరో'హిణిఆ కుండ గేమ్‌లో తనను చులకనగా చూసిన పృథ్వీని ఓడించింది. అంతకంటే ముందు విష్ణును చిత్తు చేసింది. హౌస్‌కు మెగా చీఫ్ అయింది. కప్పు కన్నా ముఖ్యమైన ప్రేక్షకుల మనసుల్ని గెలిచింది. ఆమె విజయం చూసిన ఎంతోమందికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కమెడియన్లను హీరోలుగా చూడరు అన్న భ్రమల్ని పటాపంచలు చేస్తూ HEROHINI అనిపించుకుంది. టాప్ 5లో బెర్త్ కన్ఫామ్ చేసుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి