Narendra Modi
-
పంచరంగుల చిత్రం
గమ్యస్థానం: వికసిత భారత్ దారిదీపం: సమష్టి కృషి ఇంధనం: కొత్త తరం సంస్కరణలు స్థూలంగా చెప్పాలంటే 2025–25 కేంద్ర బడ్జెట్లో నిర్మలమ్మ( Nirmala Sitharaman) ఆవిష్కరించిన పంచ రంగుల చిత్రం సారాంశమిదే! మధ్య తరగతి కొనుగోలు శక్తిని, తద్వారా అంతిమంగా ఆర్థిక వృద్ధి రేటును ఇతోధికంగా పెంచడం, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను విస్తృతపరచడమనే మోదీ ప్రభుత్వ లక్ష్యాలను బడ్జెట్లో ఘనంగానే ఆవిష్కరించారు విత్త మంత్రి. ‘‘ఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కల సాకారం దిశగా ఇదో పెద్ద ముందడుగు’’ అని చెప్పుకున్నారు. పౌరులందరి ప్రగతే (సబ్ కా వికాస్) లక్ష్యంగా పలు పథకాలను, చర్యలను ప్రతిపాదించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న తెలుగువారి అడుగుజాడ గురజాడ పంక్తులతో ప్రసంగం మొదలు పెట్టారు. ‘పేదరికం లేని సమాజం, అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన, పాఠశాల విద్య, వైద్య సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి–వారికి మెరుగైన ఉపాధి, మహిళల్లో కనీసం 70 శాతం మందికి ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం, భారత్‌ను ప్రపంచ ఆహార పాత్రగా తీర్చిదిద్దేలా రైతన్నకు వెన్నుదన్నుగా నిలవడం’ తమ ప్రభుత్వ లక్ష్యాలని పేర్కొన్నారు.వాటి సాధనకు ‘ఆర్థిక వృద్ధి–ఉత్పాదకత, గ్రామీణ స్వావలంబన, వృద్ధి పథంలో సమష్టి అడుగులు, మేకిన్ ఇండియా ద్వారా నిర్మాణ రంగానికి పెద్దపీట, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత తోడ్పాటు, ఉద్యోగిత ఆధారిత వృద్ధి, మానవ వనరులపై భారీ పెట్టుబడులు, రక్షిత ఇంధన సరఫరాలు, ఎగుమతులు, ఇన్నోవేషన్లకు ఇతోధిక ప్రోత్సాహం’... ఇలా పది రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రస్థానంలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులను నాలుగు ప్రధాన చోదక శక్తులుగా పేర్కొన్నారు.పన్నులు, ఇంధన, పట్టణాభివృద్ధి, గనులు, ఆర్థికం, నియంత్రణ... ఈ ఆరు కీలక రంగాల్లో వచ్చే ఐదేళ్ల పరిధిలో భారీ సంస్కరణలను ప్రతిపాదించారు. కాకపోతే లక్ష్యాలను ఘనంగా విధించుకున్న మంత్రి, వాటి సాధనకు ఏం చేయనున్నారనేది మాత్రం ఇదమిత్థంగా చెప్పకుండా పైపై ప్రస్తావనలతోనే సరిపెట్టారు. వేతనజీవికి వ్యక్తిగత వార్షిక ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచేశారు. తద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్య తరగతిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొత్త ఆదాయ పన్ను బిల్లును వారంలో ప్రవేశపెడతామని తెలిపారు. పన్నుల రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మోదీ సర్కారు మానస పుత్రికలైన స్టార్టప్‌లు, డిజిటల్ ఇండియా తదితరాలకు నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టారు.న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025–26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో కూడిన పద్దును పార్లమెంటుకు సమర్పించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.4 శాతం ఉండొచ్చని మంత్రి జోస్యం చెప్పారు. జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికే పరిమితం కావచ్చన్న అంచనాల నేపథ్యంలో సంక్షేమాన్ని, సంస్కరణలను పరుగులు పెట్టించేలా పలు చర్యలను ప్రతిపాదించారు. 74 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఏమేం చెప్పారంటే... పరిశ్రమలకు మహర్దశ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ల్లో పెట్టుబడులను రెట్టింపునకు పైగా పెంచనున్నట్టు మంత్రి వివరించారు. ‘‘ప్రస్తుతం కోటికి పైగా ఎంఎస్ఎంఈల ద్వారా 7.5 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వాటికి ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లకు పైగా రుణ సదుపాయం అందనుంది. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రుణ పరిమితి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు, స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరగనుంది. తయారీ రంగంలో మేకిన్ ఇండియాకు మరింత ప్రాధాన్యం దక్కనుంది’’ అని చెప్పారు. చదువుకు జేజే ఈ ఏడాది మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 10 వేల అదనపు సీట్లు, ఐఐటీల్లో కనీసం 6,500 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నట్టు విత్త మంత్రి ప్రకటించారు. ‘‘రూ.500 కోట్లతో సాగు, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతాయి. భారత్‌నెట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం అందుబాటులోకి తేనున్నాం. బాలల్లో శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించేందుకు సర్కారీ స్కూళ్లలో వచ్చే ఐదేళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబులు ఏర్పాటవుతాయి. ‘భారతీయ భాషా పుస్తక్’ పథకంతో స్థానిక భాషల్లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాలన్నీ డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయి’’ అని తెలిపారు. పట్టణాలకు ప్రాధాన్యం పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా తీర్చిదిద్దడానికి రూ.లక్ష కోట్లతో అర్బన్ చాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా అమలు చేసే ప్రతి పథకంలోనూ నాలుగో వంతు నిధులను కేంద్రం అందజేస్తుంది. 2047 కల్లా కనీసం 100 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తే లక్ష్యంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మెడికల్ టూరిజానికి ఊపు మెడికల్ టూరిజంలో భాగంగా రూ.20 వేల కోట్లతో ‘హీల్ ఇన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా మరో 50 పర్యాటక ప్రాంతాలను స్థానిక ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. మరో 120 పట్టణాలను ఉడాన్ పథకం పరిధిలోకి తేవడం ద్వారా వచ్చే పదేళ్లలో మరో 4 కోట్ల మందికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి సింగిల్ విండో సదుపాయంగా ‘భారత్ ట్రేడ్‌నెట్’ను అందుబాటులోకి తెస్తామన్నారు.సాగుకు పట్టం...వ్యవసాయ రంగానికి పట్టం కట్టేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మల ప్రకటించారు. ‘‘7.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం. అసోంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో భారీ యూరియా ప్లాంటు ఏర్పాటవనుంది. వ్యవసాయోత్పత్తి, నిల్వ సామర్థ్యం పెంపు తదితర లక్ష్యాలతో రాష్ట్రాల భాగస్వామ్యంతో 100 జిల్లాల్లో ప్రధానమంత్రి ధనధాన్య కృషీ యోజన అమలవనుంది.రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెజీలియన్స్ పథకంతో ఈ పథకంతో గ్రామీణ మహిళలు, యువ రైతులు, చిన్న, సన్నకారు రైతులకు బాగా లబ్ధి చేకూరుతుంది. వంట నూనెల ఉత్పత్తి తృణధాన్యాల సాగులో ఆత్మనిర్భరత సాధనకు ప్రాధాన్యమిస్తున్నాం. కూరగాయ లు, పళ్ల సాగుకు సమగ్ర పథకం తేనున్నాం. జన్యు బ్యాంకుల ద్వారా విత్తన నిల్వ సా మర్థ్యం పెంపొందిస్తాం’’ అని వివరించారు.ఇది ప్రజల బడ్జెట్: ప్రధాని మోదీన్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రజల బడ్జెట్‌గా అభివర్ణించారు. ఇది ప్రతి భారతీయుడి కలలను నెరవేరుస్తుందని అన్నారు. బడ్జెట్లో తీసుకున్న చర్యలవల్ల ప్రజల మధ్య మరింత డబ్బు చలామణి అవుతుందని, ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఊతం ఇస్తుందని, ఇది దేశ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.మరిన్ని రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని, దీని ద్వారా ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చని అన్నారు. పొదుపు, పెట్టుబడులు, వినియోగం, అభివృద్ధి వంటి అంశాలకు ఈ బడ్జెట్ ఊతం కల్పిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్‌ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలతోపాటు దీని రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థిక శాఖ బృందాన్ని ప్రధాని అభినందించారు. సాధారణంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా బడ్జెట్లు ఉంటాయని, కానీ ఈ సారి అందుకు భిన్నంగా ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువ చెలామణి అయ్యేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కొనియాడారు.రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలున్యూఢిల్లీ: మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక ప్రకటన చేశారు. వడ్డీ లేకుండా రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేకుండా ఈ రుణాలు కేంద్రం ఇస్తుంది. ఈ నిధులను వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2021లో మొదటి అసెట్ మానిటైజేషన్ వ్యూహాన్ని ప్రకటించింది.తాజా బడ్జెట్లో 2025–30 కాలానికి సంబంధించి రెండో అసెట్ మానిటైజేషన్ ప్లాన్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్లాన్‌లో భాగంగా మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.10 లక్షల కోట్ల మూలధన సహకారం అందిస్తారు. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ మద్దతుతో రాష్ట్రాలను కూడా ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. బడ్జెట్ హైలైట్స్⇒ కొత్త పన్నువిధానంలో రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉండదు. వేతన జీవులకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.12.75 లక్షల వరకు పరిమితి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల రెవెన్యూ తగ్గిపోతుంది. ⇒ ఏడు టారిఫ్ రేట్ల తొలగింపు ⇒ 82 టారిఫ్ లైన్లపై ఉన్న సామాజిక సంక్షేమ సర్‌చార్జి రద్దు.⇒ అప్పుల ద్వారా ఆదాయం రూ. 34.96 లక్షల కోట్లు, మొత్తం వ్యయం రూ.50.65 లక్షల కోట్లు ⇒ జీడీపీ రెవెన్యూ లోటు 4.4 శాతం ⇒ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధాన్‌మంత్రి ధన్ ధాన్య యోజనకృషి యోజన ఏర్పాటు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం ⇒ కంది, మినుములు, పెసర రైతుల ప్రోత్సాహకం కోసం పప్పుధాన్యాల ఆత్మనిర్భర మిషన్ ఏర్పాటు. దీనిద్వారా నాఫెడ్, ఎన్సీపీఎఫ్లు రైతులనుంచి వచ్చే నాలుగేళ్లలో పప్పుధాన్యాలను సేకరిస్తాయి. ⇒ కూరగాయలు, పండ్లు పండించే రైతుల కోసం సమగ్ర పథకం ⇒ మఖానా విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు బిహార్‌లో మఖానా బోర్డు స్థాపన. అస్సాంలో ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తిచేసే యూరియా ప్లాంట్.ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలతో దేశప్రజలు ఇబ్బంది పడుతుంటే బడ్జెట్‌తో ప్రజలను మోసగించే యత్నం చేశారు. పదేళ్లలో మధ్యతరగతి నుంచి రూ.54.18 లక్షల కోట్లను ఆదాయపు పన్నుకింద వసూలు చేసి, ఇప్పుడు రూ.12 లక్షలు సంపాదించే వారికి మినహాయింపులు ఇస్తోంది. –– ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుఅభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ విజన్‌కు ఈ బడ్జెట్ అద్దం పడుతోంది. ప్రధాని ఆలోచనంతా మధ్యతరగతి ప్రజల బాగోగులపైనే. రైతులు మొదలుకొని మధ్యతరగతి ప్రజల వరకు.. అన్ని వర్గాల సంక్షేమంపై ఈ బడ్జెట్ దృష్టిపెట్టింది. –– అమిత్‌షా, కేంద్ర హోం మంత్రిబిహార్ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పాటునందిస్తుంది. మఖానా బోర్డ్ ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు.. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను తీరుస్తాయి. పట్నా ఐఐటీని విస్తరించాలన్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సాంకేతిక విద్యకు ఊతం లభిస్తుంది. –– నితీశ్‌కుమార్, బిహార్ సీఎంకోటీశ్వరులకు రుణాలు మాఫీ చేసే విధానానికి స్వస్తి చెప్పి, అలా ఆదాచేసిన డబ్బులను మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి వాడాలని నేను చేసిన సూచనను బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకపోవడం నిరుత్సాహపరిచింది. కోటీశ్వరుల రుణమాఫీ కింద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చించడం సరికాదు. –– కేజ్రీవాల్, ఆప్ జాతీయ కన్వీనర్బడ్జెట్లో అంకెలకన్నా, కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గల్లంతు అయ్యారన్న విషయమే నాకు ముఖ్యం. తొక్కిసలాటలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పలేకపోతోంది. బాధితులు ఇంకా తమ కుటుంబ సభ్యులకోసం వెతుక్కుంటున్నారు. –– అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత వరుసగా 8వసారిదేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ హితోక్తే మా సర్కారుకు స్ఫూర్తిజీవకోటి వానల కోసం ఎదురు చూసినట్టే పౌరులు సుపరిపాలనను అభిలషిస్తారన్న తిరుక్కురళ్ హితవును పన్ను విధానాల రూపకల్పనలో దృష్టిలో ఉంచుకున్నాంఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కలను సాకారం చేసుకునే దిశగా ఇదో పెద్ద ముందడుగు– బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
బీహార్ సాధించుకుంది మరి ఏపీకి ఏమైంది ?
-
ప్రజల జేబులు నింపే బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ:ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్లో శనివారం(ఫిబ్రవరి1) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను ఈ బడ్జెట్ నెరవేరుస్తుందన్నారు. బడ్జెట్‌పై శనివారం మధ్యాహ్నం మోదీ స్పందించారు.‘భారత్ అభివృద్ధి ప్రయాణంలో ఈరోజు అత్యంత ముఖ్యమైనది. ఇది 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు సంబంధించిన బడ్జెట్.ఈ బడ్జెట్ ప్రతీ భారతీయుడి కలను నెరవేరుస్తుంది. బడ్జెట్ ద్వారా అనేక రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సామాన్యులే వికసిత్ భారత్ మిషన్‌ను ముందుకు తీసుకువెళ్లేలా ఈ బడ్జెట్ తోడ్పడుతుంది. సాధారణంగా ప్రభుత్వ ఖజానను ఎలా నింపాలన్నదానిపై బడ్జెట్ ఫోకస్ ఉంటుంది. కానీ ఈ బడ్జెట్ సామాన్యుల జేబులు ఎలా నింపాలన్నదానిపై దృష్టి పెట్టి రూపొందించినది. ఈ బడ్జెట్‌తో దేశ పౌరులు తమ కష్టార్జితాన్ని పొదుపు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. తద్వారా వినియోగం కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతుంది. అణు ఇంధన రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు తలుపులు తెరవడం లాంటి చర్యలు ఈ బడ్జెట్లో తీసుకువచ్చిన గొప్ప సంస్కరణలు’అని ప్రధాని కొనియాడారు. కాగా, కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ఆదాయ పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయించడంతో పాటు పాత విధానంలోనూ శ్లాబులు మార్చి పన్ను తగ్గించారు. దీంతో ఈ బడ్జెట్ ప్రజల చేతిలో మిగులు ధనం ఉండేందుకు దోహదం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. -
పేదలు, మహిళల కోసం కొత్త పథకాలు
-
ఆప్ ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకుంది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధిని ఆప్ అడ్డుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ పురోగతి కోసం ఢిల్లీని రాజకీయ ఏటీఎంలా వాడుకుంటోందన్నారు. మోదీ శుక్రవారం నాడిక్కడ ద్వారకలో ప్రచారసభలో మాట్లాడారు. ఢిల్లీ పురోభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కారును ఎన్నుకోవాల్సిందిగా ప్రజలను కోరారు. అధునాతన ఢిల్లీకి బీజేపీ కట్టుబడి ఉందనడానికి ఇటీవల ప్రారంభించిన యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ఉదాహరణ అన్నారు. వేరే రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఆప్ ఢిల్లీ వనరులను ఖాళీ చేసిందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీని ఏటీఎం కార్డు లాగా వాడుకుంటోందన్నారు. కాంగ్రెస్ రాజకుటుంబం గిరిజన రాష్ట్రపతిని అవమానించిందన్నారు. ఆప్ ప్రభుత్వం తమ సమయమంతా ఇతర రాష్ట్రాలతో పేచీలకే వెచి్చస్తోందని మండిపడ్డారు. కేంద్రంతోనూ, ఉత్తరప్రదేశ్, హరియాణాలతో నిత్యం కలహిస్తోందన్నారు. దాంతో ఢిల్లీ అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉంటే అభివృద్ధిలో ఢిల్లీ వెనుకబడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కలహాలలో మునిగితేలే ప్రభుత్వం కంటే సమన్వయంతో ముందుకు సాగే ప్రభుత్వం ఢిల్లీకి అవసరమన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూసే ప్రభుత్వం కావాలన్నారు. బీజేపీని గెలిపిస్తే అవినీతిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అన్నా హజారే ఉద్యమాన్ని అపహస్యం చేస్తూ ఆప్ సర్కార్ అవినీతిలో మునిగిపోయిందని, ప్రజలకు ద్రోహం చేసిందని మోదీ అన్నారు. ఢిల్లీ బడ్జెట్లో ఆప్ 20 శాతమే అభివృద్ధిపై ఖర్చు పెడుతోందని, మౌలికసదుపాయాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజల కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా సొంత ప్రచారానికి నిధులు వెచి్చస్తోందని పేర్కొన్నారు. అద్దాల మేడలో నివసించే వాళ్లు పేదల ఇళ్ల గురించి పట్టించుకోరని, ఆప్ మధ్యతరగతికి వ్యతిరేకమని మోదీ అన్నారు. ఆప్ అక్రమాలను తవ్వితీస్తాం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఆప్ ప్రభుత్వం అక్రమాలను తవ్వితీస్తామని మోదీ హామీ ఇచ్చారు. కాగ్ నివేదికను ఢిల్లీ సర్కారు తొక్కిపెట్టాలని చూసిందని ఆరోపించారు. మద్యం పాలసీతో సహా ఆప్ విధానాలను కాగ్ తప్పుపట్టిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే కాగ్ నివేదికను ప్రవేశపెడతామని మోదీ అన్నారు.ఢిల్లీ అభివృద్ధికి శాయశక్తులా బీజేపీ సర్కారు కృషి చేస్తుందన్నారు. దోపిడి, అబద్ధాల నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. ఢిల్లీ ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే తన కల అని, ఆప్ దీనిని అడ్డుకుంటోందని మోదీ ఆరోపించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను పేదలకు కేటాయించకుండా ఆప్ అడ్డుకుంటోందని, తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందేలా చూస్తామని, ఇది తన గ్యారంటీ అని మోదీ పేర్కొన్నారు. -
‘ఐటీ’ కటాక్షించేనా?
(సాక్షి, బిజినెస్ డెస్క్, సాక్షి, అమరావతి) : మరి కొద్ది గంటల్లో బడ్జెట్(Budget) ప్రవేశపెట్టనున్న తరుణంలో వెలువడిన కేంద్ర ఆర్థిక సర్వేతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) చేసిన వ్యాఖ్యలు వేతన జీవులు, మధ్య తరగతి వర్గాల్లో ఆశలను పెంచుతున్నాయి. 2014 నుంచి పన్నుల శ్లాబులు మార్చకపోవడం.. మండిపోతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెరగని నేపథ్యంలో ఈదఫా వేతన జీవులకు ఊరట లభిస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదలైన ఆర్థిక సర్వే ఇదే సంకేతాలనిచ్చింది. 2023–24లో కంపెనీల లాభాలు 22.3 శాతం పెరగగా ఇదే సమయంలో ఉద్యోగాల కల్పన వృద్ధి 1.3 శాతానికి పరిమితం కావడం.. సంస్థలు వ్యయాల నియంత్రణ పేరుతో సిబ్బంది సంఖ్యతో పాటు వేతనాల్లో కోత పెడుతుండటంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 2002–03లో దేశ జీడీపీలో 2.1 శాతంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల లాభాలు 2023–24 నాటికి ఏకంగా 4.8 శాతానికి చేరుకున్నాయని, ఇదే సమయంలో వేతనాల పెరుగుదల చాలా తక్కువగా ఉండటం ఆర్థిక అసమానతలను పెంచుతుందని సర్వే పేర్కొంది. అయితే దేశ ఆర్థిక పరిస్థితేమీ అంత గొప్పగా లేదు. వృద్ధి నెమ్మదించింది. అమెరికాలో ట్రంప్ విజయం సాధించటమేకాక... భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచుతామని బెదిరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరగటంతో... ఇపుడు బ్లూచిప్, చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా అన్ని కంపెనీల్లోనూ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఫారిన్ ఫండ్స్) తమ వాటాలను అయినకాడికి తెగనమ్మేస్తున్నాయి. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతోంది... డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీగా పతనమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందే తప్ప తగ్గటం లేదు. ఇలాంటి సమస్యలతో దేశం ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో 2025–26 కేంద్ర బడ్జెట్‌ను శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా... మోదీ ప్రభుత్వం మూడోసారి గెలిచాక ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.ఎందుకంటే ఎన్నికలు సంవత్సరం మధ్యలో రావటంతో మిగిలిన కాలానికి ఓటాన్ అకౌంట్‌తో నెట్టుకొచ్చారు. మరి ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలంటే సరికొత్త గేమ్ ఛేంజర్ విధానాలు అవసరమన్నది నిపుణుల మాట. ఒకవైపు పేద, మధ్య తరగతి వర్గాలకు తగిన రక్షణ కల్పిస్తూనే.. వృద్ధిని పరుగులెత్తించాల్సిన బాధ్యత ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఏ మేరకు నెరవేరుస్తారన్నదే సర్వత్రా చర్చనీయమవుతోంది.ఆదాయపు పన్నులో మరింత ఊరట!బడ్జెట్ వచ్చిందంటే మధ్య తరగతి ఎదురుచూసేది ఆదాయపు పన్ను సవరణల గురించే. ఈసారి ఆదాయ పన్ను విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల కిందట ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తెచ్చింది. ఎలాంటి మినహాయింపులూ లేకుండా పన్ను శ్లాబులను మాత్రం సవరించింది. పాత పన్ను విధానంలోనైతే గృహ రుణం, స్కూలు ఫీజుల నుంచి మనం చేసిన వివిధ సేవింగ్స్‌ను కూడా మినహాయించుకునే అవకాశముండేది. కొత్త విధానంలో అలాంటి మినహాయింపులేవీ లేవు. కాకపోతే పన్ను రేట్లు కాస్త తక్కువ. జీతాన్ని బట్టి ప్రస్తుతం ఎవరి లెక్కలు వారు వేసుకుని, ఎవరికి ఏది అనుకూలమంటే దాన్ని ఎంచుకుంటున్నారు. కాకపోతే రెండేళ్లు ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో ఆకర్షణీయమైన మార్పులు చేస్తూ... పాత పన్ను విధానం నుంచి ఎవరికి వారు స్వచ్ఛందంగా కొత్త విధానంలోకి మారేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈసారి పాత విధానం వృథా అనేలా చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్నుల విధానంలో 72 శాతం మందికి పైగా రిటర్నులు దాఖలు చేశారు. పాత పన్నుల విధానాన్ని రద్దు చేసి.. కొత్త పన్నుల విధానంలో పలు రాయితీలను ప్రకటించడం ద్వారా మధ్య తరగతి ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చన్నది ఆర్థిక మంత్రి ఆలోచనగా ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం... కొత్త విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని, రూ.15–20 లక్షల వరకు ఆదాయానికి 25 శాతం కొత్త పన్ను శ్లాబ్‌ను ప్రవేశపెట్టాలనే వాదనలు బలంగా వస్తున్నాయి. ఆర్థిక మంత్రి గనక ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే బడ్జెట్లో మధ్య తరగతికి మేలు జరిగినట్లే. బడ్జెట్ సమావేశాల ఆరంభానికి ముందు... శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పన్ను మినహాయింపులపై ఆశలు పెంచేలా ఉన్నాయి. మధ్యతరగతి, పేదలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పేర్కొనడం గమనార్హం. ఇన్ఫ్రాకు బూస్ట్కొంతకాలంగా ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణంపై దృష్టి సారించడం వల్ల ఇన్ఫ్రా రంగంమీద ఫోకస్ ఉంటుంది. అయితే ఈ రంగంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు నిరుత్సాహకరంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే మూలధన వ్యయం మద్దతును పెంచే అవకాశముంది. వివిధ పరిశ్రమలలో ఇప్పటికే మంచి ఫలితాలను చూపించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని విస్తరించడం ద్వారా తయారీ రంగాన్ని బలోపేతం చేసే అవకాశం కనిపిస్తోంది. వినియోగాన్ని పెంచడం తక్షణ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రైవేట్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోటీతత్వం ,ఉపాధి అవకాశాలను పెంచే దీర్ఘకాలిక వ్యూహాలపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.యువత ఉపాధి, కీలక రంగాలకు మద్దతురాబోయే రోజుల్లో లక్షల మంది యువతీ యువకులు డిగ్రీ పట్టాలతో మార్కెట్లోకి వస్తారు. వీళ్లందరికీ ఉద్యోగాలు లభిస్తేనే ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. ఇందువల్ల ఉద్యోగ కల్పనపై కూడా బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించే అవ కాశం ఉంది. నిర్మాణం, జౌళి, ఇ–కామర్స్, పర్యాటక రంగాలు పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి.ఈ రంగాలకు బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు ఉండొచ్చు. దీనికి అదనంగా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం వారికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించడం లక్ష్యంగా విధానాలు ప్రకటించచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి ప్రభుత్వం నుంచి నిరంతర సహాయం అందేలా చర్యలు తీసుకునే వీలుంది. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం రుణ హామీ పథకాలను విస్తరించడం, ఎగుమతులకు అదనపు ప్రోత్సాహæకాలు అందించడం వంటి చర్యలను పరిశీలించవచ్చు. వీటికి తోడు చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై విధించే పన్నుల సరళీకరణ కూడా బడ్జెట్లో ఉండొచ్చు.వ్యవసాయం, గ్రామీణ ఆర్థికంపై ఫోకస్వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బడ్జెట్లో ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉంది. రైతులు రుణాలను సులభంగా పొందడానికి ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ పథకాలను విస్తరించవచ్చు. ఈ రంగానికి మరింత మద్దతుగా, ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మరిన్ని కేటాయింపులు చేసే అవకాశం ఉంది. పంట నిల్వల కోసం గోదాముల నిర్మాణం, వ్యవసాయ మార్కెటింగ్ కోసం మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వొచ్చు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ వంటి కార్యక్రమాలు నీటిపారుదలను గణనీయంగా పెంచినప్పటికీ, ఇంకా పురోగతికి అవకాశం ఉంది. పరిశోధన, అభివృద్ధితో సహా సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యవస్థలతో వ్యవసాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెంచడానికి రైతులకు మరింత మద్దతు అవసరం. గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకి పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని, అందుబాటు గృహాల నిర్మాణం మరో ముఖ్యమైన అంశంగా ఉండొచ్చు. ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఉపాధి పథకాలకు నిధులు పెంచి, దాని పరిధిని విస్తరించే అవకాశముంది. -
పేదలు, మధ్య తరగతిపై లక్ష్మీకటాక్షం
సాక్షి, న్యూఢిల్లీ: పేదలు, మధ్య తరగతి ప్రజలపై సంపదల దేవత లక్ష్మీదేవి కటాక్షం చూపాలని తాను ప్రార్థిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా వర్గాలకు లక్ష్మీదేవి ప్రత్యేకంగా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ బడ్జెట్లో పేదలు, మధ్య తరగతితోపాటు మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ ప్రాంగణంలో మోదీ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. మహిళలకు సమాన హక్కులు ఉండాలన్నారు. వారిపై వివక్ష అంతం కావాలని ఆకాంక్షించారు. మహిళల గౌరవాన్ని పెంచే చర్యలు చేపట్టబోతున్నామని ప్రకటించారు. ఇప్పటికే మహిళల సాధికారతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరంచారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పలు చరిత్రాత్మక బిల్లులు, ప్రతిపాదనలపై చర్చించబోతున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. దేశాన్ని మరింత బలోపేతం చేసే చట్టాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. యువ ఎంపీలే విధాన రూపకర్తలు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఎదిగేందుకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు విశ్వాసాన్ని, శక్తిని నింపుతాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని 140 కోట్ల మంది పౌరులు ఈ తీర్మానాన్ని సమష్టిగా నెరవేరుస్తారని ఆయన నొక్కి చెప్పారు. మూడో దఫా ప్రభుత్వంలో భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా సమగ్ర అభివృద్ధి దిశగా మిషన్ మోడ్‌లో ముందుకు సాగుతోందని, ఆవిష్కరణలు, చేరికలు, పెట్టుబడులు స్థిరంగా దేశ ఆర్థిక రోడ్‌మ్యాప్‌కు పునాదిగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశాన్ని బలోపేతం చేసే చట్టాలకు దారితీసే అనేక చరిత్రాత్మక బిల్లులు, ప్రతిపాదనలు ఈ సెషన్లో చర్చిస్తామన్నారు. స్త్రీల గౌరవాన్ని పెంచేలా, ప్రతి మహిళకు సమాన హక్కులు కల్పించడంతోపాటు మతపరమైన చిచ్చుల , వర్గ విభేదాలు లేకుండా చేయడం.. తమ ప్రా«థామ్యాలని ఆయన నొక్కిచెప్పారు. ఈ లక్ష్య సాధన దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. వేగవంతమైన అభివృద్ధిని సాధించడంలో సంస్కరణలు, పనితీరు, మార్పు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. దేశం అపారమైన యువశక్తితో తొణికిసలాడుతోందని, ఈ రోజు 20–25 సంవత్సరాల వయస్సు గల యువత 45–50 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి అభివృద్ధి చెందిన భారతదేశంలో అతిపెద్ద లబి్ధదారులు అవుతారని అన్నారు. వారంతా విధాన రూపకల్పనలో కీలక స్థానాల్లో ఉంటారని, అభివృద్ధి చెందిన భారతాన్ని రాబోయే శతాబ్దంలో గర్వంగా నడిపిస్తారన్నారు. 1930, 1940లలో స్వాతంత్య్రం కోసం పోరాడిన యువతతో వారిని పోల్చారు. యువ ఎంపీలకు ఇది సువర్ణావకాశమని, సభలో వారి చురుకైన భాగస్వామ్యంతో వికసిత్ భారత్‌కు సాక్షులుగా ఉంటారని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రతి ఎంపీ, ముఖ్యంగా యువ ఎంపీలు వికసిత్ భారత్ ఎజెండాకు ఇతోధికంగా కృషి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సంస్కరణలు, పనితీరు, పరివర్తన’ తమ మంత్రంగా ఉంటుందన్నారు. వేగంగా అభివృద్ధిని సాధిస్తామని, సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మార్పు సాధ్యమన్నారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేస్తామని పేర్కొన్నారు. పదేళ్లలో విదేశీ జోక్యం లేని సమావేశాలివే గడిచిన పదేళ్లలో విదేశీ జోక్యం లేకుండా జరుగుతున్న మొదటి పార్లమెంట్ సమావేశాలు ఇవేనని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి సమావేశాలకు ముందు విదేశాల నుంచి అగ్గిరాజేయడం పరిపాటిగా వస్తోందని, ఈసారి మాత్రం అలాంటిదేమీ జరుగలేదని విపక్షాలకు చురకలు వేశారు. ‘‘2014 నుంచి నేను గమనిస్తున్నాను. ప్రతి సమావేశానికి ముందు ఇక్కట్లు సృష్టించేందుకు చాలామంది సిద్ధంగా ఉంటారు. ఇక్కడ దేశంలో ఈ ప్రయత్నాలను ఎగదోసే వారికి కొదవలేదు. విదేశీ మూలాల నుంచి ఎలాంటి జోక్యం లేని మొదటి సమావేశం ఇదే’’ అని వ్యాఖ్యానించారు. -
వంట నూనెని తీసుకోవడం తగ్గించండి..!: ప్రధాని మోదీ విజ్ఞప్తి
శారీరక శ్రమ లేకపోవడం, జంక్‌ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లు, జీవనశైలి తదితరాలే ఊబకాయం సమస్యకు కారణం అని అంతా చెబుతుంటారు. కానీ ప్రధాన కారణం వంట నూనె అట. సాక్షాత్తు ప్రధాని మోదీనే అన్నారు. ఆయన ఎందుకిలా పిలుపునిచ్చారు..? ఊబకాయం సమస్యకి వంటనూనె కారణమా..? తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.దయచేసి అందరూ ఇళ్లల్లో వంటనూనె వినియోగాన్ని తగ్గించండి ఇదే ఊబయకాయం రావడానికి ప్రధానం కారణం అంటూ పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. న్యూఢిల్లీలో జరిగిన 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో ఇలా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వంటనూనె అధిక వినియోగమే ఊబకాయం సమస్యకు ప్రధాన కారణం అని అన్నారు. దేశంలోని అన్ని వయసుల వారు, ముఖ్యంగా యువత ఈ సమస్య బారినపడుతున్నారని అన్నారు. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ ఊబకాయం మధుమేహం, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదాన్ని పెంచుతోందన్నారు. రోజువారీగా వ్యాయమం చేయడం, సమతుల్య పోషకాహారంపై దృష్టిపెట్టడం తోపాటు నూనె తీసుకోవడం తగ్గించాలని ప్రజలకు సూచించారు మోదీ. "మన ఇళ్లల్లో నెల ప్రారంభంలో రేషన్ వస్తుంది. ఇప్పటి వరకు ప్రతినెల రెండు లీటర్ల వంట నూనె ఇంటి తీసుకొచ్చినవారు దానిని కనీసం 10%కి తగ్గించండి." అని కోరారు మోదీ. మరి దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. మణిపాల్ ఆస్పత్రిలోని డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ కుమార్ సైతం వంట నూనెని తగ్గించాలన్నారు. అధిక బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీసే కడుపు నిండిన అనుభూతిని కలిగించకుండా చేసేది వంటలో ఉపయోగించే అదనపు నూనె అని అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి నెలకు 600-700 ఎంఎల్ కంటే ఎక్కువ తినకూడదని చెప్పారు. అంటే రోజుకి సుమారు నాలుగు టీస్పూన్లకు మించి వాడకూడదని అన్నారు.మరో డాక్టర్ అనూప్ మిశ్రా మాట్లాడుతూ..సాధారణంగా ప్రజలు సిఫార్సు చేసిన నూనెకి మించి అధికంగా నూనెని వాడతారు. కొందరూ ఫ్రై చేసిన నూనెని తిరిగి వినియోగిస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. ఆహార పదార్థాలు వేయించడానికి ఉపయోగించిన నూనెని తిరిగి ఉపయోగించడం వల్ల ట్రాన్స్-ఫ్యాట్స్ పెరుగుదలకు దారితీస్తుంది. ఇవి గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక నూట్రిషన్లు నూనె పరిమాణం తోపాటు నూనె నాణ్యత కూడా ముఖ్యమేనని అన్నారు. ముఖ్యంగా ఆవాల నూనె, వేరుశెనగ నూనె వంటకు చాలామంచివని చెప్పారు. అలాగే మిశ్రమ నూనెల కలయిక కూడా చాలామంచిదని చెప్పారు. ఉదాహారణకి వేరుశెనగ, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనె, బియ్యం ఊక నూనెల మిశ్రమంగా వాడటం కూడా మంచిదని అన్నారు. ఇక ఆర్థిక సర్వే 2023-2024 అనారోగ్యకరమైన ఆహారం,ఎక్కువగా కూర్చొనే అలవాట్లు మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని పేర్కొంది. అంతేగాదు ఇది దేశ ఆర్థిక సామర్థ్యానికి ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. శతాబ్దాలుగా మన భారతీయ సాంప్రదాయ ప్రకృతి, పర్యావరణానికి అనుకూలంగా ఆరోగ్యంగా, సామరస్యంగా ఎలా జీవించాలో చూపించాయి. దానికి అనుగుణంగా భారతీయ వ్యాపారాలు ఉండాలి. ప్రపంచ మార్కెట్‌ని ఉపయోగించుకోవడానికి బదులుగా నడిపించేలా భారతీయ వ్యాపారాలు ఉండాలి. అంటే ఆరోగ్యానికి పెద్దపీటవేసేలా సాగితే.. అన్ని విధాల శ్రేయస్కరం, ప్రగతి పథం కూడా అని అన్నారు ప్రధాని మోదీ. (చదవండి: -
ఈ బడ్జెట్ భారతీయులకు నూతన శక్తి ఇస్తుంది
-
పదేళ్లలో ఇదే తొలిసారి
బడ్జెట్(Union Budget 2025-26) సమావేశాలకు ముందు 2014 తర్వాత తొలిసారి అశాంతిని రెచ్చగొట్టేలా విదేశీ ప్రయత్నాలు జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందు ఆయన చేసిన ప్రసంగంలో ఈ మేరకు ప్రకటన చేశారు. గత దశాబ్ద కాలంగా పార్లమెంటు కీలక సమావేశాలకు ముందు రాజకీయ వాతావరణాన్ని అస్థిరపరిచేలా విదేశీ సంఘటనలు ఉన్నాయని తెలిపారు. 2014 తర్వాత ఏ విదేశీ సంస్థ కూడా అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించకపోవడం ఇదే తొలిసారని ఆయన ఉద్ఘాటించారు.ఆర్థిక సర్వేకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న 2025 ఆర్థిక సర్వే గత ఏడాది కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుపై సమగ్ర అంచనాను అందిస్తుంది. కీలక పరిణామాలు, సవాళ్లు, భవిష్యత్తు వృద్ధికి రోడ్ మ్యాప్‌ను ఈ సర్వే వివరిస్తుంది. జీడీపీ వృద్ధిని పెంచడానికి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇది హైలైట్ చేస్తుంది.కేంద్ర బడ్జెట్ 2025ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2025లో సమ్మిళిత వృద్ధి, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించే అవకాశం ఉంది. భారత స్వాతంత్ర్య శతాబ్దిని పురస్కరించుకుని 2047 నాటికి ‘వికసిత్ భారత్(Vikasit Bharat)’ లక్ష్యాన్ని సాధించడానికి బడ్జెట్ సమావేశాలు కొత్త నమ్మకాన్ని, శక్తిని నింపుతాయని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన ఆవిష్కరణలు, పెట్టుబడులకు ప్రభుత్వ నిబద్ధతను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో బడ్జెట్ సమావేశాల్లో కీలక సంస్కరణలు, నిర్ణయాలను ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: మహా కుంభమేళా.. విమాన ఛార్జీలు తగ్గింపుగతంలో విదేశీ జోక్యం ఇలా..దశాబ్ద కాలంలో బడ్జెట్ సమావేశాలకు ముందు విభిన్న సంఘటనల ద్వారా విదేశీ జోక్యం చోటు చేసుకుంటుంది. 2019, 2021 కెనడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా చైనా, భారతదేశం పాల్గొన్నాయని కెనడా కమిషన్ నివేదిక వెల్లడించింది. చైనాను ప్రధాన పాత్రధారిగా గుర్తించగా, భారత్ పార్టీలకు అతీతంగా అభ్యర్థులను ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. 2023లో సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఇది దౌత్య సంక్షోభానికి దారితీసింది. కెనడా అక్రమ వలసలు, నేరాలకు అనుమతించే వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని భారతదేశం ఆరోపించింది. -
భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం: రాష్ట్రపతి
👉 వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి. బడ్జెట్లో రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం ఉంటుంది. వికసిత్ భారత్ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. మూడోసారి మా ప్రభుత్వం మూడు రెట్లు అధిక వేగంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. వ్యవసాయ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది ఇంటి కల నెరవేర్చాం. కోట్లాది మందిని ప్రభుత్వం పేదరికం నుంచి బయటపడేసింది. మూడు కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నాం.👉మహాకుంభమేళాలో కోట్లాది మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. మహాకుంభమేళా భారత సంస్కృతికి చిహ్నం. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు నివాళి అర్పిస్తున్నాను.👉 ఇటీవల 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది సొంత ఇంటి కల నెరవేరబోతుంది. అమృత్‌భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.👉 వందో ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇస్రో భారత కీర్తి పతాకం ఎగురవేసింది. స్పేస్ డాకింగ్‌తో మరో అడుగు ముందుకేశాం. అంతరిక్షంలో భారతీయుడు అడుగుపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మేకిన్ ఇండియాతో అద్భుత విజయాలు సాధిస్తున్నాం. ఇండియా ఏఐ మిషన్‌ను ప్రారంభించాం. సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ నేరాలు, డిజిటల్ నేరాల నుంచి బయటపడేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రపంచస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.👉 ఖేలో ఇండియా మన దేశ యువతకు ఎంతో ఉపయోగకరం. మన దేశ మహిళలు ఒలంపిక్స్‌లో పథకాలు సాధిస్తున్నారు. మహిళా సాధికారిత కోసం డ్రోన్ దీదీ పథకం తీసుకువచ్చాం. లక్షా 15వేల మంది మహిళలు లక్పతి దీదీలుగా మారారు. మూడు లక్షల మంది మహిళలను లక్పతి దీదీలుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. డ్రోన్ దీదీ స్కీమ్ మహిళలకు ఉపయోగపడుతోంది. మధ్య తరగతి కుటుంబాలకు హోం లోన్స్ ఇస్తున్నాం. దేశంలో 70 ఏళ్లు దాటిన ఆరు కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తాం. రైతులను ఆదుకునేందుకు, వారి ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యువతను వారి వారి మాతృ భాషల్లో ఎడ్యుకేట్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నాం. 👉 భారత ఆర్థిక వ్యవస్థకు చిరు వ్యాపారులే కీలకం. భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం. టెక్నాలజీ రంగంలో భారత్ అద్భుతంగా దూసుకుపోతోంది. డిజిటల్ చెల్లింపుల్లో రికార్డులు సాధిస్తున్నాం. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. ఎంఎస్ఎంఈ కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీం తీసుకొచ్చాం. 👉 వైద్య, ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నూతన టెక్నాలజీ తీసుకొచ్చాం. దేశవ్యాప్తంగా చాలా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం. టీబీ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతున్నాం. తక్కువ ధరకే క్యాన్సర్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చాం.👉 ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జిని కశ్మీర్లో నిర్మించాం. దేశంలో మెట్రో వ్యవస్థలను వేగంగా విస్తరిస్తున్నాం. ఢిల్లీలో మెట్రో వ్యవస్థను విస్తరిస్తున్నాం. స్వచ్చమైన నీటి కోసం నదులను అనుసందానం చేస్తున్నాం. దేశంలో పౌరవిమానయాన రంగం అభివృద్ధి చెందుతోంది. రైతులు, పరిశ్రమలు, సైన్స్‌పై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.👉చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు. ఆదివాసీల్లో సికెల్‌సెల్ వ్యాధిని నివారించాం. మహిళలతోనే ఆర్థిక అభివృద్ధి అని మా ప్రభుత్వం నమ్ముతోంది. దళితుల కోసమే కొన్ని ప్రత్యేక పథకాలు తీసుకువచ్చాం. వన్ నేషన్-వన్ ట్యాక్స్ అభవృద్ధి చేశాం. 👉త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ అవతరించబోతుంది. భారత రాజ్యాంగానికి నా సెట్యూట్. వక్ఫ్ బోర్డులో సంస్కరణపై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మహిళా సాధికారితకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందరికీ ఫలాలు అందాలన్నదే మా ఉద్దేశ్యం. 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తాం. దేశాభివృద్ధికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.70వేల కోట్లు కేటాయించాం. ట్యాక్స్ విధానాలను సరళీకరించాం. ఉద్యోగుల కోసం ఎనిమిదో వేతన సంఘాన్ని నియమించాం. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. పేదలకు లబ్ధి కలిగిస్తున్నాయి. President Murmu says, "My government is committed to fulfilling the dream of the middle class of having their own house..." pic.twitter.com/Y58sa0z61Z— ANI (@ANI) January 31, 2025 👉మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యలకు ఉభయ సభలు సభ్యులు నివాళి అర్పించారు. 👉బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. President Droupadi Murmu to address the joint sitting of both Houses of Parliament, shortlySource: DD News pic.twitter.com/2RVQS79blX— ANI (@ANI) January 31, 2025👉కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వద్ద ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. మూడోసారి దేశ ప్రజలు మాకు విజయాన్ని అందించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పాన్ని పరిపూర్ణం చేస్తాం. వికసిత్ భారత్‌కు ఈ బడ్జెట్ ఊతమిస్తుంది. దేశంలోని పేదలు, మధ్య తరగతిపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ప్రార్థిస్తున్నాను. 👉ఈ సమావేశాల్లో చర్చకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తాం. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తాం. ఈ బడ్జెట్ భారతీయులకు నూతన శక్తిని ఇస్తుంది. ఈ బడ్జెట్ యువతకు ఆశాజనకంగా ఉంటుంది. చారిత్రాత్మక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడతాం. వక్ఫ్, బ్యాంకింగ్, రైల్వేలు సహా 16 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాం. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను అని కామెంట్స్ చేశారు.#WATCH | #BudgetSession | PM Modi says, "I pray that Maa Lakshmi continues to bless the poor and middle class of our country. It is a matter of great pride that India completed 75 years as a democratic nation. India has established itself well on the global pedestal...This is the… pic.twitter.com/BF2dT2oTz9— ANI (@ANI) January 31, 2025 👉ఈరోజు సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్ధేశించి లోక్‌సభ హాల్లో ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను లోక్‌సభలో, రాజ్యసభలో ప్రవేశపెడతారు. శనివారం నిర్మల లోక్‌సభలో 2025–26 సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చకు రాజ్యసభ, లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇస్తారు. బడ్జెట్ సమావేశాల తొలి సెషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 దాకా, రెండోసెషన్ మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ దాకా జరుగుతుంది. నిలదీసేందుకు విపక్షాల వ్యూహరచనమోదీ సర్కార్‌ను నిలదీసేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, కుంభమేళాలో అపశ్రుతి సహా కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, చైనా సరిహద్దు వివాదం వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని సైతం కొన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించి వాకౌట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సీపీఐ, సీపీఎం పార్టీలు, చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్లకు మాత్రం అన్ని కాంట్రాక్టులు దక్కేలా కుట్ర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధంచేశాయి. సహకరించాలన్న మోదీ సర్కార్శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలతో పాటు రాష్ట్రాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్‌చేశాయి. మహాకుంభమేళాలో భక్తులను గాలికొదిలేసి వీఐపీ సంస్కృతికి యోగి ప్రభుత్వం జై కొట్టిందని, ఈ నిర్లక్ష్య ధోరణిపై చర్చ జరపాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పట్టుబట్టగా ఎజెండాలో ఏమేం ఉండాలో సభావ్యవహా రాల సలహా కమిటీ నిర్ణయిస్తుందని మంత్రి కిరెణ్ రిజిజు చెప్పారు.వక్ఫ్ సహా కీలక బిల్లులు ఈ సమావేశాల్లోనే.. ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు గురువారం సమర్పించింది. వక్ఫ్ సవరణ బిల్లును గత ఏడాది లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడం తెల్సిందే. కాగా గురువారం నాటి అఖిలపక్ష భేటీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను అఖిలపక్ష నేతలకు ప్రభుత్వం అందజేసింది. ఈ జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లు సైతం ఉంది. 16 బిల్లులను ఈ సెషన్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉభయసభల ముందుకొచ్చే బిల్లుల జాబితాలో బ్యాంకింగ్ చట్టాల(సవరణ) బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ బిల్లు, చమురు క్షేత్రాల(సవరణ) బిల్లు, షిప్పింగ్ బిల్లు, వైమానిక వస్తువుల ప్రయోజనాల పరిరక్షణ బిల్లు, త్రిభువన్ సహకారీ యూనివర్సిటీ బిల్లు, వలసల, విదేశీయుల బిల్లు వంటివి ఉన్నాయి. -
బరువు తగ్గాలంటే..? సింపుల్‌గా ఈ చిట్కాలు పాటించండి: అక్షయ్ కుమార్
ఈమధ్య పదేళ్లలోపు పిల్లలు కూడా ఊబకాయం బారిన పడటం చూస్తున్నాం. ఊబకాయం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు వంటి సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి. దీంతో మానసిక, భావోద్వేగ ఆరోగ్యం మీదా అధికబరువు ప్రభావం చూపుతుంది. దేశంలో చాలామంది ఇలాంటి ఆందోళన సమస్యలతోనూ సతమతమవుతుంటారు. ఇదే అంశం గురించి తాజాగా ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోందని ఉత్తరాఖండ్ పర్యటనలో అన్నారు. ఫిట్‌నెస్‌పై అందరూ దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఊబకాయం చాలా వ్యాధులకు మూలం అని ఆయన గుర్తు చేశారు. (ఇదీ చదవండి: నటి శోభన పెళ్లెందుకు చేసుకోలేదంటే..?)స్థూలకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య దేశంలో బాగా పెరిగిపోతోందని, ఇది గుండె, మధుమేహం వంటి సమస్యలకు దారి తీయవచ్చని మోదీ అన్నారు. ‘ఫిట్ ఇండియా’ ఉద్యమం ద్వారా దేశంలోని నేటి యువత ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి పలు వ్యాఖ్యలు చేశారు. మోదీ (Narendra Modi) చేసిన ప్రసంగాన్ని ‘ఎక్స్’ వేదికగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) రీపోస్టు చేస్తూ.. మోదీపై ప్రశంసలు కురిపించారు. ఆపై బరువు తగ్గుదాం అనుకునే వారికి కొన్ని చిట్కాలను కూడా ఇచ్చారు.'ప్రధాని మోదీ చెబుతున్నట్లుగా ఊబకాయం వల్ల చాలా జబ్బులు వస్తాయి. ప్రధాని మోదీ చెప్పింది ముమ్మాటికి వాస్తవం. ఇదే విషయాన్ని చాలా ఏళ్ల నుంచి నేను కూడా చెబుతూనే ఉన్నాను. ప్రస్తుతం మోదీనే ఇదే విషయం చెప్పడంతో చాలామందికి రీచ్ అవుతుంది. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. ఊబకాయం నుంచి మనం బయటపడాలంటే సరిపడ నిద్రదో పాటు స్వచ్ఛమైన గాలి తీసుకోవాలి ఉండాలి. సూర్యరశ్మి సమయంలో మనం అడుగులు వేయాలి. మన వంటకాల్లో తక్కువ నూనె వాడకం ఉండేలా చూసుకోవాలి. ఆపై దేశీ నెయ్యి విరివిగా వినియోగించాలి. ఊబకాయంతో పోరాడే దేశ ప్రజలందరికీ ఇవే పెద్ద ఆయుధాలుగా ఉపయోగపడుతాయి. ప్రతి ఒక్కరు మీ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోండి. కచ్చితంగా రోజూ చేసేలా ప్లాన్ చేసుకోండి. ముమ్మాటికి ఈ విషయాన్ని నమ్మండి. ఈ చిట్కాలతో స్థూలకాయం నుంచి బయటపడొచ్చు.' అని అక్షయ్ తెలిపారు.How true!! I’ve been saying this for years now…love it that the PM himself has put it so aptly. Health hai toh sab kuchh hai. Obesity se fight karne ke sabse bade hathiyaar 1. Enough sleep2. Fresh air and Sunlight3. No processed food, less oil. Trust the good old desi ghee… pic.twitter.com/CxnYjb4AHv— Akshay Kumar (@akshaykumar) January 30, 2025 -
ఊహకందని మలుపులు తిరుగుతోన్న ఢిల్లీ ఎన్నికల సమరం
-
యమునలో స్నానమెప్పుడు చేస్తారు
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు యమునా నది కాలుష్యం చుట్టూ తిరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గురువారం యమునా నదిలో విహరిస్తున్న వీడియోను విడుదల చేసి.. ఈ మురికి కాసారంలో ఎప్పుడు స్నానం చేస్తారని అరవింద్ కేజ్రీవాల్‌కు సవాల్ విసిరారు. యమునా కాలుష్యం ప్రధాని నరేంద్ర మోదీ, కేజ్రీవాల్‌ల నిర్లక్ష్యం, అవినీతి ఫలితమేనని రాహుల్ ఆరోపించారు. రాహుల్ బుధవారం యమునా నదిలో విహరించి.. నది దుస్థితిని వీడియో తీశారు. ‘నాలాగా మీరు ఢిల్లీ వాసులైనట్లయితే యమునా నది పరిస్థితిని చూసి తీవ్రంగా విచారిస్తూ ఉంటారు. బుధవారం ఉదయం నేను యమునా నదికి వెళ్లాను. స్థానికులు, పడవలు నడిపేవాళ్లు, ఉద్యమకారులతో మాట్లాడాను. యమునా నదిలో ఎటు చూసినా చెత్తే. మురికినీళ్లే. దుర్వాసన వెదజల్లుతోంది. నీటి శుద్ధి తర్వాత వ్యర్థాలను తిరిగి యమునలోనే వదిలేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. యమునా నదిలో స్నానమాచరించడానికి గతంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్లు. ఇప్పుడు అతికొద్ది మంది మాత్రమే వస్తున్నారు. అదీ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి’అని రాహుల్ అన్నారు. ‘ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యమునను శుద్ధి చేస్తామని కేజ్రీవాల్ శుష్క వాగ్దానాలు చేస్తున్నారు. నేను యమునా నదిలో మునక వేస్తాను లేదంటే మాకు ఓటు వేయకండి అంటూ సుదీర్ఘ ఉపన్యాసాలిస్తున్నారు. ఇప్పుడు యమునా నీటిని ఒక సీసాలో తీసుకొని ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. ఇది యమునా నదిని అవమానించడమే కాదు.. ఢిల్లీ ప్రజలను అపహస్యం చేయడమే’అని రాహుల్ విమర్శించారు. ‘కేజ్రీవాల్ జీ 2025 వచ్చింది. మీరెప్పుడు యమునా నదిలో మునక వేస్తారు. ఢిల్లీ ఎదురుచూస్తోంది’అని రాహుల్ ప్రశ్నించారు. యమున శుద్ధి పేరిట డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపించారు. -
యమునా నది వివాదం.. ఎప్పుడేం జరిగింది?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యమునా నదిపై రాజకీయ వివాదం చెలరేగింది. ఢిల్లీ జీవనాడిగా భావించే యమునా నదిపై రాజకీయ పార్టీలు వాదోపవాదాలకు దిగాయి. యమునా నది (Yamuna River) కాలుష్యానికి మీరు కారణమంటే.. మీరు కారణమని అధికార, విపక్షాలు వాదులాడుకుంటున్నాయి. యమునా నది కాలుష్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం (Political Heat) రేగింది. న్యాయపరంగానూ ఆయనకు చిక్కులు ఎదురయ్యాయి.యమునా నదిని హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం విషతుల్యం చేస్తోందని బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో రచ్చ మొదలైంది. కేజ్రీవాల్ ఆరోపణలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తిప్పికొట్టారు. మరోవైపు కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు, ఎన్నికల సంఘం తాఖీదులు పంపాయి. యమునా నది కాలుష్యంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని ఆదేశించాయి. కేజ్రీవాల్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా దీటుగా స్పందించడంతో వివాదం మరింత ముదిరింది.హస్తిన జీవనాడిదేశరాజధాని ఢిల్లీకి యమునా నది జీవనాడి వంటిది. హస్తిన జనాభాలో 70 శాతం మందికి నీటిని అందించే ఈ నది ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగివుంది. అయితే దేశంలోని ఇతర ప్రధాన నదుల మాదిరిగానే యమున కూడా కాలుష్యకాసారంగా మారిపోయింది. పట్టణీకరణ బాగా పెరగడం.. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను నిరంతరం నదిలోకి వదులుతుండడంతో యమున కాలుష్యం బారిన పడింది. యమున నదిపై ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల మధ్య ఎన్నో ఎళ్లుగా తగాదాలు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.యమునా నది జలాల పంపిణీ వివాదం ఇలా...1993లో ఢిల్లీ శాసనసభ ఏర్పడింది. యమునా నదీ జలాల పంపిణీపై 1994, మే నెలలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనిపై ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేశారు. అయితే ఈ వ్యవహారం 1995, మార్చి 31న సుప్రీంకోర్టుకు చేరింది. ఢిల్లీలో తాగునీటి కొరతను తగ్గించేందుకు యమునా నదిలో నీటి ప్రవాహాన్ని సక్రమంగా నిర్వహించేలా హరియాణాకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పు వెలువరించింది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఢిల్లీకి వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించింది. 5 రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించింది. 1996, ఫిబ్రవరిలోనూ మరోసారి ఇలాంటి ఆదేశాలిచ్చింది. వజీరాబాద్, హైదర్‌పూర్‌లోని రెండు నీటి రిజర్వాయర్లు, ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి ఢిల్లీకి నీరు ఇవ్వాలని పేర్కొంది.2018, ఏప్రిల్ నెలలో వజీరాబాద్ రిజర్వాయర్‌లో నీటిమట్టం పడిపోవడంతో అప్పటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపుతట్టింది. సమస్యను పరిష్కరించాలని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ వివాదానికి సంబంధించి కోర్టులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకుంటేనే నీటిని విడుదల హరియాణాలోని అప్పటి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తామని హామీ ఇచ్చింది.2021, మార్చిలో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. హరియాణాకు వ్యతిరేకంగా ఢిల్లీ జల్ బోర్డు(DJB) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. యమునా నీటి పంపిణీపై 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హరియాణా ప్రభుత్వం ధిక్కరించిందని కోర్టుకు తెలిపింది. దీనిపై హరియాణా ప్రభుత్వం సర్కారు స్పందిస్తూ.. తమ తప్పు ఏమీలేదని, హస్తిన సర్కారు అసమర్థత కారణంగానే నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నమైందని వాదించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్‌ను 2021, జూలైలో సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.చదవండి: హరియాణాలో ఉన్నది మనుషులు కాదా?2023, జూలైలో దేశ రాజధానికి వరదలు పోలెత్తాయి. ఈ సమయంలో యమునానగర్ జిల్లాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి ఉద్దేశపూర్వకంగా హరియాణా నీటిని విడుదల చేసిందని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. కాగా, యమునా జలాల్లో తన వాటాను విడుదల చేయకుండా ఢిల్లీకి వ్యతిరేకంగా హరియాణా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ 2024, జూన్ నెలలో అప్పటి ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి, ప్రస్తుత సీఎం అతిషి నిరాహార దీక్ష చేశారు. తాజాగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో యమున నదీ వివాదం ఢిల్లీ ఎన్నికల్లో తెరమీదకు వచ్చింది. -
మోదీ నమస్కారం వైరల్.. ఎవరీ రవీందర్?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్క్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఢిల్లీలో బహిరంగ సభలో బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి.. మోదీ పాదాలకు నమస్కరించడంతో ప్రతిగా మర్యాదతో ప్రధాని కూడా మూడుసార్లు నమస్కరించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో రవీందర్ సింగ్ నేగి ఎవరూ అనే చర్చ మొదలైంది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున రవీందర్ సింగ్ నేగి.. పట్పర్గంజ్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ ఆప్ అభ్యర్థిగా యూపీఎస్సీ కోచ్ అవధ్ ఓజా పోటీలో నిలిచారు. ఇదే స్థానం నుంచి ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా 2013 నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం సిసోడియా జంగ్‌పురా నుండి పోటీ చేస్తున్నారు. ఇక, రవీందర్ సింగ్ నేగి ప్రస్తుతం పట్పర్గంజ్ నియోజకవర్గంలో భాగమైన వినోద్ నగర్ నుంచి కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.यह बड़प्पन है हमारे पीएम नरेंद्र मोदी का नहीं चाहते कि कोई भी उनके पास छुए*BJP candidate Ravindra Negi touches PM Modi's feet.* फिर PM Modi did it thrice. pic.twitter.com/KFtyHBqPHm— Srivatsan (@kj_srivatsan) January 29, 2025ఇదిలా ఉండగా.. రవీందర్ సింగ్ నేగి అప్పట్లో సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. అయితే, ఢిల్లీలో దుకాణాలకు తమ సొంత పేర్లను ఏర్పాటు చేయాలని నేగి సూచించారు. హిందువులు అయితే కాషాయ జెండాను దుకాణాలపై ఎగురువేయాలని కోరారు. అంతేకాకుండా.. నవరాత్రి రోజుల్లో, పండుగలకు ముందు రోజు హిందూ భావాలను గౌరవిస్తూ మటన్, చికెన్ షాపులను మూసివేయాలని దూకాణాదారులను ఆయన కోరారు. దీనికి సంబంధించిన వీడియోలు అక్టోబర్ 2024, జనవరి 2025లో సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో, హిందువుల గురించి ఆయన పలు కార్యకక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే, ఢిల్లీలో వరద నీరు నిలిచిన సమయంలో నీటిలో బోట్లు వేసుకుని తిరిగారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన కార్యక్రమాలు వైరల్‌గా మారాయి.This is BJP Councillor Ravinder Singh Negi.When you mistake an inflatable boat for the rowing machine in the gym. 😭pic.twitter.com/lJ00VoiyEK— @UrbanShrink 🌻 (@UrbanShrink) June 28, 2024మరోవైపు.. రవీందర్ సింగ్ నేగి బీజేపీ నుంచి పోటీ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2020లో ఆయన మనీష్ సిసోడియా చేతిలో కేవలం 2 శాతం తేడాతో ఓడిపోయారు. 2022 ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో, వినోద్ నగర్ స్థానం నుండి ఆప్ అభ్యర్థిని 2,311 ఓట్ల తేడాతో ఓడించారు. This is Ravindra Singh Negi, a BJP councilor in Delhi. He is pressuring Muslim vendors into writing their names on their stalls to identify themselves. He is also placing Bhagwa flags on the outlets of Hindu business owners. Life has become an absolute hell for Indian… pic.twitter.com/puV6LVOJsW— Darab Farooqui (@darab_farooqui) December 8, 2024 -
యమునా నీటి వివాదంపై ప్రధాని మోదీ ఫైర్
-
‘ఆప్’ను ప్రజలు క్షమించరు
న్యూఢిల్లీ: యమున నదిలో విషం కలుపుతున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)చేసిన ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) ఓటమి తప్పదని తేలడంతో ఆప్ నాయకులు మతితప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని కర్తార్ నగర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆప్ నాయకులకు, చార్లెస్ శోభారాజ్‌కు మధ్య పెద్ద తేడా లేదని అన్నారు. పైకి అమాయకంగా కనిపిస్తూ ప్రజల సొమ్మును దోచుకోవడంలో వారు ఆరితేరిపోయారని దుయ్యబట్టారు. ‘‘వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినవారు, అద్దాల మేడల్లో నివసిస్తున్నవారు పేదల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. ఓటమి భయంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో యుమున నదిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు దగాకోరు మాటలు చెబుతోంది. యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇస్తే ఓట్లు రావని అంటోంది. ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రజలకు పరిశుభ్రమైన నీరు దొరకడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇష్టంలేదు. ఢిల్లీలోని పూర్వాంచల్ ప్రజలు మురికికూపంలోనే ఛాత్ పూజలు చేసుకోవాలని కోరుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ దేశ చరిత్రలో అతిపెద్ద పాపం చేసింది. ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మాజీ ముఖ్యమంత్రి(అరవింద్ కేజ్రీవాల్) హరియాణా ప్రజలపై నిందలు వేశారు.యమునా నదిలో విషం కలిపారని అన్నారు. హరియాణాలో ఉన్నది మనుషులు కాదా? వారికి ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధువులు లేరా? సొంత మనుషులు చావాలని నదిలో విషం కలుపుతారా? యమున నదిలో హరియాణా నుంచి వస్తున్న నీటినే నాతోపాటు ఢిల్లీ ప్రజలు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు కూడా తాగుతున్నారు. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నదిలో విషం కలిపి నాకు హాని కలిగిస్తుందని ఎవరైనా అనుకుంటారా? ఆప్ నాయకులు అసలేం మాట్లాడుతున్నారు? తప్పులను క్షమించే గుణం మన భారతీయుల్లో ఉంది. కానీ, ఉద్దేశపూర్వకంగా పాపాలు చేస్తే ఎవరూ క్షమించరు. ఆప్ పాపాత్ములను మన్నించే ప్రసక్తే లేదు’’అని మోదీ అన్నారు. -
అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్!
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, ఆప్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో యమనా నది నీటి విషయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. యమునా నీటిలో విషం కలిపారని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ.. యమునా నీటిని తాగారు. అనంతరం, నీటిని నెత్తిన జల్లుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యుమునా నది నీటిలో విషం కలిపారని హర్యానా బీజేపీ ప్రభుత్వం మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. యుమునా నదిలోకి కావాలనే పారిశ్రామిక వ్యర్థాలను వదులుతోందన్నారు. ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ (Atishi) విలేకరులతో మాట్లాడుతూ.. యమునను కలుషితం చేయడం ‘జల ఉగ్రవాదం’ అని అభివర్ణించారు. హర్యానా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమ్మోనియం స్థాయిలు ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీ సమీపంలోని పల్లా గ్రామం వద్ధ యమునా నీటిని హర్యానా సీఎం సేవించారు. దీంతో, కేజ్రీవాల్ ఆరోపణలకు ఆయన చెక్ పెట్టారు.बेहिचक और बेझिझक पवित्र यमुना के जल का आचमन किया हरियाणा की सीमा पर।आतिशी जी तो आईं नहीं।कोई नया झूठ रच रही होंगी।झूठ के पांव नहीं होते।इसलिए आप-दा का झूठ चल नहीं पा रहा।दिल्ली की देवतुल्य जनता इन फ़रेबियों को पहचान चुकी है।5 फ़रवरी को आप-दा के फरेब काल का अंत निश्चित है।… pic.twitter.com/EAG4pXjCFr— Nayab Saini (@NayabSainiBJP) January 29, 2025ఇదిలా ఉండగా.. యమునా నదిపై ఆరోపణలను హర్యానా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కేజ్రీవాల్‌పై హర్యానా ప్రభుత్వం కేసు నమోదు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘కేజ్రీవాల్ మా ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల హర్యానా, ఢిల్లీలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేజ్రీవాల్ నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం. కేజ్రీవాల్ మాటలు అవాస్తవమని నిరూపిస్తాం’ అని అన్నారు.మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేడు ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రధాని తాగే నీళ్లలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతుందా అటూ ప్రజలను సూటిగా ప్రశ్నించారు. హర్యానా ప్రజల బంధువులు ఢిల్లీలో కూడా ఉన్నారని.. తమ సొంత ప్రజలు తాగే నీటిలో ఎవరైనా విషం కలుపుతారా?. ఆ నీటిని తాగే వారిలో ప్రధాని కూడా ఉన్నారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోతారనే కారణంగానే ఆప్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఎన్సీఎంఎంకు 16వేల కోట్లు కేటాయింపు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీకి(NCMM) కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.16,300 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా 24 విలువైన ఖనిజాల తవ్వకాలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.కేంద్ర కేబినెట్ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో వివరాలను ప్రకటించారు. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం రూ.16,300 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ 24 ఖనిజాలలో బెరిల్, కోబాల్ట్, కాడ్మియం, లిథియం, గ్రాఫైట్, నికెల్, సెలీనియం, ఇతరాలు ఉన్నాయి. కీలకమైన ఖనిజాలు ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, రవాణా మొదలైన ఇతర పరిశ్రమలకు కూడా ముఖ్యమైనవి. రక్షణ, ఏరోస్పేస్, వ్యవసాయ రంగాలకు కూడా కీలకమైనవని అన్నారు. ఈ క్రమంలో విలువైన ఖనిజాల తవ్వకాలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే, సీ-హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేయబడిన ఇథనాల్ కోసం అధిక ఎక్స్-మిల్ ధరను కేంద్రం ఆమోదించినట్లు తెలిపారు. మొలాసిస్తో ఉత్పత్తి చేసే ఇథనాల్ ఎక్స్‌మిల్ ధర గతంలో లీటరుకు రూ.56.28 ఉండగా.. తాజాగా రూ.57.97కి పెంచుతూ కేబినెట్ ఆమోదించిందని కేంద్రమంత్రి ప్రకటించారు. ఇదే సమయంలో దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు ఆఫ్‌షోర్ మైనింగ్ వేలాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పని చేస్తుందని కేంద్రం ప్రకటించింది.ఇక, 2022-23 ఇథనాల్ సరఫరా సంవత్సరం (నవంబర్-అక్టోబర్) నుండి ప్రభుత్వం నిర్ణయించిన ఇథనాల్ ధరలను పెంచలేదు. చెరకు రసం, బి-భారీ బెల్లం, సి-భారీ బెల్లం నుండి ఉత్పత్తి చేసిన ఇథనాల్ ధరలు వరుసగా లీటరుకు రూ.65.61, రూ.60.73, రూ.56.28గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధరలు సవరిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, ఇవాళ చక్కెర, ఇథనాల్‌కు సంబంధించిన కంపెనీల షేర్లు భారీగా వృద్ధి చెందాయి.VIDEO | Delhi: Here’s what Union Minister Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) said at a Cabinet press briefing:“Several key decisions have been made to create new opportunities for our youth, future generations, and the economy through science and technology. In this regard, PM… pic.twitter.com/H5KxzppIeS— Press Trust of India (@PTI_News) January 29, 2025 -
మహా కుంభమేళాలో అపశ్రుతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
-
‘నేను తాగే నీళ్లలో విషం కలిపారా?’
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ (narendra modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ (aap) నేతలు బీజేపీపై అసహ్యకరమైన అభియోగాలు మోపుతుందని మండిపడ్డారు.ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ విషం కలిపిన నీటిని ఢిల్లీ ప్రజలకు అందిస్తుందని ఆరోపించారు. అంతేకాదు, హర్యానా బీజేపీ ప్రభుత్వం విషయం కలిపిన నీటిని ప్రధాని మోదీ తాగగలరా? అని ఓటర్లను ప్రశ్నించారు.అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై మోదీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ ఘోండా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని తాగే నీళ్లలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా..? అని ప్రశ్నించారు #WATCH | During a public rally in Delhi, PM Modi says, ": In 'aapda' walon ki lutiya Yamuna mein hi doobegi...""People of 'aapda' say that people of Haryana mix poison in water sent to Delhi. This is not just an insult to Haryana but to all Indians. Ours is a country where… pic.twitter.com/kJoQCAuEi2— ANI (@ANI) January 29, 2025 ఆప్ నేతలు అసహ్యకరమైన అభియోగాలు మోతున్నారంటూ.. ఆ పార్టీ కన్వినర్ కేజ్రీవాల్‌పై మోదీ విరుచుకు పడ్డారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా యమునా (yamuna water) నీటిని తాగే నీరుగా మార్చి ఢిల్లీ ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ఏమైంది. నెరవేర్చలేదు. పైగా సిగ్గు లేకుండా ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో యమునా నీటి అంశాన్ని అడ్డం పెట్టుకొని తమకు ఓటేయ్యమని అడుగుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆప్ పాపాలు చేస్తోంది. అలాంటి వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదు.. ఢిల్లీ ఎప్పటికీ క్షమించదు’ అంటూ మోదీ దుయ్యబట్టారు.ఈ సందర్భంగా మోదీ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన డెడ్‌లైన్‌పై పరోక్షంగా స్పందించారు. హార్యానాలోని బీజేపీ ప్రభుత్వం..అక్కడి నుంచి ఢిల్లీ ప్రవహించే నీటిలో అమోనియాను కలిపించదని ఆప్, కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన ఈసీ.. బుధవారం రాత్రి 8 కల్లా తగిన ఆధారాల్ని అందించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలపై మోదీ ఎన్నికల ప్రచారంలో ఆప్‌ను టార్గెట్ చేశారు. గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నంలో.. నిందలు మాపై పడతాయని ఆశిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. వచ్చే వారం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ అధికార పార్టీ గందరగోళంలో పడింది. హర్యానా ప్రజలు ఢిల్లీలో నివసించకూడదా? ఢిల్లీ ప్రజలతో ప్రధాని మోదీ తాగే నీటిని హర్యానా విషపూరితం చేయగలదా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. చివరిగా ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్,ఆప్ పాలన చూశారు. ఇప్పుడు బీజేపీకి ఓ అవకాశం ఇవ్వండి’ అని ఢిల్లీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు.👉చదవండి : మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రధాని విచారం -
కుంభమేళా తొక్కిసలాట ఘటన.. యోగికి మోదీ, అమిత్ షా కాల్
-
ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్ధం: ప్రధాని మోదీ
గ్రామీణ ప్రతిభకు పట్టం కట్టే జాతీయ క్రీడలు... అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉత్తరాఖండ్ వేదికగా 38వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 14 వరకు జరగనున్న ఈ క్రీడల్లో 10 వేల మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఈ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న ఆ రాష్ట్రం... ఆద్యంతం తమ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆరంభ వేడుకలు నిర్వహించింది.ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ... 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించడమే తమ లక్ష్యమని... దీంతో దేశవ్యాప్తంగా క్రీడలకు మరింత ఆదరణ పెరుగుతుందని అన్నారు. ‘మీ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ప్రయ త్నాలు కొనసాగించండి.వాటికి మద్దతివ్వడంపై మేము దృష్టి పెడతాం. దేశాభివృద్ధిలో క్రీడలు ముఖ్యమైన భాగం అని బలంగా విశ్వసిస్తున్నాం. విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఒలింపిక్స్ ఎక్కడ జరిగినా అన్నీ రంగాలు లాభపడతాయి. ఇలాంటి మెగా టోర్నీలతో అథ్లెట్లకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి’ అని నరేంద్ర మోదీ అన్నారు. కాగా రెండేళ్ల క్రితం ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్లో ప్రధాని మోదీ 2036 ఒలింపిక్స్ఆతిథ్యానికి సిద్ధం అని ప్రకటించగా... దీనికి సంబంధించిన నివేదికను భారత ఒలింపిక్ సంఘం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అందించింది.ఈ క్రీడలకు డెహ్రాడూన్ ప్రధాన వేదిక కాగా... మొత్తం 7 నగరాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. 18 రోజుల పాటు జరగనున్న ఈ ఆటల్లో 32 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. జాతీయ క్రీడల ఆరంభ వేడుకలు సాంస్కృతిక నృత్య కళారూపం ‘తాండవ్’తో ప్రారంభం కాగా.. ప్రముఖ సినీ గాయకుడు జుబిన్ నౌటియాల్ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. అంతకుముందు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామితో కలిసి ప్రధాని మోదీ గోల్ఫ్ కార్ట్‌లో మైదానమంతా కలియతిరిగారు.అనంతరం స్థానిక సంప్రదాయ దుస్తుల్లో అథ్లెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అథ్లెట్ల మార్చ్‌పాస్ట్ అనంతరం ఉత్తరాఖండ్‌కు చెందిన భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్... క్రీడాజ్యోతిని ప్రధాని మోదీకి అందించారు. జ్యోతిని నిర్దిష్ట ప్రదేశంలో పెట్టిన ప్రధాని... క్రీడలు అధికారికంగా ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఆరంభ వేడుకలు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తి ప్రస్ఫుటించాయని ప్రధాని అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి మోనల్‌ను పోలి ఉండే విధంగా ‘మౌలి’ మస్కట్‌ను రూపొందించారు. మరిన్ని క్రీడావార్తలు2న రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీజీసీఏ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. బషీర్‌బాగ్ సమీపంలో లాల్‌బహదూర్ స్టేడియం యోగా హాల్లో ఈ టోర్నీని ఏర్పాటు చేశారు. అండర్–7, 9, 11, 13, 15 బాలబాలికల విభాగాల్లో ఈ టోర్నీ జరుగుతుంది.1–1–2010న లేదా ఆ తర్వాత పుట్టిన వారే ఈ టోర్నీలో ఆడేందుకు అర్హులు. స్విస్ ఫార్మాట్లో ఐదు రౌండ్లపాటు టోర్నీని నిర్వహిస్తారు. ప్రతి విభాగంలో టాప్–10లో నిలిచిన ప్లేయర్లకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, పతకాలు అందజేస్తామని టీజీసీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే వారు తమ ఎంట్రీలను జనవరి 31వ తేదీలోపు పంపించాలి. స్పాట్ ఎంట్రీలు స్వీకరించరు. వివరాలకు 7337578899 లేదా 7337399299 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలి. శ్రీనిధి, నామ్ధారి మ్యాచ్ ‘డ్రా’ చండీగఢ్: ఐ–లీగ్‌లో శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) మూడో ‘డ్రా’ నమోదు చేసుకుంది. మంగళవారం నామ్ధారి ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన పోరును శ్రీనిధి జట్టు 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. శ్రీనిధి డెక్కన్ జట్టు తరఫున విలియమ్ అల్వెస్ ఒలీవైరా (45+1వ నిమిషంలో), నామ్ధారి జట్టు తరఫున క్లెడ్సన్ కార్వాలో డిసిల్వా (33వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. ఇరు జట్లు తొలి అర్ధభాగంలోనే ఒక్కో గోల్ సాధించాయి.ద్వితీయార్ధంలో రెండు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయాయి. గత నాలుగు మ్యాచ్‌ల్లో శ్రీనిధి జట్టుకు ఇది మూడో ‘డ్రా’ కాగా... వరుస విజయాలతో దూసుకెళ్తున్న నామ్ధారి జట్టు గెలుపు జోరుకు శ్రీనిధి క్లబ్ అడ్డుకట్ట వేసింది. తాజా సీజన్లో 11 మ్యాచ్‌లాడిన శ్రీనిధి జట్టు 3 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని 8వ స్థానంలో ఉంది. 11 మ్యాచ్‌లాడిన నామ్ధారి ఫుట్‌బాల్ క్లబ్ 6 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 21 పాయింట్లు సాధించి ‘టాప్’లో కొనసాగుతోంది. -
కేవలం ముడి సరుకుల ఎగుమతిని అంగీకరించను
భువనేశ్వర్: మన దేశం నుంచి కేవలం ముడి సరుకులు ఎగుమతి చేయడాన్ని తాను అంగీకరించనని, వాటికి విలువ జోడించి ఎగుమతి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) చెప్పారు. మన ముడి సరుకులతో విదేశాల్లో తయారైన వస్తువులను దిగుమతి చేసుకొనే విధానం మారాలని అన్నారు. మంగళవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ‘ఉత్కర్ష్ ఒడిశా(Utkarsh Odisha): మేక్ ఇన్ ఇండియా సదస్సు’ను ఆయన ప్రారంభించారు. తూర్పు ఇండియాను గ్రోత్ ఇంజన్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు. బహుముఖ అభివృద్ధికి ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు.దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిలో ఒడిశా పాత్ర అత్యంత కీలకమని వెల్లడించారు. కేవలం ముడి సరుకుల ఎగుమతి వల్ల దేశం అభివృద్ధి చెందదని తేల్చిచెప్పారు. ఈ పరిస్థితి పూర్తిగా మారాలని, మనమంతా నూతన దార్శనికతతో పనిచేయాలని సూచించారు. ‘‘ఇక్కడ తవి్వతీసిన ముడి ఖనిజాలను విదేశాలకు ఎగుమతి చేయడం. అక్కడ వాటికి విలువను జోడించి, వస్తువులు తయారీ చేసి తిరిగి మన దేశానికి పంపడం సరైన విధానం కాదు. మన సముద్ర ఉత్పత్తులను ప్రాసెసింగ్ కోసం విదేశాలకు పంపుతున్నారు. వాటినే మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇదంతా నాకు నచ్చడం లేదు.అది నేను అంగీకరించను. మన ముడి సరుకులకు ఇక్కడే విలువను జోడించాలి. ఆ తర్వాత విదేశాలకు ఎగుమతి చేయాలి. దానివల్ల మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూరుతుంది’’ అని మోదీ స్పష్టంచేశారు. నానాటికీ మారుతున్న ఆధునిక ప్రపంచంలో గ్లోబల్ సప్లై చైన్‌కు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. కేవలం దిగుమతుల ఆధారిత సప్లై చైన్‌పై ఆధారపడడం తెలివైన పని కాదని పేర్కొన్నారు. అంతర్జాతీయ తలెత్తే ఒడిదొడుకుల ప్రభావాన్ని తట్టుకోవడానికి మన దేశంలోనే పటిష్టమైన సప్లై, వాల్యూ చైన్‌ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ బాధ్యత ప్రభుత్వాలతోపాటు పరిశ్రమ వర్గాలపైనా ఉందన్నారు. కాన్సర్ట్ ఎకానమీని ప్రోత్సహిస్తాం.. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగానికి ఇక ఎంతో దూరం లేదని ప్రధాని మోదీ వివరించారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా రెండు మూలస్తంభాలపై ఆధారపడి ఉందన్నారు. అవి వినూత్నమైన సేవా రంగం, నాణ్యమైన ఉత్పత్తులు అని తెలిపారు. గ్రీన్ టెక్నాలజీ, గ్రీన్ ఫ్యూచర్‌పై అధికంగా దృష్టి పెట్టామని అన్నారు. ఈ రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, సది్వనియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ముంబై, అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన కోల్డ్‌ప్లే కార్యక్రమాల(కాన్సర్ట్స్) గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోల్డ్‌ప్లే టూర్లు విజయవంతమయ్యాయని గుర్తుచేశారు. ఇండియాలో కాన్సర్ట్ ఎకానమీ ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ఈ రంగంలోమౌలిక సదుపాయాల కల్పనకు, నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ రంగానికి సూచించారు. కాన్సర్ట్ ఎకానమీని ప్రోత్సహిస్తామని వెల్లడించారు. లైవ్ ఈవెంట్లకు డిమాండ్ భారీగా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా పేరున్న కళాకారులు ఇండియాలో ప్రదర్శనలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని నరేంద్ర మోదీ చెప్పారు. వచ్చే నెలలో మన దేశంలో తొలిసారిగా ‘వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మట్’ జరగబోతోందని వివరించారు. మన సృజనాత్మకు ప్రపంచానికి చాటడానికి ఇదొక చక్కటి వేదిక అని తెలిపారు. ఉత్కర్ష్ ఒడిశా సదస్సులో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.