National Investigation Agency
-
లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ను పట్టిస్తే రూ.10 లక్షలు
ముంబై: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అలాగే అన్మోల్ను పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కాగా గత ఏప్రిల్‌లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మీన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో అన్మోల్కు ప్రమేయం ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులు అన్మోల్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ ఫైరింగ్‌కు పాల్పడింది తామే అని అతను సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య వంటి కారణాలతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మారుమోగుతోంది. బాబా సిద్దిఖీ హత్యతో అన్మోల్ బిష్ణోయ్ పేరు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారుఅన్మోల్ బిష్ణోయ్‌ని అలియాస్ భానుగా పిలుస్తారు. గత ఏడాది నకిలీ పాస్‌పోర్ట్‌తో భారత్ నుంచి పారిపోయిన అన్మోల్.. అనంతరం కెన్యా, కెనడాలో గుర్తించారు. ప్రస్తుతం అతడు కెనడాలో నివసిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబీ సింగర్ సిద్దూ మోసేవాల్ హత్య కేసులో అన్మోల్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నారు. -
జమ్ము కశ్మీర్: డ్రోన్ల సాయంతో ఎన్ఐఏ ‘ఉగ్ర’ వేట
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాత్రికులు కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సంఘటన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత సమీపంలోని గుహల్లోకి వారు పారిపోయి ఉంటాని భావిస్తున్నారు. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.కాగా శివ ఖోరీ మందిరం నుంచి వైష్ణో దేవి ఆలయం వైపు వెళ్తుండగా.. సమీపంలోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు డ్రైవర్‌కు గాయాలవ్వడంతో నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వాహనం లోయలో పడినప్పటికీ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించారు. ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తోంది. గత నెలలో రాజౌరి, పూంచ్‌లలో ఇతర దాడులు పాల్పడిన ఉగ్రవాదులో ఈ ఆపరేషన్‌లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉగ్రదాడిని ఖండించారు. -
బెంగాల్లో ఎన్ఐఏ అధికారులపై దాడి..
లక్నో: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో శనివారం ఉగ్రవాద నిరోధక సంస్థ ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. 2022లో జరిగిన బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఎన్ఐఏకు చెందిన యాంటీ టెర్రర్ స్కాడ్ బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మోనోబ్రోటో జానాతో సహా ఇద్దరు వ్యక్తులను ఎన్ఐఏ అధికారుల అరెస్టు చేశారు. అయితే జిల్లాలోని భూపతినగర్ ప్రాంతం నుంచి అధికారులు తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా ఒక గుంపు ఎన్ఐఏ బృందంపై దాడి చేసింది. ఇటుకలు, రాళ్లతో అధికారులపై తిరగబడ్డారు. ఈ ఘటనణలో ఒక అధికారి గాయపడ్డారు. అలాగే ఏజెన్సీకి చెందిన ఓకారును కూడా ధ్వంస చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కొంతమంది మహిళలు, పురుషులు అధికారులను అడ్డగించి, వారిపై గట్టిగట్టిగా అరవడం ప్రారంభించారు. వాళ్లను వెనక్కి వెళ్లాలని అరిచారు. అయితే పలువురు మహిళలు తమ చేతుల్లో వెదురు కర్రలతో భద్రతా సిబ్బంది ముందు కూర్చున్నారు. అనంతరం ప్రధాన నిందితుడు మోనోబ్రోటో జానా, అతని కుటుంబ సభ్యులతో పాటు గుర్తు తెలియని వక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని, అధికారులపై దాడి ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు. అయితే తాము సోదాలు చేసేముందు స్థానిక పోలీస్ స్టేషన్‌కు ముందుగానే సమాచారమిచ్చినప్పటికీ, సరైన భద్రతను స్థానిక పోలీసులు కల్పించలేకపోయారని ఎన్ఐఏ బృందాలు ఆరోపించాయి. కాగా 2022 డిసెంబర్ 3న భూపతినగర్‌లోని టీఎంసీ నేత ఇంటి వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. చదవండి: ఇజ్రాయెల్‌పై ప్రతిదాడి.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక Another example of lawlessness in West Bengal under Mamata Banerjee government A team of NIA officers, which went to Bhupatinagar in East Medinipur District of West Bengal, to arrest two TMC leaders, were targeted More than 100 villagers, not only stopped the NIA team from… pic.twitter.com/aJWWSEOsh2 — Organiser Weekly (@eOrganiser) April 6, 2024 -
రామేశ్వరం కేఫ్ పేలుడులో ట్విస్ట్.. విచారణలో బీజేపీ కార్యకర్త
బెంగళూరు: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనికి కారణమైన నేరస్థులను గాలించడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఈ పేలుడులో బీజేపీ కార్యకర్తకు సంబంధం ఉన్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలోని బీజేపీకి చెందిన కార్యకర్త సాయి ప్రసాద్‌ను ఇంటరాగేట్ చేస్తున్నట్లు సమాచారం. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులతో ప్రసాద్‌కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అతడిని విచారణకు తీసుకొచ్చింది. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి 10 రోజుల క్రితం ఎన్ఐఏ పలు ఇళ్లు, దుకాణాలపై దాడులు నిర్వహించి పత్రాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపైన పలువురు కామెంట్స్ చేస్తున్నారు. NIA has interrogated a BJP leader in Thirthahalli, Shivamoga, in connection with the Rameswaram Cafe blast case in Bengaluru. Don't be surprised that it's linked to BJP. Remember how fast bhakts jumped & abu$ed congress govt in Karnataka .#RameshwaramCafe — Dr Jwala Gurunath (@DrJwalaG) April 5, 2024 -
ఉగ్రవాద సంస్థతో లింకులు.. కరీంనగర్లో ఎన్ఐఏ దాడుల కలకలం..
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ హుస్సేనిపురా, కర్ఖానాగడ్డ, నాకా చౌరస్తాలో గురువారం ఉదయం ఎన్ఐఏ బృందం తనిఖీలు చేపట్టింది. తబ్రేజ్ అనే వ్యక్తికి పీఎఫ్ఐ అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో సోదాలు జరుపుతోంది. ప్రస్తుతం తబ్రేజ్ దుబాయ్‌లో ఉంటున్నాడు. కరీంనగర్లో, ఆదిలాబాద్‌లో ఎన్ఐఏ దాడులు జరుపుతోంది. పీఎఫ్ఐ టెర్రర్ ఆక్టివిటీపై సోదాలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: మజ్లిస్ సెక్యులర్ ఎలానో కేసీఆర్ చెప్పాలి: కిషన్‌రెడ్డి డిమాండ్ -
ఎన్ఐఏ చేతికి భోపాల్ ఉగ్ర కేసు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–భోపాల్‌లలో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పరిధిలోకి వెళ్లింది. ఈ నెల 9న ఏకకాలంలో దా డులు చేసిన ఏటీఎస్ అధికారులు హైదరాబాద్‌లో ఐదుగురు, భోపాల్‌లో 11 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం భోపాల్‌లో ఏటీఎస్ అధికారులతో భేటీ అయిన ఎన్ఐఏ అధికారులు.. శుక్రవారం నుంచి అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు. దీనికోసం ప్రత్యే కంగా కేసు నమోదు చేశారు. ఈ ఉగ్రవాదులకు ఉన్న విదేశీ లింకులు, ఆర్థిక మూలాలపైనే తొలుత దృష్టి సారించారు. దీనితోపాటు వారికి అందిన శిక్షణ, ఎక్కడెక్కడ శిబిరాలు నిర్వహించారన్నది ఆరా తీస్తున్నారు. హెచ్‌యూటీ పేరుతోనే కొనసాగింపు.. హైదరాబాద్, భోపాల్‌లలో అరెస్టైన ఉగ్రవాదులు తొలుత అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ)కి అనుబంధంగా పనిచేశారు. రాకెట్ చాట్, త్రీమా యాప్స్‌లో ఏర్పాటు చేసుకున్న గ్రూపుల్లో హెచ్యూటీకి చెందినవారు పంపిన వీడియోలు, ఆడియోలు, పత్రాలను చూసి ప్రేరణ పొందారు. కానీ ఎంతకాలం ఎదురుచూసినా హెచ్‌యూటీ నుంచి విధ్వంసాలకు సంబంధించిన ఆదేశాలు అందలేదు. దీంతో సొంతంగా సలీం, యాసిర్‌ల నేతృత్వంలో హైదరాబాద్, భోపాల్ మాడ్యుల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. నిషేదం నుంచి తప్పించుకోవడానికి ఈ మాడ్యూల్స్‌కు ఎలాంటి పేర్లూ పెట్టుకోలేదు. ప్రాథమిక ఆధారాలను బట్టి హెచ్‌యూటీ ఉగ్రవాదులుగానే పరిగణించాలని, ఆ సంస్థపై నిషేధం విధించాలని కేంద్ర హోంశాఖకు నివేదిక పంపేందుకు ఎన్ఐఏ సన్నాహాలు చేస్తోంది. కేసు దర్యాప్తు పూర్తిచేసి, అభియోగపత్రాలు దాఖలు చేశాక ఈ ప్రక్రియ చేపట్టనుంది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో లాడెన్ వీడియోలు ఏటీఎస్ అధికారులు ఉగ్రవాదుల నుంచి స్వా«దీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషణ చేయించగా.. పలు కీలక అంశాలను గుర్తించారు. యువత ఉగ్రవాద బాటపట్టా లని రెచ్చగొట్టేలా ఒసామా బిన్‌లాడెన్ చేసిన ప్రసంగాల వీడియోలు, తఫ్సీర్–ఎ–జిహాద్ పేరిట రెచ్చ గొట్టే వ్యాఖ్యల ఆడియోలు వాటిలో ఉన్నట్టు ఏటీఎస్ అధికారులు చెప్తున్నారు. ఈ ఉగ్రవాదుల్లో ఇంజనీరింగ్ చదివిన రిజ్వీ, డానిష్, కరీం, అబ్దుర్ రెహ్మాన్ (హైదరాబాద్‌లో అరెస్టయ్యాడు) ఎల్రక్టానిక్ పరికరాలను వినియోగించడంపై మిగతా వారికి శిక్షణ ఇచ్చారు. భోపాల్ మాడ్యుల్‌కు చెందినవారు అక్కడి ఇంద్రపురిలో ఉన్న కమల పార్కులో వివిధ అంశాలపై శిక్షణ తీసుకున్నరని దర్యాప్తు అధికారులు గుర్తించారు. యాసిర్ వీరికి తన ఫిట్నెస్ సెంటర్లో బాక్సింగ్, కత్తిని ఉపయోగించడం వంటి వాటిలో చిట్కాలు నేర్పినట్టు తేల్చారు. హైదరాబాద్‌లో శిబిరం ఎక్కడ? ఉగ్రవాదులను విచారించిన సమయంలో.. హైదరాబాద్‌తోపాటు భోపాల్‌కు చెందిన ఉగ్రవాదులు 2021 జూలైలో ఇక్కడి గోల్కొండలోని మహ్మద్ సలీం ఇంట్లో సమావేశమయ్యారని ఏటీఎస్ గుర్తించింది. తర్వాత రెండు రోజుల పాటు పెద్ద శిక్షణ శిబిరం నిర్వహించారని.. ఎయిర్ గన్ కాల్చడం, బరువు తగ్గడంతోపాటు ఆత్మరక్షణ, పోలీసుల ఇంటరాగేషన్‌ను ఎదుర్కోవడం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారని తేల్చింది. అయితే ఈ శిక్షణ శిబిరం ఎక్కడ నిర్వహించారనేది ఉగ్రవాదులు బయటపెట్టలేదని.. ఆ ప్రాంతాన్ని గుర్తించడానికి ఎన్ఐఏ అధికారులు సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారని తెలిసింది. ఇక గత ఏడాది నవంబర్‌లో భోపాల్ సమీపంలో జరిగిన శిబిరంలో వీరంతా నాటు తుపాకీ కాల్చడం, చిన్న చిన్న బాంబులు తయారు చేయడాన్ని ప్రాక్టీస్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. -
ఏది నిజం?: కప్పిపుచ్చడమే..అసలైన కుట్ర!
మొదటి నుంచీ అంతే!!. 2018 అక్టోబర్‌లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన రోజునే... అటు ‘ఈనాడు’ గానీ... ఇటు తెలుగుదేశం పార్టీ గానీ సిగ్గూ ఎగ్గూ వదిలేశాయి. హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావుపై తన స్వస్థలం ముమ్మిడివరంలో ఎలాంటి కేసులూ లేవంటూ రామోజీరావు తొలిరోజునే సర్టిఫికెట్ ఇచ్చేశారు. కానీ రెండవరోజున అప్పటి వైజాగ్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నిందితుడిపై ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు కేసుల్ని వివరించారు. తప్పనిసరై దాన్ని కూడా ప్రచురించింది ‘ఈనాడు’. ఇక్కడ గమనించాల్సింది... ప్రశ్నించాల్సింది ఒక్కటే. తొలిరోజున ఏ పోలీస్ అధికారీ చెప్పకుండానే... ‘ఈనాడు’ తనంతట తానుగా నిందితుడు శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవని ఎలా ప్రచురించింది? అసలెందుకు ప్రచురించిందీ వార్త? ఎందుకంటే ఇదంతా రామోజీ, చంద్రబాబు కలిసి ఆడించిన కుట్ర కాబట్టి!. తాజాగా ఎన్ఐఏ వేసిన కౌంటర్‌కు తన సొంత భాష్యం చెబుతూ శుక్రవారం ‘ఈనాడు’ రాసిన వార్త... ఈ కుట్రను మరోసారి స్పష్టంగా బయటపెట్టింది.అంతే!. కోర్టుకు ఎన్ఐఏ సమర్పించిన అఫిడవిట్లో జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో 2017 మార్చి నెలలో కేసు నమోదు అయినట్లు పేర్కొన్న భాగం జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసు నమోదు కాలేదు అంటూ హత్యాయత్నం జరిగిన నాడే ‘ఈనాడు’ రాసిన వార్త.. (ఫైల్) ఏది నిజం ? వాస్తవానికి సంఘటన జరిగిననాడే ‘ఈనాడు’ ఏడెనిమిది వార్తలు వేసింది. అందులో ఒక్కటి మాత్రమే దాడికి సంబంధించినది. మిగిలినవన్నీ ఆ దాడితో తెలుగుదేశానికి సంబంధం లేదంటూ ఎదురుదాడి చేసినవే. ఆ రోజు మొదలు... ప్రతిరోజూ ఈ కేసును తప్పుదోవ పట్టించే వార్తలే. కాకపోతే ఈ కేసును దర్యాప్తు చేసిన ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) 2019 జనవరి 23న దీనిపై ఛార్జిషీట్ వేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యకు ప్రయత్నించటం వెనక కుట్ర కోణం ఉన్నట్లు ఎన్ఐఏ ఆ ఛార్జిషీట్లో స్పష్టంగా పేర్కొంది. ఆ దిశగా దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పింది. ఇలాంటి సమయంలో న్యాయస్థానాలు అయితే ఆ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని అభియోగాలు నమోదు చేయటం... లేకపోతే తదుపరి దర్యాప్తు కొనసాగించి తుది ఛార్జిషీటు వేయాలని చెప్పటం చేస్తాయి. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేసి తుది ఛార్జిషీటు వేయాలని ఎన్ఐఏకు కోర్టు చెప్పింది. కాకపోతే ఏళ్లు గడుస్తున్నా... ఎన్ఐఏ తుది ఛార్జిషీటు వేయలేదు. ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందని తన తొలి ఛార్జిషీట్లో చెప్పింది కాబట్టి... ఆ కోణాన్ని త్వరగా విచారించి తుది ఛార్జిషీటు వేయాల్సిందిగా ఎన్ఐఏను ఆదేశించాలంటూ పిటిషనర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఆనాడే.. తన స్టేట్మెంట్లో.. వివరంగా తనపై హత్యాయత్నానికి సంబంధించి 2019 జనవరి 17న నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్యాప్తు అధికారులకు వాంగ్మూలమిచ్చారు. తనపై హత్యాయత్నం వెనక ఉన్న కుట్ర కోణాన్ని ఆయన బలంగా వినిపించారు. ‘‘నిందితుడెవరో నాకు తెలియదు. కానీ తనను వైఎస్సార్ సీపీ అభిమానిగా చూపించటం, దానికి మద్దతుగా ఒక ఫ్లెక్సీని సృష్టించటం ఇదంతా ఓ పెద్ద కుట్రలో భాగం. ఇదంతా తమకు సంబంధం లేని వ్యవహారంగా చిత్రించడానికి టీడీపీ చేస్తున్న కుట్ర. నా పాదయాత్ర విశాఖలో అడుగుపెట్టిన నాటి నుంచీ హత్యాయత్నం జరిగిన రోజు వరకూ ఎయిర్‌పోర్టులో సీసీ టీవీ కెమెరాలు పనిచేయలేదని నాకు తెలిసింది. పైపెచ్చు నిందితుడికి ఎయిర్‌పోర్టులోని తన ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్లో ఉద్యోగమిచ్చిన హర్షవర్దన్ చౌదరి టీడీపీ నాయకుడు. 2014లో గాజువాక టిక్కెట్ కూడా ఆశించారు. నిందితుడు శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవని అబద్ధపు డిక్లరేషన్ ఇచ్చి మరీ తనను పనిలో పెట్టుకున్నాడు. ‘ఆపరేషన్ గరుడ’ పేరిట టీడీపీ సానుభూతిపరుడైన ఓ నటుడు(శివాజీ) ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఈ కుట్రలో భాగమేననిపిస్తోంది. వీళ్లు చేసే హత్యాయత్నం ఫలిస్తే వీళ్లనుకున్నది జరుగుతుంది. ఒకవేళ బెడిసికొడితే.. గరుడలో చెప్పిందే జరిగిందని వీళ్లే ఎదురుదాడి చేయాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది’’ అంటూ అప్పట్లో తన స్టేట్మెంట్లో వివరంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మరి దీన్ని ఎన్ఐఏ ఎందుకు సమగ్రంగా విచారించటం లేదు? ఇదే ఇప్పుడు ప్రశ్న. ఇది కుట్ర కాదనగలమా? వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన జానిపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ ఫ్యూజన్ ఫుడ్స్‌లో ఉద్యోగంలో చేరడమే ఈ కుట్రకు నాంది. తదనంతరం జరిగిన పరిణామాలు కుట్రను స్పష్టంగా బయటపెట్టేలా ఉన్నా... ఎన్ఐఏ ఉదాసీనంగా ఉండటమే ఇక్కడ విస్మయం కలిగించే అంశం. ఎందుకంటే జె.శ్రీనివాసరావుకు తన రెస్టారెంట్లో ఉద్యోగమిచ్చేందుకు దాని యజమాని హర్షవర్దన్ చౌదరి అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కారు. కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే విమానాశ్రయాల్లో ప్రైవేటు సిబ్బంది నియామకానికి కచ్చి తమైన మార్గదర్శకాలున్నాయి. (హర్షవర్దన్ చౌదరి పాత్రను, తెలుగుదేశంతో ఆయన సంబంధాలను, ఈ కుట్రపై దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని పేర్కొంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచి్చన వాంగ్మూలం.) రెస్టారెంట్, ట్రావెల్ ఏజెన్సీల డెస్క్ లు మొదలైన వాటిలో ప్రైవేటు వ్యక్తులే పని చేస్తారు. అందుకోసమే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం విమానాశ్రయంలో పనిచేసే వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. ఆ విషయాన్ని నిర్ధారిస్తూ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇస్తేనే ఉద్యోగంలో చేర్చుకోవాలి. నిజానికి జె.శ్రీనివాసరావుపై 2017లో నాటి తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో ఓ కేసు నమోదైంది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు పోలీసులు చార్జ్‌షీట్ కూడా వేశారు. అంటే అతనికి నేర చరిత్ర ఉన్నట్టే. కానీ అతనిపై ఎలాంటి కేసులూ లేవని ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ చౌదరి డిక్లరేషన్ ఇవ్వటం గమనార్హం. ఇంకా శ్రీనివాసరావుపై తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసులూ లేవని, స్వస్థలంలో ఉన్నాయేమో చూడాలని విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ ఎన్వోసీ ఇచ్చారు. కానీ స్వస్థలంలో కేసుల గురించి కనుక్కునే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. దానికితోడు శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవంటూ హర్షవర్దన్ చౌదరి తన సొంత ఎన్ఓసీ ఇచ్చేశారు. హత్యాయత్నం జరిగిన రోజున రామోజీరావు కూడా శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవంటూ ‘ఈనాడు’ ద్వారా ఎన్ఓసీ ఇచ్చేశారు. ఇంతటి కీలకమైన అంశంపై ఎన్ఐఏ దృష్టిసారించకపోవటమే పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీ టీవీ రికార్డింగులు ఎందుకు కోర్టుకు సమర్పించలేదు ఈ కేసులో విమానాశ్రయంలో సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ అత్యంత కీలకం. ఎందుకంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోకి జె.శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడానికి వాడిన కత్తిని ఎలా తీసుకువెళ్లారన్నది కీలకం. హత్యాయత్నానికి కంటే కొన్ని రోజుల ముందటి సీసీ టీవీ కెమెరాల రికార్డులను ఎన్ఐఏ ఆ కెమెరాల తయారీదారైన తోషిబా కంపెనీకి పంపించి విశ్లేషించింది. విమానాశ్రయం కిచెన్‌లో ఓ వంటపాత్రలో ఆ కత్తిని వేడిచేస్తున్నట్టుగా ఆ వీడియో క్లిప్పింగుల్లో ఉందని వెల్లడైంది. జె.శ్రీనివాసరావే ఆ కత్తిని వేడి నీటిలో మరిగిస్తున్నట్టుగా వీడియో క్లిప్పింగుల్లో ఉంది. మరి ఆ విషయాన్ని ఎన్ఐఏ ఎందుకు కౌంటర్ అఫిడవిట్లో ప్రస్తావించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతటి కీలకమైన వీడియో క్లిప్పింగులను న్యాయస్థానానికి కూడా సమర్పించకపోవడం గమనార్హం. నిందితుడి లేఖను కూడాసమర్పించనే లేదు... ఈ కేసులో నిందితుడు జె.శ్రీనివాసరావు రాసిన లేఖ, ఇతర కాపీలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వాటిని ఎన్ఐఏకు అప్పగించారు. తనకు ఏమైనా అయితే తన శరీర అవయవాలను దానం చేయాలని అతను రాసినట్టుగా ఉంది. తనకు ఏదైనా అవుతుందని జె.శ్రీనివాసరావు ముందే ఎలా ఊహిస్తారు... ! అంటే ఇదేమీ యాదృచ్చి కంగానో అప్పటికప్పుడు హఠాత్తుగానో జరిగింది కాదన్నది సుస్పష్టం. ముందస్తుగానే కొందరితో కలిసి పన్నిన కుట్ర ప్రకారమే అంతా జరిగిందని... ప్లాన్‌తోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని వెల్లడి కావటంలేదా? మరి అంతటి కుట్ర వెనుక ఎవరున్నారన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? నిందితుడు శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్ యూనిఫామ్ వేసుకుని, వాటర్ బాటిల్‌తో వీఐపీలాంజ్‌లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పక్కన నిల్చుని అవకాశం కోసం చూశాడని, అవకాశం దొరికినవెంటనే పదునైన కత్తితో హతమార్చుదామని అనుకున్నాడని.. ఈ క్రమంలోనే జగన్మోహన్రెడ్డి వేగంగా పక్కకు తప్పుకోవటంతో భుజానికి గాయం అయిందని ఛార్జిషీట్లో పేర్కొన్న ఎన్ఐఏ. ఈ కేసులో కుట్ర కోణాన్ని, నిందితుడిని ప్రేరేపించిన పరిస్థితులుంటే వాటిని కూడా దర్యాప్తుచేస్తామని తొలి ఛార్జిషీట్లో కోర్టుకు చెప్పిన ఎన్ఐఏ. దర్యాప్తు ముగియనే లేదు కదా...! అంత ఆతృత ఎందుకు రామోజీ? హత్యాయత్నం వెనక ఉన్న కుట్రకోణాన్ని త్వరగా దర్యాప్తు చేసి తుది ఛార్జిషీటు వేయాల్సిందిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్‌పై ప్రస్తుతం కోర్టు విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా ఎన్ఐఏను సమాధానమివ్వాలని కోర్టు కోరగా... దీనిపై ఎన్ఐఏ కౌంటర్ వేసింది. ఇది కౌంటర్ మాత్రమే తప్ప తుది ఛార్జిషీటు కాదు. తమ దర్యాప్తు ముగిసిందని కూడా చెప్పలేదు. ఈ కేసులో బాధితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన అంశాలను కౌంటర్లో ప్రస్తావించింది. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పింది. కానీ దర్యాప్తు ముగిసిపోయినట్లు... ఇక దర్యాప్తు చేసేందుకు ఏమీ లేదని అన్నట్టుగా టీడీపీ అనుకూల పచ్చ మీడియా తెగ హడావుడి చేస్తోంది. నిందితుడు శ్రీనివాసరావు హత్యాయత్నం చేసినట్లు ఎన్ఐఏ ఎప్పుడో చెప్పింది. దానికి కారణాలు తేలాలి. ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది. కారణాలు తెలిస్తే కుట్ర కోణమూ బయటపడుతుంది. కాకపోతే దర్యాప్తు కొనసాగుతుండగానే... ఇక కుట్ర కోణమేదీ లేదని ఎల్లో మీడియా తేల్చేసింది. ఎన్నాళ్లగానో తాము చేస్తున్న ప్రయత్నం ఫలించినట్లుగా... ఎన్ఐఏ కౌంటర్‌ను చూసి ఎల్లో మీడియా తెగ సంబరపడిపోయింది. ఎందుకింత ఆత్రం? దర్యాప్తు పూర్తికాకుండానే ఎందుకంత తొందర రామోజీ? ఎల్లో సిండికేట్ తీరే అంత... వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా ఎల్లో సిండికేట్ మొదటి నుంచీ వ్యవహరిస్తూ వస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుడు జె.శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అని ప్రకటించేశారు. కేవలం సానుభూతి కోసమే ఈ హత్యాయత్నానికిపాల్పడ్డారని బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న డీజీపీ ఏకపక్షంగా ప్రకటించడం అప్పట్లో అందరినీ నివ్వెరపరిచింది. నిజానిజాలు వెలికితీస్తాం అని ప్రకటించాల్సిన ఆయన... చంద్రబాబు డైరెక్షన్ మేరకు అడ్డగోలు అబద్ధాలు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు చేసే కిందిస్థాయి పోలీసు అధికారులను ప్రభావితం చేసేందుకే ఆయన అలా ప్రకటించారన్నది సుస్పష్టం. వైఎస్ జగన్‌కు తీవ్రమైన గాయం అయ్యింది. ఆ కత్తి మెడలో దిగి ఉండే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేదని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నారు. కానీ గాయం చిన్నదే అని నాటి డీజీపీ, చంద్రబాబు, ‘ఈనాడు’ కట్టగట్టుకుని ప్రచారం చెయ్యడాన్ని ఏమనుకోవాలి? మళ్లీ అదే తతంగం ఇక తాజాగా ఎన్ఐఏ కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న అంశాల విషయంలోనూ ఎల్లో మీడియా ఇదే పంథా ఎంచుకుంది. హత్యాయత్నం వెనక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని నిర్ధారణ అయినట్టుగా కథనాలు ప్రచురించి తన దుర్బుద్ధిని చాటుకుంది. ఎన్ఐఏ కౌంటర్ అఫిడవిట్‌లోని అంశాలను సవాల్ చేస్తూ బాధితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అందుకోసం న్యాయస్థానం గడువు ఇస్తూ కేసు విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. జగన్ తరపు న్యాయవాది వేసే కౌంటర్లోని అంశాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్నాక విచారణ ప్రక్రియ సాగుతుంది. మరోవైపు ఎన్ఐఏ దర్యాప్తు కూడా ఇంకా పూర్తి కాలేదు. తుది నివేదిక రావాలి. ఇవేవీ పట్టించుకోకుండా కేసు దర్యాప్తు ముగిసినట్టే అనే భ్రాంతి కలిగించేలా పచ్చ మీడియా హడావుడి చేస్తుండటమే అసలైన కుట్ర!!. -
రాధ మిస్సింగ్ కేసు: ఎన్ఐఏ అదుపులో హైకోర్టు అడ్వకేట్ శిల్ప
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్‌లో ఎన్ఐఏ(NIA) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మెడికల్ విద్యార్థి రాధ మిస్సింగ్ కేసులో భాగంగా ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, రాధను శిల్ప.. మావోయిస్టుల్లో చేర్చారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ఏక కాలంలో అధికారులు మూడు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా.. పలు డాక్యుమెంట్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో శిల్పను ఎన్ఐఏ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శిల్పను ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. కాగా, మెదక్ జిల్లా చేగుంటలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టు నేత శంకర్ కొడుకు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అయితే, మూడున్నర సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో రాధ అదృశ్యమైంది. రాధను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మే 31వ తేదీన కేసు రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని NIA కు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైతన్య మహిళా సంఘం నేతలపై, మావోయిస్టు అగ్రనేతలు గాజర్ల రవి, అరుణలపై NIA కేసు నమోదు చేసింది. ఇది కూడా చదవండి: జైలుకు మరో 10 మంది ఆందోళనకారులు -
‘ఆ స్థాయి’ కేసులే దర్యాప్తు చేస్తాం
సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణాకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యవసానాలు ఎదురయ్యే కేసులను మాత్రమే తాము దర్యాప్తు చేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైకోర్టుకు నివేదించింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మూడునెలల ఆడ శిశువును రెండునెలల్లో ఏడుసార్లు విక్రయించిన ఘటనపై మంగళగిరి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యవసానాలు ఎదురయ్యేంత కేసు కాదని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత కేసులో ఆదేశాలు జారీచేయాలని కోరింది. ఈ మేరకు ఎన్ఐఏ ఎస్పీ వి.విక్రమన్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. శిశు విక్రయాలపై స్పందించిన హైకోర్టు మంగళగిరికి చెందిన మేడబలిమి మనోజ్ తన మూడునెలల ఆడ శిశువును, ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన జి.చిలకమ్మ అనే మహిళకు పుట్టిన శిశువును పలువురికి విక్రయించారు. వీటికి సంబంధించి పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాజ్యాలపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్ఐఏ, సీబీఐలకు నోటీసులు జారీచేసింది. బుధవారం మరోసారి విచారణకు రాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ కౌంటర్ దాఖలుకు గడువు కోరారు. ధర్మాసనం అంగీకరిçస్తూ విచారణను మే 4కు వాయిదా వేసింది. -
యోగి, ఆర్ఎస్ఎస్ పేరు చెప్పమని ఏటీఎస్ బెదిరించింది
ముంబై: పేలుడు కేసులో నలుగురు ఆర్ఎస్ఎస్ నేతలు, యూపీ సీఎం ఆదిత్యనాథ్ పేర్లను చెప్పమని ముంబై ఏటీఎస్ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) తనను బెదిరించిందని 2008 మాలేగాం పేలుడు కేసులో సాక్షి మంగళవారం కోర్టుకు చెప్పారు. నాడు ఆ కేసును ప్రస్తుతం పలు కేసులు ఎదుర్కొంటున్న పరమ్‌బీర్ సింగ్ పర్యవేక్షించారు. నాడు సదరు సాక్షి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అయితే హఠాత్తుగా తనను బెదిరించి పేర్లు చెప్పించారని సాక్షి కోర్టుకు చెప్పడం కలకలం రేపింది. కేసుపై ఎన్ఐఏ కోర్టు విచారణ జరుపుతోంది. పరమ్‌బీర్ సహా మరో అధికారి యోగి, ఆర్ఎస్ఎస్ నేతల పేర్లను చెప్పమని బెదిరించారని తాజా విచారణలో సాక్షి కోర్టుకు విన్నవించారు. తనను ఏటీఎస్ హింసిందన్నారు. దీంతో సాక్షి ఏటీఎస్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ను అంగీకరించమని కోర్టు ప్రకటించింది. ఇంతవరకు ఈ కేసులో 220 సాక్షులను విచారించారు. వీరిలో 15మంది అడ్డం తిరిగారు. ఈ నేపథ్యంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు మన్మోహన్, సోనియా గాంధీ, రాహుల్, సల్మాన్‌ఖుర్షిద్, ప్రియాంక క్షమాపణలు చెప్పాలని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలో రాజకీయ కుట్రతో ఈ కేసును రిజిస్టర్ చేశారన్నారు. కాంగ్రెస్ కుట్రలను తనను బెదిరించారన్న సాక్షి స్టేట్మెంట్ బహిర్గతం చేసిందన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇతర ప్రతిపక్షాలు సైతం కాంగ్రెస్‌కు వత్తాసు పలికాయని విమర్శించారు. -
ఏకంగా రక్షణ వ్యవస్థనే లక్ష్యం.. డ్రోన్ల దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) స్థావరంపై డ్రోన్ల దాడి ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తునకు ఆదేశిస్తూ హోం శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడికి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఏకంగా రక్షణ వ్యవస్థనే లక్ష్యంగా చేసుకున్న ముష్కరులను పట్టుకుని చట్టం ముందు నిలబెట్టేందుకే దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించినట్లు హోం శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. జమ్మూ విమానాశ్రయానికి సమీపంలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఆదివారం అర్థరాత్రి డ్రోన్లతో దాడికి దిగిన విషయం తెలిసిందే. లష్కరే టాప్ కమాండర్ అబ్రార్ హతం ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ మంగళవారం హతమయ్యాడు. సోమవారం భద్రతాబలగాలు అబ్రార్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అతడిని తీసుకుని వెళ్లి మంగళవారం మలూరాలోని ఓ ఇంటిని చుట్టుముట్టగా ఆ ఇంట్లో నక్కి ఉన్న పాక్ ఉగ్రవాది కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడగా అబ్రార్ మృతి చెందాడు. చదవండి: డ్రోన్లను గుర్తించి పేల్చేసే సాంకేతికత! Agni-Prime: భారత దేశ సరికొత్త ఆయుధం ఇదే! -
తమిళనాడులో ఎస్ఐఏ సోదాలు
-
‘సాధ్వీ ప్రజ్ఞాసింగ్’ కేసు ఏమవుతుంది !?
సాక్షి, న్యూఢిల్లీ : 2008 నాటి మాలేగావ్ బాంబు పేలుడు కేసు విచారణను గోప్యంగా నిర్వహించాలని కోరుతూ ఆ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ: అత్యున్నత యాంటి టెర్రరిస్టు దర్యాప్తు సంస్థ) ఆగస్టు రెండవ తేదీన ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఓ దరఖాస్తు దాఖలు చేసుకొంది. ఇక్కడ కేసును గోప్యంగా విచారించడం అంటే కేసుతో సంబంధం ఉన్న నిందితులు, సాక్షులు, న్యాయవాదులు, అవసరమైన కోర్టు సిబ్బంది మినహా మిగతా ప్రజలు ఎవరూ కోర్టు హాలులో ఉండరాదు. ముఖ్యంగా మీడియాను అనుమతించరాదు. ఉత్తర మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008, రంజాన్ మాసం ఆఖరి రోజైన సెప్టెంబర్ 29వ తేదీన ఓ మసీదు సమీపంలో ఓ మోటారు సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడం వల్ల ఆరుగురు మరణించడం, వంద మంది దాకా గాయపడడం తెల్సిందే. బాంబు అమర్చిన మోటార్‌సైకిల్ ప్రస్తుతం బీజేపీ లోక్‌సభ సభ్యురాలైన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉందని, ముస్లిం టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆమె, మరికొంత మంది హిందూత్వ వాదులు కుట్ర పన్ని ఈ ‘హిందూ టెర్రరిజం’కు పాల్పడ్డారని నాడు ఆరోపణలు, వార్తలు వచ్చాయి. దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించే లక్ష్యంతో ప్రజ్ఞాసింగ్ మరికొంత మంది తీవ్ర హిందూత్వవాదులు ‘అభినవ్ భారత్’ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. మత సామరస్యం, జాతీయ భద్రత, శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొనే ఈ కేసు విచారణను గోప్యంగా నిర్వహించాలని కోరుతున్నట్లు ఎన్ఐఏ తన దరఖాస్తులో పేర్కొంది. ఇది కేవలం సాకు మాత్రమేనని, ఇందులో ఏదో మర్మం ఉందని సులభంగానే గ్రహించవచ్చు. అది ఎప్పుడూ నిందితలు పక్షం వహిస్తూ రావడమే అందుకు రుజువు. ఈ కేసులో ఠాకూర్, ఇతర నిందితుల పట్ల మెతక వైఖరి అవలంబించాల్సిందిగా ఎన్ఐఏ తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణీ సేలియన్ బహిరంగంగా ఆరోపించడం తెల్సిందే. ఠాకూర్, ఇతర నిందితులపై చార్జిషీటు నమోదు చేసేందుకు సరైన ఆధారాలు లేనందున వారిని కేసు నుంచి మినహాయించాలని కోరుతూ 2016లో ఎన్ఐఏ ఓ అనుబంధ నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. గత ఐదేళ్లుగా కేసు దర్యాప్తు జరిపి మీరు తేల్చింది చివరకు ఇదా, కేసు విచారణ కొనసాగాల్సిందేనంటూ ఆ నివేదికను పరిగణలోకి తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది. 2011లో ఈ కేసు విచారణను ఎన్ఐఏ స్వీకరించిన విషయం తెల్సిందే. అప్పటి వరకు మహారాష్ట్ర యాంటి టెర్రరిజమ్ స్క్వాడ్ ఈ కేసు విచారణను కొనసాగించింది. ఈ కేసులో త్వరలో ప్రాసిక్యూషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘ఇన్ కెమేరా (గోప్యంగా)’లో కేసు విచారణ జరగాలంటూ ఎన్ఐఏ దరఖాస్తు చేసుకుంది. కేసు విచారణ సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే నిందిల పట్ల మెతక వైఖరి అవలంబిస్తే అది బయటకు తెలుస్తుందని, సరైన ఆధారాలు చూపకపోతే సంస్థ వైఫల్యం ప్రజలకు, ముఖ్యంగా మీడియాకు తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఎన్ఐఏ సంస్థ ఈ దరఖాస్తు చేసినట్లు మీడియా అనుమానిస్తోంది. అందుకనే కొంత మంది జర్నలిస్టులు కలిసి ఎన్ఐఏ దరఖాస్తును సవాల్ చేస్తూ ఆగస్టు ఐదవ తేదీన ఓ పిటిషన్ దాఖలు చేశారు. మీడియాను అనుమతించక పోవడం అంటే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని కూడా వాదించింది. దీనిపై కోర్టు తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. ‘కేసులో న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్లు బయటకు కనిపించాలి’ అంటూ సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో సహజ న్యాయ సూత్రాన్ని ప్రకటించింది. ఆ రకంగానైనా కేసులో బహిరంగ విచారణే కొనసాగించాలి. మరి ప్రజ్ఞాసింగ్ కేసులో ఏమవుతుందో చూడాలి!! -
జమ్మూకశ్మీర్‌లో ఎన్ఐఏ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రనిధుల కేసులో భాగంగా జమ్మూకశ్మీర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో ఏకకాలంలో నాలుగు చోట్లు ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అక్కడి ఇళ్లను జల్లెడపడుతున్నారు. వేర్పాటువాద నేత మసరత్ ఆలంను గతవారం జమ్మూకశ్మీర్ జైలు నుంచి ఢిల్లీ నుంచి తరలించిన ఎన్ఐఏ.. విచారణలో అతడని నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఆ డేటా ఆధారంగానే ఇప్పుడు సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. టెర్రర్ ఫండింగ్ కేసు 2012లో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మసరత్ ఆలంతోపాటు వేర్పాటువాద నేతలు అసియా ఆంద్రబి, షబీర్ షా సహా 12మందిపై అభియోగాలు నమోదుచేసింది. -
జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్
శ్రీనగర్: ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన ఇర్షాద్ అహ్మద్ రిషిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆదివారం అరెస్ట్ చేసింది 2017లో దక్షిణ కశ్మీర్ లెత్‌పోరాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ జరిగిన దాడితో ఇర్షాద్కు సంబంధం ఉన్నట్టుగా ఎన్ఐఏ అనుమానిస్తుంది. కాగా, ఈ దాడిలో ఐదుగురు అధికారులు చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇర్షాద్ ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదో నిందితుడు. అతడు జైషే ఉగ్రసంస్థ అండర్ గ్రౌండ్ వర్కర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జైషే కమాండర్ నూర్ మహమ్మద్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి జరిపిన ఉగ్రవాదులకు ఇర్షాద్ ఆశ్రయం కల్పించినట్టుగా తెలుస్తోంది. కాగా, నిందితున్ని సోమవారం జమ్మూలోని ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. -
హైదరాబాద్‌లో ఎన్ఐఏ కార్యాలయం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నూతన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. మాదాపూర్ (హైటెక్ సిటీ) సమీపంలోని ఖానామెట్ గ్రామంలో నిర్మించిన ఎన్ఐఏ కార్యాలయంతో పాటు రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కు రాజ్‌నాథ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ... ప్రపంచంలోనే అత్యంత పకడ్బందీగా దర్యాప్తు చేసే సంస్థగా ఎన్ఐఏకు గుర్తింపు ఉందన్నారు. ఎన్ఐఏ దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులతో ముడిపడి ఉన్న కేసులను ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతుందని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి అత్యంత దారుణమన్న రాజ్‌నాథ్... ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలని పిలుపునిచ్చారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉగ్రవాదాన్ని తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రపంచం అంతా పోరాడుతుందని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రపంచంలో టెర్రరిస్టులను తరిమికొట్టేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయన్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి అనంతరం భారత్ నుంచి ఉగ్రవాదులను తరిమి కొట్టేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టారన్నారు. ఉగ్రవాదులను అంతం చేసేందుకు దేశమంతా ఒకే వేదికపై ఉందని తెలిపారు. దేశంలో మార్పు కోసం అన్ని సంస్థలతో పాటు ఎన్ఐఏ పాత్ర కూడా ఉండాలన్నారు. ఐఎస్ఐఎస్పై విచారణ చేపట్టేందుకు ఎన్ఐఏకి హోంశాఖ పూర్తి స్వేచ్ఛనిచ్చిందని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్ఐఏ కార్యాలయాలు ఉన్నాయని, లేని ప్రాంతాల్లో సైతం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టుల టార్గెట్.. టీఆర్ఎస్ నేతలు!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు దాడులు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు పోలీసు యంత్రాంగానికి పలు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో హై అలర్టు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచించింది. ఛత్తీస్‌గఢ్ లాంటి మావోయిస్టు ప్రాబల్యం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇదివరికే పోలీస్ శాఖను హైఅలర్టు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన కొందరు నాయకులును టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉందని జాతీయ ధర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) తెలిపింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు మావోయిస్టులు సానుకూలంగా ఉన్నారంటూ సమాచారం. కాంగ్రెస్ నేతలపై కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా దండకారణ్యంలో గత రెండు నెలలుగా మావోయిస్టులు ఎన్నికలపై ప్రత్యేక ప్రణాళిక రచించనట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు అలర్టుగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఎన్నికల్లో మావోయిస్టుల వ్యూహాలకు, ప్రతి వ్యూహాలకు సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
ఎన్ఐఏ కొత్త చీఫ్‌గా వైసీ మోదీ
► అక్టోబర్ 30న శరద్‌కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్న మోదీ ► గుజరాత్ అల్లర్ల కేసుల్లో సుప్రీం ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడు ► సశస్త్ర సీమా బల్ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ రజనీకాంత్ మిశ్రా న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నూతన చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వైసీ మోదీ నియమితులయ్యారు. 1984 అస్సాం–మేఘాలయ కేడర్‌కు చెందిన మోదీ ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ప్రత్యేక డైరెక్టర్‌గా ఉన్నారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో వైసీ మోదీ కూడా సభ్యునిగా ఉన్నారు. గుజరాత్ అల్లర్లకు సంబంధించిన మొత్తం తొమ్మిది కేసుల్లో నరోదా పటియ, నరోదాగామ్, గుల్బర్గ్ సొసైటీ కేసులను వైసీ మోదీ దర్యాప్తు చేశారు. గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ కేసులో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి క్లీన్చిట్ లభించిన విషయం తెలిసిందే. మోదీ పేరుకు ఏసీసీ ఆమోదం.. ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయానికి సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే ఎన్ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్(డీజీ)గా వైసీ మోదీ పేరును కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించింది. అనంతరం ఎన్ఐఏ చీఫ్‌గా ఆయన పేరును ఖరారు చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ(డీవోపీటీ) శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఎన్ఐఏ చీఫ్ శరద్‌కుమార్ నుంచి అక్టోబర్ 30న వైసీ మోదీ బాధ్యతలు స్వీకరిస్తారు. శరద్‌కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించే నిమిత్తం మోదీని ఎన్ఐఏలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా తక్షణం నియమిస్తున్నట్టు డీవోపీటీ శాఖ వెల్లడించింది. ఎన్ఐఏ చీఫ్‌గా వైసీ మోదీ 2021 మే 31 వరకూ కొనసాగుతారు. శరద్‌కుమార్ 2013 జూలైలో ఎన్ఐఏ డీజీగా నియమితులయ్యారు. ఆయనకు రెండుసార్లు పొడిగింపు లభించింది. పఠాన్‌కోట్ ఉగ్రదాడి కేసు, వివిధ ఐఎస్ఐఎస్ సంబంధిత కేసుల దర్యాప్తు నిమిత్తం ఆయన పదవీ కాలాన్ని గత ఏడాది అక్టోబర్‌లో కేంద్రం సంవత్సరం పాటు పొడిగించింది. ఎన్ఐఏ చీఫ్‌గా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి శరద్కుమారే. ఎస్ఎస్బీ చీఫ్‌గా రజనీకాంత్ మిశ్రా మరో సీనియర్ ఐపీఎస్ అధికారి రజనీకాంత్ మిశ్రా ఇండో–నేపాల్ సరిహద్దుల్లో గస్తీ కాసే సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. 1984 ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన మిశ్రా ప్రస్తుతం సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లో అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఆయన ఎస్ఎస్బీ చీఫ్‌గా 2019 ఆగస్టు 31 వరకూ కొనసాగుతారని డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రధానిపై దాడికి ఐసిస్ విఫలయత్నం
►బాంబు కూడా అమర్చిన ముష్కరులు ►ఎన్ఐఏ విచారణలో వెల్లడి న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిన్ ప్యాసింజర్‌లో పేలుడు జరిపిన ఐసిస్ ఉగ్రవాదులు ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీపైనా దాడికి విఫలయత్నం చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం వెల్లడించింది. గతేడాది దసరా సమయంలో మోదీ లక్నోలో నిర్వహించిన దాడికి ఐసిస్ కుట్ర పన్నింది. ర్యాలీ జరిగే రామ్‌లీలా మైదాన్‌లో అక్టోబరు 17న బాంబు పెట్టాలని అనుకున్నామని ఈ కేసులో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులు మహ్మద్ డానిష్, ఆతిఫ్ ముజఫర్, వీరి స్నేహితులు విచారణలో వెల్లడించారు. ఇందుకోసం మైదానం దగ్గర రెక్కీ కూడా జరిపారు. ర్యాలీకి ముందు రోజు అక్కడున్న చెత్తడబ్బాలో బాంబు అమర్చి వచ్చారు. అయితే ర్యాలీ తరువాత కూడా పేలుళ్ల గురించి సమాచారం రాలేదు. రెండు రోజుల తరువాత అక్కడికి ముజఫర్ వెళ్లి చూడగా, వైర్లు మాత్రమే కనిపించాయి. ఐసిస్ సత్తా చాటేందుకు డానిష్ పలుచోట్ల బాంబు పేలుళ్లకు యత్నించినా అవేవీ సఫలం కాలేదు. ఈ ఐసిస్ సభ్యుల బృందానికి నాయకుడిగా (ఆమిర్) ప్రకటించుకున్న ముజఫర్ స్టీలు పైపులు, షాండ్లియర్ బల్బులతో బాంబులు కూడా తయారు చేశాడు. ఉజ్జయిన్లో రైలులో ఈ నెల ఏడున జరిగిన పేలుళ్ల కేసులో వీరిద్దరితోపాటు ఏడుగురిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరందరికీ భారత వైమానిక దళం మాజీ ఉద్యోగి ఒకరు సాయం చేసినట్టు గుర్తించి, అతణ్నీ అరెస్టు చేసింది. పేలుడులో 10 మందికి గాయాలయ్యాయి. -
‘మక్కా’ నిందితులు మరణించారా?
- వాంటెడ్‌గా ఉన్న రామ్‌చంద్ర, సందీప్ ధాంగే - 2008లో ‘చనిపోయారన్న’ ఏటీఎస్ మాజీ అధికారి సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని మక్కా మసీదు లో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు కేసులో వాంటెడ్ నిందితులుగా ఉన్న రామ్‌చంద్ర కస్సంగ్రా, సందీప్ ధాంగే ‘మరణించారా’..? మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) మాజీ ఇన్స్పెక్టర్ మహబూబ్ ముజావర్ ఇటీవల అక్కడి న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ ఈ అను మానాలకు తావిస్తోంది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ముజావర్ గత వారం ఓ జాతీయ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఆ ఇద్దరూ 2008లోనే ఏటీఎస్ కస్టడీలో చనిపోయారని ప్రకటించారు. తనకు ‘ఆ విషయం’ తెలిసినందుకే తనపై అక్రమం గా కేసులు బనాయించి అప్రతిష్టపాలు చేశారని పేర్కొన్నారు. మక్కా మసీదు పేలుడు ఘటనలో 9 మంది ప్రాణాలు విడువగా.. ఆ తర్వాత అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. 58 మంది క్షతగా త్రులయ్యారు. హుస్సేనిఆలం పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్‌కు.. అక్కడ నుంచి సీబీఐ వెళ్లాయి. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. ముంబై దాడుల రోజే: ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ముజావర్ ప్రకటనతో ‘మక్కా’తో పాటు మాలే గావ్, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు, అజ్మీర్ దర్గా బ్లాస్ట్ కేసులు కొత్త మలుపు తిరిగాయి. ఈ కేసులన్నింటిలోనూ రామ్‌చంద్ర, సందీప్ నిందితు లుగా ఉన్నారు. వీరిద్దరినీ మాలేగావ్ కేసు దర్యాప్తు నేపథ్యంలో మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు 2008లోనే పట్టుకున్నారని ముజావర్ పేర్కొన్నారు. ఆ టీమ్‌లో తానూ సభ్యుడిగా ఉన్నానని, 26/11 ముంబై దాడులు జరిగిన 2008 నవంబర్ 26న వీరిద్దరూ ఏటీఎస్ కస్టడీలో చనిపోయారని సంచల నాత్మక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు, అంశాలను న్యాయస్థానం ముందు ఉంచుతానం టూ షోలాపూర్ మేజిస్ట్రేట్ కోర్టులో గత నెల మొదటి వారంలో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ప్రస్తుతం దర్యాప్తు, నిఘా వర్గాల కన్ను ముజావర్తో పాటు ఏటీఎస్‌పై పడింది. ఆదాయానికి మించి ఆస్తులు, ఆయుధ చట్టం కింద నమోదైన రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న ముజావర్ అఫిడవిట్ ఎంత వరకు వాస్తవమనేది ఆరా తీస్తున్నాయి. ‘మాలేగావ్’తో వీడిన చిక్కుముడి.. మక్కా మసీదులో పేలుడు జరిగిన 3 నెలలకు రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాలో బాంబు పేలింది. ఈ రెంటికీ సారూప్యతలు ఉండటంతో ఒకే మా డ్యుల్ పనిగా అనుమానించారు. మహా రాష్ట్రలోని మాలేగావ్ పేలుడు(రెండోసారి) కేసు లో ఏటీఎస్ అధికారులు అభినవ్ భారత్‌కు చెం దిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్ పురోహిత్‌ను 2008 అక్టోబర్ 28న అరెస్టు చేశారు. వీరి విచార ణలో అజ్మీర్ పేలుడుకు బాధ్యులైన దేవేంద్ర, లోకేష్, రామ్‌చంద్ర, సందీప్ పేర్లు వెలుగులోకి వచ్చా యి. 2010 ఏప్రిల్ 28న రాజస్థాన్ ఏటీఎస్ అధికారులు దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మను పట్టు కున్నారు. విచారణలో ‘మక్కా’ పనీ తమదేనని అంగీకరించడంతో మూడేళ్ల తర్వాత చిక్కుముడి వీడింది. ‘మక్కా’ కేసులో మొత్తం ఆరుగురిని నిందితులుగా గుర్తించారు. మూడేళ్ల తర్వాత సీబీఐ.. దేవేంద్ర, లోకేష్‌లను పీటీ వారెంట్‌పై తీసుకురావడంతోపాటు స్వామి అశిమా నందను అరెస్టు చేశారు. మరో నిందితుడు సునీ ల్జోషి 2007లోనే హత్యకు గురయ్యాడని తేలిం ది. రామ్‌చంద్ర, సందీప్ థాంగే ఇప్పటికీ పరారీ లోనే ఉన్నారని అధికారులు అంటున్నారు. -
కట్టుబొట్టు మార్చిన అయ్యవార్లు!
- ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కొందరు అర్చకుల తీరు - తలపై శిఖ, నుదుట తిలకం మాయం, ధోవతి బదులు లుంగీధారణ - కొన్ని ఆలయాల తనిఖీల్లో వెలుగులోకి - కమిషనర్‌కు అధికారుల నివేదిక - అన్ని ఆలయాలకు త్వరలో నోటీసులు సాక్షి, హైదరాబాద్ : తలపై శిఖ (పిలక), నుదుటన నామాలు, గోచీతో కూడిన ధోవతి... ఆలయ అర్చకులంటే కనిపించే రూపం ఇది. దేవునికి, భక్తునికి మధ్య అనుసంధానకర్తలైన అయ్యవార్లు పవిత్రత, ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం. కానీ ఇప్పుడు ఆ రూపులో తేడాలు కనిపిస్తున్నాయి. చాలా దేవాలయాల్లో అర్చకులు ఆగమశాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా ధోవతికి బదులు లుంగీలు ధరించడమే కాకుండా పిలక కూడా పెట్టుకోవడం లేదని అధికారుల తనిఖీల్లో బయటపడింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన దేవాదాయశాఖ...చట్టంలో పొందుపరిచిన అర్చకుల ప్రవర్తనా నియమావళిని పాటించని అన్ని దేవాలయాలకు నోటీసులు పంపాలని నిర్ణయించింది. నియమావళికి విరుద్ధంగా... ఇటీవల కొందరు ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాలను తనిఖీ చేయగా అర్చకుల వేషధారణలో మార్పులు రావటాన్ని గుర్తించారు. ముఖ్యంగా వారికం టూ ప్రత్యేకంగా చట్టంలో పొందుపరిచిన ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తుండటాన్ని గమనించారు. దేవాదాయ చట్టంలోని సెక్షన్ 13లో ఆగమశాస్త్ర నియమావళి ప్రకారం అర్చకులు విధిగా శిఖ పెట్టుకోవడంతోపాటు గోచీతోకూడిన ధోవతి, పైపంచె, నుదుటన ఆలయ ఆగమానికి తగ్గట్టుగా తిలకం ధరించాల్సి ఉంది. కానీ చాలా మంది అర్చకులు శిఖను ఉంచుకోవటం లేదని అధికారులు గుర్తించారు. కొందరు కనీసం కుంకుమ కూడా పెట్టుకోవడం లేదని, గోచీతో కూడిన పంచెకు బదులు లుంగీ కట్టుకుంటున్నారని గమనించారు. అలాగే ఆలయంలో దేవతావిగ్రహాలపై ఉంచిన పూలను మరుసటి రోజు (నిర్మాల్యం) తొలగించటం లేదని గుర్తించారు. ముఖ్యంగా అర్చకులు ధూమపానం, జర్దా, తంబాకు, గుట్కా వంటి దురలవాట్లకు లోను కాకూడదని దేవాదాయశాఖ చట్టం చెబుతున్నా కొందరు అర్చకులు మాత్రం పాన్‌మసాలా నములుతున్నట్టు అధికారులు కనుగొన్నారు. ఇవి ఆలయ పవిత్రతకు భంగం కలిగించటమే కాకుండా భక్తుల మనోభావాలకు ఇబ్బందిగా ఉన్నాయని పేర్కొంటూ దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. దీంతో చట్టంలో పేర్కొన్న అర్చకుల ప్రవర్తనా నియమావళిని, గతంలో ప్రభుత్వ ఉత్తర్వు రూపంలో జారీ చేసిన వివరాలను పొందుపరుస్తూ అన్ని దేవాలయాలకు శ్రీముఖాలు పంపాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. నిబంధనలు అతిక్రమించిన అర్చకులపై చర్యలు తీసుకోవాలనుకుంటోంది. కొన్ని ఆలయాల్లో అవినీతి... హైదరాబాద్‌లో దాడులకు కుట్రపన్నిన ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇటీవల అరెస్టు చేసి విచారించగా వారి హిట్‌లిస్టులో కొన్ని దేవాలయాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆయా ఆలయాల వద్ద భద్రతను పరిశీలించేందుకు వెళ్లిన అధికారులకు అక్కడ జరుగుతున్న అవకతవకలు, అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు సమర్పించిన వాటి ఆధారంగా కమిషనర్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ వినాయక ఆలయం లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయటంతోపాటు ఒకరికి రివర్షన్ ఆదేశాలు జారీ చేశారు. -
‘ఉగ్ర’ ఫైనాన్షియర్ల కోసం వేట
జేకేబీహెచ్కు భారీగా హవాలా నిధులు - నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ బృందాల దర్యాప్తు - హైదరాబాద్‌లో 13 చోట్ల పేలుళ్లకు కుట్ర సాక్షి, హైదరాబాద్ : సాధారణ పదార్థాలతో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నిన ఐసిస్ అనుబంధ సంస్థ ‘జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్’ (జేకేబీహెచ్)కు ఆర్థిక సాయం చేసిన ఉగ్ర ఫైనాన్షియర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి పెట్టింది. వారికి అడ్డుకట్ట వేయకపోతే అదను చూసుకుని మరో మాడ్యూల్ ఏర్పాటు చేసే ప్రమాదముందని అనుమానిస్తోంది. అందుకే వీరిని గుర్తించేందుకు తమ కస్టడీలో ఉన్న నలుగురు ఉగ్రవాదుల్నీ లోతుగా విచారించాలని నిర్ణయించింది. ఈ మాడ్యూల్‌కు రాజస్థాన్‌లోని అజ్మీర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని హవాలా ఏజెంట్ల ద్వారా నిధులందాయని గుర్తించింది. ఇవన్నీ ‘రియాల్’ కరెన్సీలో వచ్చాయని తేలింది. సిరియాతో పాటు దుబాయ్ కోణమూ వెలుగులోకి వచ్చింది. సిరియాలో ఉన్న వీరి హ్యాండ్లర్ ద్వారానే సమాచార మార్పిడితో పాటు మౌలిక వసతుల కల్పన, ఆర్థిక సహకారం అందుతోందని ఇప్పటిదాకా భావించారు. కానీ వీరికి ఉగ్ర నిధులు రియాల్ రూపంలో రావడంతో దుబాయ్‌లోని ఉగ్ర ఫైనాన్షియర్లే హ్యాండ్లర్ ఆదేశానుసారం పంపి ఉంటారని ఎన్ఐఏ అనుమానిస్తోంది. హ్యాండ్లర్‌తో పాటు ఈ ఫైనాన్షియర్లనూ గుర్తించడం కీలకమనే భావనతో నిందితుల విచారణతో పాటు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టింది. ఈ ముష్కరులు హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విధ్వంసాలకు కుట్ర పన్నినట్లు ప్రాథమికంగా గుర్తించింది. ఆ వివరాలను నిందితులు పూర్తిగా బయటపెట్టడం లేదని అనుమానిస్తోంది. అందుకే అన్ని వివరాలూ రాబట్టడానికి నిందితుల్ని లోతుగా విచారించనుంది. 12 రోజుల పాటు విచారించినా వారు సహకరించనందున పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితుల్ని వికారాబాద్, పోచంపల్లి, మేడ్చెల్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలతో పాటు ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకూ తీసుకెళ్లి ఆధారాలు సేకరించనున్నారు. ‘ఆన్లైన్’లో అప్రమత్తం ఆన్లైన్ వాడకంలో ముష్కరులు అనేక జాగ్రత్తలు తీసుకున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఎన్క్రిప్టెడ్ విధానంలో ఉండే ఈ-మెయిల్స్, డార్క్ వెబ్ వంటి అప్లికేషన్స్ వాడటంతో పాటు ఇబ్రహీం యజ్దానీ ద్వారా హ్యాండ్లర్‌తో సంప్రదింపులు జరిపారు. సమాచార మార్పిడికి ఇదే విధానాలతో పాటు సోషల్‌మీడియాను వాడారు. ఐసిస్ వీడియోలు, మెటీరియల్ డౌన్లోడ్ చేసుకునేందుకు సొంత కంప్యూటర్లు కాకుండా సైబర్ కేఫ్‌లను వాడారు. ‘ఐసిస్’పై కన్నేసి ఉంచే నిఘా వర్గాలకు చిక్కే ప్రమాదాన్ని శంకించి ఈ జాగ్రత్త తీసుకున్నారు. ఆయా నెట్ సెంటర్లను గుర్తించి హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకోవడానికి ఎన్ఐఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 13 ప్రాంతాల గుర్తింపు హైదరాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నిన ఈ మాడ్యూల్... పోలీసుస్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రక్షణ రంగ సంస్థలనూ లక్ష్యం చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయాలను విదేశంలో ఉన్న హ్యాండ్లర్కు ముష్కరులు ఎప్పటికప్పుడు చేరవేశారు. వారిమధ్య ఫేస్బుక్, ఈ-మెయిల్‌తో పాటు ఇతర సోషల్ మీడియాల ద్వారా జరిగిన మార్పిడైన సమాచారాన్ని ఎన్ఐఏ సేకరించింది. నగరంలోని 13 ప్రాంతాలతో పాటు ఆరుగురు ప్రముఖులు వీరి హిట్‌లిస్ట్‌లో ఉన్నట్టు తేల్చింది. విధ్వంసాలు సృష్టించాలని వారు భావించిన ప్రాంతాలను అధికారికంగా గుర్తించారు. వారినుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను విశ్లేషణ కోసం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు, పేలుడు పదార్థాలు, రసాయనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, తుపాకులు, తూటాల్ని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ (సీఎఫ్ఎస్ఎల్), కేంద్రం ఆధీనంలోని సెర్ట్-ఇన్ సంస్థలకు పంపారు. ఖలీఫాగా ప్రకటించుకున్న ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బగ్దాదీకి బద్ధులమై ఉంటామంటూ ప్రమాణం చేయడానికి (బయాత్) వీరు వినియోగించిన పత్రాలను కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. కీలకాధారాలు సీసీ కెమెరా ఫుటేజ్‌లు ఈ కేసులో నిందితులపై నేరం నిరూపించడానికి ఆధారాల సేకరణలో భాగంగా పలు ప్రాంతాల నుంచి భారీగా సీసీ కెమెరాల ఫుటేజ్‌లను ఎన్ఐఏ సేకరించింది. బాంబుల తయారీకి ముడి పదార్థాలు సమీకరించుకోవడానికి పలు దుకాణాల్లో, రెక్కీ కోసం పలు ప్రాంతాల్లో సంచరించారు. అప్పుడు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను అధికారులు సేకరించారు. వీటిని నిందితులతో పోల్చి చూడనున్నారు. ఇందుకు నిపుణుల సాయం తీసుకుంటున్నారు. వీరు షెల్టర్ తీసుకున్న, భేటీ అయిన, శిక్షణకు వినియోగించిన ప్రదేశాలకు వెళ్లి క్రైమ్ సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయనున్నారు. వెలుగులోకి వచ్చిన అంశాల్లోని మిస్సింగ్ లింకులను పూరించుకోవడానికి కస్టడీలోకి తీసుకున్న నలుగురినీ విడిగా విచారించాలని ఎన్ఐఏ నిర్ణయించింది. -
ఉగ్రజాడలు
♦ వికారాబాద్‌లో ఇబ్రహీం ముఠా కదలికలు ♦ పాస్‌పోర్టుల ఆధారంగా సిమ్‌కార్డుల కొనుగోలు ♦ స్థానిక జిరాక్స్ సెంటర్లో పాస్‌పోర్టుల జిరాక్స్‌లు ♦ వీటిని ఎక్కడైనా తస్కరించారా? ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చించోళి- వికారాబాద్ మధ్య రాకపోకలు సాగించినట్లు ఎన్ఐఏ విచారణలో వెల్లడి ఒకవేళ హైదరాబాద్‌లో దాడుల వ్యూహం ఫలిస్తే.. కొంతకాలం వికారాబాద్‌లోనే తలదాచుకోవాలని ఉగ్రవాడులు ప్రణాళిక రూపొందించుకున్నట్టు ఎన్ఐఏ విచారణలో వెలుగుచూసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మరోసారి జిల్లాలో ‘ఉగ్ర’మూలాలు బయటపడ్డాయి. వికారాబాద్‌లో ఐసిస్ తీవ్రవాదులు సంచరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించే ప్రయత్నంలో పోలీసులకు చిక్కిన టైస్టులు ఇబ్రహీం యజ్దానీ, హబీబ్ పలుమార్లు వికారాబాద్, చించోళి పట్టణాల కు రాకపోకలు సాగించినట్లు స్పష్టమైంది. పోలీసుల కళ్లుగప్పి ఐసిస్ అగ్రనేతలతో మాట్లాడేందుకు వినియోగించిన సిమ్ కార్డులలో రెండు చిరునామాలు జిల్లాకు చెందినవే కావడంతో పోలీసు యంత్రాంగం నివ్వెరపోయింది. జిల్లాకు చెందిన ఇద్దరి వ్యక్తుల పాస్‌పోర్టుల ఆధారంగానే ఎయిర్టెల్ సిమ్ కార్డులను పొందినట్లు తేలింది. ఇబ్రహీం స్థానిక బీజేఆర్ చౌరస్తాలోని ఓ ఇంటర్నెట్ సెంటర్లో జిరాక్సులు తీసుకున్నట్లు విచారణలో బయటపడింది. రంజాన్ పండగ వేళ రాజధానిలో విధ్వంస రచనకు కుట్రపన్నిన ఇబ్రహీంతో సహా మరో నలుగురు ఐసిస్ తీవ్రవాదులపై ఎన్ఏఐ మెరుపు దాడులు చేసి చాకచక్యంగా పట్టుకుంది. ఈ నేపథ్యంలో సిమ్‌కార్డులు పొందడానికి ఎలాంటి ఆధారాలను సమర్పించారు? ఆ పాస్‌పోర్టులు ఎక్కడి నుంచైనా తస్కరించారా? ఎవరైనా సమకూర్చారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా వీరికి ఎవరైనా సహకారం అందించారా అనే విషయంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ సిమ్‌కార్డులతో ఎవరెవరితో సంభాషణలు జరిపారనే అంశంలోనూ విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు టవర్ లోకేషన్ అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. వికారాబాద్‌లో బీఈ చదివి.. పాతబస్తీకి చెందిన ఇబ్రహీం యజ్దానీకి వికారాబాద్‌తో గతం నుంచే సంబంధాలు ఉన్నాయి. 2003లో స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన యజ్దానీ.. ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం సౌదీకి వెళ్లాడు. అక్కడే ఐసిస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఇబ్రహీం.. ఇక్కడే ముఠా ఏర్పాటు చేశాడు. రాజధానిలో ఒకేసారి పలుచోట్ల బాంబు పేలుళ్లు, తుపాకులతో విరుచుకుపడేలా ప్లాన్ వేశాడు. అయితే, ఎన్ఐఏ అధికారుల అప్రమత్తంతో హైదరాబాద్‌కు ఉగ్రముప్పు తప్పింది. ఒకవేళ వారి వ్యూహం ఫలిస్తే.. దాడుల అనంతరం కొంతకాలం వికారాబాద్‌లోనే తలదాచుకోవాలని ప్రణాళిక రూపొందించినట్లుగా ఎన్ఐఏ విచారణలో వెలుగుచూసింది. వికారాబాద్‌లో సొంతంగా స్థావరం ఏర్పాటుచేసుకోవాలనుకున్నారా? ఎవరైనా సహకారం అందిస్తున్నారా అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సిమీ తీవ్రవాదులకు శిక్షణ గతంలో స్టూడెంట్ మూవ్మెంట్ ఆఫ్ ఇస్లామిక్(సిమీ) తీవ్రవాదులు కూడా వికారాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ పోలీసులకు పట్టుబడిన సిమీ అగ్రనేత సప్ధర్ నగోరి కూడా వికారాబాద్ సమీపంలోని అనంతగిరిలో శిక్షణ పొందినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. ఆయుధాల వాడకంలో అటవీ ప్రాంతంలో శిక్షణ తీసుకున్నామని చెప్పారు. మరోవైపు గతేడాది వరంగల్ పోలీసుల చేతిలో ఎన్కౌంటరైన వికారుద్దీన్ కూడా చేవెళ్ల సమీపంలోని మదర్సాలో కొన్నాళ్లపాటు తలదాచుకున్నానని పోలీసుల ముందు అంగీకరించారు. తాజాగా ఐసిస్ ముఠా కదలికలు కూడా వికారాబాద్‌లో కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. -
జెద్దాలో కలసిన జోర్డాన్‌వాసి!
- ఇబ్రహీంను ఉగ్రబాట పట్టించింది ఇతడే - 2015లో సిరియాలో మృతి - ఇలియాస్ రాడికలైజ్ అయింది వేలూరులో - ‘మీ సేవ’ యజమానికి ఎన్ఐఏ నోటీసులు.. - వాంగ్మూలం నమోదు సాక్షి, హైదరాబాద్ : ఐసిస్‌కు అనుబంధమైన ఏయూటీ మాడ్యుల్ హైదరాబాద్‌లో తయారు కావడానికి మూలం జోర్డాన్‌కు చెందిన వ్యక్తా... దీనికి ఔననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వర్గాలు. ఈ మాడ్యుల్ చీఫ్ ఇబ్రహీం యజ్దానీ సహా మిగిలిన నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్తున్నాయి. మలుపు తిప్పిన సహోద్యోగి పరిచయం పాతబస్తీకి చెందిన యజ్దానీ 2003లో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. నగరంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన ఇతగాడు 2011లో సౌదీ అరేబియాలోని జెద్దా వెళ్లి అక్కడి ఎలక్ట్రికల్ కంపెనీలో చేరాడు. అప్పట్లో ఇతడి సహోద్యోగిగా ఉన్న జోర్డాన్ వాసితో పరిచయం ఇబ్రహీం జీవి తాన్ని మలుపుతిప్పింది. జోర్డాన్, సిరియా ల్లో జరుగుతున్న ‘యుద్ధం’, అక్కడి పరిస్థితుల్ని ఇబ్రహీంకు వివరించిన జోర్డాన్‌వాసి ఆ మార్గం వైపు ఆకర్షించాడు. 2014 వరకు జెద్దాలోనే ఉన్న ఇబ్రహీం.. ఆయా దేశాల్లో ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి ఇంటర్నెట్ను ఆశ్రయించాడు. ఇబ్రహీం తొలినాళ్లల్లో బ్లాగ్స్తో పాటు ఫేస్బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల్లోని ‘ఓపెన్ ఫోరమ్స్’లో ఓ వర్గానికి అనుకూలంగా, మరో వర్గానికి/దేశాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యల్ని అధ్యయనం చేసేవాడు. సిరియా వెళ్లేందుకు ఇబ్రహీం యత్నం జోర్డాన్ వాసి ఐసిస్‌లో పనిచేసేందుకు జెద్దా నుంచి సిరియా వెళ్లిపోయినట్లు ఇబ్రహీం తెలుసుకున్నాడు. అతడు గత ఏడాది చనిపోయాడు. ఈ విషయం జోర్డాన్‌వాసి సోదరుడు ఫేస్బుక్ లింక్ ద్వారా తనకు సమాచారం ఇచ్చినట్లు ఇబ్రహీం ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. ఈ పరిణామంతో పూర్తి ఉగ్రవాద బాటపట్టిన ఇబ్రహీం సిరియా వస్తానంటూ ఆన్లైన్ ద్వారా హ్యాండ్లర్‌ను కోరాడు. దీన్ని వ్యతిరేకించిన హ్యాండ్లర్ హైదరాబాద్‌లోనే ముఠా ఏర్పాటు చేసి ‘ఆపరేషన్స్’ చేయాలని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పాడు. నిధుల కోసం నగల విక్రయం తన సోదరుడితో పాటు పాతబస్తీ ప్రాంతానికే చెందిన మరికొందరితో కలసి రంగంలోకి దిగాడు. వీరందరితో ప్రమాణం చేయించిన ఇబ్రహీం.. కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన నిధుల కోసం అతడు తన సంబంధీకుల బంగారు ఆభరణాలను విక్రయించాడని వెల్లడైంది. ‘వల’ వేసి పట్టిన సిరియా హ్యాండ్లర్ ఆయా మాధ్యమాల్లో ఉన్న పోస్ట్‌లకు ఉద్రేకపూరితంగా స్పందిస్తున్న ఇబ్రహీంను గుర్తించిన సిరియాలో ఉన్న హ్యాండ్లర్ వ్యక్తిగతమైన ‘పేజ్’ల్లోకి ఆహ్వానించి తన భావజాల వ్యాప్తిని కొనసాగించాడు. ఇలా పూర్తిగా తన వల్లో పడిన తర్వాత ‘వాట్సాప్’, ‘హైక్’, ‘సిగ్నల్’, ‘ట్రిలియన్’, ‘స్కైప్’ సహా వివిధ రకాలైన యాప్స్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. ఏ సందర్భంలోనూ తన ఉనికి బయటపడకుండా జాగ్రత్త వహిస్తూ.. పూర్తిగా ఉచ్చులోకి లాగేశాడు. ఇబ్రహీం 2014లో జెద్దా నుంచి తిరిగివచ్చినా నెట్ ద్వారా హ్యాండ్లర్‌తో సంప్రదింపులు కొనసాగించాడు. ఇతడి సోదరుడైన ఇలియాస్ యజ్దానీ తమిళనాడులోని వేలూరులోని మదర్సాలో విద్యనభ్యసించాడు. అక్కడ పరిచయమైన కొందరి ద్వారా ఉగ్రవాద భావాలను నింపుకున్నాడు. దీంతో వీరిద్దరూ తరచుగా వివిధ రకాలైన ఉద్రేకపూరిత చర్చలు జరిపేవారు. ఇబ్రహీం బంధువు వాంగ్మూలం నమోదు ఇబ్రహీం ముఠా తమ కార్యకలాపాలకు తలాబ్‌కట్టలో షాలియార్ ఆన్లైన్ సేవ పేరుతో ఉన్న మీ సేవ కేంద్రాన్ని వినియోగించుకుంది. దీన్ని ఇబ్రహీం బావమరిదైన సంతోష్‌నగర్‌లోని ఈది బజార్ వాసి నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ మాడ్యుల్ తమ కుట్రల్ని చర్చించుకోవడానికి ఇందులోనే సమావేశమయ్యేది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాదనే ఉద్దేశంతోనే మీ సేవ కేంద్రాన్ని ఎంచుకుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడి కంప్యూటర్ను సైతం వినియోగించింది. దీని ద్వారానే ‘ప్రమాణ పత్రాలను’ తయారు చేయడంతో పాటు బోగస్ ధ్రువీకరణలు రూపొందించడానికి స్కానర్‌ను వాడినట్లు బయటపడింది. ఎన్ఐఏ విచారణలో ఇబ్రహీం, ఇలియాస్ ఈ విషయాలు బయటపెట్టడంతో మంగళవారం మీ సేవ కేంద్రంలో తనిఖీలు చేసిన అధికారులు కంప్యూటర్, స్కానర్ స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న సిమ్‌కార్డుల్లో ఒకటి ఇతడి పేరుతోనే ఉంది. దీంతో ఈ కేసులో అతడు కీలక సాక్షిగా మారాడు. శుక్రవారం అతడికి నోటీసులు జారీ చేసిన ఎన్ఐఏ అధికారులు తమ కార్యాలయానికి పిలిపించి సాక్షిగా పరిగణిస్తూ వాంగ్మూలం నమోదు చేశారు. -
హై అలర్ట్!
* ఏయూటీ అరెస్టులతో ముందస్తు చర్యలు * సిటీలో నిఘా, తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు * ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్న సీపీలు సాక్షి, సిటీబ్యూరో: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం పాతబస్తీలో ఏయూటీ హైదరాబాద్ మాడ్యుల్‌కు చెందిన ఐదుగురిని అరెస్టు చేయడంతో ముందుజాగ్రత్త చర్యగా మూడు కమిషనరేట్ల అధికారులూ అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ వెస్ట్ సీపీ నవీన్‌చంద్, ఈస్ట్ ఇన్చార్జ్ సీపీగా ఉన్న జేసీపీ శశిధర్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ విభాగం అధికారులు ఏర్పాటు చేసిన సర్వైలెన్స్ కెమెరాలతో పాటు కమ్యూనిటీలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటన్నింటినీ అధికారులు బషీర్‌బాగ్, గచ్చిబౌలీల్లోని పోలీసు కమిషనరేట్స్లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లతో (సీసీసీ) అనుసంధానం చేశారు. ఈ కెమెరాలను తాజా పరిస్థితుల నేపథ్యంలో నిఘా కోసమూ వినియోగిస్తున్నారు. ఇతర ప్రాంతాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలపై కన్నేసి ఉంచారు. కూడళ్లు, రహదారుల్లో జరుగుతున్న వ్యవహరాలను పసిగట్టడానికీ వీటిని ఉపయోగించనున్నారు. దీని కోసం సీసీసీల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వీరు అటు ప్రధాన కంట్రోల్ రూమ్‌తో పాటు ఫీల్డ్ స్టాఫ్‌తోనూ సంప్రదింపులు జరుపుతూ అవసరమైన సూచనలు చేస్తున్నారు. నగరంలోని ప్రతి చెక్‌పాయింట్, పికెట్ వద్దా ఉండే సిబ్బందిని అప్రమత్తం చేశారు. అత్యవసర సమయాల్లో వినియోగించడానికి స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచుతున్నారు. మూడు కమిషనరేట్ల వ్యాప్తంగా అనుమానితుల కదలికలను కనిపెట్టడం కోసం యూనిఫాంలో ఉన్న సిబ్బందితో పాటు భారీగా మఫ్టీ పోలీసుల్ని మోహరించారు. నగరంలోని జనసమర్థ ప్రాంతాలు, మాల్స్ తదితర చోట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సిటీలోని లాడ్జిలు, హోటళ్లు తదితరాల్లో బస చేస్తున్న వారి వివరాలనూ సేకరిస్తున్నారు. -
'నాన్నకు బుల్లెట్లన్ని దింపి.. మళ్లీ లోడ్ చేశారు'
బిజ్నూర్: పిల్లలముందు చిన్న ఘర్షణలాంటిది జరిగితేనే అది మరిచిపోవడానికి ఎంతో సమయం పడుతుంది. వారి మనసును ఆ ఘటన వేధిస్తుంటుంది. అలాంటిది కన్నతండ్రిపై కళ్లముందే దుండగులు కాల్పులు జరుపుతుంటే.. ఆ సమయంలో వారెంత భయపడిపోతారు.. బుల్లెట్ల ధాటికి తండ్రి రక్తపు బిందువులు చింది వారిపై పడుతుంటే ఆ పిల్లల పరిస్థితి ఏమిటి? సరిగ్గా ఇదే అనుభవాన్ని ఎదురుచూశారు దుండగుల చేతుల్లో కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయిన ఎన్ఐఏ అధికారి మహ్మద్ తాంజిల్ పిల్లలు. తన కుటుంబంతో కలిసి వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగొస్తున్న తాంజీల్ పై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు శనివారం రాత్రి వికృతంగా కాల్పులు జరిపారు. మొత్తం 24 బుల్లెట్లు ఆయన శరీరంలోకి దిగాయి. ఆయన అక్కడికక్కడే చనిపోగా నాలుగు బుల్లెట్లు ఆయన భార్యకు తగిలాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉంది. బిజ్నూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను సీటు వెనుకాలే కూర్చుని ప్రత్యక్షంగా చూసిన ఆ పిల్లలు ఎంతగా భయపడిపోతున్నారంటే.. 'ఆ ఘటన ఇప్పటికీ మా కనురెప్పలు వాలనివ్వడం లేదు. మేం పెళ్లికి వెళ్లి వస్తుండగా రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు. మా నాన్నను వారి చేతిలోని తుపాకీలో బుల్లెట్లు అయిపోయే వరకు కాల్చారు. అవి అయిపోగానే మరోసారి లోడ్ చేసి కాల్పులు జరిపారు. కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాలు అక్కడే ఉండి అనంతరం వెళ్లిపోయారు. కాల్పులు ప్రారంభం కాగానే మానాన్న సీటుకింద దాచుకోండని చెప్పాడు' అంటూ ఆ పిల్లలు ఏడుస్తూ చెప్పారు. తాంజిల్కు 14 ఏళ్ల కూతురు, పన్నేండేళ్ల బాబు ఉన్నాడు. -
పాకిస్తాన్ వెళ్లనున్న ఎన్ఐఏ బృందం
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడికి సంబంధించి దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం త్వరలో పాకిస్తాన్లో పర్యటించనుంది. ఎన్ఐఏ బృందం పాక్ పర్యటన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్ఐఏ డెరైక్టర్ జనరల్ శరద్‌కుమార్ శుక్రవారం తెలిపారు. పఠాన్‌కోట్ దర్యాప్తు కోసం ఐదు రోజుల క్రితం భారత్‌కు వచ్చిన పాక్ బృందం శుక్రవారం స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. కాగా, జేఐటీ దర్యాప్తు సమయంలో పాక్ అధికారులతో ఎన్ఐఏ చర్చలు జరిపింది. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ బృందాన్ని పాకిస్తాన్‌కు పంపాలని భావిస్తున్నట్లు చెప్పగా.. దానికి పాక్ సానుకూలంగా స్పందించినట్టు శరద్‌కుమార్ తెలిపారు. పఠాన్‌కోట్ దాడికి కుట్ర వెనుక జైషే మహమ్మద్ ఉందనేందుకు కీలక ఆధారాలను జేఐటీకి సమర్పించినట్లు పేర్కొన్నారు. -
ఐఎస్ఐఎస్ కుట్ర భగ్నం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఐఎస్ఐఎస్ తీవ్రవాద ముఠాతో సంబంధాలున్న 13 మందిని బెంగళూరు పోలీసులు గత నెల అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు తమిళనాడుకు చెందిన వారు కావడం కలకలం రేపింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు ఈ విషయాన్ని బైటపెట్టారు. రిపబ్లిక్ డే ఉత్సవాల నేపథ్యంలో తీవ్రవాదుల ఉనికి కారణంగా ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిఘా పెట్టారు. దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో ఐఎస్ఐఎస్కు చెందిన 13 మంది తీవ్రవాదులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో ఇద్దరు చెన్నై సమీపం గుమ్మిండిపూండి, కోయంబత్తూరుకు చెందిన వారుగా అధికారుల విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరు ఆసిఫ్ ఆలీ అలియాస్ అర్మాన్ సానిన (21). ఇతను కోయంబత్తూరులో ప్లస్‌టూ వరకు కోయంబత్తూరులో చదివి ఆ తరువాత కుటుంబంతో సహా బెంగళూరుకు వెళ్లాడు. అక్కడ ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే గుమ్మిడిపూండికి చెందిన మహ్మద్ అబ్దుల్ అకద్ అలియాస్ సల్మాన్ (46) చెన్నైలో డిగ్రీ పూర్తిచేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని కుటుంబికులు గుమ్మిడిపూండిలోనే నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ గత నెల 22వ తేదీన బెంగళూరులో అరెస్టయ్యారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తమ విధ్వంసాలను అమలు చేసేందుకు యువతకు గాలం వేస్తున్నారు. యువతను ముగ్గులోకి దించేందుకు ఐఎస్ఐఎస్ భారత విభాగం అనే పేరుతో ముంబై, ఢిల్లీ, లక్నో, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రత్యేక బృందాలు సంచరిస్తున్నాయి. పట్టుబడిన యువకులు ఐఎస్ఐఎస్లోకి మరింత మంది యువకులను ఎంపికచేయడం, డబ్బు వసూలు చేయడం వంటి బాధ్యతలను అప్పగించింది. ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకు కేంద్రస్థానమైన సిరియా నుంచి భారత్‌లోని యువకులను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సంప్రదిస్తుంటారు. అలాగే ఏకే 47, బాంబుల తయారీ ప్రయోగం తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్స్ ద్వారానే శిక్షణనిస్తున్నారు. ఇందుకోసం సాంకేతిక డిప్లొమో హోల్డర్లు, డిగ్రీలను పొందిన యువకుల పైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుని ఉన్న ఈ 13 మంది కొన్ని నెలల క్రితం లక్నోలో సమావేశమై విధ్వంస రచన చేశారు. పట్టుబడిన ఇద్దరు తమిళనాడు యువకులు తమ తోటివారితో కలిసి చెన్నైలో రహస్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని విధ్వంసాలకు కుట్రపన్నేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే తీవ్రవాదుల కదలికలపై తీవ్రస్థాయిలో నిఘాపెట్టిన ఎన్ఐఏ కళ్లలో పడి కటకటాల పాలయ్యారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న చెన్నై యువకుడు సూడాన్‌కు వెళ్లి తీవ్రవాదులతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నట్లు కనుగొన్నారు. ఈ యువకుడిని సైతం గత ఏడాది డిసెంబరులో అరెస్ట్ చేయగా, రెండు నెలల్లోపే మరో ఇద్దరు తమిళనాడు యువకులు పట్టుబటడం ఆందోళనకరంగా పరిగణిస్తున్నారు. కోవైలో మావోల కదలికలు: ఇదిలా ఉండగా కోయంబత్తూరులో 15 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం నుంచి వాహనాల తనిఖీ తీవ్రతరం చేశారు. కోవై తొండాముత్తూరు సమీపం అట్టుకల్ కొండప్రాంత గ్రామాల్లో మావోయిస్టుల కదలికలున్నట్లు పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నక్సలైట్ల నిరోధక విభాగ పోలీసులు, ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్, జిల్లా పోలీసులు, క్యూబ్రాంచ్ పోలీసులు, అటవీ అధికారులు సంయుక్తంగా గ్రామాల్లో కూంబింగ్ ప్రారంభించారు. రెండు రోజుల క్రితం సుమారు 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులు చేతపట్టి కొండల్లోకి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాహనాల తనిఖీని కట్టుదిట్టం చేశారు. కోవై మీదుగా కేరళ రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించే మార్గాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఐసిస్‌లో మరో నలుగురు రాష్ట్రవాసులు!
సాక్షి, హైదరాబాద్: ఐసిస్ అనుబంధ సంస్థ జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ సభ్యులనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసిన నలుగురు నగరవాసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో పట్టుబడిన నఫీజ్ ఖాన్, ఒబేదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు అన్స్‌లను ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు కోర్టు అనుమతితో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురితో సన్నిహిత సంబంధాలు కలిగి నట్లు అనుమానిస్తున్న మరో ఇద్దరు హైదరాబాదీలు ఫయాజ్, అర్ఫాన్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరూ జపాన్ మీదుగా సిరియా వెళ్లేందుకు వీసాలు సైతం తీసుకున్నారని అధికారులు అంటున్నారు. ఆ దేశ కాన్సులేట్‌తో పాటు పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు వీరి కోసం వేట ముమ్మరం చేశారు. మరోపక్క తెలంగాణకు చెందిన నలుగురు ఇప్పటికే సిరియా చేరుకున్నట్లు ‘ఆ నలుగురూ’ వెల్లడించారు. అర్షద్ అలీ అనే యువకుడు 4 నెలల క్రితం సింగపూర్‌కు వెళ్లాడని, అక్కడ నుంచి అక్రమంగా సిరియా చేరుకున్నట్లు స్పష్టం చేశారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న ఖాదిర్ అనే యువకుడూ రెండు నెలల క్రితం సిరియాకు వెళ్లిపోయినట్లు బయటపెట్టారు. ఆన్లైన్, సోషల్‌మీడియా ద్వారా వీరు తమతో సంప్రదింపులు జరిపేవారని నఫీజ్ అంగీకరించినట్లు తెలిసింది. మరో ఇద్దరు నగరవాసులు కూడా సిరియాకు చేరుకున్నట్లు తమకు తెలుసని ‘ఆ నలుగురు’ నిందితులు వెల్లడించడంతో వారి వివరాలు ఆరా తీయడంపై నిఘా, పోలీసు వర్గాలు దృష్టి పెట్టాయి. -
'మా ఆయనకు ఐఎస్ఐఎస్ తో లింక్స్ ఉన్నాయి'
ముంబై: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద గ్రూపుతో ముద్దబిర్ ముష్తాక్ షైక్ కు సంబంధాలు ఉన్న విషయం ఆయన కుటుంబానికి కూడా తెలిసినట్టు కనిపిస్తోంది. మహారాష్ట్రలోని ముంబ్రా పట్టణానికి చెందిన షైక్ (34)ను అతని ఇంటి నుంచి శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఏటీఎస్, ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. షైక్ ఎప్పుడూ సిరియాకు వెళ్తున్నానని చెప్పేవాడని ఆయన కుటుంబం చెప్తోంది. షేక్ భార్య ఉజ్మా (30) బీకాం డిగ్రీ చదివింది. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ ఎజెంట్. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద భావజాలాన్ని అనుసరించవద్దని వారు ఎప్పుడూ షైక్ కు కౌన్సెలింగ్ చేస్తూ వచ్చారు. 'మనకు ఓ కుటుంబం ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారని నేను ఎప్పుడూ ఆయనకు చెప్పేదాన్ని. కానీ ఆయన మాత్రం నన్ను పట్టించుకునేవారు కాదు. ఇస్లామిక్ గ్రూపులో తానొక భాగమని, అది మంచి కోసం పనిచేస్తుందని చెప్పేవారు' అని ఉజ్మా తెలిపింది. ఈ క్రమంలో అమృతనగర్‌లోని రెష్మా అపార్ట్మెంట్లోని తమ నివాసంలో షైక్‌తో కలిసి ఉండలేక ఆమె బంధువుల వద్దకు వచ్చేసింది. భారత్‌లో ఐఎస్ఐఎస్కు నియామకాలు చేపడుతున్న వారిలో షేక్ ప్రధాన నిందితుడు అని పోలీసులు భావిస్తున్నారు. ఐటీ వృత్తినిపుణుడు అయిన అతన్ని శుక్రవారం ముంబైలోని ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టి.. ట్రాన్సిట్ రిమాండ్ పొందారు. అతన్ని సోమవారం ఢిల్లీలోని పాటియాల కోర్టు ఎదుట హాజరపరిచారు. ఐఎస్ఐఎస్ వ్యవహారంలో అరెస్టైన మొత్తం 12 మందికి పాటియాల కోర్టు సోమవారం రిమాండ్ విధించింది. గత కొన్ని నెలల నుంచి ఐఎస్ఐఎస్తో తన భర్త క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాడని, అయితే గత నెలరోజులుగా అతను అంత చురుగ్గా ఈ ఇందులో పాలుపంచుకోలేదని ఉజ్మా తెలిపింది. ఈ విషయాన్ని తాను పోలీసులకు తెలిపానని, కేవలం విచారణ కోసమే తన భర్తను అరెస్టు చేసినట్టు వారు తెలిపారని ఆమె వివరించింది. -
‘సిమి’ ఉగ్రవాదులపై రివార్డు
సాక్షి, హైదరాబాద్: స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రివార్డు ప్రకటించింది. గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్లో జరిగిన పేలుడుకు సంబంధించి మొత్తం నలుగురు సిమి ఉగ్రవాదులపై శుక్రవారం రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. వీరి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరింది. రాష్ట్రంలోని చొప్పదండిలోని బ్యాంకు దోపిడీ, చెన్నై రైల్వేస్టేషన్, బెంగళూరు చర్చి స్ట్రీట్ బ్లాస్ట్‌లతో వీరు నిందితులు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి అబు ఫైజల్, ఎజాజుద్దీన్ మహ్మద్, జాకీర్ హుస్సేన్, మహబూబ్, అస్లం అయూబ్ ఖాన్, అంజద్ రంజాన్ ఖాన్, అబిద్‌లు 2013 అక్టోబర్‌లో పారిపోయారు. అబు ఫైజల్, అబిద్‌లు పోలీసులకు చిక్కారు. మిగిలిన వారు సూర్యాపేటలో పోలీసులపై కాల్పులకు తెగబడి అందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో పోలీసుల ఎదురు కాల్పుల్లో అర్వపల్లిలో ఎజాజ్, అస్లం మరణించగా మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు వెదుకుతున్నారు. మహ్మద్ సాలఖ్, మహబూబ్ తల్లి నజ్మాజీకి వీరితో సంబంధాలున్నాయని అధికారులు గుర్తించారు. కాగా, మహారాష్ట్రలోని పుణేలో జరిగిన బాంబు పేలుడుతో పాటు మరికొన్ని కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మహబూబ్, అంజాద్, జాకీర్‌పై యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు గత నెలలో రూ.10 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు. తాజాగా ఎన్ఐఏ ప్రకటించిన మొత్తంతో కలిపి వీరిపై ఉన్న రివార్డు మొత్తం రూ.70 లక్షలకు చేరింది. దేశ వ్యాప్తంగా ఉగ్ర పంజా విసురుతున్న వీరు ఏపీ, తెలంగాణలో ఆశ్రయం పొందే వీలు లేకపోలేదని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. పాత వస్త్రాలు అమ్మే వారిగా వీరు చెలామణీ అవుతారని పేర్కొన్నాయి. -
ఇంతకీ వారెవరు ?
బెజవాడలో నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ? విజయవాడ: విజయవాడలోని పాతబస్తీ, భవానీపురం ప్రాంతాలకు చెందిన నలుగురు యువకుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే వీరెరవనే విషయమై స్థానిక పోలీసులు నోరు మెదపడం లేదు. ప్రస్తుతం ఈ నలుగురినీ అధికారులు ఓ రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారని తెలిసింది. నల్లగొండ జిల్లా అర్వపల్లి ‘సిమి’ ఉదంతం నేపథ్యంలో ఉగ్రవాదుల కన్ను విజయవాడపై ఉన్నట్లు వెలుగులోకొచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ, నిఘా వర్గాలు నగరంపై డేగకన్ను వేశాయి. ఎన్ఐఏ, నిఘా విభాగాలతో కూడిన ప్రత్యేక సంయుక్త బృందం దాదాపు వారం క్రితం ఇక్కడికి వచ్చింది. నగరంలోని పాతబస్తీతోపాటు భవానీపురం ప్రాంతానికి చెందిన 22 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంది. వీరిని పలు కోణాల్లో విచారించిన తరువాత 18 మందిని విడిచిపెట్టింది. మిగిలిన నలుగురినీ మాత్రం రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. వీరంతా సిమి లేదా ఐఎస్ఐఎస్కి చెందినవారనే కోణాల్లోనే విచారణ సాగుతున్నట్లు సమాచారం. -
ఎల్బీనగర్లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు విచారణకు ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు భవనంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేకకోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలోని ఎన్ఐఏ కోర్టులో సాగుతోంది. ఇక్కడికి నిందితులను తరలించడం, తిరిగి జైలుకు తీసుకెళ్లడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. భద్రతాకారణాల దృష్ట్యా రంగారెడ్డి కోర్టు భవనంలోకి ఎన్ఐఏ కోర్టును మార్చాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో తదుపరి ఈ కేసు విచారణ ఎల్బీనగర్లో జరుగనుంది. ఈ కేసులో అరెస్టు అయిన ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, తెహసీన్, హడ్డీ, వఖాస్‌లు చర్లపల్లి జైల్లో.. ఎజాజ్ షేక్ ఢిల్లీ, అఫాఖీ, సద్దాం బెంగుళూరు జైలులో ఉన్నారు. వహీద్ అనే మరో అనుమానితుడు దుబాయ్‌లో ఉగ్ర కేసులో పట్టుబడి అక్కడి జైలులో ఉంటున్నాడు. ఈ కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఎన్ ఐఏ అధికారులు ఇతర రాష్ట్రాల జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను ఇక్కడికి తరలించేందుకు సిద్ధమవుతున్నారు. -
నకిలీ కరెన్సీ కేసులో 15 మందికి ఐదేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2012లో గుట్టురట్టు చేసిన నకిలీ కరెన్సీ రాకెట్ కేసులో 15 మందిని దోషులుగా నిర్ధారిస్తూ నాంపల్లి కోర్టు గురువారం తీర్పు చెప్పింది. వారికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. ఈ రాకెట్‌కు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు చెందిన మోర్జాన్ హోసేన్ కీలక సూత్రధారి. నకిలీ నోట్లను పాక్‌లో ముద్రించి బంగ్లాదేశ్ మీదుగా దేశంలోని పలు ప్రాంతాలకు ఏజెంట్ల ద్వారా హోసేన్ చెలామణిలోకి తెచ్చాడు. దీన్ని గుర్తించిన ఎన్ఐఏ 2012లో పశ్చిమ బెంగాల్లో హోసేన్‌ను అరెస్టు చేసింది. అతడిచ్చిన సమాచారంతో 30 మందిని పట్టుకుంది. -
దిల్సుఖ్నగర్ పేలుళ్లలో ఎజాజ్
- నగదు సరఫరాలో సూత్రధారి - నిర్ధారించిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల కేసులో నిందితుల సంఖ్య ఆరుకు చేరింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాది ఎజాజ్ షేక్ పాత్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారించింది. పేలుళ్లకు అవసరమైన ఆర్థిక సాయం ఇతడే చేశాడనే ఆరోపణలపై హైదరాబాద్ తరలించేందుకు నాంపల్లి కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎజాజ్‌ను ఆదివారం లోపు నగరానికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. పుణేకు చెందిన ఎజాజ్ షేక్ ఐఎంలో కీలక వ్యక్తి. సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు ఎజాజ్ పాత్రను గుర్తించాయి. గత ఏడాది సెప్టెంబర్ 6న ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతమైన సహరంగ్‌పూర్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. హైదరాబాద్‌ను 2007లో మాదిరిగానే మరోసారి టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్న రియాజ్ భత్కల్ 2012 సెప్టెంబర్‌లో అసదుల్లా అక్తర్ (ఆజామ్ఘడ్), వఖాస్ (పాకిస్థాన్)లను మంగుళూరుకు పంపాడు. వీరికి అవసరమైన నిధుల్ని పంపే బాధ్యతలు పుణేలో ఉంటున్న ఎజాజ్‌కు అప్పగించాడు. దీంతో ఎజాజ్ మంగుళూరులోని హంపన్‌కట్టలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ఔట్లెట్ సుపమ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం చేసే డింగ్ డాంగ్ దుకాణం యజమాని ద్వారా 2013 ఫిబ్రవరిలో రూ.6.8 లక్షలు పంపాడు. ఉగ్రవాదులు ఆ నగదును వినియోగించే దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ-1 మిర్చ్ సెంటర్స్‌లో పేలుళ్లకు పాల్పడి 18 మందిని పొట్టన పెట్టుకున్నారు. -
హైదరాబాద్‌లో ఉగ్రవాది ఖలీద్ అరెస్ట్
హైదరాబాద్ : బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో ఉగ్రవాది ఖలీద్‌ను ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) మంగళవారం అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ అధికారులు ఖలీద్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి పేలుడు పదార్ధాలతో పాటు బాంబు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2న జరిగిన పేలుళ్లలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మయన్మార్ కు చెందిన ఖలీద్ హైదరాబాద్ లో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు సాజిద్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎంబి) ఉగ్రవాద సంస్థ చీఫ్ కమాండర్ అయిన సాజిద్‌పై నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రూ. పది లక్షల రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పట్టణంలోని ఖాగ్రాగఢ్‌లోని ఓ ఇంటిలో.. అక్టోబర్ రెండో తేదీన పేలుడు సంభవించి షకీల్ అహ్మద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మరో వ్యక్తి సోవన్ మండల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిద్దరికీ జెఎంబి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ముష్కరులపై మూడో చార్జ్‌షీట్
మానవ బాంబులతో దాడి కేసులో ఎన్ఐఏ అభియోగపత్రం దాఖలు కీలక నిందితులుగా రియాజ్, తెహసీన్ పేర్లు కేసులో ఇద్దరు హైదరాబాదీలు కూడా.. హైదరాబాద్: మానవబాంబులతో హైదరాబాద్ నగరంలోని మూడు ప్రాంతాలతో సహా దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం మూడో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్‌లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించిన అభియోగపత్రాల్లో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్, ఉగ్రవాదులు తెహసీన్ అక్తర్, జకీ ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్ (ఈ ముగ్గురూ దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులు)లతో సహా మొత్తం ఇరవై మందిపై మోపింది. ప్రభుత్వంపై యుద్ధానికి తెగబడటం, ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నడం, నిషిద్ధ ఉగ్రవాద సంస్థల్లో సభ్యత్వం కలిగి ఉండటం, యువతను ఆకర్షించి ఉగ్రవాదబాట పట్టించడం వంటి నేరాల కింద నిందితులు శిక్షార్హులని స్పష్టం చేసింది. ఇదే కేసుకు (ఆర్సీ నం-06/2012/ఎన్ఐఏ/డీఎల్ఐ) సంబంధించి గతేడాది జూలై 17న ఎన్ఐఏ దాఖలు చేసిన మొదటి చార్జ్‌షీట్‌లో హైదరాబాద్‌లోని పాతబస్తీ గుల్షన్ ఇక్బాల్కాలనీకి చెందిన ఒబేద్-ఉర్-రెహ్మాన్, షాహిన్నగర్కు చెందిన సయ్యద్ మగ్బూల్ అలియాస్ జుబేర్‌లతో పాటు బీహార్ వాసులు డానిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, ఇమ్రాన్ ఖాన్లు నిందితులుగా ఉన్నారు. వీరి వాంగ్మూలాల మేరకు అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు పేలుడు పదార్థాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ హైదరాబాద్ విభాగం మగ్బూల్, ఇమ్రాన్‌లను పీటీ వారంట్‌పై తీసుకువచ్చి విచారించింది. ఆర్సీ నెం-06/2012 కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన ఐఎం ఫౌండర్ రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.ఢిల్లీ పోలీసులు 2012 అక్టోబర్‌లో ఈ కుట్రను ఛేదించి నలుగురు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. ఆ తరువాత కేసు దర్యాప్తు బాధ్యతల్ని జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది. మూడో చార్జ్‌షీట్‌తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 29 మంది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులపై ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. వీరిలో ఐఎం వ్యవస్థాపకుడు, 2007లో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లలో నిందితుడిగా ఉన్న అమీర్ రజా ఖాన్ కూడా ఉన్నాడు. ఇదీ ఉగ్రవాదుల కుట్ర... రియాజ్ భత్కల్ దేశ వ్యాప్తంగా మరోసారి మారణహోమం సృష్టించడానికి కుట్రపన్నాడు. మానవబాంబులతో వివిధ నగరాల్లో ఉన్న జనసమ్మర్ధ ప్రాంతాల్లో విరుచుకుపడాలని పథకం వేశాడు. వీరి టార్గెట్‌లో హైదరాబాద్‌తో పాటు బీహార్‌లోని బుద్ధగయ ప్రాంతం కూడా ఉంది. గతానికి భిన్నంగా మానవబాంబుల్ని తయారు చేసి దాడులు చేయాలని నిర్ణయించిన రియాజ్ దీపావళి టపాసుల్లో వాడే మందు, వ్యవసాయానికి వినియోగించే యూరియా, డీజిల్‌లతో అత్యాధునికమైనవి తయారు చేయించాలని నిర్ణయించాడు. బాంబుల తయారీలో ప్రమేయం ఉన్న మగ్బూల్కు వీటి తయారీ బాధ్యతలు అప్పగించాడు. ఔరంగాబాద్ శివార్లలో అసద్ ఖాన్‌కు ఉన్న ఫామ్‌హౌస్‌లో మగ్బూల్ కొన్ని ట్రయల్స్ కూడా పూర్తి చేశాడు. ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి 2011లో హైదరాబాద్ వచ్చి దిల్సుఖ్నగర్, బేగంబజార్, అబిడ్స్‌ల్లో రెక్కీలు నిర్వహించాడు. దిల్సుఖ్నగర్ టార్గెట్ అని 2012లో మగ్బూల్, ఇమ్రాన్ తదితరుల అరెస్టు సందర్భంలో బయటపడినా 2013 ఫిబ్రవరి 21 నాటి జంట పేలుళ్లను ఆపలేకపోయారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. -
ఉగ్రవాది అక్తర్ ఆస్తులను స్వాధీనం చేసుకోనున్న ఎన్ఐఏ
పాట్నా: పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది తహసీన్ అక్తర్ అలియాస్ మోను ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగం సిద్ధం చేస్తోంది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా మణియార్‌పూర్ గ్రామానికి చెందిన అక్తర్... ఢిల్లీ, ముంబై, పాట్నా, బుద్ధగయ సహా పలుచోట్ల జరిగిన బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడు. లొంగుబాటుకు ప్రత్యేక కోర్టు విధించిన గడువు ముగిసిపోయినా, అతడు పోలీసుల ముందుకు రాకపోవడంతో ఎన్ఐఏ అతడి ఆస్తులను స్వాధీనం చేసుకోనుందని పోలీసు వర్గాలు తెలిపాయి. అతడి ఆస్తుల స్వాధీనం కోసం ఎన్ఐఏ బృందం అతడి స్వగ్రామానికి చేరుకున్నట్లు చెప్పాయి. -
పాట్నా బాంబు పేలుళ్ల కేసులో ఆరుగురి నిర్బంధం
బీహార్ రాజధాని పాట్నా వరుస బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి వందలాది బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఏటీఎమ్ కార్డులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు శనివారం పోలీసులు వెల్లడించారు. నిఘా విభాగాల సమాచారం మేరకు శుక్రవారం రాత్రి లఖిసరాయ్‌లో రెండు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. 'ఎన్ఐఏ అధికారులు ఆరుగురి అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 300 పాస్‌బుక్‌లు, 30 ఏటీఎమ్ కార్డులు, నగదు లావాదేవీలకు సంబంధించి ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిందితులకు దేశం వెలుపల ఉన్న ఉగ్రవాదులతో సంబంధం ఉండొచ్చని ఎన్ఐఏ భావిస్తున్నట్టు వెల్లడించారు. మరింత సమాచారం కోసం వారిని విచారిస్తున్నట్టు చెప్పారు. గత మూడు రోజులుగా ఎన్ఐఏ బీహార్‌లోని పలు అనుమానిత ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. గత నెలలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొన్న పాట్నా ర్యాలీ సందర్భంగా ఉగ్రవాదులు వరుస బాంబులు పేల్చిన సంగతి తెలిసిందే. -
ఎన్ఐఏ కస్టడీ నుంచి పాట్నా పేలుళ్ల నిందితుడు పరారీ
పాట్నా వరుస పేలుళ్లలో అనుమానితుడు మెహ్రార్ ఆలాం పోలీసుల కస్టడిని నుంచి గురువారం తప్పించుకున్నారు. పాట్నాకు 70 కిలో మీటర్ల దూరంలోని ముజఫర్ పూర్ లో ఆలాంను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ప్రశ్నించారు. ఎన్ఐఏ కస్టడీ నుంచి ఆలాం తప్పించుకోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న తర్వాత ఆలాంపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకున్న ఆలాం పేలుళ్లకు పాల్పడిన ఆరుగురు సభ్యులో ఒకరైన తెహసీన్ అక్తర్ కు అత్యంత సన్నిహితుడు. ఇప్పటి వరకు అక్తర్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తీరుగుతున్నాడు. గత అదివారం పాట్నాలోని గాంధీ మైదానంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పాల్గొన్న హుంకార్ ర్యాలీలో వరుస పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులను ఢిల్లీకి తరలించిన ఎన్ఐఏ
దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను ఎన్ఐఏ అధికారులు ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి తరలించారు. దిల్సుఖ్నగర్ బాంబ్ కేసులో విచారణ నిమిత్తం ఆ ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ తీసుకువచ్చారు. ఇటీవల దేశ సరిహద్దుల వద్ద యూసిన్ భత్కల్‌తోపాటు మరోకరిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని వివిధ బాంబు పేలుళ్లలో భత్కల్ కీలక పాత్ర పోషించాడని నిఘా వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
పాక్ ఐఎస్ఐ నుంచే ఐఎంకు నిధులు: ఎన్ఐఏ
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ నుంచి హవాలా మార్గంలో ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)కు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని, ఆ డబ్బుతోనే వారు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి విధ్వంసాలకు పాల్పడుతున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టుకు స్పష్టం చేసింది. స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్(సిమీ) సంస్థే.. ఐఎంగా మారిందని, దీనికి యాసిన్ భత్కల్ నేతృత్వం వహిస్తున్నాడని వివరించింది. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ పేలుళ్లలో రెండో నిందితుడిగా ఉన్న భత్కల్ను ఢిల్లీ నుంచి నగరానికి తీసుకొచ్చిన ఎన్ఐఏ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు భత్కల్‌కు అక్టోబరు 17 వరకు రిమాండ్ విధించింది. అయితే, ఐఎస్ఐతో ఐఎంకున్న సంబంధాలు, పేలుళ్ల కుట్రలపై వివరాలు రాబట్టేందుకు భత్కల్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. ఐఎస్ఐ నుంచి వచ్చిన నిధులతో దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు పాల్పడ్డారని తెలిపింది. ఈ క్రమంలో భత్కల్ తరఫు న్యాయవాది ముజఫరుల్లా వాదిస్తూ, భత్కల్ను ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు తీసుకెళ్లి విచారించారని, కొత్తగా విచారించాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. వాదనల అనంతరం మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జి.లక్ష్మీపతి, పూర్తిస్థాయి విచారణకు అనుమతిస్తూ, మంగళవారం నుంచి అక్టోబరు 8 వరకు (15 రోజులు) భత్కల్ను ఎన్ఐఏ కస్టడీకి అప్పగించారు. -
భత్కల్ను హైదరాబాద్ తీసుకువచ్చిన ఎన్ఐఏ అధికారులు
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆదివారం హైదరాబాద్ తీసుకువచ్చారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భత్కల్‌తోపాటు ఎన్ఐఏ అధికారులు ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అతడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. కాగా భత్కల్ను రేపు నాంపల్లి కోర్టులో ఎన్ఐఏ అధికారులు హాజరపరచనున్నారు. యాసిన్ భత్కల్ను హైదరాబాద్‌లో విచారించేందుకు న్యూఢిల్లీలోని కోర్టు శనివారం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. యాసిన్ భత్క్లల్తోపాటు మరోకు ఇటీవల భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీహార్ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. గతంలో భారత్‌లో పలు ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లలో భత్కల్ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. -
త్వరలో హైదరాబాద్‌కు తబ్రేజ్
దిల్సుఖ్నగర్ కేసులో తీసుకురానున్న ఎన్ఐఏ సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్‌పై ఉగ్రవాది తబ్రేజ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. పేలుళ్లలో నేరుగా పాల్గొన్న తబ్రేజ్‌ను ఇక్కడకు తీసుకు వచ్చేందుకు ఢిల్లీ కోర్టు నుంచి ఎన్ఐఏ అధికారులు అనుమతి పొందారు. ఈనెల 19 లోపు హైదరాబాద్‌కు తీసుకువచ్చి, స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. కేసులో తబ్రేజ్‌ను ఎన్ఐఏ అధికారులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఎన్ఐఏ ఇప్పటికే తబ్రేజ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించింది. భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో తప్పిన భారీ ముప్పు: మంగళూరులో 90 ఐఈడీలు స్వాధీనం దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలకు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్ర దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో త్రుటిలో తప్పింది. ఈ పేలుళ్లకు ముందు, తర్వాత తబ్రేజ్తోపాటు ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన రహస్య ప్రాంతంలో పెద్దసంఖ్యలో బాంబులను పోలీసులు ఇటీవల కనుగొన్నారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని జఫర్ హైట్స్ భవంతి మూడో అంతస్తులో ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి పేలుళ్ల కోసం సిద్ధం చేసిన 90 అధునాతన పేలుడు పరికరాలను(ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న భారత్-నేపాల్ సరిహద్దులో యాసిన్, తబ్రేజ్‌లను అరెస్టు చేయడం తెలిసిందే. తబ్రేజ్ వెల్లడించిన సమాచారం ఆధారంగా మంగళూరులోని రహస్య డెన్‌ను ఈ నెల 7న గుర్తించారు. తబ్రేజ్‌ను తీసుకెళ్లి డెన్‌లోని ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. -
అనుమానితులకు పరిహారమా? : హైకోర్టు
ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల వ్యవహారంలో అనుమానితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అనుమానితులకు దాదాపు 70 లక్షల రూపాయల మేర పరిహారం చెల్లిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తన పరిధి దాటి పరిహారం చెల్లించిందని, ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. 2007లో మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో పోలీసులు పలువురిని అనుమానితుల కింద అదుపులోకి తీసుకుని విచారించారు. తరువాత ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టడంతో వారిని కేసు నుంచి తప్పించారు. ఈ అనుమానితుల్లో కొందరు జాతీయ మైనారిటీ కమిషన్‌ను ఆశ్రయించి, పోలీసు చర్య వల్ల తాము మానసిక వేదనతో పాటు, సామాజికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తమకు పరిహారం ఇప్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషన్... ఆ మేర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 20 మందికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, ఇంటరాగేషన్ నుంచి బయట పడిన వారికి రూ.20వేల చొప్పున కూడా చెల్లించింది. ఈ చర్యలను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన ఎస్.వెంకటేష్‌గౌడ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పరిహారం చెల్లింపు ఉత్తర్వులను రద్దు చేసింది. -
వారం ముందే హైదరాబాద్‌లో మకాం
ఉగ్రవాది తబ్రేజ్‌ను తీసుకొచ్చి దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ! విద్యార్థుల ముసుగులో బహదూర్‌పురాలో ఉగ్రవాదుల అడ్డా ఆశ్రయం పొందిన ఇంట్లో అధికారుల తనిఖీలు ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్స్, బాంబు తయారీ పదార్థాలు స్వాధీనం సాక్షి, హైదరాబాద్: రాజధానిలో జంట పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు.. ఆ పేలుళ్లకు వారం రోజుల ముందే హైదరాబాద్‌కు వచ్చి మకాం వేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తులో తేలింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్, వకాస్ అలియాస్ అహ్మద్, తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ ఆశ్రయం పొందిన బహదూర్‌పురాలోని ఇంటిని దర్యాప్తు అధికారులు గుర్తించారు. గత నెల 28న భారత్- నేపాల్ సరిహద్దుల్లో యాసిన్ భత్కల్‌తో పాటు అరెస్టైన తబ్రేజ్‌ను ఎన్ఐఏ అధికారులు మూడురోజుల కింద హైదరాబాద్‌కు తీసుకువచ్చి దర్యాప్తు జరిపారు. అయితే, భద్రతా కారణాల రీత్యా తబ్రేజ్‌ను ఇక్కడికి తీసుకువచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. వారం ముందుగా నగరానికి వచ్చామని, వకాస్‌తో కలసి పేలుళ్లు జరిగిన మరుసటి రోజు మంగళూరుకు వెళ్లామని తబ్రేజ్ అధికారులకు వివరించినట్లు సమాచారం. తబ్రేజ్ వెల్లడించిన సమాచారం ప్రకారమే నెహ్రూ జూపార్కుకు సమీపంలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్స్, కొంతపాడై ఉన్న ట్రాలీ బ్యాగ్, బాంబుల తయారీకి ఉపయోగించే కొన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఆ ఇంట్లో చిన్నచిన్న వస్తువులను, వెంట్రుకలను దర్యాప్తు అధికారులు సేకరించారు. అయితే, యాసిన్ భత్కల్, తబ్రేజ్ సహా ఈ ఉగ్రవాదులు తాము విద్యార్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారిగా చెప్పుకొని బహదూర్‌పురాలో ఆశ్రయం పొందినట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. అసలు ఉగ్రవాదులకు ఇంటిని అద్దెకు ఇప్పించింది ఎవరు? బాంబుల తయారీకి అవసరమైన పరికరాలను సమకూర్చుకోవడంలో సహకరించిన స్లీపర్ సెల్స్ ఎవరు? అనేదిశగా ఆరా తీస్తున్నారు. అయితే, ఎన్ఐఏ అధికారులు మూడు రోజుల విచారణ అనంతరం తబ్రేజ్‌ను శనివారం ఉదయమే ఢిల్లీకి తరలించినట్లు తెలుస్తోంది. కాగా.. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లు, లుంబినీపార్కు, గోకుల్‌ఛాట్ పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ను విచారించేందుకు ఎన్ఐఏతో పాటు రాష్ర్ట కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ అధికారులు పీటీ వారెంట్ పొందేందుకు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. -
'మహాబోధి' పేలుళ్ల కేసును వేగవంతం చేయండి
బుద్ద గయలోని మహాబోధి దేవాలయంలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై చేపట్టిన విచారణ మరింత వేగవంతం చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చీఫ్ శరత్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆ పేలుళ్లపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ, బీహార్ రాష్ట్ర పోలీసులతో ఆయన బీహార్ రాజధాని పాట్నాలో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కేసు పురోగతిపై శరత్‌కుమార్ ఆయా అధికారులతో చర్చించారు. అలాగే ఆ కేసులో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఎన్ఐఏ, బీహార్ పోలీసు ఉన్నతాధికారులు శరత్‌కుమార్‌కు ఈ సందర్బంగా వివరించారు. బీహార్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం బుద్ద గయలోని మహాబోధి దేవాలయం దేవాలయంలో పేలుళ్లు జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. భారత్ - నేపాల్ సరిహద్దుల్లో గురువారం బీహార్ పోలీసులకు చిక్కిన యాసిన్ భత్కల్‌కు ఈ పేలుళ్లతో సంబంధం ఉండవచ్చని శరత్ కుమార్ అనుమానించారు. అలాగే మావోయిస్టులు చర్య కావచ్చని దీన్ని తోసిపుచ్చుడానికి వీలు లేదన్నారు. జులై 7న మహాబోది దేవాలయంలో వరుసగా బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు బౌద్ధ బిక్షువులు గాయపడిన సంగతి తెలిసిందే. -
ఇటలీ నావికుల కేసు ఎన్ఐఏకు
న్యూఢిల్లీ: ఇటలీ నావికుల కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించింది. ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం కేరళ పోలీసులకు లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిన నేపథ్యంలో హోంశాఖ ఆ బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించింది. భారత్ సముద్ర జలాల్లో మత్య వేటకు వెళ్లిన ఇద్దరు కేరళకు చెందిన మత్యకారులను మాసిమిలియానో లాతోర్, సాల్వతోర్ గిరోన్ అనే ఇద్దరు ఇటలీ నావికులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. గతంలోనే ఈ ఉదంతంపై వామపక్షాలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇటలీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అంతకుముందు బీజేపీ నేతలు ఇటలీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. భారత్‌ను ఇటలీ తేలికగా తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.