Abu Bakr al-Baghdadi
-
ఐసిస్ కొత్త లీడరే అమెరికా టార్గెట్: ట్రంప్
వాషింగ్టన్: ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ కొత్త లీడర్‌పైనే అమెరికా దృష్టి సారించిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘అందరికీ తెలుసు అతను ఎక్కడున్నాడో..’అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొత్త టార్గెట్ పేరుని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. ఉగ్రసంస్థ చీఫ్ అబూ బాకర్ అల్ బాగ్దాదీని గత నెలలో అమెరికా కమాండోలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఆత్మాహుతి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతని స్థానంలోకి వచ్చిన అబూ ఇబ్రహీం అల్ హష్మీ అల్ ఖురేషీనే అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘అమెరికా అల్ బాగ్దాదీని అంతం చేసింది. అతని తర్వాతి వ్యక్తి (నంబర్–2)ని కూడా మట్టుబెట్టింది. ఇప్పుడు మిగిలిన నంబర్–3పైనే మా దృష్టంతా.. అతనికి చాలా సమస్యలున్నాయి. ఎందుకంటే అతను ఎక్కడున్నాడో మాకు తెలుసు కాబట్టి..’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
బాగ్దాదీ హతం: ఫొటోలు, వీడియో విడుదల
వాషింగ్టన్ : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని తమ సేనలు మట్టుబెట్టిన తీరు అభినందనీయమని అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ అన్నారు. బాగ్దాదీని హతం చేసే క్రమంలో సాధారణ పౌరులెవరూ గాయపడకుండా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు. సిరియాలో మారణహోమం సృష్టించి.. ప్రపంచ దేశాలకు సవాలు విసిరిన బాగ్దాదీని అగ్రరాజ్య సైన్యం ఆదివారం అంతమొందించిన విషయం తెలిసిందే. సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ తలదాచుకున్న బాగ్దాదీని అమెరికా సేనలు చుట్టుముట్టడంతో.. తనను పేల్చుకుని అతడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తునాతునకలైన శరీర భాగాల నుంచి డీఎన్ఏను ఘటనాస్థలిలోనే సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు అది బాగ్దాదీ మృతదేహమేనని ధ్రువీకరించారు. అనంతరం ఒసామా బిన్‌లాడెన్ తరహాలోనే బాగ్దాదీ శరీర భాగాలను సముద్రంలో కలిపేశారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని పట్టించింది అతడే!) ఇక బాగ్దాదీ చేతుల్లో చిత్రహింసలు అనుభవించి హత్యగావించబడిన అమెరికా మానవహక్కుల కార్యకర్త కైలా ముల్లర్ పేరిట చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పెంటగాన్ గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా జనరల్ ఫ్రాంక్ మెకెంజీ మాట్లాడుతూ... ‘ బాగ్దాదీని అంతమొందించడంలో ఇంటలిజెన్స్ వర్గాలు కీలకంగా వ్యవహరించాయి. అతడు తలదాచుకున్న చోటును కచ్చితంగా కనిపెట్టగలిగాం. పక్కా ప్లాన్ ప్రకారం అతడి ఇంటిని చుట్టుముట్టి ప్రత్యేక బృందాల సహాయంతో అంతమొందించాం. ఇందులో హెలికాప్టర్ దాడులు ప్రముఖమైనవి. అవి సిరియాకు చేరుకున్న అనంతరం ఆపరేషన్ మరింత కఠినతరంగా మారినట్లు అనిపించింది. అయితే లక్ష్యాన్ని పక్కాగా ఛేదించడం(బాంబులు వేయడం)లో ఆ రెండు హెలికాప్లర్టు సఫలీకృతమయ్యాయి. సాధారణ పౌరులెవరూ గాయపడకుండా జాగ్రత్త వహించాయి. ఇంటలెజిన్స్, అమెరికా సైన్యం సహాయంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశాం. ప్రపంచ దేశాలకు సవాలు విసిరిన ఉగ్రవాదిని సమూలంగా నాశనం చేశాం’ అని పేర్కొన్నారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని వేటాడింది ఈ కుక్కే!) -
బాగ్దాదీ జాడ చెప్పినందుకు రూ.177 కోట్లు!
వాషింగ్టన్/బాగ్దాద్: ఇటీవల అమెరికా దాడుల్లో హతమైన ఉగ్రసంస్థ ఐసిస్ అధినేత అల్‌బకర్ బాగ్దాదీ గురించి ఐసిస్‌లోని కీలక సభ్యుడే ఉప్పందించాడు. బాగ్దాదీ తలపై రూ. 177 కోట్ల బహుమతిని అమెరికా గతంలో ప్రకటించింది. బాగ్దాదీ సిరియాకి వచ్చిన విషయాన్ని ఐసిస్ కీలక సభ్యుడే అమెరికాకు తెలిపాడు. ఈ నేపథ్యంలో అమెరికా ఇస్తామన్న రూ. 177 కోట్ల నగదు పూర్తిగాగానీ, ఎక్కువ మొత్తంలోగానీ అతడికే దక్కే అవకాశం ఉంది. ఆ వ్యక్తి జాతీయతనుగానీ మరే వివరాలనుగానీ అతడి భద్రత రీత్యా వెల్లడించలేదు. గతంలో ఇతడే బాగ్దాదీ లోదుస్తులను, రక్తపు శాంపిల్‌ను అమెరికాకు అందించాడు. వీటి ఆధారంగానే మరణించింది బాగ్దాదీదేనని డీఎన్ఏ పరీక్షలో నిర్ధారించుకున్నారు. -
బాగ్దాదీని ఎలా గుర్తించారంటే..?
బీరట్: ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) చీఫ్ అబు బాకర్-అల్- బాగ్దాదీని హతమార్చేందుకు అమెరికా పక్కా వ్యూహంతో పనిచేసింది. అబు బాకర్‌ను మట్టుబెట్టడానికి ముందు కుర్దీష్ నేతృత్వంలోని సిరియా డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్) సహాయంతో డీఎన్ఏ పరీక్ష ద్వారా అతడే అని నిర్ధారించుకుంది. రహస్య వర్గాల ద్వారా అబు బాకర్ లోదుస్తులను సేకరించి డీఎన్ఏ పరీక్ష చేయించినట్టు ఎస్డీఎఫ్ సీనియర్ సలహాదారు పొలట్ కాన్ ట్విటర్లో వెల్లడించారు. అబు బాకర్ ఆచూకీ తెలపడంతో ఎస్డీఎఫ్ ఏవిధంగా సహాయపడిందో ఆయన వివరించారు. ‘ఎస్డీఎఫ్ రహస్య బృందాలు అబు బాకర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్లాయి. అతడి లోదుస్తులను తీసుకొచ్చి డీఎన్ఏ పరీక్ష చేయించాం. వంద శాతం అతడే అని ధ్రువీకరించుకున్నాకే ఆ సమాచారాన్ని అమెరికా దళాలకు చేరవేశాం. చివరివరకు సమర్థవంతంగా పనిచేసి ఆపరేషన్ విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించామ’ని పొలట్ కాన్ వెల్లడించారు. ఎస్డీఎఫ్ ఇచ్చిన సమాచారం ‘ఆపరేషన్ కైలా ముల్లర్’లో ఎంతో ఉపయోగపడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అబు బాకర్‌ను పట్టుకునేందుకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏతో మే నెల 15 నుంచి పనిచేస్తున్నట్టు చెప్పారు. (చదవండి: ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం) -
ఎవరిపై.. ఎప్పుడు దాడిచేస్తామో తెలీదు: అమెరికా
వాషింగ్టన్ : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని హతమార్చి ఐసిస్ ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీచేశామని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ అన్నారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పక్కా పథకం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాయువ్య సిరియాలో అమెరికా సైన్యం బాగ్దాదీని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. అమెరికా మానవ హక్కుల కార్యకర్త కైలా ముల్లర్ పేరిట చేపట్టిన రహస్య ఆపరేషన్‌లో అమెరికా సేనలు బాగ్దాదీని అంతం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మార్క్ మాట్లాడుతూ.. పాశవిక దాడులు, హత్యలకు.. నరమేధానికి కారణమైన బాగ్దాదీని హతం చేసే క్రమంలో ఒక్క అమెరికా సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని తెలిపారు. బాగ్దాదీ అంతం తర్వాత కూడా సిరియాలో ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయని.. కొన్ని బాహ్య శక్తులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘సిరియాలో ఐసిస్‌ను ఓడించేందుకు 2014 నుంచి ప్రయత్నించాం. ఇందులో భాగంగా ఐసిస్ చర్యలకు అడ్డుకట్ట వేయడంతో అధ్యక్షుడు ట్రంప్ సూచనలతో కొన్ని రోజుల క్రితం అమెరికా సేనలు వెనక్కి వచ్చాయి. అయితే ఏరివేయగా అక్కడ మిగిలిపోయిన కొంతమంది ఉగ్రవాదులు మరోసారి విధ్వంసానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సిరియన్ డెమొక్రటిక్ బలగాలు మాకు సహకరించాయి. దీంతో వాయువ్య సిరియాలో మేము పట్టుబిగించాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని వేటాడింది ఈ కుక్కే!) ఇక బాగ్దాదీ హతమైన నేపథ్యంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ అలెగ్జాండర్ మిల్లీ మాట్లాడుతూ... బాగ్దాదీని అంతమొందించడంలో ఇంటలెజిన్స్, రక్షణ శాఖలు సమన్వయంతో పనిచేశాయని పేర్కొన్నారు. టర్కీ బార్డర్లో ఉన్న ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో బాగ్దాదీ జాడను కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ‘ ఈ రహస్య ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు అమెరికా దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు వాటిని విడుదల చేయలేము. డీక్లాసిఫికేషన్(డాక్యుమెంటేషన్ ప్రాసెస్) చేసిన తర్వాత భవిష్యత్తులో అవి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అమెరికా సైన్యం లక్ష్యం ఎక్కడున్నా.. ఎంత దుర్భేద్యమైనది అయినా దానిని ఛేదించడంలో ఏమాత్రం తడబడదు. టార్గెట్‌ను కొట్టి తీరుతుంది. మా దగ్గర ఎంతో గొప్పదైన సైన్యం ఉంది. ఎవరిపైనైనా.. ఎక్కడి నుంచైనా.. ఏ సమయంలోనైనా మేము దాడి చేయగలం. కాబట్టి ఉగ్రవాదులంతా అప్రమత్తంగా ఉండండి’ అని హెచ్చరించారు. అదే విధంగా సిరియాలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు సిరియన్ డెమొక్రటిక్ బలగాలతో తాము కలిసి పనిచేస్తూనే ఉంటామని మిల్లే స్పష్టం చేశారు. -
ఐసిస్ చీఫ్ బాగ్దాదీని వేటాడింది ఈ కుక్కే!
వాషింగ్టన్ : సిరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా నరమేధానికి తెగబడిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని అమెరికా సేనలు మట్టుబెట్టిన విషయం విదితమే. పక్కా పథకం ప్రకారం ఇరాక్, టర్కీ, రష్యాల సహాయంతో బాగ్దాదీ జాడను కనిపెట్టిన అగ్రరాజ్య సైన్యం అతడిని చుట్టుముట్టడంతో ఉగ్రమూక నాయకుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తనతో పాటు తన ముగ్గురు పిల్లలను కూడా బాంబులతో పేల్చివేశాడు. బాగ్దాదీ చేతిలో దారుణ అత్యాచారానికి గురై హత్య చేయబడిన అమెరికా సామాజిక వేత్త కైలా ముల్లర్ పేరిట... అమెరికా చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్‌లో సైన్యంతో పాటు సైనిక జాగిలాలు కూడా కీలక పాత్ర పోషించాయి. సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని పరిష గ్రామంలో తలదాచుకున్న బాగ్దాదీని వెంటాడాయి. అమెరికా ఆర్మీకి చెందిన 75వ రేంజర్ రెజిమెంట్ బలగాలతో పాటు కొన్ని శునకాలు కూడా బాగ్దాదీని వేటాడాయి. దీంతో దిక్కుతోచని బాగ్దాదీ తన ఇంటి లోపల గల రహస్య మార్గం గుండా పరుగులు తీస్తూ, కేకలు వేస్తూ శరీరానికి చుట్టుకున్న సూసైడ్ జాకెట్ పేల్చుకుని తనను తాను అంతం చేసుకున్నాడు.(చదవండి : క్రూరంగా అత్యాచారం చేశాడు.. అందుకే ఆ పేరు..) ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ తమ సైన్యం చేతిలో ఐసిస్ చీఫ్ కుక్కచావు చచ్చాడని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అంతేకాదు అతడిని వెంటాడంలో అమెరికా సైనిక కే9 శునకాలు కీలక పాత్ర పోషించాయని వెల్లడించారు. ఇక బాగ్దాదీని తరిమిన శునకం గాయపడటంతో దాని వివరాలను పెంటగాన్ గోప్యంగా ఉంచింది. కేవలం అది బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందినదని, మెరుపు వేగంతో పరిగెత్తి శత్రువులను వెంటాడగలదని మాత్రమే పేర్కొంది. అయితే ట్రంప్ మాత్రం తమ వీర శునకం గురించి మాట్లాడుతూ... ‘ మా కెనైన్.. కొంతమంది దానిని కుక్క అంటారు.. మరికొంత మంది అందమైన కుక్క అంటారు... ఇంకొంత మంది ప్రతిభావంతమైన కుక్క అంటారు... తను గాయపడింది. ప్రస్తుతం దానిని వెనక్కి తీసుకువచ్చాం’ అని పేర్కొన్నారు. అయితే మంగళవారం మాత్రం దాని పేరు చెప్పకుండా కేవలం ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ‘ ఆ అందమైన శునకం ఫొటో ఇది. ఐసిస్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని పట్టుకోవడంలో, అతడిని హతమార్చడంలో కీలక పాత్ర పోషించింది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రమంలో 2011లో ఒసామా బిన్ లాడెన్‌ను తరిమిన కైరో అడుగుజాడల్లో కెనైన్ నడిచి మరో ఉగ్రవాదిని హతం చేయడంలో కీలకంగా వ్యవహరించిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని పట్టించింది అతడే!) We have declassified a picture of the wonderful dog (name not declassified) that did such a GREAT JOB in capturing and killing the Leader of ISIS, Abu Bakr al-Baghdadi! pic.twitter.com/PDMx9nZWvw — Donald J. Trump (@realDonaldTrump) October 28, 2019 -
ఆపరేషన్ కైలా ముల్లెర్
-
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం
వాషింగ్టన్: ఉగ్రమార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్న ఐసిస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ(48)ను అమెరికా సేనలు సిరియాలో అంతమొందించాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా అమెరికా సైన్యం కన్నుగప్పి దాడులకు పాల్పడుతున్న మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది బాగ్దాదీ.. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని బరీషా గ్రామంలోని అమెరికా సేనలు చేసిన ‘రహస్య దాడి’ సందర్భంగా చనిపోయాడని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. బాగ్దాదీ మరణించాక ఆ దాడి ప్రాంతం నుంచి అత్యంత విలువైన డాక్యుమెంట్లను అమెరికా సేనలు స్వాధీనంచేసుకున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణ, అంతర్జాతీయ సంబంధాల వివరాలు వాటిలో ఉన్నట్లు సమాచారం. ట్రంప్, అమెరికా సైనికాధిపతుల పర్యవేక్షణలో జరిగిన ఘటన క్షణ క్షణం నాటకీయంగా సాగినవైనమిది. బాగ్దాదీ స్థావరం ఇటీవల ఇరాక్ నుంచి వాయవ్య సిరియాకి మారింది. ఒక నెలక్రితం కుర్దుల నుంచి కచ్చితమైన సమాచారమందింది. ఆ గ్రామంలోనే బాగ్దాదీ ఉంటున్నట్లు రెండు వారాల క్రితం అమెరికా సేనలు నిర్ధారించుకున్నాయి. వాయవ్య సిరియాలోని స్థావరంపై దాడికి మూడు రోజుల ముందే ట్రంప్‌కి సమాచారం ఉంది. రష్యా, ఇరాక్, టర్కీ దేశాల అనుమతితో వాయు సేనలు సాగాయి. ఆపరేషన్ కైలా ముల్లర్ బాగ్దాదీని పట్టుకోవడం కోసం బాగ్దాదీ చేతిలో తీవ్ర చిత్రహింసలపాలై, అత్యాచారానికి గురై హతమైన అమెరికా మానవహక్కుల కార్యకర్త 26 ఏళ్ళ కైరా ముల్లర్ పేరుని ఈ ప్లాన్‌కి పెట్టారు. అసలేం జరిగింది? వర్జీనియాలో ఒక రౌండ్ గోల్ఫ్ ఆట ముగించుకొని సరిగ్గా సాయంత్రం 5 గంటలకు వైట్ హౌస్‌లోని ‘సిట్యుయేషన్ రూమ్’కి అధ్యక్షుడు ట్రంప్ చేరుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, అమెరికా భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రీన్లు సిట్యుయేషన్ రూమ్‌కి వచ్చారు. బాగ్దాదీపై సైనిక రహస్యదాడిని వీడియోలో వీక్షించేందుకే సిద్ధమయ్యారు. గంటల్లో అంతా బూడిద గ్రామంపై చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్లను గ్రామస్తులు గమనించారు. అమెరికా హెలికాప్లర్లు, సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే వారందరినీ అమెరికా సైనికులు మట్టుబెట్టారు. ఆ తర్వాత బాగ్దాదీ ఉంటున్న ఇంటి ముఖద్వారాన్ని బాంబులతో పేల్చారు. సైన్యం దాడి విషయం తెల్సి బాగ్దాదీ వెంటనే రహస్య సొరంగ మార్గం ద్వారా భూగృహం(బంకర్)లోకి చొరబడ్డాడు. ఆయనను బంకర్ చివరివరకు అమెరికా సైనిక సేనలు, సైనిక శునకాలు తరిమాయి. బయటపడే మార్గం లేకపోవడంతో తన శరీరానికున్న బాంబుల జాకెట్‌ను పేల్చుకుని బాగ్దాదీ చనిపోయాడు. పిచ్చివాడిలా అరుచుకుంటూ.. అమెరికా సైనికులు చుట్టుముట్టడంతో ప్రాణభయంతో బాగ్దాదీ అరుచుకుంటూ, ఏడ్చుకుంటూ పరిగెత్తాడని ట్రంప్ వెల్లడించారు. అమెరికా సైనిక కే9 శునకాలు తరుముతుండడంతో చివరకు సొరంగంలోని బంకర్ చివరి అంచులకు చేరి తన ముగ్గురు పిల్లలతో సహా బాంబులతో పేల్చుకుని కుక్కచావు చచ్చాడని ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో దాడి వీడియో ప్రత్యక్షప్రసారాన్ని చూస్తున్న అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్, జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ -
అమెరికా అగ్రవాదమే ఈ ఉగ్రవాదం!
‘‘అబద్ధాల మీద ఆధారపడి యుద్ధాల ద్వారా అమెరికా లక్షలాది ప్రజల్ని చంపేసిన మాట నిజమే. ఇందుకు గాను అమెరికా 8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ. 566 లక్షల కోట్లు) ఖర్చు చేయవలసి వచ్చింది.’’ – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోలు : అమెరికా ‘ఇన్ఫర్మేషన్ క్లియరింగ్ హౌస్’’ (ఐసీహెచ్) సమాచారం: బిల్ వాన్ ఆకెన్; 10–10–2019 ‘సిరియాలో తిష్ట వేసిన ఇస్లామిక్ స్టేట్ అగ్రనాయకుడు అబూ బక్రాలా బాగ్దాదీ అమెరికా సైన్యం జరిపిన దాడిలో కుక్కచావు చచ్చాడు, పిరికివాడిలా చచ్చాడు. డీఎన్ఏ పరీక్ష ద్వారా అతడు బాగ్దాదీ అని చెబుతున్నారు’ (అసోసియేటెడ్ ప్రెస్). కానీ హతమైంది బాగ్దాదీ యేనని ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మూవీ చూస్తున్నట్లు ఓ ప్రకటనలో ధృవీకరించాడు. కానీ బాగ్దాదీని వేటాడటానికి సైనికులు సహాయం తీసుకుంది డాగ్ స్క్వాడ్‌కి చెందిన ఒక కుక్కనే అన్న సంగతి ట్రంప్ మరిచిపోయాడు. కారణం.. పాశవిక హింసాప్రియుడు ట్రంప్. ‘‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’’ అన్నట్లు 26వ తేదీన చంపామని ట్రంప్ ఉద హరించిన బాగ్దాదీ ఎవరో కాదు. మీరు పెంచి పోషించిన వ్యక్తే సుమా అని కామన్ డ్రీమ్స్ సంస్థ తరపున సీఎన్‌బీసీ రిపోర్టర్ జాన్ హార్యుడ్ ప్రకటించారు (27–10–2019). ఇరాన్ నాయకులు కూడా అలానే ప్రకటించారు. ఈ గాథలు, ప్రపంచ ఘటనలు, అమెరికా నాయకస్థానంలో ఉన్న వలస సామ్రాజ్య వాద పాలకుల చేష్టలు, ప్రకటనలు గమనిస్తూంటే, ప్రపంచ ఉగ్రవాద ప్రమాదం గురించిన వీరి అంచనాలు ఒకరకంగా ఉంటూ, ఉగ్రవాద నిర్మూలన పేరిట నేడు జరుగుతున్నది అమెరికా అగ్రవాదమే అనిపిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే, కొన్నేళ్ల క్రితం బిన్ లాడెన్ పేరిట ప్రపంచవ్యాప్తంగా అమెరికా–బ్రిటన్లు జరి పిన వేటకు, ఆ ముసుగులో అప్ఘానిస్తాన్, ఇరాక్, ఇరాన్‌ల మీద జరి పిన పాశవిక దాడులకు ఇటీవల సిరియాలో జోక్యం దారీ వేటకు ఎత్తుగడలు, వ్యూహాలన్నీ రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల నాయకుల కనుసన్నలలోనే జరుగుతున్నాయని పైన తెల్పిన ట్రంప్ ప్రకటనే (అబద్ధాలపై ఆధారపడి యుద్ధాలను అమెరికా నిర్వహిస్తోందని) చెప్పక చెబుతోంది! బాగ్దాదీని అంతం చేశామని ప్రకటించిన ట్రంప్ తీరు చూస్తే సామ్రాజ్యవాద పాలకులే కాదు.. కొన్ని దేశాల పాలకులు కూడా ఎన్నికలలో విజయావకాశాలను పెంచుకునేందుకు కూడా ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి ఇరుగు పొరుగు మీదకో లేదా తమకు పడని దేశాల మీదకో యుద్ధకాహళులూది, ఉద్రిక్తతలు పెంచ డానికి వెనుదీయరని గత చరిత్రే కాదు, నడుస్తున్న చరిత్రకూడా దాఖ లాలుగా ఉన్నాయి. ట్రంప్ ఇంత సీరియస్‌గా బాగ్దాదీ చావు గురించి అంత హడా వుడిగా చేసిన ప్రకటన ఆధారాల్ని పాశ్చాత్య పరిశీలకులు, కొన్ని పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. అవి: 1. కొన్ని నెలల్లో రానున్న అధ్యక్ష ఎన్నికల పూర్వ రంగంలో ఇటీవల ట్రంప్ రష్యా, చైనాల పైన పొంతన లేని ఆరోపణలు చేస్తుండటం, తద్వారా అమెరికా ప్రతిష్టను దిగజార్చడానికి నిరసనగా అమెరికా పార్లమెంటులో ట్రంప్‌కు వ్యతి రేకంగా అభిశంసన తీర్మానం రాబోవడం. 2. సిరియాలో అమెరికా, కుర్దిష్ అనుయాయులపై టర్కీ జరిపే దాడులకు దూరంగా ఉండటం కోసం సిరియా నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకోవాలని ట్రంప్ అకస్మాత్తుగా ప్రకటించడాన్ని రిపబ్లికన్, డెమోక్రాటిక్ పక్షాలు రెండూ విమర్శించడం. ఇందుకు అనుగుణంగా టర్కీ, కుర్దూల మధ్య యుద్ధవిరమణను ప్రకటిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించ డమూ! ఇది ఇలా ఉండగా, బాగ్దాదీని ఖతం చేసినట్లు స్వయానా ట్రంప్ అకస్మా త్తుగా చేసిన ప్రకటనను స్వయానా అమెరికన్ సైనిక యుద్ధ తంత్ర కార్యాలయం (పెంటగన్) సైతం ధృవీకరించడానికి నిరాకరించింది. చివరకు ‘ఆసులో గొట్టాం’ మాదిరిగా చీమ చిటుక్కుమంటే చాలు విసుగూ విడుపూ లేకుండా ప్రచారం కోసం ప్రకటనలు విడుదల చేస్తూండే ట్రంప్ అధ్యక్ష ప్రాసాద సాధికార ప్రతినిధి హాగన్ గిడ్లీ సహితం నోరు మెదపకుండా అదంతా ట్రంపే చూసుకుంటాడు లెమ్మని ముక్తసరిగా చెప్పాడు. పైగా బాగ్దాదీని అంతమొందించడా నికి జరిగిన దాడి ప్రయత్నం ‘జయ ప్రదమయిందా’ అన్న ప్రశ్నకు దాడిని నిర్వహించానని చెప్పిన అధికారి కూడా వివరాలు తెల్పడానికి నిరాకరించాడు. ఇక సుప్రసిద్ధ ప్రపంచ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ సంప్రదించిన అమెరికన్ అధికారులు కూడా నిజానిజాల గురించి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఇన్ని వైరుధ్యాల మధ్య బాగ్దాదీ ‘హతం, ఖతం’ వార్తలు విడుదలయ్యాయి. అందుకే, గతంలో ‘9/11’ (2001–2002) నాటి అమెరికా జంట వాణిజ్య కేంద్ర భవన సముదాయంపై జరిగిన ఆకస్మిక దుర్మార్గపు దాడిలో 3,000 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ దాడికి వ్యూహకర్త, ఇస్లామిక్ ఉగ్ర వాద నాయకుడు బిన్‌లాడెన్ స్వయంగా దాడికి కారకుడని ప్రచార ప్రకటన జార్జిబుష్ ప్రెసిడెంట్‌గా ఉన్న కాలంలో జరిగింది. కానీ, ఆ తర్వాత 1,500 మంది అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రసిద్ధ భవన నిర్మాణ ఇంజనీర్లు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, పలువురు శాస్త్రవేత్తలు, భౌగోళికంగా భవన పునాదుల నిర్మాణ సంబంధమైన వాస్తు శిల్పులు, సామాజిక శాస్త్ర వేత్తలతో ఏర్పడిన కమిటీ భేటీ జరిపి సమర్పించిన నివేదికలో న్యూయార్క్, వాషింగ్టన్ వ్యూహ కేంద్రాలపై దాడి చేసిన సివిలియన్ విమానాలు ఎక్కడివో కావు, అమెరికావేననీ, ఫ్లారిడా (అమెరికా)లోని సైనిక కేంద్రం నుంచి బయలు దేరినవేనని ప్రకటించారు.. అంతవరకూ అమెరికా ప్రజలు, ప్రపంచ ప్రజలూ అది ఉగ్రవాద మూకల దాడేనని నమ్మాల్సి వచ్చింది, విశ్వసించాల్సి వచ్చింది. ఆ విశిష్ట నిపుణుల సంఘం ఇప్పటికీ దాడి అనంతర వాస్తవాలను తవ్వి తీయడం మానలేదు సుమా! పైగా, ట్విన్ టవర్లపై దాడి, బిన్ లాడెన్‌పై దాడి, అతగాడి మృతి గురించి కూడా పరస్పర విరుద్ధ కథనాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. 2001 సెప్టెంబర్ 11న జంట వాణిజ్య సముదాయాలపై ఉగ్రవాద దురాగతం జరిగిందనీ, ఈ దాడిని నిర్వహించినవాడు బిన్‌లాడెన్ అనీ మనం నమ్ముతూ వస్తున్నాం. కానీ, ఆ లాడెన్ 2001 అక్టోబర్ 10న రావ ల్పిండి ఆసుపత్రిలో ఉన్నాడని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అమెరికాలోని జంట వాణిజ్య సముదాయ భవనాలు కూలిపోయింది 2001 సెప్టెంబర్ 11న అనీ, 2001 సంవత్సరం మధ్యలో లాడెన్ దుబాయ్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనీ సీబీఎస్ న్యూస్ యాంకర్ డాన్ రాదర్ రాశాడు. ఇక ‘న్యూయార్క్ టైమ్స్’ అయితే, లాడెన్ మృతిని 2001 డిసెంబర్‌గా పేర్కొన్నది. అతణ్ణి ఖననం చేసింది అప్ఘానిస్తాన్ అని చెప్పింది. ఇక అమెరికా అయితే లాడెన్‌ను పట్టుకుని ఖతం చేసింది అబ్బాటోబాద్లో అని రాసింది. ఇన్ని వైరుధ్యాల మధ్య లాడెన్ వాస్తవాలు దోబూచులా డుతూ వచ్చాయి. అసలింతగా లాడెన్ వెనుక దాగివున్న అసలు రహస్యమేమిటి? అది అమెరికాకే తెలుసు. ఎందుకంటే ఆప్ఘనిస్తాన్‌లో ఏలుబడిలో ఉన్న సోషలిస్టు అనుకూల ‘ప్రజాస్వామ్య’ ప్రభుత్వాన్ని ఈ లాడెన్, అతని అనుయాయుల సహకారంతోనే ఆయుధాలిచ్చి అమెరికా కూలదోసింది. ఆ తర్వాత లాడెన్ తనకు ‘ఏకు మేకై’ పోయాడు కాబట్టి, అతణ్ణి హత మార్చాలి. లాడెన్‌ను ఖతం చేసిన అమెరికా అతని అస్థిపంజరం ఆధారంగా వరస వారీగా ఇరాక్, ఇరాన్, సిరియాలపై యథేచ్చగా దాడులు చేసి, ఆ దేశాల వాస్తు శిల్ప సంపదను దోచేసి అమెరికాకు తరలించుకుపోవడం మరపురాని సామ్రాజ్యవాద యుద్ధ సత్యాలు. కనుకనే, సామాజిక చేతనాజీవులైన అసాంజే (వికీలీక్స్), అమె రికా యుద్ధతంత్ర వ్యవస్థలో జాతీయ భద్రతా దళ శాఖలో పనిచేసి కళ్లారా చూసిన ఘోరాలకు చలించిపోయి కాందిశీకుడై ప్రపంచ ప్రజ లకు అమెరికా యుద్ధోన్మాద వ్యవస్థ స్వరూప స్వభావాలను ప్రాణా లకు తెగించి ఈరోజుదాకా ఎండగడుతూ వచ్చిన ఎడ్వర్డ్ స్నోడెన్ మరపురాని త్యాగశీలురుగా సజీవులై బాధలను భరిస్తూ మనకళ్ల ముందే అమెరికాకు చిక్కకుండా నిత్య సింహస్వప్నాలై వెలుగొందు తున్నారని మరవరాదు. 9/11 జంట వాణిజ్య సముదాయాల ఘోర కలికి అమెరికా పాలకులు ఎలా కారకులో నిరూపిస్తూ ప్రపంచ ప్రజలు ఎన్నటికీ మరవకూడని ‘శాశ్వత రికార్డు’ (పర్మనెంట్ రికార్డ్) పేరిట ఇటీవలనే (2019) ఒక ప్రసిద్ధ గ్రంథాన్ని రాశాడు స్నోడెన్. ‘‘9/11 ఘోరకలి ఘటనలు ప్రతిచోట అగాథాలు సృష్టించాయి. కుటుంబాలలో ఛిద్రాలు, వివిధ వర్గాల ప్రజలు, సామాజికుల మధ్య విచ్ఛిన్నాలు, కమ్యూనికేషన్స్ విచ్ఛిత్తీ, ఉపరితలంపైనే కాదు, భూగ ర్భంలోనూ విచ్ఛిన్న శకలాలే’’నని రాశాడు. ఈ స్వవినాశన చర్యకు ఫలితంగా అమెరికా చెప్పిన సమాధానం– పదిలక్షలమంది ప్రజల హత్యాకాండ అని రాశాడు (పేజి 77–78). అలాగే, 9/11 దుర్మార్గ ఘటన గురించి అమెరికా ప్రభుత్వం ‘సాధికారిక నివేదిక’ పేరిట (మిస్టీరియస్ కొలాప్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్–7, ది ఫైనల్ రిపోర్ట్, ఎబౌట్ 9/11) వెలువరించిన కవిలకట్ట కాస్తా ‘శుద్ధ అబద్ధపు అశా స్త్రీయ దస్తరం’ అని డేవిడ్ రే అనే పరిశోధకుడు వెల్లడించారు. ఈ ‘నివేదిక’ మనకాలపు పచ్చి అబద్ధాల పుట్టే కాదు, ప్రపంచంలో ఎవరి మీద కాలు దువ్వని అనేక శాంతి కాముక దేశాలపై ఏదో ఒక మిష పైన అమెరికన్ దురాక్రమణ యుద్ధాలు నిర్వహించడానికి ఈ తప్పుడు నివేదిక ద్వారాలు తెరిచిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
బాగ్దాదీ ‘ఆపరేషన్’!
కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అధినాయకుడు, ఉగ్రవాది అబూ బకర్ అల్ బాగ్దాదీ కోసం అమెరికా అయిదారేళ్లుగా సాగిస్తున్న వేట ముగిసింది. అతగాడిని సిరియాలో తమ దళాలు వెంటాడి ఓ సొరంగంలో చిక్కుకున్నాక మట్టుబెట్టాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. ముందు ట్విటర్ ద్వారా ఏకవాక్య ప్రకటన చేసి, ఆ తర్వాత మీడియా సమావేశం ద్వారా బాగ్దాదీ మృతి వివరాలను ఆయన వెల్లడించారు. వీక్షకుల్లో ఉత్కంఠ రేపేందుకు చానెళ్లు సస్పెన్స్ దట్టించి మధ్యమధ్యలో విడుదల చేసే టీజర్ల మాదిరి ఆ ట్వీట్ ఉంది. తమ బలగాల చర్య పర్యవసానంగా ఐఎస్ నడ్డి విరచగలిగామని ట్రంప్ సంతోషపడుతున్నారు. ఆ మాటెలా ఉన్నా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని మళ్లీ గెలుచుకోవాల్సిన సమయం దగ్గర పడుతున్న వేళ బాగ్దాదీ మరణం ఖచ్చితంగా ఆయనకు కలిసిరావొచ్చు. ఇరాక్ తదితర దేశాల్లో అనేకానేక దురాగతాలకూ, దుర్మార్గాలకూ కారణమైన సంస్థ అధినాయకుడు మరణించాడంటే సహజంగానే ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటుంది. అయితే ఈ సందర్భంగా ఒక జర్మన్ పాత్రికేయుడు యూర్గన్ టోడెన్ హ్యోపర్‌కి అయిదేళ్లక్రితం ఎదురైన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇరాక్‌లోని మోసుల్‌లోఐఎస్ ముఠాలో కొందరిని కలిసి బాగ్దాదీని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరిన ఆయనతో ‘అతను కేవలం వ్యక్తిమాత్రుడు. విద్యావంతులు, నాయకులు సభ్యులుగా ఉండే ఒక మండలి ఆయన్ను నాయకుడిగా ఉంచింది. ఆయన మరణిస్తే ఆ మండలి మరొకరిని ఆ స్థానంలో ప్రతిష్టిస్తుంది. మీరు కలవదల్చుకుంటే మండలి సభ్యుల్ని కలవండి’ అని సలహా ఇచ్చారట! కనుక బాగ్దాదీ మరణంతో ఐఎస్, దాని దుర్మార్గాలు కనుమరుగవుతాయని భావించడం దురాశే. ఒకపక్క దురాగతాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు కొనసాగిస్తూనే.... ఆ సంస్థ పుట్టుకకూ, అది పుంజుకోవడానికి ఏ కారణాలు దోహదపడ్డాయో గుర్తించడం, అందుకు కారకులెవరో తేల్చడం, వారిపట్ల ఎలా వ్యవహరించాలో నిర్ణయించడం ఇప్పుడు ప్రపంచ ప్రజల కర్తవ్యం. లేనట్టయితే బాగ్దాదీలాంటివారు మున్ముందు కూడా పుట్టు కొస్తూనే ఉంటారు. ఊహకందని మారణహోమాలు సృష్టిస్తూనే ఉంటారు. సరిగ్గా ఎనిమిదేళ్లక్రితం అల్ కాయిదా నాయకుడు బిన్ లాడెన్‌ను అమెరికా మెరైన్లు మట్టు బెట్టినప్పుడు కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా మీడియా సమావేశం ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. అయితే అందులో ట్రంప్ ప్రదర్శించినంత నాటకీయత లేదు. ఆయన ఒక ప్రకటన చదవబోతున్నట్టు తెలుసుకున్న వెంటనే అప్పటికప్పుడు చానెళ్లు అన్నిటినీ నిలిపి దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఒబామా ప్రకటనలో అవసరమైన వివరాలేమీ లేవు. కానీ ట్రంప్ తీరు వేరు. ఆపరేషన్ మొత్తం ఎలా జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పారు. ఆయన మాటలు జాగ్రత్తగా విన్న ప్రతి ఒక్కరూ అది కళ్లముందే జరిగిందన్న భ్రాంతికి లోనుకావడం ఖాయం. అమెరికన్ బలగాలు గుర్తించి కాల్పులు మొదలెట్టిన వెంటనే బాగ్దాదీ ముగ్గురు పిల్లల్ని తీసుకుని లబోదిబోమంటూ ఒక సొరంగంలో దూరిన వైనం, ఆ సొరంగానికి బయటకుపోయే మార్గం లేకపోవడం గురించి ట్రంప్ వివరించారు. అనంతరం పాత్రికేయులడిగిన సందేహాలన్నిటికీ జవాబి చ్చారు. మొత్తం నలభై నిమిషాలపాటు ట్రంప్ ప్రసంగించారు. బాగ్దాదీ తొలిసారి ప్రపంచానికి పరిచయమైననాటికీ, ఇప్పుడు మరణించేనాటికీ పరిస్థితుల్లో వచ్చిన వ్యత్యాసాన్ని గమనిస్తే ఐఎస్ ఉత్థానపతనాల గురించి స్థూలంగా అర్ధమవుతుంది. 2010లో ఐఎస్ ఆవిర్భావాన్ని ప్రకటించి నప్పుడు అది ప్రపంచ ముస్లింలందరికీ మార్గదర్శకత్వంవహిస్తుందని బాగ్దాదీ చెప్పుకున్నాడు. కానీ ఇరాక్, ఇరాన్, సిరియా, అఫ్ఘానిస్తాన్ వగైరాల్లో అమెరికా అనుసరిస్తున్న ధోరణుల్ని గట్టిగా వ్యతిరేకించే ప్రపంచ ముస్లిం ప్రజానీకంలో సైతం అతనికి పెద్దగా మద్దతు లభించింది లేదు. సరిగదా కార్యకలాపాలు సాగించిన ప్రాంతాల్లోనే అది క్షీణించింది. తన చుట్టూ ఉండేవారిలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని స్థితికి అతను చేరుకున్నాడు. అల్ కాయిదా, ఐఎస్ మొదట్లో కలిసి పనిచేసినా 2013లో తెగదెంపులు చేసుకున్నాక ఆ రెండు సంస్థలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అమెరికాకు సాగిలబడిన ద్రోహులు మీరంటే మీరని నిందించుకు న్నాయి. పిరికిపందలని తిట్టుకున్నాయి. కానీ అల్ కాయిదా అనుబంధ సంస్థ హయత్ తహ్రిర్ అల్ షామ్(హెచ్‌టీఎస్)కు పలుకుబడి ఉన్న సిరియాలోని అద్లిబ్ ప్రాంతంలో ఇప్పుడు బాగ్దాదీ పట్టు బడటాన్ని గమనిస్తే చిట్టచివరిలో అతని స్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఖలీఫాగా తనను తాను ప్రకటించుకున్నాక అతను నేరుగా దానికి నాయకత్వంవహించింది తక్కువ. పైగా దాని కంటూ ప్రత్యేకించి ఒక స్థావరం లేదు. 2003లో అమెరికా దురాక్రమించే సమయానికి ఇరాక్ ఎంతో ప్రశాంతంగా ఉండే సోషలిస్టు, సెక్యులర్ రాజ్యం. రాజ్యాంగంలో ఇస్లామ్‌ను అధికార మతంగా ప్రకటించడానికి ఆ దేశాధ్యక్షుడు సద్దాంహుస్సేన్ నిరాకరించారు. అలాంటి దేశాన్ని వల్లకాడుగా మార్చి అప్పటికి పాఠశాల చదువు కూడా పూర్తిచేయని బాగ్దాదీ లాంటివారిని ఉగ్రవాదులుగా రూపాంతరం చెందే స్థితికి చేర్చింది అమెరికాయే. ఐఎస్ బాధితుల్లో అత్యధికులు ముస్లింలే. ఈ వాస్తవాన్ని దాచి అది మత సంస్థగా చిత్రించడం పాశ్చాత్య మీడియా అవగాహన లేమి పర్యవసానం. సిరియా అధ్యక్షుడు అసద్‌ను పదవీచ్యుతుణ్ణి చేయడం కోసం య«థేచ్ఛగా డాలర్లు, ఆయుధాలు కుమ్మరించి, ఎందరు మొత్తుకుం టున్నా వినక ఐఎస్‌ను పెంచి పోషించిన అమెరికాయే ఇప్పుడు బాగ్దాదీ మరణంలో తన విజ యాన్ని వెదుక్కుంటున్న తీరు విడ్డూరం. కనీసం ఇప్పటికైనా తన చేష్టలు ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తున్నాయో గ్రహించి తీరు మార్చుకోవడం అమెరికా బాధ్యత. ఆ బాధ్యతను అది గుర్తించేలా చేయడం ప్రపంచ ప్రజానీకం కర్తవ్యం. -
క్రూరంగా అత్యాచారం చేశాడు.. అందుకే ఆ పేరు..
వాషింగ్టన్ : ‘అతడు హీరోలా కాదు. ఓ పిరికిపందలా ఏడుస్తూ.. భయంతో కేకలు వేస్తూ చచ్చాడు’ . సిరియాలో నరమేధానికి కారణమైన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్- బాగ్దాదీని అగ్రరాజ్య సైన్యాలు మట్టుబెట్టిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్య ఇది. తమ సైన్యానికి చెందిన కుక్కలు వెంబడించడంతో ఓ టన్నెల్లోకి పరిగెత్తిన బాగ్దాదీ తనను తాను పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. బాగ్దాదీపై దాడి చేసి రాత్రి వేళలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య తమ సైన్యం అతడిని హతం చేసిందని పేర్కొన్నారు. కాగా సిరియాతో పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన ఐఎస్ ఉగ్రమూక చీఫ్ బాగ్దాదీని అంతమొందించడానికి అమెరికా ఐదేళ్లుగా వేచిచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పక్కా ప్లాన్‌తో బాగ్దాదీని హతమార్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇక బాగ్దాదీపై తమ సైనికులు విరుచుకుపడిన తీరును ట్రంప్ సహా అమెరికా భద్రతా సంస్థ సీనియర్ అధికారులు సిట్యూవేషన్ రూంలో నుంచి ప్రత్యక్షంగా వీక్షించినట్లు సమాచారం. రెండు రోజుల ముందే స్కెచ్ వేసి... పిల్లలు, మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన బాగ్దాదీని చంపే ఆపరేషన్‌కు అమెరికా అధికారులు కైలా ముల్లర్ అని నామకరణం చేశారు. సిరియాలో పనిచేస్తున్న సమయంలో అమెరికా సామాజిక కార్యకర్త కైలాను బాగ్దాదీ కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెపై అత్యంత క్రూరంగా అనేకమార్లు అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌కు కైలా మ్యూలర్ అని పేరుపెట్టిన అధికారులు గురువారం నుంచే బాగ్దాదీని హతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాదు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడంలోనూ సఫలీకృతమయ్యారు. శుక్రవారం తన కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్ వివాహ వార్షికోత్సవాన్ని జరపడం కోసం ట్రంప్ క్యాంప్ డేవిడ్‌కు వెళ్లారు. అనంతరం వెంటనే వర్జీనియాకు పయనమై మిలిటరీ ఆపరేషన్స్‌కు సంబంధించిన ఫైళ్లను ఆయన పరిశీలించారు. తర్వాత బేస్‌బాల్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆపరేషన్‌కు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తైంది. సీక్రెట్ ఆపరేషన్ సాగిందిలా.. ఆదివారం వేకువ జామున అమెరికా సైన్యానికి చెందిన ఎనిమిది హెలికాప్టర్లు ఉత్తర ఇరాక్ నుంచి బయల్దేరాయి. సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో బాగ్దాదీ ఉన్నాడన్న సమాచారంతో మిడిల్ ఈస్ట్‌లో ప్రవేశించాయి. ఇరాక్, టర్కీ, రష్యా అధికారులతో సమన్వయమై ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలేవీ చెప్పకుండానే గగనతలాన్ని అదుపులోకి తెచ్చుకోవాలని అమెరికా అధికారులు సూచించారు. బాగ్దాదీ ఉన్న ప్రాంతానికి చేరుకోగానే అమెరికా సైన్యానికి చెందిన రోటార్ సీహెచ్-47 విమానాలు రెండు అల్- అసద్ ఎయిర్‌బేస్ కేంద్రంగా బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో తన చావు ఖాయమని భావించిన బాగ్దాదీ తమ అండర్ గ్రౌండ్ బంకర్లలోకి వెళ్లి తల దాచుకున్నాడు. అంతేకాదు అమెరికా సైనికులు తనను సమీపిస్తున్న క్రమంలో ఆత్మాహుతి దాడి జాకెట్ ధరించి ముగ్గురు అమాయక పిల్లల్ని తన వెంట తీసుకువెళ్లాడు. అయితే అమెరికా సైన్యానికి చెందిన జాగిలాలు బాగ్దాదీని వెంబడించడంతో బంకర్ టన్నెల్ చివరికి చేరగానే తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో బాగ్దాదీతో పాటు ముగ్గురు చిన్నారులు కూడా చనిపోయారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని పట్టించింది అతడే!) చచ్చింది అతడే.. బంకర్ పేలిపోవడంతో బాగ్దాదీ హతమైనట్లు గుర్తించిన అమెరికా సైన్యం.. చనిపోయింది బాగ్దాదీ అన్న విషయాన్ని ధ్రువీకరించేందుకు అతడి ఆనవాళ్లు సేకరించారు. ముక్కలైన మృతదేహం నుంచి ఫోరెన్సిక్ అధికారులు డీఎన్ఏ సేకరించి పరీక్షించగా అది బాగ్దాదేనన్న విషయం స్పష్టమైంది. ఈ విషయం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘ చచ్చింది అతడే. 15 నిమిషాల్లోనే ఫోరెన్సిక్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత బాగ్దాదీని మట్టుబెట్టి మా సైనికులు ఐసిస్‌కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని, ఉగ్రవాదుల తదుపరి ప్రణాళికల గురించి వివరాలు సేకరించారు’ అని పేర్కొన్నారు. కాగా అమెరికా సైన్యం సిరియాలో బాగ్దాదీని అంతం చేసిన వెంటనే అమెరికా ఫైటర్ జెట్లు ఆరు రాకెట్లను ఆకాశంలోకి వదిలి తమ విజయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఈసారి లీక్ అవ్వలేదు.. ఒసామా బిన్‌లాడెన్ తరహాలోనే బాగ్దాదీని కూడా అంతమొందించామన్న ట్రంప్ ఈసారి మాత్రం తమ ప్రణాళికలు ఏమాత్రం బయటకు పొక్కలేదని వ్యాఖ్యానించారు. ‘ వాషింగ్టన్ లీకింగ్ మెషీన్. అయితే ఇప్పుడు లీకులు బయటికి రాలేదు. నేను రచించిన వ్యూహం కొంతమందికి మాత్రమే తెలుసు. ఇది అమెరికా అతిపెద్ద విజయం అని పేర్కొన్నారు. ఇక బాగ్దాదీని హతం చేయడం పట్ల ట్రంప్ మద్దతుదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉగ్రవాదిని అంతమొందించి అమెరికాను సురక్షితంగా ఉంచడంలో సఫలమయ్యారు’ అంటూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా ఐసిస్ వంటి క్రూరమైన ఉగ్రమూకను నడిపిస్తున్న బాగ్దాదీని మట్టుబెట్టి అమెరికా ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక జారీ చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు ట్రంప్ ఎన్నికల వ్యూహంలో ఇదొక ఎత్తుగడ అని.. అందుకే ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఆపరేషన్ నిర్వహించారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. కాగా 2020లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. -
ఐసిస్ చీఫ్ హతం
-
ఐసిస్ చీఫ్ బాగ్దాదీని పట్టించింది అతడే!
బాగ్దాద్ : సిరియాలో మారణహోమం సృష్టించిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్-అల్- బాగ్దాదీని మట్టుబెట్టేందుకు అతడి ప్రధాన అనుచరుడు ఇచ్చిన సమాచారమే తోడ్పడిందని ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు. సిరియాను నరకప్రాయం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వేళ్లూనుకుపోయిన ఉగ్రమూక ఐఎస్ చీఫ్‌ను అమెరికా సేనలు ఆదివారం హతం చేసిన విషయం తెలిసిందే. చిన్నారులు సహా వేలాది మంది సిరియన్లను దారుణంగా హతమార్చిన అబు బాకర్ బాగ్దాదీని తమ సైన్యం చుట్టుముట్టడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ‘ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఐఎస్ ఉగ్రవాద సంస్థ వేలాది మంది ప్రాణాలను తీసింది. కానీ.. దాని స్థాపకుడు బాగ్దాది చివరికి ఒక పిరికివాడిలా తనను తాను అంతం చేసుకున్నాడు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అబు బాకర్‌ను అంతమొందించడంలో తమకు సహకరించిన సిరియా కుర్దిష్ వర్గాలు, రష్యా, టర్కీ తదితర మిత్రదేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఇరాక్ భద్రతా అధికారులు ఈ ఆపరేషన్‌లో అబు బాకర్ ప్రధాన అనుచరుడు ఇస్మాయిల్ అల్-ఇతావీ ఇచ్చిన సమాచారం ఎంతగానో ఉపయోగపడిందంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.(చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదిని మేం చంపలేదు.. కానీ) కూరగాయల బస్సుల్లో వెళ్లేవాడు.. అబు బాకర్ జాడ కోసం అన్వేషిస్తున్న క్రమంలో అతడి ప్రధాన అనుచరుడు ఇతావీ 2018 ఫిబ్రవరిలో టర్కిష్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని ఇరాక్ సేనలకు అప్పగించారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా... ‘ఐదు ఖండాలలో తన ఉన్మాదంతో విధ్వంసం సృష్టించిన అబు బాకర్ ఎల్లప్పుడూ మినీ బస్సుల్లోనే తన సహచరులతో సమావేశమయ్యాడు. కూరగాయలతో నిండిన ఆ బస్సుల్లో వారంతా దొంగచాటుగా గమ్యస్థానాలకు చేరుకునేవారు. ఇస్లామిక్ సైన్సెస్‌లో పీహెచ్డీ చేసిన ఇతావీ అబు బాకర్ ఐదుగురు ముఖ్య అనుచరుల్లో ఒకడు. అతడు 2006లో ఉగ్ర సంస్థ ఆల్ ఖైదాలో చేరాడు. 2008లో అమెరికా సేనలకు పట్టుబడటంతో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో ఇతావీ గురించి తెలుసుకున్న అబు బాకర్ తమతో చేతులు కలపాల్సిందిగా అతడిని కోరాడు. ఈ క్రమంలో మత పరమైన సూచనలు ఇవ్వడంతో పాటు ఇస్లామిక్ స్టేట్ కమాండర్లను ఎంపిక చేయడంలోనూ ఇతావీ కీలక పాత్ర పోషించేవాడు. ఇందులో భాగంగా 2017లో తన సిరియన్ భార్యతో కలిసి పూర్తిగా సిరియాకే మకాం మార్చాడు. అయితే 2018లో టర్కీ అధికారులకు అతడితో పాటు నలుగురు ఇరాకీలు, ఒక సిరియన్ చిక్కాడు. దీంతో వాళ్లను మాకు అప్పగించారు. అప్పుడే ఇతావీ మాకు బాగ్దాదీ గురించిన రహస్యాలన్నీ చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు సిరియాలోని ఇడ్లిబ్ అనే ప్రాంతంలో అబు బాకర్ తల దాచుకున్నాడని మాకు తెలిసింది. అయితే ఇడ్లిబ్‌పై పట్టు కలిగి ఉన్న, ఐఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే మరో ఉగ్రసంస్థ నుస్రా ఫ్రంట్ అబు బాకర్‌ను చంపేందుకు వెంటపడటంతో.. అతడు తరచుగా వివిధ ప్రాంతాలకు పయనమయ్యేవాడు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు, ముగ్గురు అనుచరులను ఎల్లప్పుడూ వెంటబెట్టుకునేవాడని ఇతావీ తెలిపాడు. అదే విధంగా అతడు ఏయే సమయాల్లో ఏ చోట తల దాచుకుంటాడనే విషయాన్ని కూడా మాకు చెప్పాడు. దీంతో మేము అమెరికా భద్రతా సంస్థ సెంట్రల్ ఇంటలెజిన్స్ ఏజెన్సీతో సమన్వయం చేసుకుని... ఇడ్లిబ్ సమీప ప్రాంతాల్లో ఎక్కువ సైన్యాలను మోహరించాలని సూచించాం. ఈ క్రమంలో గత ఐదు నెలలుగా సీఐఏ డ్రోన్స్, సాటిలైట్స్‌తో ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఇప్పుడు అబు బాకర్ హతమయ్యాడు అని ఇరాక్ అధికారులు వెల్లడించారు. -
‘ప్రపంచాన్ని వణికించే ఉగ్రవాది అతడు’
ముంబై : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను పొగుడుతూ బ్రిడ్జ్ పిల్లర్‌పై గుర్తు తెలియని దుండగులు రాతలు రాయడం కలకలం రేపింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ విచారణ చేపట్టింది. వివరాలు.. ముంబై అర్బన్‌లోని బ్రిడ్జి పిల్లర్లపై ఐఎస్ హెడ్ అబూ బాకర్ అల్ బాగ్దాదీ, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పొగుడుతూ రాతలు వెలిశాయి. ప్రపంచాన్ని వణికించే ఉగ్రవాది బాగ్దాది అంటూ ఐఎస్‌ను చీఫ్‌ను పొగడటంతో పాటు.. పోర్టు, ఎయిర్‌పోర్టు, పైప్‌లైన్, ట్రెయిన్ వంటి వివిధ చిత్రాలను గీసిన దుండగులు వాటిని మార్క్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన కోప్తా గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం ఏటీఎస్‌కు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో అర్బన్ ఏరియా, పోర్టు సమీపంలో భద్రత పటిష్టం చేశారు. బుధవారం రంజాన్ నేపథ్యంలో అల్లర్లు ప్రేరేపించేందుకే దుండగులు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే బ్రిడ్జికి సమీపంలో మద్యం సీసాలు లభించిన కారణంగా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే ఆకతాయిలు ఈ పని చేశారా అన్న దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. -
ఐఎస్ అగ్రనేత బగ్దాదీ కుమారుడు హతం
బీరుట్: సిరియా ప్రభుత్వ దళాలతో పోరాడుతూ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అగ్రనేత అబు బకర్ అల్ బగ్దాదీ కుమారుడు హుథయ్ఫా అల్ బద్రీ మృతి చెందినట్లు ఐఎస్ ప్రకటించింది. ఈ మేరకు బద్రీ మరణం గురించి తమ సోషల్ మీడియా అకౌంట్లలో మంగళవారం రాత్రి వెల్లడించింది. ఓ అస్సాల్ట్ రైఫిల్‌ను పట్టుకుని ఉన్న యువకుడి ఫొటోను కూడా చూపుతూ అతడి పేరును హుథయ్ఫా అల్ బద్రీగా పేర్కొంది. సెంట్రల్ సిరియన్ ప్రావిన్స్ ఆఫ్ హోమ్స్‌లోని థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద సిరియా, రష్యా బలగాలతో పోరాడుతూ చనిపోయినట్లు తెలిపింది. అయితే ఎప్పుడు హతమయ్యాడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘ఇంఘిమసీ ఆపరేషన్’లో భాగంగా బద్రీ హతమైనట్లు ఐఎస్ తెలిపింది. సంప్రదాయ ఆత్మాహుతి బాంబింగ్ మెషీన్లకు ‘ఇంఘిమసీ ఆపరేషన్’ కొంత భిన్నంగా ఉంటుంది. పాత ఆత్మాహుతి దాడుల్లో భాగంగా లక్ష్యాలను చేరుకున్న వెంటనే సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చేసుకుంటారు. ఇంఘిమసీ ఆపరేషన్‌లో మాత్రం జిహాదిస్టులు తమ వద్ద ఉన్న తుపాకీలు, గ్రెనేడ్లు పూర్తయ్యే వరకు పోరాడతారు. అవి అయిపోగానే తమను తాము పేల్చేసుకుంటారు. -
కనిపిస్తే తగలబెట్టేయండి!
కైరో: కిరాతక ఉగ్రసంస్థ ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బగ్దాదీ మరోసారి ప్రపంచం ముందుకొచ్చాడు. శత్రువులందరిని తగులబెట్టేయాలనీ, మీడియా సంస్థలపై దాడులు నిర్వహించాలనీ ఓ ఆడియో సందేశంలో ఉగ్రవాదులకు పిలుపునిచ్చాడు. ఐసిస్ నేతృత్వంలోని అల్ ఫుర్కాన్ విభాగం 46 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియోను విడుదల చేసింది. ఇందులో బగ్దాదీ ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీరు ఖలీఫత్ సైనికులు, ఇస్లామ్ హీరోలు. మీ శత్రువులపై ప్రతిచోటా దాడులకు తెగబడండి. సైద్ధాంతిక యుద్ధానికి ప్రధాన కార్యాలయాలుగా మారిన అవిశ్వాసుల మీడియా సంస్థలపై విరుచుకుపడండి’ అని పిలుపునిచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా మీ సోదరుల హత్యలు, వారిపై దమనకాండ జరుగుతుంటే, మతభ్రష్టులు సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్నారని బగ్దాదీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యుద్ధంలో అమరత్వం పొందిన వారికి స్వర్గంలో 72 మంది భార్యలు లభిస్తారని గుర్తు చేశాడు. సిరియా అధ్యక్షుడు అసద్‌కు చెందిన అలావతి జాతి(షియాలో భాగం)తో పాటు టర్కీ, రష్యా, ఇరాన్ దేశాల కుతంత్రాలపై జాగ్రత్తగా ఉండాలని సిరియా సున్నీలను బగ్దాదీ హెచ్చరించాడు. అమెరికా, రష్యా వైమానిక దళాల సాయం లేకుండా సంకీర్ణ సేనలు తమముందు ఒక్క గంట కూడా నిలబడలేవని విమర్శించాడు. మోసుల్ నగరంపై తాము చేసిన వైమానిక దాడిలో బగ్దాదీ చనిపోయి ఉండొచ్చని జూన్‌లో రష్యా ప్రకటించిన కొన్ని నెలల అనంతరం ఆయన మాట్లాడిన ఆడియో సందేశం బయటకురావడం గమనార్హం. -
‘బాగ్దాదీ బతికే ఉండొచ్చు’
వాషింగ్టన్: అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ ఇంకా బతికే ఉండొచ్చని అమెరికా టాప్ మిలిటరీ కమాండర్ అనుమానం వ్యక్తం చేశారు. తాము జరిపిన వైమానిక దాడుల్లో బాగ్దాదీ హతమైనట్లు రష్యా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాగ్దాదీ ఇంకా బతికే ఉన్నాడని అనిపిస్తోంది’ అని యూఎస్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ స్టీఫెన్ టౌన్సెండ్ తెలిపారు. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై దాడులు చేస్తున్న సంకీర్ణ దళాలకు స్టీఫెన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికా పెంటగాన్‌లోని విలేకరులతో స్టీఫెన్.. బాగ్దాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘బాగ్దాదీ చనిపోయినట్లు ముందు నేను కూడా భావించాను. అయితే కొన్ని నిఘా వర్గాల సమాచారం చూస్తుంటే బాగ్దాదీ బతికే ఉన్నాడని అనిపిస్తోంది. అతడి కోసం మా దళాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఒకవేళ వారు అతడిని గుర్తిస్తే కచ్చితంగా చంపేస్తారే గానీ.. బందీగా పట్టుకోరు’ అని స్టీఫెన్ తెలిపారు. యుఫరేట్స్ నదిని ఆనుకొన్న ప్రాంతాల్లో బాగ్దాది దాగి ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నామని స్టీఫెన్ అన్నారు. -
'బాగ్దాదీ చావలే.. మేం చంపాకే నమ్ముతాం'
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ ఇప్పటికీ బతికే ఉన్నట్లు భావిస్తున్నామని అమెరికా తెలిపింది. ఇటీవల తాము జరిపిన వైమానిక దాడుల్లో బాగ్దాదీ చనిపోయినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని సిరియాకు చెందిన హక్కుల సంస్థ కూడా పేర్కొంది. అయితే, తాను మాత్రం బాగ్దాదీ హతమయ్యాడని అనుకోవడం లేదని, వైమానిక దాడుల్లో అతడి ఎలాంటి హానీ జరగలేదని భావిస్తున్నానని అమెరికా ప్రధాన రక్షణ స్థావరం పెంటగాన్ చీఫ్ జిమ్ మాట్టిస్ అన్నారు. 'బాగ్దాదీ బతికే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. తాము చంపేసినప్పుడు మాత్రమే అతడు చనిపోయాడని మేం నమ్ముతాం' అని చెప్పారు. అమెరికా బాగ్దాదీ తలపై దాదాపు 25 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది. -
బాగ్దాది కథ ముగిసింది
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) నాయకుడు అబూబకర్ అల్ బాగ్దాది ప్రాణాలతో లేరని ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించింది. దీంతో బాగ్దాదీ చనిపోయాడంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించినట్లయింది. త్వరలోనే ఆయన వారసుడిని ఎన్నుకుంటామని తెలిపింది. మోసుల్‌లోని తల్ అఫార్ పట్టణంలోని ఐఎస్ఐఎస్ తన సొంత మీడియా ద్వారా సంక్షిప్తంగా ఈ ప్రకటన చేసింది. బాగ్దాదీ చనిపోయాడని పేర్కొన్న సంస్థ.. ఎలా చనిపోయాడు? తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదని ఇరాక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ చెర నుంచి మోసుల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఇరాక్ ప్రధాని హైదర్ అల్-అబాదీ ప్రకటించిన మరునాడే ఐఎస్ఐఎస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. దాదాపు ఎనిమిది నెలలుగా ఐఎస్ చేతుల్లో ఉన్న మోసుల్‌ను భీకర పోరు తర్వాత ఇరాక్ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. -
బాగ్దాదీ చనిపోతే తర్వాత ఎవరు?
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ చనిపోయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అతడి తర్వాత ఆ సంస్థ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే విషయంపై జోరుగా చర్చ మొదలైంది. గతంలో ఇరాక్ ఆర్మీ అధికారులుగా పనిచేసిన ఇయాద్ అల్ ఒబైదీ, అయాద్ అల్ జుమెయిలీ అనే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఈ బాధ్యతలు తీసుకుంటారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆ ఇద్దరు కూడా గతంలో సద్దాం హుస్సేన్ పరిపాలన హయాంలో ముఖ్యమైన ఆర్మీ అధికారులుగా చేశారంట. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై అవగాహన ఉన్న నిపుణులు మాత్రం ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఏ ఒక్కరిని కూడా స్పష్టం చేయలేదు. తాము జరిపిన వైమానిక దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ చీఫ్ బాగ్దాదీ చనిపోయాడని రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. -
మనం ఓడిపోయాం.. వెళ్లిపొండి లేదా చచ్చిపోండి
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఓడిపోయిందని, అందువల్ల అరబేతర దేశాలకు చెందిన యోధులంతా తిరిగి తమ తమ సొంతదేశాలకు వెళ్లిపోవాలి లేదా తమను తాము పేల్చుకుని చచ్చిపోవాలని ఆ సంస్థ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ చెప్పాడు. ఐసిస్ వీడ్కోలు ప్రసంగంలో ఇలా చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్న బాగ్దాదీ 'వీడ్కోలు ప్రసంగం' పేరుతో ఒక ప్రకటన విడుదల చేశాడు. దాన్ని ఐసిస్ ప్రబోధకులకు, మతప్రవక్తలకు పంచిపెట్టారు. మోసుల్ నగరంలో ఇస్లామిక్ స్టేట్ మీద ఇరాకీ ఆర్మీ తన పట్టు బిగించడంతో ఐఎస్‌కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇస్లామిక్ స్టేట్ కార్యాలయాన్ని మూసేయాలని, అరబ్ దేశాల వాళ్లు కాకుండా అందులో పనిచేస్తున్న ఇతర ఫైటర్లంతా తమ తమ సొంత దేశాలకు వెళ్లిపోవడం లేదా తమను తాము పేల్చేసుకుని చచ్చిపోవడం తప్పదని బాగ్దాదీ ఆదేశించాడు. అలా చనిపోయినవాళ్లకు స్వర్గంలో 72 మంది మహిళలు దక్కుతారని కూడా చెప్పాడు. బాగ్దాదీని ఎవరైనా పట్టుకుంటే దాదాపు రూ. 66 కోట్ల బహుమతి ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పలుమార్లు దాడుల్లో బాగ్దాదీ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు చనిపోయాడని కూడా చాలాసార్లు కథనాలు వచ్చాయి. 2014 సంవత్సరంలోనే తాను ఖలీఫానని ప్రకటించుకున్నాడు. అప్పట్లో తూర్పు సిరియా, ఉత్తర ఇరాక్ ప్రాంతాలను చాలావరకు ఐసిస్ ఆక్రమించుకుంది. ఇప్పుడు చాలామంది ఐసిస్ నాయకులు ఇరాక్ నుంచి సిరియాకు పారిపోయారు. అమెరికా, ఇతర దేశాల అండతో ఇరాకీ సైన్యం గత సంవత్సరం అక్టోబర్ 17వ తేదీన మోసుల్ నగరాన్ని తిరిగి దక్కించుకోడానికి భారీ ఎత్తున దాడులు చేసింది. జనవరి నెలలో ఆ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి ఆ దేశంలో ఐసిస్ పతనం మొదలైంది. -
యెమెన్ లో అమెరికా దాడులు
41 మంది ఉగ్రవాదులు సహా 57 మంది మృతి అదెన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా ఓ దేశం (యెమెన్ )పై ఆ దేశ భద్రతా దళాలు దాడులకు పాల్పడ్డాయి. యెమెన్ లో జరిగిన ఈ దాడుల్లో 41 మంది అనుమానిత అల్‌కాయిదా ఉగ్రవాదులు, 16 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. బైదా సెంట్రల్ ప్రావిన్స్ లోని యక్లా జిల్లాలో జరిగిన ఈ దాడుల్లో 8 మంది మహిళలు, 8 మంది చిన్నపిల్లలు సహా మొత్తం 57 మంది మృత్యువాత పడ్డారు. అల్‌కాయిదా బడులు, మసీదులు, వైద్య ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహించారు. ఈ ప్రాంత అల్‌కాయిదా చీఫ్ అబు బరాజన్ కూడా దాడుల్లో చనిపోయినట్లు అధికారులు చెప్పారు. దాడుల్లో తమ సైనికుడు ఒకరు మృతి చెందాడని అమెరికా పేర్కొంది.గత 24 గంటల్లో 100 మంది రెబల్స్‌ను హతమార్చామని యెమెన్ ఆర్మీ చెప్పింది. -
అతడు సజీవంగానే ఉన్నాడు, వేటాడతాం: అమెరికా
వాషింగ్టన్: ఉగ్ర సంస్థ ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్–బాగ్దాదీని మట్టుబెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ఇంకా సజీవంగానే ఉన్నాడని నమ్ముతున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. తాను 2014లో ఖలీఫా రాజ్యాన్ని ప్రకటించిన, ప్రస్తుతం బలగాల ముట్టడిలో ఉన్న మోసుల్ పట్టణంలోనే ఉన్నాడా అన్న దానిపై స్పష్టత లేదని తెలిపింది. ‘బాగ్దాదీ ప్రాణాలతో ఉన్నాడని, ఐసిస్‌ను నడిపిస్తున్నాడని నమ్ముతున్నాం. అయన కదలికలు పసిగట్టేందుకు చేయాల్సినదంతా చేస్తున్నాం. ఆయనకు తగిన శాస్తి చేయడానికి దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోం. ఇందుకోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం’ అని పెంటగాన్ ప్రతినిధి పీటర్ కుక్ చెప్పారు. సంకీర్ణ దళాలు చాలా మంది ఐసిస్ సభ్యులను అంతమొందించడంతో బాగ్దాదీకి సలహాలు ఇచ్చేవారు కరువయ్యారని, ఆయన ఒంటరైపోయారని తెలిపారు. బగ్దాదీ తలపై బహుమానాన్ని అమెరికా ఈ మధ్యే రెండింతలు పైగా పెంచుతూ 25 మిలియన్ డాలర్లు చేసింది. ఐసిస్ చివరిసారిగా విడుదల చేసిన 2014 నాటి వీడియోలో బాగ్దాదీగా భావిస్తున్న వ్యక్తి నెరిసిన గడ్డం, నల్ల దుస్తులు, తలపాగాతో కనిపిస్తూ మోసుల్‌ను కాపాడుకోవాలని మద్దతుదారులకు సందేశమిచ్చాడు. 2016, జూన్ లో సంకీర్ణ దళాల దాడుల్లో అబు బకర్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అతడు బతికేవున్నట్టు అమెరికా తాజాగా ప్రకటించింది. -
యెమెన్‌లో ఐసిస్ నరమేధం
ఆత్మాహుతి దాడిలో 48 మంది సైనికులు మృతి ∙84 మందికి గాయాలు.. అడెన్: యెమెన్‌లోని అడెన్ ప్రాంతంతో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 48 మంది సైనికులు మృతిచెందారు. 84 మందికిపైగా గాయపడ్డారు. అడెన్‌లో సైనికులపై వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండో ఆత్మాహుతి దాడి ఇది. వేతనాలు తీసుకునేందుకు ఈశాన్య అడెన్‌లోని సైనిక స్థావరం వద్ద గుమికూడిన సైనికులను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి బాంబర్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. సైనికుల్లో కలసిపోయి ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నాడు. 48 మంది సైనికులు మరణించారని, 84 మంది ఇతరులు గాయపడ్డారని అడెన్ హెల్త్ చీఫ్ అబ్దుల్ నాసర్ అల్–వలి తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో భీతావహ పరిస్థితి నెలకొంది. తెగిపడిన శరీర భాగాలు, నెత్తుటి చారికలతో ఆ ప్రాంతం భీతి గొలుపుతోంది. కాగా, దాడి తమ పనేనని ఐఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు ఎనిమిది రోజుల క్రితం అల్–సవ్లాబన్ ప్రాంతంలో ఇదే తరహాలో ఐఎస్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో 48 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా.. 29 మంది ఇతరులు గాయపడ్డారు. బాగ్దాదీని పట్టిస్తే 170 కోట్లు వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీపై ఉన్న బహుమానాన్ని అమెరికా భారీగా పెంచింది. బాగ్దాదీకి సంబంధించిన సమాచారాన్ని తెలియజేసిన వారికి 25 మిలియన్ యూఎస్ డాలర్లు (సుమారు 170 కోట్లు) ఇస్తామని తెలిపింది. బాగ్దాదీని పట్టించిన లేదా సమాచారం తెలిపిన వారికి తొలుత 10 మిలియన్ యూఎస్ డాలర్ల (సుమారు 68 కోట్లు)ను బహూకరిస్తామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్నే రెండింతలు పైగా పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. 2011లో అల్‌కాయిదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌పై కూడా అమెరికా 25 మిలియన్ యూఎస్ డాలర్లను ప్రకటించింది. ఆ తర్వాత ఇంత మొత్తంలో బహుమతిని మరొకరిపై అమెరికా ఎన్నడూ ప్రకటించలేదు. -
లష్కరే టాప్ కమాండర్ హతం
జమ్ము: లష్కర్ ఏ తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన టాప్ కమాండర్ అబూ బకర్ హతమయ్యాడు. భారత సైనికుల కాల్పుల్లో ఆ ఉగ్రవాది చనిపోయాడు. సోపోర్‌లో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. గత కొన్ని గంటలుగా జమ్ముకశ్మీర్ లోని సొపోర్ ప్రాంతంలో భారత బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లోనే ఉగ్రవాది అబూ బకర్ హతమయ్యాడని తెలుస్తోంది. భారతీయ సైనికులకు ఎలాంటి హానీ జరగలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.