Adventure
-
సాహసకృత్యాలకు చిరునామా మయూరి ఎకో పార్క్
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ‘మయూరి హరితవనం’ (ఎకో అర్బన్ పార్క్) ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ పార్క్ వనవిహార కేంద్రంగా రూపుదిద్దుకుంది. జిల్లా కేంద్రం అప్పన్నపల్లి శివారులోని ఈ ఎకో అర్బన్ పార్క్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఈ నేచర్పార్క్ అర్బన్ లంగ్స్ స్పేస్ పర్యాటక కేంద్రంగా మారుతోంది. 2,087 ఎకరాల్లో మయూరి పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం అన్ని రకాల వసతులు ఉండడంతో ఎకో పార్క్‌కు సందర్శకుల తాకిడి అధికమైంది. ఎకో అర్బన్ పార్కులో సౌకర్యాలు పార్క్‌లో చిల్డ్రన్స్ పార్క్, బటర్‌ఫ్లై గార్డెన్, కరెన్సీ పార్క్, రోజ్ గార్డెన్, రాశీవనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం, హెర్బల్ గార్డెన్లు పర్యాటకులకు అమితంగా ఆకర్షిస్తున్నాయి. పార్క్‌లో మాకావ్ ఎన్‌క్లోజర్, స్వాన్ పాండ్, హిల్‌వ్యూ పాయింట్, ప్రత్యేకంగా జంగిల్ సఫారీ, ఫ్లాగ్ పాయింట్, ఆస్ట్రిచ్ బర్డ్ ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. ఆకట్టుకుంటున్న అడ్వెంచర్ గేమ్‌లు పార్క్‌లో పెద్దల కోసం ఏర్పాటు చేసిన జిప్‌లైన్, జిప్సైకిల్, చిన్నారులకు జిప్సైకిల్, జిప్‌లైన్ తదితర అడ్వెంచర్ గేమ్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్దల జిప్ సైకిల్ రూ.150, జిప్‌లైన్ రూ.70, చిన్నారుల జిప్సైకిల్ రూ.30, జిప్‌లైన్ రూ.30గా నిర్ణయించారు. జిప్సైకిల్ రానుపోను 600 మీటర్లు, జిప్‌లైన్ 200 మీటర్ల వరకు ఉంటుంది. వీకెండ్ రోజుల్లో ముఖ్యంగా చిన్నారులు, యువత జిప్ సైకిల్, జిప్ లైన్‌పై హుషారుగా సందడి చేస్తున్నారు. పార్క్‌లో అడల్ట్, చిల్డ్రన్స్ బోటింగ్‌తోపాటు నేచర్ నైట్ క్యాంపింగ్ సైట్ అందుబాటులో ఉంది.అడవిలో జంగిల్ సఫారీ పార్క్‌లో జంగిల్ సఫారీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పార్క్ నుంచి అడవిలో రానుపోను 14 కిలోమీటర్లు ఈ జంగిల్ సఫారీ ఉంటుంది. పార్క్ నుంచి ప్రారంభమయ్యే ఈ సఫారీ గోల్ బంగ్లా వాచ్ టవర్ వరకు తీసుకెళ్లి తిరిగి పార్క్‌కు చేరుకుంటుంది. సఫారీలో నెమళ్లు, జింకలు, ఇతర జంతువులను తిలకించే అవకాశం ఉంటుంది. రూ.2 వేలు చెల్లించి 8 మంది జంగిల్ సఫారీ చేయవచ్చు. మరిన్ని సాహస క్రీడల ఏర్పాటు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా మయూరి పార్క్‌లో భవిష్యత్‌లో మరిన్ని సాహస క్రీడలను ఏర్పాటు చేస్తాం. రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. జంగిల్ సఫారీకి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. – సత్యనారాయణ, డీఎఫ్‌వో, మహబూబ్‌నగర్ -
సర్కస్ కాదు.. సర్కారు ఉద్యోగి సాహసం
-
సముద్ర సాహసాలు చేయాలనుందా? అయితే ఈ గేమ్ ఆడాల్సిందే!
‘బారెంట్స్ అండ్ ఫిషింగ్.. నార్త్ అట్లాంటిక్ ఫ్రాంఛైజీలకు సీక్వెల్‌గా వచ్చిన గేమ్ షిప్స్ ఎట్ సీ. ఈ బ్రాండ్–న్యూ గేమ్‌ప్లేలో రకరకాల కొత్త ఫీచర్లు ఉన్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న మల్టీప్లేయర్ మోడ్‌లో వచ్చిన ఈ గేమ్ ద్వారా మహా సముద్రాలకు సంబంధించి రియలిస్టిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను సొంతం చేసుకోవచ్చు.నెక్ట్స్ జనరేషన్ షిప్ స్టిమ్యులేషన్గా వచ్చిన ఈ గేమ్‌లో మొదటిసారిగా సర్వీస్, కార్గో నౌకలను పరిచయం చేశారు. వీటిలో సరికొత్త గేమ్‌ప్లే ఫీచర్లో ఉంటాయి. ‘స్నేహితులతో కలిసి నార్వేజియన్ సముద్రంలోకి వెళ్లండి. సినిమాటిక్–క్వాలిటీ ఓషన్ స్టిమ్యులేషన్ దీని సొంతం. సముద్ర సాహసాలు చేయాలనే ఉత్సాహం మీలో ఉందా? అయితే షిప్స్ ఎట్ సీలోకి వచ్చేయండి’ అంటుంది గేమ్ డెవలపర్ మిస్క్ గేమ్స్.జానర్స్: ఎర్లీ యాక్సెస్, స్ట్రాటజీ వీడియో గేమ్,ల్యాట్ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్,ఇంజిన్: అన్రియల్ ఇంజిన్ 5.ఇవి చదవండి: ఈ టేస్టీ స్నాక్స్‌తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..! -
గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు!
యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘ఘోస్ట్ ఆఫ్ సుషిమ’ విడుదల అయింది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి ఆడే గేమ్ ఇది. సుషిమ ద్వీపాన్ని రక్షించడానికి రంగంలోకి దిగిన ‘సకాయ్’ అనే సమురాయ్‌ని ప్లేయర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అకీరా కురోసావా సినిమాలు, కామిక్ బుక్ సిరీస్ ‘ఉసాగి యోజింటో’ ప్రేరణతో ఈ గేమ్‌ను రూపొందించారు.గేమ్ ల్యాండ్‌స్కేప్, మినిమలిస్టిక్ ఆర్ట్ స్టైల్‌ను యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘షాడో ఆఫ్ ది కొలోసస్’ ప్రభావంతో చేశారు. గేమ్‌లోని లొకేషన్లు ‘పర్ఫెక్ట్ ఫొటోగ్రాఫర్స్ డ్రీమ్స్’ అనిపించేలా అందంగా ఉంటాయి. ఇలన్ ఎస్కేరి, షిగేర్ ఉమేలయాషి ఈ గేమ్ సౌండ్ ట్రాక్‌ను అద్భుతంగా కం΄ోజ్ చేశారు.‘చారిత్రకంగా, సాంస్కృతికంగా ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాం’ అని మేకర్స్ చెబుతున్నారు.జానర్: యాక్షన్–అడ్వెంచర్మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ప్లాట్ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ప్లే స్టేషన్ 5, విండోస్.ఇవి చదవండి: అరుదైన ప్రతిభ.. అక్షత! -
'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్ ట్రై చేయండి!
సముద్ర గర్భంలోకి వెళ్లడం అంటే మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే. పరిచిత, అపరిచిత, వింత, క్రూర.. రకరకాల జీవులు మనకు సవాలు విసురుతాయి. సాహసం ఏమాత్రం నీరు కారి΄ోయినా జీవితం నీటిపాలు కావాల్సిందే. అందుకే సముద్ర గర్భంలో ప్రతి క్షణం...విలువైన సాహసమే. సముద్ర గర్భంలో సాహస యాత్ర చేయాలని ఉందా? అయితే ఈ గేమ్ మీ కోసమే.అడ్వెంచర్ సిమ్యూలెషన్ గేమ్ ‘ఎండ్లెస్ ఒషియన్ లుమినస్’ విడుదలైంది. జపాన్ గేమింగ్ కంపెనీ ‘అరిక’ డెవలప్ చేసిన గేమ్ ఇది. ‘ఎండ్లెస్ ఓషన్’ సిరీస్‌లో వస్తున్న థర్డ్ గేమ్. సముద్రగర్భ ప్రపంచాన్ని రికార్డ్ చేయడానికి ఈ గేమ్‌లో ప్లేయర్ స్కూబా డైవర్ పాత్ర పోషించాల్సి ఉంటుంది.ప్లాట్‌ఫామ్: నిన్టెండో స్విచ్,జానర్స్: అడ్వెంచర్, సిమ్యులేషన్,మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీ ప్లేయర్ -
మహిళల సమస్యలపై ‘సాహస్’ అస్త్రం
సాక్షి, హైదరాబాద్: పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై ‘సాహస్’పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. ఉద్యోగం చేసే మహిళలు ఈ పోర్టల్‌లో తమ సమస్యలు చెప్పుకునేందుకు ‘గెట్ హెల్ప్’ఆప్షన్ ఉన్నట్టు వారు వెల్లడించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ ఉదయం 10–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7331194540 నంబర్లోనూ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. సాహస్ పోర్టల్‌ను ఇప్పటికే ప్రారంభించామని, మహిళల్లో అవగాహన కోసం దీనిపై మరింత ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు మొదలు.. లైంగిక వేధింపులపై ఎలా ఫిర్యా దు చేయాలి, న్యాయ సాయం ఎలా పొందాలో పోర్టల్‌లో పొందుపరిచినట్టు తెలిపారు. ఫిర్యాదులకు https:// womensafetywing. telangana. gov. in/ sahas/ లో క్లిక్‌చేసి వివరాలు పొందవచ్చని వివరించారు. -
97 నుంచి 77 కట్ చేస్తే... ఆ కరేజ్ ఇలా ఉంటుంది!
97 సంవత్సరాల వయసులో రెండు అడుగులు వేగంగా వేయాలంటేనే కష్టం. అలాంటిది ‘పారా మోటరింగ్ అడ్వెంచర్’ చేస్తే... మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఉషా తూసే 97 సంవత్సరాల వయసులో పారామోటరింగ్ సాహసం చేసి నెటిజనులు ‘వావ్’ అనేలా చేసింది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.2 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఆర్మీ పారా–కమాండో పైలట్స్, ఎయిర్ ఫోర్సు వెటరన్స్ ఆపరేట్ చేసే ఫ్లైయింగ్ రైనో పారామోటరింగ్ విభాగం బామ్మ చేత ఈ సాహసాన్ని చేయించింది. ‘97 ఇయర్ వోల్డ్ కరేజ్ అండ్ 20 ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్’ అనే కాప్షన్‌తో ‘ఎక్స్’లో ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసింది. ‘సాహసంలో జీవనోత్సాహం కూడా ఉంటుంది అనే వాస్తవాన్ని ఆవిష్కరించే వీడియో ఇది’. ‘ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే వీడియో’.... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి నిజానికి ఉషాకు సాహసం కొత్త కాదు. భర్త ఆకస్మిక మరణం, పిల్లల బరువు బాధ్యతల సమయంలో కూడా ఆమె డీలా పడిపోలేదు. ఒంటి చేత్తో కుటుంబాన్ని ధైర్యంగా పోషించింది. -
హైదరాబాద్‌లో అడ్వెంచర్స్.. వీకెండ్లో చిల్ అవ్వండి
హైదరాబాద్‌లో అంటేనే నోరూరించే కమ్మని వంటకాలు, అనేక పర్యాటక ప్రదేశాలకు ఫేమస్. వీకెండ్ వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చి రిలాక్స్ అవుతుంటారు. అడ్వెంచర్ యాక్టివిటిస్కి కూడా హైదరాబాద్ అడ్డాగా మారుతుంది. ఒకప్పుడు పారాగ్లైడింగ్ అంటే గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా ఎన్నో అడ్వెంచర్ స్పాట్స్, అది కూడా తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చేశాయి. అవేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. బంగీ జంపింగ్ లైఫ్‌లో ఒక్కసారైనా బంగీ జంపింగ్‌ను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొండలు, బ్రిడ్జి వంటి ఎత్తైన ప్రదేశాల నుంచి తాళ్లతో శరీరాన్ని కట్టుకొని కిందకు దూకండి చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. బంగీజంపింగ్ చేయాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ అడ్వెంచర్ యాక్టివిటి కోసం మన హైదరాబాద్‌లోనే చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. వాటిలో రామోజీ ఫిల్మ్ సిటీ,లియోనియా రిసార్ట్, డిస్ట్రిక్ గ్రావిటి పార్క్ వంటి ప్రాంతాల్లో అందుబాలో ఉంది. దీని ధర సుమారు రూ.3500 నుంచి 4500 వరకు ఉంటుంది. 12 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వ్యక్తులు ఎవరైనా బంగీ జంప్ చేయొచ్చు. దీనికోసం ముందుగానే బీపీ, హార్ట్‌రేట్ వంటివి చెక్ చేస్తారు. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులకే బంగీ జంపింగ్ అనుమతిస్తారు. పారాగ్లైడింగ్ రెక్కలు కట్టుకొని ఆకాశలో ఎగురుతూ భూమిపై ఉన్న ప్రకృతి అందాలను చూడాలంటే పారాగ్లైడింగ్ బెస్ట్ ఛాయిస్.ఆకాశంలో పక్షలతో పోటీ పడి ఎగురుతూ భూమి పై అందాలను ఆస్వాదించవచ్చు. అయితే పారాగ్లైడింగ్ అన్ని చోట్ల వీలు పడదు. ఇందుకు కొంత ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులతో పాటు వాతావరణం కూడా అనుకూలించాలి. హైదరాబాద్‌లో కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర్లో అందుబాటులో ఉంది. ధర రూ.3500 జిప్‌లైన్ చాలా ప్రాంతాల్లో జిప్‌లైన్ కోసం 50 మీటర్ల నుంచి ఎత్తులో బ్యూటిఫుల్ నేచర్‌ను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. హైదరాబాద్‌లో శామీర్‌పేట్‌లోని డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్, ఎక్సోటికా బొటిక్ రిసార్ట్ వంటి ప్రాంతాల్లో జిప్‌లైన్ యాక్టివిటి అందుబాలో ఉంటుంది. ధర రూ. 700-1000 వరకు ఉంటుంది. వీకెండ్స్‌లో ధర మారుతుంది) స్కై డైవింగ్ ఎత్తుగా ఉండే ప్రాంతాల నుంచి గాల్లోకి దూకే సాహసక్రీడను స్కై డైవింగ్ అంటారు. వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఒక్కసారిగా కిందికి దూకుతూ చేసే స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇండోర్‌లో కూడా పొందచ్చు. అది ఎక్కడంటే..గండిపేట సమీపంలో గ్రావిటీజిప్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఈ ఇండోర్ స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందిచ్చు. ఇందుకోసం ఇండోర్ స్కైడైవింగ్ కోసం 23 అడుగుల ఎత్తుతో ప్రత్యేక సిలిండర్ రూపొందించారు. ధర సుమారు రూ. 3300 నుంచి 4300 వరకు ఉంటుంది. (వీకెండ్స్‌లో ధర మారుతుంటుంది) ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ కోసం సిటీలో చాలా ప్రాంతాలు ఉన్నా అనంతగిరి హిల్స్ బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. వీకెండ్ వస్తే చాలు ఇక్కడికి ఫ్రెండ్స్‌తో ఎక్కువగా హైదరబాదీలో ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. ఇందుకోసం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. క్లౌడ్ డైనింగ్ సాధారణంగా రెస్టారెంట్లో ఎవరైనా భోజనం చేస్తారు. కానీ ఆకాశానికి, భూమికి మధ్యలో ఎత్తైన ప్రదేశంలో భోజనం చేస్తే ఆ ఫీలింగే వరే. గాల్లోకి ఎగిరిపోయి అక్కడి నుంచి కిందకు చూస్తూ భోజనం చేస్తే ఆ థ్రిల్లింగ్ చెప్పక్కర్లేదు. ఇండియాలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలంటే హైదరాబాద్‌లోని క్లౌడ్ డైనింగ్‌కు వెళ్లాల్సిందే. ఇది హైటెక్ సిటీ సమీపంలో ఉంటుంది. ఈ క్లౌడ్ డైనింగ్.. భూమికి 160 ఎత్తుల అడుగులో ఉంటుంది. దాదాపు అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ భోజనం చేయాలంటే.. రూ.5,000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. -
డబ్బింగ్ షురూ
కార్తీ హీరోగా నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘జపాన్’. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సునీల్, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో నటించారు. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడిస్తూ, ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ‘‘కార్తీ పుట్టినరోజు (మే 25) సందర్భంగా విడుదల చేసిన ‘జపాన్’ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ చిత్రంలో కార్తీ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా ‘జపాన్’ చిత్రంలో గోల్డ్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో కార్తీ కనిపిస్తారని కోలీవుడ్ టాక్. -
నారూటే సెపరేటు..చీర కట్టులో సర్ఫింగ్
చీరతో కొన్ని రకాల సాహస క్రీడలు, ఫీట్లు చేయడం కాస్త కష్టం. అందులోనూ స్కూబా వంటివి అయితే అస్సలు కుదరదు. అలాంటిది ఓ మహిళ చీరతో ఆ సాహసానికి దిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ మహిళ చీర కట్టులో గాలిపటల సర్ఫింగ్ చేసింది. ఆమె పేరు కాత్యా సైనీ. ఈ నెల ప్రారంభంలోనే లైసెన్స్ పొందిన స్కూబా డైవింగ్ శిక్షకురాలు ఆమె. కాగా అందుకు సంబంధించిన వీడియో జూలై 10న నెట్టింట పోస్ట్ అవ్వడంతో తెగ వైరల్ అవ్వుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కొందరూ మెచ్చుకోగా మరికొందరూ ఫైర్ అయ్యారు. ఒక నెటిన్ ఇది క్రాస్ కల్చర్ ఇలాంటిది నాకు చాలా ఇష్టం. నువ్వు ఓ అద్భతం అంటూ ఆ మహిళని ప్రసంశించాడు. మరో వ్యక్తి ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి సాహసం చేశారో తెలియదు. కొన్ని సాహస క్రీడలకు చీర నిషిద్ధం. అలాంటి ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నప్పుడూ చీర ఇరుక్కుంటే పరిస్థితి ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. ఈ వీడియోకి లక్షలకు పైగా లైక్‌లు వ్యూస్ వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Katya Saini (@katyasaini) (చదవండి: ఓ దేశానికి హాలిడే ట్రిప్‌గా వెళ్లితే.. ఆ దేశ అధ్యక్షుడి సడెన్ ఎంట్రీతో..) -
సాగర గర్భంలో కలిసిన సాహస వీరులు
ఎప్పుడో వందేళ్ల కిందట.. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. టైటాన్ అనే మినీ సబ్‌మెరిన్(సబ్ మెర్సిబుల్)లో వీక్షణకు బయల్దేరి.. సముద్ర గర్భంలోనే కలిపిపోయారు వాళ్లు!. దాదాపు ఐదురోజులపాటు ప్రపంచం మొత్తం వాళ్ల జాడ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చింది. అమెరికా తీర రక్షణ దళం ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన రెస్క్యూ టీంలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. గురువారం నాడు గంట గంటకు ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారం.. చివరకు శకలాల గుర్తింపు ప్రకటనతో విషాదాంతంగా ముగిసింది. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటన ప్రకారం.. టైటానిక్ శకలాల సమీపంలోనే ఓడ ముందుభాగం నుంచి సుమారు 1,600 అడుగుల దూరంలో టైటాన్ శిథిలాలు పడి ఉన్నాయి. రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్(ROV) వీటిని గురువారం ఉదయం గుర్తించినట్లు ప్రకటించింది కోస్ట్‌గార్డ్. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ నుంచి ఐదుగురితో కూడిన ‘టైటాన్’ సాహసయాత్ర ప్రారంభం అయ్యింది. పోలార్ ప్రిన్స్ అనే నౌక సాయంతో టైటాన్‌ను నీటి అడుగుకు పంపించారు. గంటన్నర తర్వాత.. పోలార్‌ప్రిన్స్‌తో టైటాన్‌కు సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని వెంటనే అమెరికా తీర రక్షణ దళం దృష్టికి తీసుకెళ్లింది ఈ యాత్ర నిర్వాహణ సంస్థ ఓషన్‌గేట్. న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో ఉత్తర అట్లాంటిక్‌లో టైటాన్ అదృశ్యమై ఉంటుందని భావించింది కోస్ట్‌గార్డ్. అప్పటి నుంచి 13,000 అడుగుల (4,000 మీటర్లు) లోతుల్లో టైటాన్ జాడ కనిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. సముద్ర అగాథంలోకి చేరుకుని జలాంతర్గామిని కనిపెట్టడం అత్యంత కష్టమని నిపుణులు మొదటి నుంచి వేసిన అంచనా కొంతవరకు నిజమైంది కూడా. ఇలా జరిగిందేమో.. విపత్తు పేలుడు..Catastrophic Implosion టైటాన్ ప్రమాదానికి కారణం ఇదేనని యూఎస్ కోస్ట్‌గార్డ్ ఓ అంచనా వేస్తోంది. నీటి అడుగుకు వెళ్లే క్రమంలో.. ఛాంబర్లోని ఒత్తిడి వల్లే మినీసబ్‌మెర్సిబుల్ పేలిపోయి ఉంటుందని ప్రకటించింది. అయితే.. నీటి అడుగున సబ్మెర్సిబుల్(మినీజలంతర్గామి) విషయంలోనే కాదు.. సబ్మెరిన్ల(జలంతర్గాముల) విషయంలోనూ ఇది జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక అంతర్గత ఒత్తిడి వల్ల సబ్మెరిన్లు ఒక్కోసారి ఆగిపోయి.. నీటి అడుగుకు వెళ్లిపోతాయట. ఒక్కోసారైతే ఆ ఒత్తిడి భరించలేక అవి పేలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. టైటాన్ పేలిపోయిన ఖచ్చితమైన క్షణం మాత్రం చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయే అవకాశమే ఉంది. ఒకవేళ టైటాన్ శకలాల చెంత మృతదేహాల జాడ కనిపించినా.. అట్లాంటిక్ అడుగున ఉన్న వాతావరణం నుంచి బయటకు తేలేని పరిస్థితి ఉందని యూఎస్ కోస్ట్‌గార్డ్ అధికారికంగా ప్రకటించింది. 🚨 Breaking News All five people onboard on #Submersible are all very sadly died, #OceanGate confirms. This video shows how the accident happened with the submarine. 💔#Titanic #Titan pic.twitter.com/W82X9OawuD — WOLF™️ (@thepakwolf) June 22, 2023 ఆది నుంచి విమర్శలే.. వాషింగ్టన్ ఎవరెట్టెకు చెందిన ప్రైవేట్ కంపెనీ ఓషన్‌గేట్. 2009లో స్టాక్టన్ రష్, గుయిలెర్మో సోహ్నలెయిన్‌లు దీనిని స్థాపించారు. నీటి అడుగున టూరిజంతో పాటు అన్వేషణలకు, పరిశోధనలు ఈ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. అందుకుగానూ ఛార్జి చేస్తుంటుంది. 2021 నుంచి టైటానిక్ శకలాలను చూసేందుకు టైటాన్ అనే సబ్ మెర్సిబుల్ ద్వారా యాత్రికులను తీసుకెళ్తూ వస్తోంది. ఈ అడ్వెంచర్ టూర్లో 400 మైళ్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. టైటాన్లో.. ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. వాళ్లకు తగ్గట్లే సీటింగ్ ఉంటుంది. దాదాపు 6.5 మీటర్ల పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల దాకా బరువు ఉంటుంది. కార్బన్, టైటానియం కలయిక గోడలు ఉన్నాయి. సోనార్ నేవిగేషన్ సిస్టమ్, హైఎండ్ కెమెరా ఎక్విప్మెంట్, పవర్ఫుల్ ఎల్ఈడీ లైట్లు.. వీటితో పాటు లోపలికి ప్రవేశించడానికి, బయటకు రావడానికి ఒక్కటే ద్వారం ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. తాజాగా వెళ్లిన ఐదుగురికి(ఒక పైలట్, మిగిలిన నలుగురు యాత్రికులు) 2.50 లక్షల డాలర్లు చెల్లించారు. మన కరెన్సీ లెక్కలో.. అది రూ.2 కోట్లకు పైమాటే. అయితే టైటాన్ నిర్మాణం అట్లాంటిక్ అగాధంలోకి వెళ్లడానికి పనికిరాదంటూ మొదటి నుంచి కొందరు నిపుణులు మొత్తుకుంటున్నా.. ఓషన్‌గేట్ మాత్రం యాత్రలు నిర్వహిస్తూనే వస్తోంది. అంతేకాదు దానిని ఆపరేట్ చేసేందుకు ఉపయోగించే రిమోట్ విషయంలోనూ తీవ్ర విమర్శలు.. మరోవైపు సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. టైటానిక్ శకలాలకు చూసేందుకు గతంలో ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ప్రయత్నించి భంగపడ్డాయి. అయితే చాలామంది నిపుణులు ఈ యాత్రను ఆత్మహత్య సదృశ్యంగా వర్ణించారు కూడా. ఇదీ చదవండి: టిక్.. టిక్.. టిక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌లా టైటాన్ కోసం.. డబ్బే కాదు.. గుండెధైర్యం ఉన్నోళ్లు కూడా! ‘టైటాన్ సబ్మెర్సిబుల్’ మొత్తం ఐదుగురు టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లారు. సాధారణంగా ఇలాంటి యాత్రలకు ఎంపిక ప్రక్రియ కూడా పకడ్బందీగానే జరుగుతుంది. అయితే ఈసారి యాత్రలో వెళ్లిన వాళ్లంతా.. గతంలో సాహస యాత్రలు చేసిన అనుభవం ఉన్నవాళ్లూ ఉన్నారు. కానీ, ఈసారి సాహసయాత్ర వాళ్లను ప్రాణాలను బలిగొంది. డాషింగ్ అండ్ డేరింగ్ హార్డింగ్.. బ్రిటన్‌కు చెందిన 58ఏళ్ల బిలియనీర్ హమీష్ హార్డింగ్ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. దుబాయ్‌కు చెందిన యాక్షన్ ఏవియేషన్స్ కంపెనీ చైర్మన్‌గా వ్యహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఆయన మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. అతను ఒక సాహసికుడు. 2022లో జెఫ్ బెజోస్ నిర్వహించిన బ్లూ ఆరిజిన్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. అనేకసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా సందర్శించారు. మహాసాగరంలో అత్యంత లోతైన ‘మరియానా ట్రెంచ్’లో ఎక్కువసేపు గడిపారు. ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. నమీబియా నుంచి భారత్‌కు 8 చీతాలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి షెహజాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్‌లు. బ్రిటిష్-పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19) కూడా మినీ జలాంతర్గామిలో ఉన్నారు. షాజాదా.. కరాచీ కేంద్రంగా.. పాక్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్. ఇంగ్రో సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. 2022లో ఈ సంస్థ 350 బిలియన్ రూపాయల ($1.2 బిలియన్) ఆదాయాన్ని ప్రకటించింది. పాకిస్థాన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో షాజాదా తండ్రి హుస్సేన్ దావూద్ పేరు ప్రతిసారీ ఉంటుంది. సర్రేలో భార్యా, ఓ కూతురు, కొడుకుతో ఆయన సెటిల్ అయ్యారు. దావూద్‌కు యూకేలోని ఉన్నతవర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన పలు సాహస యాత్రల్లో పాల్గొన్నారు కూడా. ఓషియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్.. ఓషన్‌గేట్ సహవ్యవస్థాపకుడు. ట్రైనింగ్ పైలట్ అయిన రష్.. గతంలో టైటానిక్ శకలాలను చూసి వచ్చారు కూడా. నిపుణుడి హోదాలో ఆయన ఆ బృందం వెంట వెళ్లారు. ఫ్రెంచ్ సబ్మెర్సిబుల్ పైలట్ పాల్ హెన్రీ నార్జిలెట్.. నౌకాదళంలో కమాండర్‌గా పని చేసిన అనుభవం ఉంది ఈయనకి. అత్యంత లోతైన ప్రదేశాల్లో పని చేసే టీంలకు ఈయన కెప్టెన్‌గా వ్యవహరించారు. నావికుడిగా పాతికేళ్ల అనుభవమూ ఉంది. ది ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ సీలో చేరి.. ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రీయ పర్యటనలకు వెళ్లారాయన. విలాసవంతమైన టైటానిక్ నౌక.. 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను 3,800 మీటర్ల లోతులోని సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. ఇదీ చదవండి: వేల అడుగుల లోతుల్లో టైటానిక్.. మీరూ చూసేయండి -
భూగర్భ హోటల్..అక్కడికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే!
ఇంతవరకు ఎన్నో లగ్జరీ హోటళ్ల గురించి విని ఉంటాం. ఆకాశంలోనూ, సముద్రం అడుగున ఉండే అత్యంత ఖరీదైన హోటళ్లను చూశాం. కానీ భూగర్భంలో వేల అడుగుల లోతుల్లో హోటల్.. అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఐతే అక్కడకి వెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఒకరకంగా సాహసంతో కూడిన పని. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే.. యూకేలో నార్త్ వేల్స్లో ఎరారీ నేషనల్ పార్క్‌లోని స్నోడోనియా పర్వతాల కింద ఉంది. భూగర్భంలో ఏకంగా 1,375 అడుగుల దిగువున ఉంది. అందుకే ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత లోతుగా ఉండే హోటల్‌గా గుర్తింపు పొందింది. దీని పేరు 'డీప్ స్లీప్ హోటల్'. ఈ హోటల్‌కు వెళ్లడమే ఓ అడ్వెంచర్. ఎరారీ నేషనల్ పార్క్‌లో పర్వతాల కింద ఉండే ఈ హోటల్లో క్యాబిన్లు, రూమ్‌ల సెటప్ అదిపోతుంది. ఈ హోటల్లోకి వచ్చేక అక్కడ ఉన్న ఆతిథ్యాన్ని చూసి.. అక్కడకి చేరుకోవడానికి పడ్డ పాట్లన్నింటిని మర్చిపోతారు. ఇందులో ట్విన్ బెడ్లతో కూడిన నాలుగు క్యాబిన్లు, డబుల్ బెడ్‌తో ప్రత్యేకు గుహలాంటి రూములు అతిధులను మత్రముగ్దుల్ని చేస్తాయి. ఇక్కడ ఏడాది ఏడాది పొడవునా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ..క్యాబిన్లకు థర్మల్ లైనింగ్ ఉండటంతో వెచ్చగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ అండర్ గ్రౌండ్ హోటల్లో బస చేసేందుకు వెచ్చగా ఉండే దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. ఆ హోటల్ కేవలం రాత్రి పూట బస చేయడానికి అతిథులను ఆహ్వానిస్తుంది. అదికూడా కేవలం శనివారం రాత్రి నుంచి ఉదయ వరకు మాత్రమే అక్కడ బస. ఈ హోటల్‌కి చేరుకోవడం అలాంటి ఇలాంటి ఫీట్ కాదు. ఓ సాహస యాత్ర. మొదటగా పర్యాటకులు పర్వతాల మీదకు కాలినడన శిఖరాన చేరకున్న తర్వాత హోటల్ నిర్వాహకులు భూగర్భంలోకి వెళ్లడానికి కావాల్సిన హెల్మెట్, లైట్, బూట్లు ఇతరత్రా వస్తువులకి సంబంధించి సంరక్షణ కిట్‌ని ఇస్తారు. వాటిని ధరించి గైడ్ సమక్షంలో బండ రాళ్ల వెంట ట్రెక్కింగ్ చేసుకుంటూ..మెట్ల బావులు, వంతెనలు దాటుకుంటూ కఠిన దారుల వెంట ప్రయాణించాలి. అలా ప్రయాణించక పెద్ద ఐరన్ డోర్ వస్తుంది. కానీ ఇక్కడకు పిల్లలకు మాత్రం 14 ఏళ్లు దాటితేనే అనుమతిస్తారు. ఇక ప్రైవేట్ క్యాబిన్లో ఇద్దరికి బస రూ. 36 వేలు కాగా , గుహ లాంటి గదికి గానూ రూ. 56 వేలు వెచ్చించాల్సి ఉంది. అయితే ఇక్కడకు వచ్చే పర్యాటకులు మాత్రం ఇంత పెద్ద సాహసయాత్ర చేసి ఆ హోటల్లో బస చేయడం ఓ గొప్ప అనుభూతి అంటున్నారు. అంతేగాదు తమ జీవితంలో మంచి నిద్రను పొందామని ఆనందంగా చెబుతున్నారు పర్యాటకులు. (చదవండి: ఈ టూర్ యాప్ మహిళల కోసమే.. ఇందులో ప్రత్యేకతలు ఏంటో చూసేయండి) -
భారతదేశంలోని టాప్ 10 సాహస ప్రదేశాలు
-
రైడింగ్‌కి సిద్ధమైపోండి.. మరిన్ని హంగులతో 390 అడ్వెంచర్ వచ్చేసింది!
2023 KTM 390 Adventure Spoke Wheels: కుర్రకారుకు ఎంతో ఇష్టమైన 'కెటిఎమ్ 390 అడ్వెంచర్' KTM 390 Adventure) ఇప్పుడు కొన్ని ఆధునిక హంగులతో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ఈ బైక్ ప్రైస్, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ విఫణిలో విడుదలైన కొత్త 'కెటిఎమ్ 390అడ్వెంచర్' ధర రూ. 3.60 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ బైక్ ఇప్పుడు మరింత ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వైర్-స్పోక్ రిమ్‌లను కలిగి ఉండటం వల్ల మరింత రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. కొత్త మార్పులు.. గతంలో చాలామంది కెటిఎమ్ బైక్ రైడర్లు ఈ వైర్-స్పోక్ రిమ్ ఫీచర్ ఉంటే మరింత గొప్ప రైడింగ్ అనుభూతిని పొందవచ్చని అభిప్రాయం వ్యక్తం చేయడం వల్ల చివరకు కంపెనీ ఆ ఫీచర్ తీసుకువచ్చింది. ఇందులో అల్యూమినియం వైర్-స్పోక్ రిమ్‌లు ఉన్నాయి. ఇవి కూడా ట్యూబ్-టైప్ మెట్జెలర్ టూరెన్స్ టైర్లను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. (ఇదీ చదవండి: భారత్‌లో అరంగేట్రం చేయనున్న ఎక్స్ఎల్7 - ఫీచర్స్‌కి ఫిదా అవ్వాల్సిందే!) లేటెస్ట్ కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఇప్పుడు అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా కలిగి ఉంటుంది. అయితే ఫోర్క్ కంప్రెషన్ అండ్ రీబౌండ్ కోసం మాత్రమే అడ్జస్టబుల్ ఉంటుంది. కానీ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ లేదు. అదే సమయంలో 10 స్టెప్ ఫ్రీలోడ్ & 20 స్టెప్ రీబౌండ్ అడ్జస్ట్ పొందుతుంది. ఈ కొత్త మార్పులు మాతర్మే కాకుండా ఈ బైక్ ఇప్పుడు కొత్త ర్యాలీ ఆరెంజ్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. (ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్‌గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!) డిజైన్, ఫీచర్స్ కూడా దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. ఇంజిన్ విషయానికి ఇందులో 373 సిసి 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 42.9 bhp పవర్, 37 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది, కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి -
HYD: ఎస్సై సార్ సాహసం.. ప్రాణాలకు తెగించి 16 మందిని కాపాడాడు
సాక్షి, హైదరాబాద్: మనిషికి సమయస్ఫూర్తితో పాటు ధైర్యసాహసాలు కూడా అవసరమే!. తన ప్రాణాలకు తెగించి మరీ ఇక్కడో ఎస్సై సార్.. పదహారు మంది ప్రాణాలను కాపాడారు. రియల్ హీరో అనిపించుకున్నారు. మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. పదహారు మందిని డీసీఎంలో తరలిస్తుండగా.. ఖైరతాబాద్ వైపు వచ్చే వాహనం నడుపుతున్న హోంగార్డు రమేష్‌కు ఫిట్స్ వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి.. డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో డీసీఎంలో ఉన్న బంజారాహిల్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. కిందకు దూకి ప్రాణాలకు తెగించి వాహనాన్ని కంట్రోల్ చేశారు. ఈ క్రమంలో ఆయనకు, మరో కానిస్టేబుల్ సాయి కుమార్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. ఎస్సై సార్ సాహసంతో 16 మంది ప్రమాదం నుంచి బయటపడగా.. గాయపడిన ఎస్సై కరుణాకర్‌ను, రమేష్‌ను ఆస్పత్రికి తరలించారు. -
భారీ పైథాన్, పులులతో విజయ్ అడ్వెంచర్.. వీడియో వైరల్
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. తెలంగాణ యాసలో విజయ్ మాట్లాడే తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక అతడి డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరేంట్‌గా ఉంటుంది. ఇక తను ఏం చేసిన అందులో స్పెషాలిటీ ఉండేలా జాగ్రత్త పడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తాడు ఈ ‘రౌడీ’ హీరో. ఇటీవల లైగర్ చిత్రంతో ఫ్యాన్స్‌ని అలరించిన విజయ్ ప్రస్తుతం దుబాయ్‌లో సందడి చేస్తున్నాడు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరో తెలుసా? కుటుంబంతో కలిసి అరబ్ దేశంలో వాలిపోయాడు. అక్కడ ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న విజయ్ ఎప్పటికప్పుడు తమ ఫొటోలు షేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేశాడు విజయ్. దుబాయ్‌లోని ఓ పార్క్‌ను సందర్శించి అక్కడ పక్షులు, జంతువులతో సరదాగా గడిపాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ జీవితంలో మరో మధుర జ్ఞాపకాలను కూడబెట్టుకున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోలో విజయ్ పులులు, సింహాలు, పైతాన్లతో అడ్వంచర్ చేస్తూ కనిపించాడు. చదవండి: కన్నీళ్లు రావడం లేదు.. అంతకంటే చలించే సంఘటన ఇంకేముంటుంది: సింగర్ సునీత సైఫ్ బెల్సాసా అనే వ్యక్తి ఆర్గనైజ్ చేస్తున్న ప్రైవేట్ జూని సందర్శించి అక్కడ పాములని తన మెడలో వేసుకున్నాడు. భారీ ఫైథాన్ ఒంటిపై పాకించుకున్నాడు. అక్కడి పక్షులు, కోతులు లాంటి చిన్న చిన్న జంతువులకు ఫుడ్ తినిపించాడు. బోనులో సింహంతో టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడాడు. పులి పిల్లకు పాలు పట్టించాడు. మొత్తానికి జంతువులు, పక్షులతో తమ సమయాన్ని ఆస్వాదించిన విజయ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
న్యూస్ మేకర్: గగనాన్ని జయించింది
‘పక్షి తన రెక్కలను విశ్వసించాలేగాని అంబరం అంచుల్ని చూడగలదు’ అంది మంగళవారం రోజు 10 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ (పారాచూటింగ్) చేసిన లాన్స్‌నాయక్ మంజు. భారత సైన్యంలో ఈ ఘనత సాధించిన తొలి వనితగా మంజు రికార్డు సృష్టించింది. ఆర్మీలో మిలటరీ పోలీస్ విభాగంలో పని చేసే మంజును భారతసైన్యం ఈ ఫీట్ కోసం ఎంచుకుంది. ఇందుకోసం అడ్వంచర్ వింగ్ ఆమెకు శిక్షణ ఇచ్చింది. మంగళవారం ఇద్దరు స్కైడైవర్లతో పాటు ‘ఎ.ఎల్.హెచ్.ధ్రువ్’ (అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్)లో నింగిలోకి ఎగిరిన మంజు పదివేల అడుగులకు చేరాక జంప్ చేసి తోటి స్కైడైవర్లతో పాటు కొన్ని సెకండ్ల పాటు ఉమ్మడి విన్యాసం చేసింది. ఆ తర్వాత పారాచూట్ విప్పుకుని సురక్షితంగా నేలకు దిగింది. ‘మంజు సాధించిన ఈ ఘనత సైన్యంలో పని చేసే మహిళలకు స్ఫూర్తిదాయకం’ అని ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి మన దేశంలో రెండో ప్రపంచ యుద్ధం నుంచి పారాచూట్ రెజిమెంట్ (1941 ఆవిర్భావం) ఉంది. కాని ఇది మగవారికి ఉద్దేశించబడింది. యుద్ధాల్లో మన సైన్యానికి పారాట్రూప్స్ విశేష సేవలు అందించాయి. అయితే ప్రయివేట్ వ్యక్తులు పారాచూటింగ్ చేయడానికి కూడా మన దేశంలో అనుమతులు అంత సులభం కాదు. శిక్షణ కూడా అంతంత మాత్రమే. అందుకే విదేశాలకు వెళ్లి స్కై డైవింగ్‌లో శిక్షణ తీసుకుంటూ ఉంటారు ప్రయివేటు వ్యక్తులు. మన దేశంలో స్కై డైవింగ్ చేసిన తొలి స్త్రీ ప్రయివేటు వ్యక్తే. రేచల్ థామస్ అనే కేరళ రైల్వే ఉద్యోగి 2002లో అది నార్త్ పోల్‌లో 7000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి ఈ రికార్డును సొంతం చేసుకోవడమే కాదు ‘పద్మశ్రీ’ కూడా అందుకుంది. ఇటీవల కాలంలో స్త్రీలు చాలామంది ప్రయివేటుగా స్కై డైవింగ్ నేర్చుకుని జంప్ చేస్తున్నారు. మహిళల ముందంజ ఇటీవల త్రివిధ దళాలలో పని చేస్తున్న స్త్రీలు రికార్డులు సాధించి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలలోనే కెప్టెన్ అభిలాష బరాక్ ఆర్మీ ఏవియేషన్‌లో మొదటి మహిళా ఆఫీసర్‌గా నియమితురాలైంది. గత సంవత్సరం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మాయ సుదన్ మొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా బాధ్యత పొందింది. ఫ్లయిట్ లెఫ్టినెంట్ హినా జైస్వాల్ మొదటి మహిళా ఫ్లయిట్ ఇంజనీర్‌గా తొలి అడుగు వేసింది. ఇవన్నీ ఘనకార్యాలే. వారి వరుసలో ఇప్పుడు మంజు చేరింది. గగనాన్ని జయించాలని ఇటీవల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువతులు కూడా అభిలషిస్తున్నారు. సైన్యంలో చేరో ఏవియేషన్ చదువులు చదివో లేకుంటే కనీసం ఎయిర్ హోస్టెస్‌గా అయినా ఆకాశంలో విహరిస్తున్నారు. అనుకోవాలే గానీ చేయొచ్చని నిరూపించే వీరంతా విజేతలే. ఆర్మీకి చెందిన లాన్స్‌నాయక్ మంజు స్కై డైవింగ్ చేసిన తొలి సైనికురాలిగా చరిత్ర సృష్టించింది. 10 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి ఇటీవల ఆమె ఈ రికార్డు సాధించింది. -
సాధారణ తాడుపై థ్రిల్ ఏముందనుకున్నారేమో.. అగ్నిపర్వతంపై నడక
నిప్పులగుండం మీద నడక తెలిసిందే. కానీ.. ఇది జారిపడితే బూడిద కూడా మిగలకుండా పోయే లావాపై నడక. ఊహించడానికే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా! కానీ నడిచి చూపించారు బ్రెజిల్‌కు చెందిన రాఫేల్ బ్రీదీ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ స్కుల్జ్. సాహసాలు చేయడంలో ఆరితేరిన ఈ ఇద్దరికీ తాడు మీద నడవడమంటే మంచినీళ్ల ప్రాయం. అయితే సాధారణ తాడు మీద నడిస్తే... సాహసమేముందనుకున్నారేమో! టానా ద్వీపంలో ఉన్న అగ్నిపర్వతంపై 137 అడుగుల ఎత్తులో తాడుపై నడిచారు. ఓ వైపు లావా ఎగసి పడుతుండగానే... ఆ తాడుపై 856 అడుగుల మేర నడిచి.. గిన్నిస్ రికార్డును సృష్టించారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
రష్యా అగ్ని పర్వతంపై మెరిసిన త్రివర్ణం
మరిపెడరూరల్/ముషీరాబాద్: గిరిజన సాహసికుడు యశ్వంత్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్బ్రస్ అగ్ని పర్వతాన్ని అధిరోహించాడు. పర్వత శ్రేణిపై భారత జాతీయ పతకాన్ని ఎగురవేసి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన భూక్య రాంమ్మూర్తి, జ్యోతి దంపతుల కుమారుడు యశ్వంత్‌కు చిన్నప్పటి నుంచే పర్వతారోహణ అంటే ఇష్టం. గతేడాది జూన్‌లో జమ్మూకశ్మీర్‌లోని 5,602 మీటర్ల ఎత్తయిన ఖార్డుంగ్లా పర్వతాన్ని, ఆగస్టులో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ఈ ఏడాది జూన్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తయిన యునామ్ మంచు పర్వత శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. ఈ క్రమంలో ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ కంపెనీ వారు యశ్వంత్‌ను రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతారోహణకు ఎంపిక చేశారు. యశ్వంత్ 5,642 మీటర్ల ఎత్తయిన ఈ అగ్ని పర్వతాన్ని ఇటీవలే అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. -
తెలుగు బాలుడి సాహసయాత్ర.. రోజుకు 150 కిలోమీటర్లు సైకిల్‌పై..
సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఉర్దనపల్లి ఆశిష్ చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ మీద సాహసయాత్ర చేశాడు. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశిష్ కుటుంబం వ్యాపారరీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్‌పై ఆసక్తి ఉన్న ఆశిష్ జూలైలో చెన్నై నుంచి సైకిల్‌పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్‌కు చేరుకున్నాడు. సైకిల్‌యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్ సహా అతడి కుటుంబసభ్యులు ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆశిష్ మాట్లాడుతూ సైకిల్ యాత్రలో మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. చండీఘడ్ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలన్నదే తన కల అని పేర్కొన్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. చెన్నై నుంచి లండన్‌కు సైకిల్‌యాత్ర చేయనున్నట్లు ఆశిష్ చెప్పాడు. (క్లిక్: 23 నిమిషాల్లో 2005 కిక్స్.. తైక్వాండోలో బాలిక ప్రతిభ) -
మహాసముద్రంలో మిస్టరీలు.. మరి మీరు రెడీనా!
సముద్రంలో కనివిని ఎరగని జీవజాలాలే కాదు... ఎన్నో మిస్టరీలు దాగున్నాయి. వాటిని ఛేదించాలనుకుంటున్నారా? ఉత్సాహం ఉందా? అయితే పదండీ... ఈ నెలలో విడుదలైన సర్రియల్ అండర్ వాటర్ అడ్వెంచర్ గేమ్ ఫజిల్... స్లీట్. సముద్రాన్ని బయటి నుంచి చూడడం వేరు, సముద్రగర్భంలోకి వెళ్లడం వేరు. ఇప్పుడు మనం లో లోపటికి వెళుతున్నాం. అదిగో... తిమింగలానికి బాప్‌లాంటి రాక్షస తిమింగలం ఎదురొస్తుంది. అది నోరు తెరిస్తే... కోరల రూపంలో పదునైన గునపాల వనం కనిపిస్తుంది. అది మళ్లీ నోరు మూసే లోపే మనం తప్పించుకోవాలి. (క్లిక్: యూట్యూబ్‌లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఇదే!) కమ్మని సంగీతం వినిపిస్తే అటువైపు వెళతాం. ఏదో జంతువులాగుంది. బూర వాయిస్తుంది. వెళ్లాలా? వద్దా? అని ఆలోచించేలోపే అది మనపై ఎటాక్ చేయవచ్చు. అటు వైపు వెళితే... మన ‘పాతాళభైరవి’లో హీరోకు కనిపించే పే.....ద్ద విగ్రహంలాంటిది కనిపించి కళ్లెర్ర చేయవచ్చు. ఇంకొంచెం దూరం వెళితే... అందమైన దీపాలు అద్భుతమైన వెలుగుతో కనిపిస్తాయి. ‘ఆహా’ అనుకునే లోపే ఆ దీపాలు కాస్త భారీ గొంగళి పురుగుల ఆకారంలో మనల్ని వేటాడడానికి వస్తుంటాయి. ఇవి కొన్ని మాత్రమే. మరి మీరు రెడీనా! జానర్: అడ్వెంచర్ ఇండీ డెవలపర్స్: స్పైరల్స్ సర్కస్ -
ఓరి.. భడవా! అమ్మ తిట్టిందని..18 కి.మీ నడిచి వెళ్లి..
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో శుక్రవారం అదృశ్యమైన 9 ఏళ్ల బాలుడు విష్ణువర్ధన్ ఆచూకీ లభించింది. పోలీసులు శనివారం బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. అయితే ఘటనలో బాలుడు ఎక్కడకు వెళ్లాడు? ఏమయ్యాడు? ఎలా దొరికాడనే విషయాలు తెలిస్తే.. వీడు పిల్లాడు కాదు.. పిడుగు అనిపిస్తుంది. టూటౌన్ సీఐ యుగంధర్ తెలిపిన వివరాలు.. ప్రశాంత్‌నగర్‌కు చెందిన గీత పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ పక్కింటి అబ్బాయితో గొడవపడటంతో తల్లి మందలించింది. దీంతో శుక్రవారం ఉదయం స్కూల్‌కు వెళుతున్నట్టు చెప్పి కనిపించకుండాపోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టారు. ఇంటి నుంచి వెళ్లిన రోజు ఉదయం 9 గంటలకు ప్రశాంత్‌నగర్ నుంచి నడుచుకుంటూ గిరింపేట దుర్గమ్మ గుడి దాటినట్టుగా సీసీ కెమెరాల్లో గుర్తించారు. తవణంపల్లె మండలం దిగువ తడకరలో ఉంటున్న గీత తల్లిదండ్రులు కూడా శనివారం చిత్తూరుకు చేరుకుని పిల్లాడి కోసం వెతకసాగారు. ఇదిలా ఉండగా, విష్ణువర్దన్ నిన్న సాయంత్రానికే చిత్తూరు నుంచి దాదాపు 18 కి.మీ దూరంలో ఉన్న తవణంపల్లెలో దిగువ తడకర సమీపంలోని ఓ గ్రామానికి చేరుకున్నాడు. చీకటి పడడంతో అక్కడే ఓ ఇంటి వద్ద పడుకుని.. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దిగువ తడకరకు చేరుకున్నాడు. బాలుడిని చూసిన స్థానికులు వెంటనే విషయాన్ని గీత తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో పోలీసులు దిగువ తడకరకు వెళ్లి బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లిపై కోపంతో విష్ణువర్ధన్ అంతదూరం నడుచుకుంటూ తన అమ్మమ్మ, తాత ఇంటికి ఎవరి సాయం లేకుండా వెళ్లడంపై పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. రెండుసార్లు తడకరకు బస్సులో వెళ్లిన విష్ణువర్దన్.. అక్కడక్కడా చూసిన కొండగుర్తులతో దిగువ తడకరకు నడిచి వెళ్లడం విశేషం. -
వయసుకు సవాలు విసురుతూ.... మరో సాహసానికి సై!
‘ఈ వయసులో సాహసం ఏమిటి!’ అనుకునే వాళ్లు చాలామందే ఉండొచ్చు. ‘సాహసానికి వయసుతో పనేమిటి?’ అని దూసుకుపోయేవాళ్లు చాలా తక్కువమందే ఉండొచ్చు. అయితే రెండో కోవకు చెందిన చాలా తక్కువ మందే చాలా ఎక్కువమందికి స్ఫూర్తి ఇస్తుంటారు బచేంద్రిపాల్ ఈ కోవకు చెందిన మహిళ. బచేంద్రిపాల్... పర్వతాలు పులకరించే పేరు. సాహసాలు అమితంగా ఇష్టపడే పేరు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలిభారతీయ మహిళగా ఆమె పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. అరవై ఏడు సంవత్సరాల పాల్ ఈ వయసులోనూ మరో సాహసయాత్రకు సిద్ధం అవుతున్నారు. సాహసానికి సై అంటున్నారు. యాభై ఏళ్లు దాటిన తొమ్మిదిమంది మహిళలతో కలిసి అపూర్వ సాహస యాత్ర చేయబోతున్నారు. బృందానికి నాయకత్వం వహిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి మొదలయ్యే యాత్ర లద్దాఖ్‌లో ముగుస్తుంది. హిమాలయపర్వతశ్రేణుల గుండా సుమారు అయిదు నెలల పాటు సాగే యాత్ర ఇది. ఈ యాత్రలో వయసు పరిమితులు, వాతావరణ ప్రతికూలతలు, పదిహేడువందల అడుగులకుౖ పెగా ఎత్తు ఉన్న ‘లంకాగ’లాంటి పర్వతాలు సవాలు విసరనున్నాయి. ఈ సాహస బృందంలోని సభ్యులు: 1. బచేంద్రిపాల్ (67, ఉత్తర్ కాశీ) 2. గంగోత్రి సోనేజి (62, బరోడా) 3. శ్యామలాపద్మనాభన్ (64, మైసూర్) 4. చేతనా సాహు (54, కోల్‌కతా) 5. పాయో ముర్ము (53, జంషెడ్పూర్) 6. చౌలా జాగిర్దార్ (63, పాలన్పుర్) 7. సవితా దప్వాల్ (52, భిలాయ్) 8. డాక్టర్ సుష్మా బిస్సా (55, బికనేర్) 9. బింబ్లా దేవోస్కర్ (55, నాగ్‌పుర్) 10. మేజర్ కృష్ణ దూబే (59, లక్నవూ) ‘సాహసాలకు ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, ఇక చాలు అనిపించవు. ప్రతీ సాహసం దేనికదే ప్రత్యేకతగా నిలుస్తుంది. కొత్త అనుభూతులను ఇస్తుంది. యాభై సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి సిద్ధమైనప్పుడు సాహసయాత్ర కాదు దుస్సాహస యాత్ర చేస్తున్నావు అని హెచ్చరించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. యాభై ఏళ్ల వయసులో ఇదేం పని! అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. అయితే నేను వాటిని మనసులోకి తీసుకోలేదు. లక్ష్యమే నా ప్రాణం అయింది. అలా యాభైఏళ్ల వయసులో నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోగలిగాను. ఇప్పుడు కూడా వెనక్కిలాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాభైనాలుగేళ్ల వయసులో ఈ సాహసం ఏమిటీ అంటున్నారు చాలామంది. ఇప్పుడు కూడా విజయంతోనే సమాధానం చెబుతాను’ అంటుంది ఈ బృందంలో ఒకరైన 54 ఏళ్ల చేతనా సాహు. ఈ పదిమంది ఉత్తరకాశీలో శిక్షణ తీసుకున్నారు. ‘అరవై ఏళ్లు దాటిన తరువాత ఎప్పుడూ నడిచే దారికంటే ఇంకొంచెం ఎక్కువ దూరం నడిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేమిటోగానీ శిక్షణ సమయంలో బాగా అలిసిపోయినట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు. మనోబలం అంటే ఇదేనేమో’ అంటుంది గంగోత్రి సోనేజి. ఆమె వయసు అక్షరాల అరవైరెండు! 4,625 కిలోమీటర్ల ఈ సాహసయాత్ర అంతర్జాతీయ మహిళాదినోత్సవం (మార్చి–8) రోజు ప్రారంభమై ఆగస్టులో ముగుస్తుంది. ‘ఆరోగ్యస్పృహ విషయంలో అన్ని వయసుల మహిళలకు స్ఫూర్తి ఇచ్చే యాత్ర ఇది’ అంటుంది బచేంద్రిపాల్. విజయోస్తు -
జడతో కారు లాగిన చిన్నారి!
మార్కాపురం: రెండు జడలతో కారును లాగి అందర్నీ అబ్బురపరిచిందో చిన్నారి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన క్రీడా కోచ్ చిట్టిబాబు కుమార్తె టి.బిందు (సౌజన్య) స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. (చదవండి: వెంట్రుకలను ఎందుకలా కత్తిరిస్తున్నారని అడిగా..) బుధవారం పీఎస్ కాలనీలోని మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్లో సాహసం చేసి అందరితో శభాష్ అనిపించుకుంది. పట్టుమని 12 ఏళ్లు నిండని చిన్నారి.. తన జడతో మారుతీకారును 50 మీటర్లు లాగింది. ఈ సాహసాన్ని చూసిన ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి బిందును అభినందించారు. -
Manjarabad Fort: మంజారాబాద్.. స్టార్ఫోర్ట్
ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాన్ని చూడాలంటే తలెత్తి చూస్తే చాలు. నేల మీద ఉన్న ఈ నక్షత్రాన్ని చూడాలంటే మాత్రం ఆకాశంలో విహరించాల్సిందే. ఈ టూర్లో ఈ నక్షత్రకోటతోపాటు పశ్చిమ కనుమల ప్రకృతి విన్యాసాలన్నీ ఆస్వాదించవచ్చు. కర్ణాటక ఊటీ... నక్షత్రం ఆకారంలో ఉన్న ఈ కోట కర్ణాటక, హసన్ జిల్లాలో ఉంది. ఈ కోట సందర్శన పెద్ద సాహసం అనే చెప్పాలి. నాచు మధ్య జాగ్రత్తగా అడుగులు వేస్తూ దిగుడుబావి ఒడ్డుకు చేరడం యువతకే సాధ్యం. ఏడాది మొత్తం ఇక్కడ చల్లగానే ఉంటుంది. ఈ చల్లదనానికి పశ్చిమ కనుమల పచ్చదనం కూడా కారణమే. సక్లేశ్‌పురా నుంచి ఈ కోటకు ప్రయాణం మొదలైనప్పటి నుంచి కాఫీ గింజల పరిమళం ఉత్సాహాన్నిస్తుంది. ఆకాశాన్నంటుతున్న పోక చెట్లు మీ ప్రయాణం కూడా ఆకాశం వైపేనని గుర్తు చేస్తాయి. యాలకుల చెట్లు వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంటే మిరియాల గుత్తులు ఒకింత ఘాటు వాసనతో ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్నిస్తుంటాయి. చల్లటి వాతావరణంలో గొంతు గరగర అనిపిస్తే రెండు మిరియాలను నమిలితే పర్యటన ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. మధ్యలో చిన్న చిన్న నీటి కాలువలు పాదాలను కడుగుతుంటాయి. కొండల్లో ప్రవహించే స్వచ్ఛమైన నీరు చల్లగా పాదాలను స్పృశిస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఈ హిల్స్టేషన్ను ఊటీతో పోలుస్తారు. ఊటీ సంపన్నుల పర్యాటక క్షేత్రం అయితే ఇది పేదవారి పర్యాటక ప్రదేశమని చెబుతారు. మంచులో మెరిసిన నక్షత్రం... హసన్ జిల్లా కేంద్రానికి 45 కి.మీల దూరంలో మల్నాడు రీజియన్, సక్లేశ్‌పురా పట్టణానికి దగ్గరలో ఉన్న స్టార్ఫోర్ట్ అసలు పేరు మంజారాబాద్ కోట. మంజు అంటే కన్నడలో మంచు అని అర్థం. ఎప్పుడూ మంచు తెర కమ్మినట్లే ఉంటుంది ఇక్కడి వాతావరణం. ఇది మైసూరు పాలకుల వేసవి విడిదిగా ఉండేది. ఈ కోటలో పెద్ద ఆయుధాగారం ఉండేదని ఇప్పుడున్న ఆనవాళ్లు చెబుతుంటాయి. మైసూర్ కోట నుంచి ఈ కోటకు రహస్య మార్గం ఉండేదని స్థానిక కథనం. ఎనిమిది కోణాల నిర్మాణం ఇది. నిజానికి దీనిని ఎనిమిది రెక్కల పద్మం ఆకారం అనే చెప్పాలి. అయితే మూలలు కోసుగా కోణాకారంలో ఉండడంతో నక్షత్రకోటగా వాడుకలోకి వచ్చింది.