Agriculture Mission
-
మూడేళ్లుగా ముందుకుసాగని పథకం.. విత్తనోత్పత్తికి అంతరాయం!
రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఉద్దేశించిన గ్రామ విత్తనోత్పత్తి పథకానికి మంగళం పాడినట్లే కనపడుతోంది. 50శాతం సబ్సిడీపై రైతుకు ఫౌండేషన్ సీడ్ (మూల విత్తనం) అందించి నాణ్యమైన విత్తనాలు రైతులే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇక లేకుండా పోయింది. మూడేళ్లుగా ఈ పథకం ఊసే లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. వానాకాలానికి సంబంధించి 5.80లక్షలు ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలు ఉంటాయి. యాసంగికి సంబంధించిన వివిధ రకాల పంటలు 3.5లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరికీ నాణ్యమైన విత్తనం అందించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారుతోంది. ఈ దుస్థితిని నివారించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి గతంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేశారు. సిద్దిపేట జిల్లాను విత్తన హబ్‌గా తయారు చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ప్రతిసారి ఏదో పంటను ఎంచుకొని ఈ పథకం అమలు చేసేవారు. ఏటా జిల్లాలోని పలు గ్రామాల్లో వానాకాలానికి సంబంధించి వరి, కంది, మొక్కజొన్న, యాసంగిలో శనగ పంటల్లో విత్తనోత్పత్తి చేసేవారు. దీని ద్వారా రైతులకు 50శాతం సబ్సిడీపై మూల విత్తనం అందిస్తారు. పరిశోధనా స్థానాల నుంచి నేరుగా వచ్చే వీటి వల్ల విత్తనోత్పత్తికి అవకాశముంటుంది. విత్తనాలు అందించిన తర్వాత వ్యవసాయశాఖ విత్తనం వేసింది మొదలు.. పంట చేతికొచ్చేసరికి మూడుసార్లు శిక్షణ అందించి నాణ్యమైన విత్తన ఉత్పత్తికి బాటలు వేసేవారు. ఉత్పత్తిగా వచ్చిన విత్తనాలను రైతులే స్వయంగా తెలిసిన రైతులకు అమ్ముకోవడం, లేదా ప్రభుత్వమే విత్తన కంపెనీలతో అగ్రిమెంట్ చేయించి మార్కెటింగ్ చేసేవారు. కొంత కాలం ఈ పథకం సత్ఫలితాలనిచ్చింది. క్రమేపి ఈ విధానం వల్ల ఆశించిన ఫలితాలు రాక మొగ్గుబడిగా సాగింది. రైతులు ఉత్పత్తి చేసిన విత్తనాలు నాణ్యాత ప్రమాణాలు కలిగి ఉన్నాయా? లేదా అనే విషయం తెలియక కొనుగోలు చేయడానికి చుట్టు పక్కల గ్రామాల రైతులు ఆసక్తి చూపలేదు. కంపెనీలతో అగ్రిమెంట్ చేయించే విషయంలో వ్యవసాయ శాఖ చొరవ చూపలేదు. మరీ మూడేళ్ల నుంచి అయితే పథకం ఊసే కరువైంది. ఫలితంగా ఆసక్తి ఉన్న రైతులకు ఫౌండేషన్ సీడ్‌ను కూడా అందలేదు. దీనిని బట్టి చూస్తే ఈ పథకానికి నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ప్రభుత్వం చొరవపైనే ఆశలు.. కొత్త ప్రభుత్వం చొరవ చూపితేనే ఈ గ్రామ విత్తనోత్పత్తి పథకం సమర్థవంతంగా అమలయ్యే అవకాశముంది. ప్రధానంగా రైతులకు నాణ్యమైన విత్తన సబ్సిడీతోపాటు ఎరువులు, క్రిమిసంహారకాలను సబ్సిడీపై అందించాల్సి ఉంది. దీంతోపాటు రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసేలా రైతులకు ఒప్పందం కుదిరిస్తే.. రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభించి భారీ ప్రయోజనం జరిగే అవకాశముంది. ఇవేకాకుండా ఆత్మకమిటీల పనితీరు మెరుగుపరచడం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకాలను సైతం పునరుద్ధరించాల్సి ఉంది. ఇవి చదవండి: కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం! -
MS Swaminathan: ఆకలి లేని సమాజమే ఆయన కల
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన(1947) తర్వాత దేశంలో వ్యవసాయ రంగం నిస్తేజంగా మారింది. బ్రిటిష్ వలస పాలనలో ఈ రంగంలో అభివృద్ధి నిలిచిపోయింది. వనరులు లేవు, ఆధునిక విధానాలు లేవు. తిండి గింజలకు కటకటలాడే పరిస్థితి. గోధుమలు, బియ్యం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు నాలుగు మెతుకులు అందించలేని దురవస్థ ఉండేది. ఇలాంటి తరుణంలో స్వామినాథన్ రంగ ప్రవేశం వేశారు. హరిత విప్లవానికి బీజం చేశారు. మొదట పంజాబ్, హరియాణా, పశి్చమ ఉత్తరప్రదేశ్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టారు. రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే వంగడాలు సరఫరా చేశారు. ప్రభుత్వ సాయంతో తగిన సాగు నీటి వసతులు కలి్పంచారు. ఎరువులు అందించారు. కొద్ది కాలంలోనే సత్ఫలితాలు రావడం మొదలైంది. 1947లో దేశంలో గోధుమల ఉత్పత్తి ఏటా 60 లక్షల టన్నులు ఉండేది. 1962 నాటికి అది కోటి టన్నులకు చేరింది. 1964 నుంచి 1968 దాకా వార్షిక గోధుమల ఉత్పత్తి కోటి టన్నుల నుంచి 1.70 కోట్ల టన్నులకు ఎగబాకింది. దాంతో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. మనకు అవసరమైన ఆహారాన్ని మనమే పండించుకోగలమన్న నమ్మకం పెరిగింది. గోధుమల తర్వాత స్వామినాథన్ నూతన వరి వంగడాలపై తన పరిశోధనలను కేంద్రీకరించారు. అమెరికాతోపాటు ఐరోపా దేశాల్లో విద్యాసంస్థలతో కలిసి పనిచేశారు. 1954లో కటక్‌లోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. నూతన వరి వంగడాలను సృష్టించారు. దేశీయ రకాలను సంకరీకరించి, కొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. స్వామినాథన్ పలువురు మాజీ ప్రధానమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. హరిత విప్లవాన్ని విజయంతం చేయడానికి శ్రమించారు. గోధుమ వంగడాల అభివృద్ధి కోసం ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్తోనూ స్వామినాథన్ కలిసి పనిచేశారు. సుస్థిర ఆహార భద్రత విషయంలో ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారు. సివిల్ సరీ్వసు వదులుకొని వ్యవసాయం వైపు.. మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జని్మంచారు. ఆయన తండ్రి డాక్టర్ ఎం.కె.సాంబశివన్ వైద్యుడు. తల్లి పార్వతీ తంగమ్మల్ గృహిణి. 11వ ఏట తండ్రిని కోల్పోయారు. తన మామయ్య సంరక్షణలో పెరిగిన స్వామినాథన్ కుంభకోణంలో మెట్రిక్యులేషన్, త్రివేండ్రంలో జంతుశాస్త్రంలో డిగ్రీ చేశారు. తర్వాత కోయంబత్తూరు అగ్రికల్చరల్ కాలేజీ నుంచి అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ పూర్తి చేశారు. యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరి, బంగాళదుంప జన్యు పరిణామంపై అధ్యయనం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యు శాస్త్రవేత్తగా ఎదిగి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరారు. స్వామినాథన్ తొలుత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ, తండ్రి బాటలో వైద్య వృత్తిలో అడుగుపెట్టాలని భావించారు. అయితే, అప్పట్లో ఆకలి చావులను చలించిపోయారు. వ్యవసాయ పరిశోధనా రంగంలో అడుగుపెట్టారు. ఆకలి లేని సమాజాన్ని కలగన్నారు. ప్రజల ఆకలి తీర్చడమే కాదు, పౌష్టికాహారం అందించాలని సంకలి్పంచారు. కరువు పరిస్థితులు చూసి.. వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడానికి కారణాలను స్వామినాథన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘1942–43లో బెంగాల్లో భయంకరమైన కరువు సంభవించింది. తిండి లేక దాదాపు 30 లక్షల మంది చనిపోయారు. దేశం కోసం నేనేమీ చేయలేనా? అని ఆలోచించా. ప్రజల ఆకలి బాధలు తీర్చాలంటే వ్యవసాయ రంగమే సరైందని నిర్ణయానికొచ్చా. మెడికల్ కాలేజీకి వెళ్లడానికి బదులు కోయంబత్తూరులో వ్యవసాయ కళాశాలలకు చేరిపోయా. వ్యవసాయ పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టా. ఎక్కువ మందికి ఆహారం అందించాలంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలు కావాలి. అందుకే జెనెటిక్స్, బ్రీడింగ్‌పై పరిశోధనలు చేశా. కరువు పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించా. వీటితో రైతులు లాభం పొందారు. ప్రజలకు తగినంత ఆహారం దొరికింది’ అని స్వామినాథన్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధరపై కీలక సిఫార్సు స్వామినాథన్ 2004 నుంచి 2006 దాకా ‘నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్’ అధినేతగా వ్యవహరించారు. పంటలకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేశారు. పంటల ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతాన్ని కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని సూచించారు. ఎన్నో పదవులు కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. ► 1981 నుంచి 1985 దాకా ఫుడ్ అండ్ అగ్రిక ల్చరల్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ స్వతంత్ర చైర్మన్ ► 1984 నుంచి 1990 దాకా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అధ్యక్షుడు ► 1982 నుంచి 1988 దాకా ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ► 1989 నుంచి 1996 దాకా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(ఇండియా) అధ్యక్షుడు ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ వరించిన అవార్డులు ► 1967లో పద్మశ్రీ ► 1971లో రామన్ మెగసెసే ► 1972లో పద్మభూషణ్ ► 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ► 1989లో పద్మవిభూషణ్ ► ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లు నేల సారాన్ని కాపాడుకోకపోతే ఎడారే హరిత విప్లవం వల్ల లాభాలే కాదు, నష్టాలూ ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. నూతన వంగడాలతో సంపన్న రైతులకే లబ్ధి చేకూరుతోందన్న వాదనలు వినిపించాయి. వీటితో నేల సారం దెబ్బతింటోందని, సంప్రదాయ దేశీయ వంగడాలు కనుమరుగైపోతున్నాయని నిపుణులు హెచ్చరించారు. పురుగు మందులు, ఎరువుల వాడకం మితిమీరుతుండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. హరిత విప్లవం ప్రతికూలతలను స్వామినాథన్ 1968లోనే గుర్తించారు. ఆధునిక వంగడాలతోపాటు సంప్రదాయ వంగడాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. నేల సారాన్ని కాపాడుకోకుండా విచ్చలవిడిగా పంటలు సాగుచేస్తే పొలాలు ఎడారులవుతాయని చెప్పారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంపై నియంత్రణ ఉండాలన్నారు. అంతేకాకుండా భూగర్భ జలాల పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాగలి పడుతున్న నారీమణులు..దేశంలో పెరుగుతున్న మహిళా రైతులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వ్యవసాయంలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) వెల్లడించింది. మహిళా రైతుల సంఖ్య పెరుగుతున్నందున వారికి అనువైన వ్యవసాయ యంత్రాలను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 2010–11 గణాంకాల ప్రకారం వ్యవసాయం చేసే మహిళలు దేశంలో 12.79 శాతం ఉండగా 2015–16లో 13.87 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇదే సమయంలో మహిళా రైతులు వ్యవసాయ చేసే విస్తీర్ణం కూడా 10.36 శాతం నుంచి 11.57 శాతానికి పెరిగింది. అందువల్లమహిళలకు అనుకూలమైన యంత్ర పరికరాలు అందుబాటులోకి రావాల్సి ఉందని దేశంలో వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణపై నాబార్డు అధ్యయన నివేదికలో తెలిపింది. వ్యవసాయ రంగం అభివృద్ధికి పలు సూచనలు చేసింది. యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాలి ప్రస్తుతం దేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రారంభ దశలోనే ఉందని, యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాల్సి ఉందని స్పష్టంచేసింది. దేశంలో మొత్తం వ్యవసాయ భూకమతాల్లో 85 శాతం చిన్నవేనని, వీటిలో యంత్రాల వాడకం ప్రధాన సవాలుగా ఉందని నివేదిక తెలిపింది. కిరాయి, అద్దె మార్కెట్లు ఉన్నప్పటికీ చిన్న కమతాలకు పరిమితులు, సంక్లిష్టతలున్నాయని తెలిపింది. 2014–15లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్ ప్రారంభించినప్పటికీ, చిన్న కమతాలకు ఉపయోగకరంగా లేదని తెలిపింది. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు పెద్ద కమతాలకు అనువైనవే ఉన్నాయని తెలిపింది. చిన్న భూకమతాలకు అనువైన యంత్రాలను, పనిముట్లను ప్రోత్సహించాలని పేర్కొంది. యాంత్రీకరణతో రైతులకు లాభం యాంత్రీకరణతో రైతులకు లాభమని నాబార్డు పేర్కొంది. ట్రాక్టర్లు, సీడ్ డ్రిల్స్, హార్వెస్టర్లు, కంబైన్లు వంటి యంత్రాలు కార్మికులకయ్యే ఖర్చును ఆదా చేస్తాయని నివేదిక తెలిపింది. యంత్రాలు, సాంకేతికతతో వ్యవసాయ ఉత్పాదకత సామర్థ్యాన్ని 30 శాతం వరకు పెంచడంతోపాటు సాగు ఖర్చును 20 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైనట్లు స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగంతో కారి్మకులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేసేందుకు అందుబాటులో ఉంటారని తెలిపింది. కారి్మకులకు వ్యవసాయంలోకంటే వ్యవసాయేతర రంగాల్లో ఎక్కువ వేతనాలు లభిస్తాయని వెల్లడించింది. నాబార్డు సిఫార్సులు మరికొన్ని.. ► రైతుల సముదాయంతో రైతుల ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసి వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను ఉపయోగించుకొనేలా చేయాలి ► చిన్న, సన్నకారు రైతులకు రుణ పరిమితులను సడలించాలి ► అందుబాటులో ఉన్న వ్యవ వినియోగంలో కొండ ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఉన్న భూభాగం, స్థలాకృతికి సరిపోవు. కొండ ప్రాంతాలలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేక పనిముట్లు అవసరం. ఆ భూభాగం, పంట వ్యవస్థలకు సరిపోయే విధంగా పనిముట్లు రూపొందించాలి. ► ప్రస్తుతం ఉన్న యంత్రాలు, పనిముట్లు స్త్రీలకు అనుకూలమైనవి కావు. వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్త్రీలకు అనుకూలమైన కొత్త యంత్రాలు, పనిముట్లను అందుబాటులోకి తేవాలి. ట్రాక్టర్ల కొనుగోలులోనూ వెనుకబాటు దేశంలో 14.6 కోట్ల మంది రైతుల్లో గత 15 సంవత్సరాల్లో ట్రాక్టర్లు కొనగలిగిన వారు అతి తక్కువని పేర్కొంది. 2004–05 ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రైతులు 2.48 లక్షల ట్రాక్టర్లు కొనగా, 2019–20లో 8.80 లక్షల ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. ట్రాక్టర్ల కొనుగోలులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయని చెప్పింది. 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లో 18,335 ట్రాక్టర్ల కొనుగోళ్లు జరగ్గా 2021–22 లో 33,876 ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. 2021–22లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1,17,563, మహారాష్ట్ర 1,04,301, మధ్యప్రదేశ్‌లో 1,00,551 ట్రాక్టర్లు కొన్నట్లు పేర్కొంది. చదవండి: అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు -
సాగుబడి @29 September 2022
-
‘తాకట్టు పెట్టిన పుస్తెల తాడు ఇంటికి తెస్తానన్నావ్.. కానీ నువ్వు చేసిందేమిటి?’
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను అణిచివేశారని ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కోనసీమలో ప్రతి రైతుకు ధాన్యం డబ్బులు చెల్లించామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. చదవండి: కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో చెల్లిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యలు తగ్గిపోయాయన్నారు. అధికారం కోల్పోయాకే చంద్రబాబుకు రైతులు గుర్తొస్తారని నాగిరెడ్డి దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో వ్యవసాయ రంగం నాశనం అయిందట.. చంద్రబాబు ఉన్నపుడు బాగుందట. కోనసీమలో క్రాప్ హాలిడే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తాకట్టు పెట్టిన పుస్తెల తాడు ఇంటికి తెస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆ రోజు ఇచ్చిన హామీలను ఒక్కటైనా అమలు చేశారా?. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ రోజు చంద్రబాబును ప్రశ్నించారా?. చంద్రబాబు పెట్టిన బకాయిలు కూడా చెల్లించింది సీఎం వైఎస్ జగన్. 76 వేల కోట్ల రూపాయలు రైతులకు ఇప్పటికే అందించాం. ఎఫ్‌సీఐ నుంచి రూ.300 కోట్లకు పైగా రావాలి. పవన్ కల్యాణ్ ఎవరిని ప్రశ్నించాలి.? ఆ డబ్బు ఇప్పించాలని బీజేపీని పవన్ ఎందుకు ప్రశ్నించరు..?. కోనసీమలో ధాన్యం డబ్బు ప్రతి రైతుకు అందాయి. కోనసీమకు ఈ పని చేశానని చంద్రబాబు ధైర్యంగా చెప్పాలి. చంద్రబాబు హయాంలో కరువు మండలాలుగా ప్రకటిస్తే.. మేము వచ్చాక కరువు మండలాలే లేవు. రైతులకు పంటల బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ విషయంలో టీడీపీ చేసిందేమిటి...? చంద్రబాబు 11 శాతం మేర వ్యవసాయ బడ్జెట్ పెడితే.. మేము మొన్నటి బడ్జెట్లో 16 శాతం పెట్టాం. నేను వెళ్లడం వల్లే రైతులకు ధాన్యం డబ్బులు వచ్చాయ్ అని పవన్ అంటున్నాడు. ఆయన వెళ్లడం వల్లనే రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలు వచ్చాయా..?. కోనసీమ గొడవలు జరిగాక ఇప్పుడు మళ్లీ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని’’ నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. -
Amazon: రైతులకు టెక్నికల్‌గా సాయం
భారత్‌లో అన్ని రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపారాలకు టెక్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలో అమెజాన్ రిటైల్, రైతుల కోసం అగ్రోనమీ సర్వీసెస్‌ను ప్రారంభించింది. టెక్నాలజీ సంబంధిత ఈ సర్వీసుల ద్వారా రైతులకు వ్యవసాయ సంబంధిత సలహాలు, నిర్ణయాలు, వాళ్ల నుంచి విలువైన సూచనలు తీసుకుని మరికొందరు రైతులకు అందించే ఉద్దేశంతో ఆగ్రోనమీని మొదలుపెట్టింది. రైతులకు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని అందించడంతో పాటు ఉత్పత్తిని మెరుగుపర్చుకునేందుకు అవసరమైన సలహాలు ఇచ్చేందుకే ఈ అగ్రోనమీ ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు అమెజాన్ ఇండియా గ్రాసరీ, ఫుడ్ అండ్ హెల్త్ డైరెక్టర్ సమీర్ ఖేతర్పాల్ వెల్లడించారు. అగ్రోనమీ సేవలతో పాటు వ్యవసాయం పరిశోధకులను, నిర్వాహకుల్ని ఈ ప్రాజెక్టులో భాగం చేయనుంది అమెజాన్. శిక్షణ పొందిన రైతుల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వాళ్లను.. మరికొందరికి శిక్షణ ఇచ్చే నిర్వాహకులుగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు. గత దశాబ్దకాలంగా వ్యవసాయంలో టెక్నాలజీ పాత్ర పెరిగింది. ఈ తరుణంలో రైతులకు తోడ్పాటుగా నిలవడం ద్వారా అగ్రో సెక్టార్‌లోనూ ముందుకెళ్లాలని భావిస్తోంది అమెజాన్. మట్టి, వాతావరణాన్ని అంచనా వేసి రైతులకు అవసరమైన సూచనలు అందించే టెక్నాలజీని సైతం త్వరలో అగ్రోనమీ ప్రాజెక్టులో చేర్చనున్నట్లు అమెజాన్ తెలిపింది. చదవండి: దేశంలో ఆగిపోనున్న వీపీఎన్ సర్వీసులు? -
మాంసం వినియోగంపై అధ్యయనం
సాక్షి, అమరావతి: మాంసం వినియోగంపై ఏపీ వ్యవసాయ మిషన్ అధ్యయనం చేస్తోంది. కొవిడ్–19 నేపథ్యంలో మాంసం వినియోగం పెరగాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ అందుకనుగుణంగా మాంసం ఉత్పత్తి లేకపోవడం, సమీప భవిష్యత్‌లో ఉత్పత్తి పెరిగే అవకాశాలు కనిపించకపోవడంతో ప్రభుత్వం దీనిపై దృష్టిని కేంద్రీకరించింది. మాంసం ఉత్పత్తి పెరగకపోవడానికి కారణాలు, పెంపకందారుల సమస్యలు, వారిని ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ మిషన్ ప్రతినిధులు, పశుసంవర్థక శాఖ సిబ్బంది వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇది పూర్తయ్యాక ప్రభుత్వానికి ఏపీ వ్యవసాయ మిషన్ నివేదిక సమర్పించనుంది. దేశంలో 6 కిలోలు.. రాష్ట్రంలో 6.5 కిలోలు రాష్ట్రంలో ప్రస్తుతం గొర్రెలు 176.26 లక్షలు, మేకలు 55.22 లక్షలు, పాడిపశువులు 46,00,087, దున్నలు 62,19,499, పందులు 91958, కోళ్లు 10.75 లక్షలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఏడాదికి 11 కిలోల మాంసం అందుబాటులో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచిస్తోంది. అయితే దేశంలో 6 కిలోలు, రాష్ట్రంలో 6.5 కిలోలు మాంసం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో మాంసం ఉత్పత్తి పెంపుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పరిశీలన, పెంపకందారుల సమస్యలు, వారిని ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో వివరాలను సేకరిస్తున్నారు. వారం నుంచి రాయలసీమలో అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం సీకె దిన్నెలోని సమీకృత గొర్రెల పెంపక కేంద్రం (గొర్రె పిల్ల పెంపకం నుంచి మాంసం ఎగుమతి వరకు)లో పరిస్థితులను తెలుసుకున్నారు. అలాగే చిన్న రైతులకు నాటుకోడి పిల్లలను పంపిణీ చేసేందుకు ఊటుకూరులో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని, అనంతపురం జిల్లా పెనుగొండలో గొర్రె పిల్లల కేంద్రాన్ని, బుక్కరాయ సముద్రంలోని లైవ్‌స్టాక్ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించారు. పశుపోషకులకు మరింత లబ్ధి రాష్ట్రంలో మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇప్పటికే అల్లానా గ్రూప్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. విదేశాలకు మాంసాన్ని ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి పొందిన ఈ సంస్థ తూర్పుగోదావరి జిల్లాలో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. పశుపోషకులకు ఈ యూనిట్ ఏర్పాటుతో మరింత లబ్ధి చేకూరనుంది. జిల్లాల్లోని పశుపోషకుల నుంచి మేలురకం మాంసం కొనుగోలు చేసి, ఇతర దేశాలకు ఎగుమతులు చేయడానికి ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
రైతులకూ రాయితీ
సాక్షి, అమరావతి: అన్నదాతలకు కూడా వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీపై ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు ఉత్పత్తి సంఘాలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లకు 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలను పంపిణీ చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రైతులకు కూడా రాయితీపై పరికరాలను సరఫరా చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. మార్గదర్శకాలు.. ► సన్నకారు, చిన్నకారు రైతులకు యంత్ర పరికరం విలువలో 50% రాయితీని ప్రభుత్వం ఇస్తుంది. అది గరిష్టంగా రూ.75 వేలకు మించకుండా ఉండాలి. ► లబ్ధిదారుడు పరికరం విలువలో 10 శాతాన్ని ముందుగా చెల్లించాలి. మిగిలిన 40 శాతం మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తాయి. ► అవసరమైన పరికరాల కోసం రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ► పరికరం ఎంపిక చేసుకునే సమ యంలో గ్రామ స్థాయి అధికారులు, డీలర్ల ఒత్తిడి రైతుపై ఉండకూడదు. ► అధికారులెవరూ పరికరాల సంస్థలను రైతులకు సిఫారసు చేయకూడదు. అలా చేస్తే చర్యలు ఉంటాయి. ► జిల్లా స్థాయి కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. ఎంపికైనవారి పేర్లను ఆర్బీకేలలో ఉంచుతారు. ► రాయితీగా ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం కంపెనీ డీలర్ల బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేస్తుంది. రాయితీ చెల్లించే ముందు రైతు పరికరం పట్ల సంతృప్తి చెందితేనే అధికారులు నగదు చెల్లింపులకు సిఫారసు చేస్తారు. ► ‘ముందు వచ్చిన వారికి ముందు ప్రాధాన్యత’ పద్ధతిలో రైతులను ఎంపిక చేస్తారు. -
అందుబాటులో అవసరమైన యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతాంగ అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ వానాకాలానికి కావాల్సిన అన్ని రకాల ఎరువులు 22.30 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, దీన్ని దశలవారీగా రాష్ట్రానికి తీసుకువస్తున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ‘యూరియా లాక్ ’శీర్షికన ఆదివారం ’సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించి ఈ మేరకు వివరణ ఇచ్చారు. జూలై నెల కోటాను కేంద్రం సకాలంలో సరఫరా చేయకపోవడంతో వెంటనే సీఎం కేసీఆర్ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రితో మాట్లాడారని, తాను కూడా కేంద్రమంత్రిని కలిశానని పేర్కొన్నారు. దీంతో కేంద్రం వెంటనే జూలై కోటా సరఫరా మొదలుపెట్టిందని, ఈ నెలలో 2.05 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మిగిలిన యూరియాను ఈ నెలాఖరుకల్లా ఇస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈరోజుకు రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు, సహకార సంఘాలు, -
‘వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి!’
సాక్షి, తాడేపల్లి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాసిన లేఖ నిరాధారితంగా ఉందని వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోలుకు నిర్ణయించిన ధర ఎంతో కూడా తెలియకుండా కన్నా లేఖ రాశారని అన్నారు. సోమవారం నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. కావాలని బురదజల్లేందుకు ప్రయత్నించడం మంచిది కాదు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటల కొనుగోలులో కేంద్రం సహకారం అందించేలా ప్రయత్నించాల్సిన వ్యక్తులు ఇలా విమర్శలకు దిగడం సరికాదు. ( కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? ) టీడీపీ నేతలు చేసినట్లు ఆరోపణలు చేయవద్దు.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఇప్పటికే ఆదుకుంటోంది. మీకు చేతనైతే కేంద్రంతో మాట్లాడి ఓ లక్ష టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేలా ప్రయత్నించండి. కేంద్రం, రాష్ట్రం వేరు కాదు.. ఈ విపత్కర సమయంలో అందరం కలిసి పనిచేస్తున్నామని గుర్తించండ’’ని అన్నారు. -
కన్నా లేఖలోని అంశాలు.. పచ్చి అబద్దాలు
సాక్షి, అమరావతి: మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,550 కల్పించాలంటూ.. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాసిన లేఖలోని అంశాలన్ని పచ్చి అబద్ధాలని మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,760 మాత్రమే అని గుర్తుచేశారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి డబ్బు చెల్లించదన్నారు. ప్రజా పంపిణీ కోసం కొనుగోలు చేస్తేనే రూ.1760 మద్దతు ధర ఇస్తుందని చెప్పారు. వాస్తవాలు కాకుండా అవాస్తవాలను కన్నా ప్రచారం చేస్తున్నారని నాగిరెడ్డి మండిపడ్డారు. కేవలం విమర్శలు చేయాలనే ఉద్దేశంలోనే కన్నా ఇలాంటి లేఖలు రాస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ప్రభుత్వం రైతుల నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తోందని నాగిరెడ్డి పేర్కొన్నారు. -
‘ఆ పిచ్చే 23 సీట్లకు పరిమితం చేసింది’
సాక్షి, తాడేపల్లి: రైతులకు నష్టం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా అరటి, టమాటా వంటి పంటలను ప్రభుత్వమే కొనుగోళ్లు చేస్తేందని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారని ఆయన వెల్లడించారు. (సీఎం జగన్‌కు కేంద్రమంత్రుల అభినందనలు) రవాణా నిబంధనలను సడలించాం.. పంటలు చేతికొచ్చే సమయంలో కరోనా వైరస్ ప్రభావం పడిందని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందారని.. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీఎం అన్ని చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ధాన్యాన్ని గ్రామాల్లో కొనుగోలు చేస్తున్నామని.. ఉత్పత్తులకు ఇబ్బంది లేకుండా రవాణా నిబంధనలను సడలించామని చెప్పారు. రైతుబజార్లను సీఎం జగన్ ఎక్కడికక్కడ వికేంద్రీకరించారని.. మొబైల్ రైతుబజార్లను కూడా ఏర్పాటు చేశారని నాగిరెడ్డి వివరించారు. (కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష) ప్రధానిని ఎందుకు డిమాండ్ చేయలేదు..? ‘‘కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు అడుగుతున్నారు. ప్రధానితో ఆయన మాట్లాడినప్పుడు .. దేశమంతా రూ.5 వేలు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదని’’ నాగిరెడ్డి ప్రశ్నించారు రైతులకు చంద్రబాబు పెట్టిన బకాయిలను సీఎం జగన్ చెల్లించారన్నారు. చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం రూ.కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని.. ఆయన పబ్లిసిటీ పిచ్చే 23 సీట్లకు పరిమితం చేసిందన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉంటే.. ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ఎంవీఎస్ నాగిరెడ్డి దుయ్యబట్టారు. -
అన్నదాతలకు చిన్న ఇబ్బంది కూడా రాకూడదు
-
రైతులకు అన్ని విధాలా భరోసా
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రకటించిన ధరల కన్నా రైతులు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే వెంటనే జోక్యం చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. పంట కొనుగోలు చేసిన వారంలోగా రైతులకు డబ్బులు అందాలని, నెల రోజుల్లో పరిస్థితి మారకపోతే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. అగ్రి వ్యవసాయ మిషన్ సమీక్షలో భాగంగా గురువారం ఆయన పంటల కొనుగోలు కేంద్రాల తీరు, రైతులకు లభిస్తున్న ధరలపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాలు మరింత సమర్థవంతంగా నడవటానికి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన ధరల పట్టిక ఉంచాలని స్పష్టం చేశారు. ప్రకటించిన ధరల కన్నా తక్కువకు కొనుగోలు చేస్తే వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి కొనుగోళ్లు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం సరైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం శనగలు, కందులు మార్కెట్లోకి వస్తున్నాయని, కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. అన్నదాతలకు చిన్న ఇబ్బంది కూడా రాకూడదు పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలను, కొనుగోలు కేంద్రాల వివరాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వారానికోసారి కచ్చితంగా సమావేశం నిర్వహించి, రైతులకు అందుతున్న ధరలపై సమీక్ష చేయాలని.. నాలుగు వారాలకోసారి తనతో సమావేశం కావాలని ఆదేశించారు. దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన ధర కన్నా తక్కువ ధర వస్తుంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనే విషయంపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. పంటను అమ్ముకోవడానికి రైతులకు చిన్న ఇబ్బంది కూడా రాకూడదని, ఈ కీలక అంశాలను అధికారులు సవాలుగా తీసుకుని పనిచేయాలని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వచ్చినా పర్వాలేదని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాల కేసులను సీరియస్‌గా తీసుకోవాలి నకలీ విత్తనాల కేసులను చాలా సీరియస్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అదేశించారు. వ్యవసాయ శాఖలోనే లీగల్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరించారు. విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు పక్కాగా ఉండాలని, రైతులు నాణ్యమైన విత్తనాలను కోరుకుంటున్నందున.. వాటిని అందించడంపై దృష్టిపెట్టాల్సిందిగా సీఎం సూచించారు. విత్తన కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీ సిఫార్సుల ప్రకారం బెంగాల్ గ్రామ్ విత్తనాలను పూర్తి స్థాయిలో సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఎరువులు, విత్తనాల కంపెనీల నుంచి మంచి సానుకూల స్పందన వస్తోందని, ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల సంతృప్తికరంగా ఉన్నాయని అధికారులు వివరించారు. రైతు భరోసా కేంద్రాలు ఈ కంపెనీలకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయని, ఆ మేరకు ధరలు తగ్గించి ఎరువులు, విత్తనాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. గోదాములు, కోల్డ్ స్టోరేజీలపై ప్రత్యేక దృష్టి శ్రీకాకుళంలో గోదాముల సమస్య గురించి అగ్రి మిషన్ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. గోదాములు, కోల్డ్ స్టోరేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్త గోదాముల నిర్మాణం జరిగేంత వరకు ప్రత్యామ్నాయాలు చూడాలని, సరిపడా గోదాములు, కోల్డ్‌స్టోరేజీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ శాఖ తనదిగా భావించి పనిచేయాలని, వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించాలన్నారు. పశు సంవర్థకం, హార్టికల్చర్, ఫిషరీస్ రంగాలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొత్త ఊపు ఇవ్వాలని సూచించారు. మందులు వాడకుండా పాలు ఉత్పత్తి చేసే వారికి ప్రోత్సాహం పశువులకు వైద్యం అందిస్తున్న విధానాలపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. మందులు వాడకుండా పాలు ఉత్పత్తి చేసే వారిని పోత్సహించాలని, అలాంటి పాలకు గిట్టుబాటు ధరలు మరింత పెంచాలని ఆదేశించారు. ఆర్గానిక్ మిల్క్ పేరిట ఈ పాలను అమ్మేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువులన్నింటికీ ట్యాగ్ వేయాలన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల లోగోను సీఎం ఆవిష్కరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, కొడాలి నాని, సీఎస్ నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర బడ్జెట్‌పై ఎంవీఎస్ నాగిరెడ్డి అసంతృప్తి
సాక్షి, అమరావతి: 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బడ్జెట్లో చెబుతారు కానీ, ఎలా చేస్తారో స్పష్టత ఉండదంటూ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రైతులకు పెద్ద పీట ఎక్కడ వేశారో అర్ధం కావటం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. 2019-20లో సబ్సిడీలకు రూ. 3,38,153.67 కోట్లు కేటాయించి రూ. 2,63,557.33 కోట్లు ఖర్చు చేశారన్నారు. 2020-21కి ఆహార, ఎరువుల సబ్సిడీలు తగ్గించి రూ. 2,62,108.76 కోట్లు మాత్రమే కేటాయించి, అత్యధికంగా దృష్టి పెట్టవలసిన వ్యవసాయ యాంత్రీకరణ మీద దృష్టి పెట్టకుండా విధానపరమైన కేటాయింపులు పెంచకుండా ‘కిసాన్ రైలు’ వేస్తామని చెప్పారన్నారు. దేశవ్యాప్తంగా 26 లక్షల సొలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పడమే వ్యవసాయానికి పెద్దపీట వెయ్యడమా అని ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) -
మార్కెట్ ఇంటెలిజెన్స్‌పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వెబ్ సైట్‌తో.. రికార్డుల పరంగా, ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన అగ్రికల్చర్ మిషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం అగ్రిమిషన్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రైతు భరోసా ద్వారా వచ్చే మే నెల నాటికి మరింత మందికి లబ్ధి చేకూరుతుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇప్పటివరకూ 45,20,616 మంది కుటుంబాలకు చెందిన రైతులు రైతు భరోసా కింద లబ్ధి పొందారని తెలిపారు. సుమారు రూ.5,185.35 కోట్ల పంపిణీ చేశామని వెల్లడించారు. డిసెంబర్ 15 వరకూ కౌలు రైతులకు అవకాశం ఉంటుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దేవాలయాల భూములను సాగు చేసుకుంటున్న రైతులు, సొసైటీల పేరుతో సాగు చేసుకుంటున్న రైతులను కూడా రైతు భరోసా కింద పరిగణలోకి తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాల పక్కన దుకాణాలు, వర్క్‌షాపుల ఏర్పాటుపై సమీక్షలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల కోసం ఏర్పాటు చేసే దుకాణాల్లో దొరికే ప్రతి వస్తువుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వర్క్‌షాపులో రైతులకు ఏయే అంశాలకు శిక్షణ ఇవ్వాలన్నదానిపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. భూసార పరీక్షలు వర్క్‌షాపులోనే పెడుతున్నామని ఆయన తెలిపారు. నేచురల్ ఫార్మింగ్‌పై రైతులకు అవగాహన కల్పించి.. గ్రామ సచివాలయాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ల సేవలను బాగా వినియోగించుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేయదలచిన వర్క్‌షాపుల్లో వారి సేవలను వాడుకోవాలన్నారు. బయో ఫెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్ పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఏపీ బయో ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ యాక్ట్ తీసుకురావాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్‌పై సమీక్ష నిర్వహించని ముఖ్యమంత్రి జగన్మోహన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. గోడౌన్ల నిర్మాణంపై మండలాలు, నియోజకవర్గాల వారిగా మ్యాపింగ్ చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రైతులు నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వేరుశెనగ, మొక్కొజొన్నల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కనీస మద్దతు ధరలేని చిరుధాన్యాలను సాగుచేస్తున్న రైతులను ఆదుకోవడానికి.. సాగుకు అవుతున్న ఖర్చును పరిగణలోకి తీసుకుని ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వమే ధరలు ప్రకటింస్తుందని తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. చిరుధాన్యాల ధరల ప్రకటన త్వరలోనే చేయానున్నట్టు తెలిపారు. చీనీ రైతులకు మంచి ధర వచ్చేలా చూడటానికి అనుసరించాల్సిన మార్కెటింగ్ వ్యూహాలపై సమీక్షించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డుల్లో కనీస సదుపాయాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులను నాడు-నేడు తరహాలో అభివృద్ధి చేయాలని తెలిపారు. పంటలకు వణ్యప్రాణుల నుంచి రక్షణ కల్పించడంపై సమగ్ర నివేదిక తయారుచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి, బాలినేని పాల్గొన్నారు. -
పండగలా..రైతు భరోసా
-
వైఎస్సార్ రైతు భరోసా నేడు ప్రారంభం
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులు, కౌలుదారుల కుటుంబాల పేరిట బ్యాంకు అకౌంట్లలో నేరుగా పెట్టుబడి సాయాన్ని మంగళవారం జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 40 లక్షల మంది రైతులు, కౌలు రైతుల కుటుంబాలు ఇందుకు అర్హమైనవిగా అధికారులు తేల్చారు. సరళీకరించిన నిబంధనల ప్రకారం మరో 14 లక్షల మంది వరకు లబ్ధిదారుల జాబితాలో చేరే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పథకం కింద చెక్కులు పంపిణీ చేస్తారు. ► ‘వైఎస్సార్ రైతు భరోసా’ ప్రకటించిన తేదీ, ప్రాంతం: జులై 8వ తేదీ 2017 – గుంటూరు (పార్టీ ప్లీనరీలో) ► తొలుత అర్హత : ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతులు ► తర్వాత మారిన అర్హత : అన్నదాతలందరికీ వర్తింపు ► తొలుత ప్రకటించిన సాయం : ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50,000 ► తాజాగా ప్రకటించిన సాయం : ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలలో రూ.67,500 ► జగన్ ప్లీనరీలో ప్రకటన తర్వాత ఇదే తరహా పథకాన్ని (రైతు బంధు) అమలు చేసిన రాష్ట్రం : తెలంగాణ ► కేంద్రం ఇటీవల అమల్లోకి తెచ్చిన పథకం : పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి సాక్షి ప్రతినిధి, నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే రైతుభరోసా ప్రారంభోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ శాఖలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. స్టాళ్లను పరిశీలించిన తర్వాత రైతుభరోసా చెక్కులు పంపిణీ చేసి అన్నదాతలతో మాట్లాడతారు. సభ ముగిశాక రేణిగుంట చేరుకుని విమానంలో గన్నవరం వెళ్తారు. -
అన్నదాతలకు మరింత భరోసా!
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలో చెప్పిన విధంగా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.12,500 కాకుండా రూ.13,500 ఇవ్వాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నప్పటికీ దానిని ఐదేళ్లకు పొడిగిస్తూ రూ.67,500 ఇస్తామని స్పష్టం చేశారు. రైతు మరణిస్తే.. ఆ కుటుంబానికి అర్హత ఉంటే, ఆ రైతు భార్యకు రైతు భరోసా వర్తింపజేసేలా మార్గదర్శకాలను సైతం సడలిస్తామని చెప్పారు. అర్హులైన వారందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంతృప్తికర స్థాయిలో రైతు భరోసా ఇవ్వాలన్న లక్ష్యంతో అర్హులందరూ దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 15 వరకు గడువు పొడిగిస్తున్నామని సీఎం వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వ్యవసాయ మిషన్ సమావేశమైంది. మంగళవారం (అక్టోబర్ 15) నాడు నెల్లూరు సమీపంలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్న దృష్ట్యా లబ్ధిదారుల ఎంపికపై ఈ సమావేశంలో సీఎం ఆరా తీశారు. ఇదే సమయంలో మిషన్‌లో సభ్యులుగా కొనసాగుతున్న రైతు ప్రతినిధులు వ్యవసాయరంగంలో తాజా పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సచివాలయంలో సోమవారం జరిగిన వ్యవసాయ మిషన్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది వర్షాలు పడ్డా, సకాలంలో వర్షాలు కురవలేదని, ఖరీఫ్ సాగు కూడా సాధారణ స్థాయి దాటలేదని సీఎంకు వివరించారు. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టతరంగా ఉన్నప్పటికీ హామీల అమలుకు, రైతుల ప్రయోజనాల కోసం అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ తరుణంలో రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. పంట ఇంటికి వచ్చే సమయంలో రైతులు ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సమయంలో కొంత పెంచి ఇవ్వాలని కోరారు. రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని రెండు సీజన్లకు, మూడు విడతలుగా ఇచ్చినా అభ్యంతరంలేదన్నారు. రైతు ప్రతినిధులు చేసిన సూచనలపై సమావేశంలో చాలాసేపు చర్చ జరిగింది. ఎనిమిది నెలలు ముందుగానే అమలు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే, అనుకున్న దానికంటే ముందుగానే రైతు భరోసా ఇవ్వగలమా? లేదా? అని ఆలోచించామని సమావేశంలో సీఎం అన్నారు. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లపాటు, మొత్తంగా రూ.50 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చాక 8 నెలలు ముందుగానే ఇస్తూ, ఈ పథకాన్ని ఐదేళ్లకు వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకున్నామని సీఎం చెప్పారు. అధికారంలోకి వచ్చే నాటికి ఖరీఫ్ సమయం ముగిసినందున రబీకైనా అక్టోబర్‌లో ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర సమస్యల్లో ఉన్నప్పటికీ రైతులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నందున వారికి ఎంతచేసినా తప్పులేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, అందుకే వైఎస్సార్ రైతు భరోసా కింద ఇస్తున్న మొత్తాన్ని రైతు ప్రతినిధులు కోరినట్టుగా మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్టుగా సమావేశంలో ప్రకటించారు. అధికంగా పనులు కల్పించేది వ్యవసాయ రంగమే అయినందున వీరి ప్రతిపాదనలను అంగీకరిస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల సంఖ్యపై ఆరా రైతు భరోసాకు ఎంపికైన లబ్ధిదారుల సంఖ్యపై ముఖ్యమంత్రి జగన్ ఆరాతీశారు. గత ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి 43 లక్షల మంది రైతులతో జాబితాను పంపిందని అధికారులు సీఎంకు వివరించారు. అంతకంటే మిన్నగా ఈ పథకం ద్వారా పారదర్శకంగా సుమారుగా 51 లక్షల మంది రైతులు ఎంపిక కానున్నారని సీఎం చెప్పారు. ఈసారి మరో 3 లక్షల మంది భూములు లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకూ పథకం వర్తిస్తుందని సీఎం పేర్కొన్నారు. రైతుభరోసా ఈసారి అక్టోబర్‌లో ప్రారంభం అయిన దృష్ట్యా వచ్చే మే నుంచి కౌలు రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అక్టోబర్ 15 తర్వాత కూడా నెలరోజుల పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. నాలుగేళ్లలో రూ.50 వేల బదులు రూ.67,500 ఇవ్వబోతున్నామని, గతంలో చెప్పిన దానికంటే ఇది రూ.17,500 అధికం అని చెప్పారు. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో పంటకోసే సమయంలో లేదా రబీ సన్నాహాల కోసం రూ.4,000, సంక్రాంతి సమయంలో రూ.2 వేలు ఇద్దామన్న రైతు ప్రతినిధుల సూచనను పరిగణలోకి తీసుకుని ఆ మేరకు పథకాన్ని అమలు చేద్దామని సీఎం ప్రకటించారు. గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులూ అర్హులే సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు.. లాంటి ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటిస్తున్నారంటూ సీఎంకు వ్యవసాయ మిషన్ సభ్యులు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు తప్ప మిగతా ప్రజా ప్రతినిధులందరికీ రైతు భరోసా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆక్వా కల్చర్ కిందకు మార్చిన భూములు, రియల్ ఎస్టేట్ భూములు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను కట్టేవారిని రైతు భరోసాకు అనర్హులుగా ప్రకటించామని అధికారులు వివరించారు. మార్గదర్శకాలను తప్పనిసరిగా అందరికీ అందుబాటులో ఉంచాలని, ఎవరెవరికి పథకం వర్తించదో.. ఆ వివరాలను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అర్హులైన వారికి పథకం వర్తించలేదంటే వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనికోసం వచ్చే విజ్ఞాపన పత్రాలను వెంటనే పరిష్కరించేలా సరైన యంత్రాంగం ఉండాలని ఆదేశించారు. రైతు భరోసాను సంతృప్తికర స్థాయిలో అమలు చేయాలని, గ్రామ వలంటీర్లను, గ్రామ సచివాలయాలను పూర్తి స్థాయిలో వాడుకోవాలన్నారు. వచ్చే కేబినెట్లో అజెండాగా చిరుధాన్యాలు, వరి బోర్డులు వచ్చే ఖరీఫ్ నాటికి చిరుధాన్యాలపై ప్రమోషన్ స్కీంను తీసుకురావాలని సీఎం ఆదేశించారు. అందుకు తగినట్టుగా విత్తనాలను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. చిరుధాన్యాలు, వరి బోర్డుల ఏర్పాటుకు వెంటనే ప్రయత్నాలు మొదలు పెట్టాలని, అక్టోబర్ 16 నాటి కేబినెట్ సమావేశంలో అజెండాగా ఈ అంశం పెట్టాలన్నారు. నెలాఖరు నాటికి చైర్మన్ల నియామకాన్ని పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ కాలేజీల్లో ప్రమాణాలు పడిపోతున్న విషయాన్ని మిషన్ సభ్యులు సీఎంకు నివేదించారు. దీనిపై స్పందిస్తూ ప్రమాణాలు లేని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలేజీల్లో నాణ్యత లేకపోతే వ్యవసాయ రంగమే దెబ్బ తింటుందన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖలకు, వ్యవసాయ యూనిర్సిటీలకు మధ్య మరింత సమన్వయం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ నెలాఖరులోగా వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కేటాయింపులు కాగితాలకే పరిమితం కాకూడదు ధరల స్థిరీకరణకు బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించామని, ఆ నిధులను అవసరమైనప్పుడు వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. బడ్జెట్లో కేటాయింపులు కాగితాలకే పరిమతం కాకూడదని, ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధి ఫలితాలు రైతులకు అందాలని స్పష్టం చేశారు. పామాయిల్ ఏపీలో రికవరీ 17.2 శాతం ఉంటే, తెలంగాణలో 18.94 శాతం ఉందని సీఎం దృష్టికి రైతు ప్రతినిధులు తీసుకు వచ్చారు. పెదవేగి ప్లాంటులో కొందరు ఉద్యోగుల అక్రమాలను కూడా వారు ప్రస్తావించగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కో–ఆపరేటివ్ రంగంలో చక్కెర కర్మాగారాల పరిస్థితి బాగోలేదని, గడిచిన ఐదేళ్లలో వాటిని పట్టించుకోలేదని, వచ్చే రెండేళ్లలో వాటిని పునరుద్ధరిస్తామని సీఎం చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీలను పూర్తి స్థాయి ఆపరేషన్స్‌లోకి తీసుకురావడమే కాకుండా, మంచి మార్కెటింగ్ అవకాశాలను కల్పించేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మార్కెటింగ్, మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు, వ్యవసాయ నిపుణుడు పాలగుమ్మి సాయినాథ్, మిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’గా ఈ పథకానికి పేరు పెడదాం. కేంద్రం నుంచి వచ్చే నిధులు, తెచ్చుకునే రుణాలు, గ్రాంట్లు ఇవన్నీ కలిపితేనే బడ్జెట్.. అందువల్ల ఈ విషయంలో ఇతరత్రా ఆలోచనలు వద్దు. ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనంగా నిలుద్దాం. దీనిమీద కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రచ్చ చేసే స్థాయికి వెళ్లడం దురదృష్టకరం. టమాటా రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాలి. బెంగళూరు, చెన్నై మార్కెట్లలో రేట్లను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు స్థిరీకరించాలి. ప్రాసెసింగ్ యూనిట్లపై దృష్టి పెట్టి టమాటా ధర సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. పసుపు విషయంలో కూడా ఇలాంటి ఆలోచనే చేయాలి. రైతుల కోరిక మేరకే రైతు భరోసా ప్రోత్సాహకాన్ని మూడు దఫాలుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన వ్యవసాయ మిషన్ సమావేశ వివరాలను మంత్రులు కన్నబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పి.అనిల్‌కుమార్ యాదవ్, మోపిదేవి వెంకటరమణ, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఎవరేమన్నారంటే.. ఇది చాలా గొప్ప పథకం రైతులకు వ్యవసాయ పెట్టుబడికి సాయం అందించే గొప్ప పథకమిది. ఇలాంటి పథకాన్ని ప్రజల్లోకి సవ్యంగా తీసుకెళ్లాలి. ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశ పెడుతున్నప్పుడు మంచి అంశాలను మరుగున పరిచి తప్పుడు ప్రచారం చేసే అవకాశాలుంటాయి. ఇందుకు ఆస్కారం లేకుండా పథకం లక్ష్యాలు, రైతులకు కలిగే వాస్తవ ప్రయోజనాలు ప్రజల్లోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలి. – పాలగుమ్మి సాయినాథ్, వ్యవసాయ మిషన్ సభ్యుడు సంక్రాంతికి కొంత ఇవ్వండి రైతులకు పెద్ద పండగైన సంక్రాంతికి ధాన్యం ఇళ్లకు వస్తుంది. అందువల్ల ఆ పండుగ పూట రైతులు సంతోషంగా ఉండేందుకు వీలుగా రైతు భరోసా కింద కొంత ఆర్థిక సాయం అందిస్తే బావుంటుంది. అక్టోబర్‌లో రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఆర్థిక సాయం చేయడం చాలా అవసరం. మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతలగా సాయం అందించాలి. – డాక్టర్ మల్లారెడ్డి, వ్యవసాయ మిషన్ సభ్యుడు త్వరలో మిల్లెట్ బోర్డు ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో మిల్లెట్స్ అత్యధికంగా సాగు చేస్తున్నారు. వారికి అండగా ఉండటానికి మిల్లెట్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 16న జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే నెల 18న వ్యవసాయ కమిషన్ మరోసారి సమావేశం కానుంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ భూ యజమానులు సహకరించాలి కౌలు రైతులకు రైతు భరోసా లభించేలా భూ యజమానులు సహకరించాలి. భూ యజమానుల రక్షణ కోసం కౌలు రైతుల చట్టం తీసుకొచ్చాం. అనవసర భయాలు పెట్టుకోవద్దు. కౌలు రైతులకు సహకారం అందకపోతే కౌలు బాగా తగ్గిపోతుంది. గతంలో ఎకరానికి 30–35 బస్తాలున్న కౌలు ఇప్పుడు 28 బస్తాలకు పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే భూ యజమానులే నష్టపోతారు. – సుభాష్‌చంద్రబోస్, రెవెన్యూ శాఖ మంత్రి ఉల్లిని ప్రభుత్వమే కొంటుంది ధరలు తగ్గినప్పుడు ఉల్లి, టమాటాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇదే విధానాన్ని ఇతర పంటలకు వర్తింప చేస్తాం. ఇందుకోసం రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. వాల్‌మార్ట్‌కు సరఫరా చేయగా.. మిగిలిన సరుకుల్ని హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాల్లో వినియోగిస్తాం. – మోపిదేవి వెంకటరమణ, మార్కెటింగ్ శాఖ మంత్రి రైతుకు భరోసా కష్టాల్లో ఉన్న రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ఒక ధైర్యాన్ని ఇస్తుంది. 53 లక్షల మంది లబ్ధి పొందే ఈ కార్యక్రమం ప్రారంభానికి నెల్లూరు జిల్లాను ఎంచుకోవడం సంతోషకరం. – పి.అనిల్‌కుమార్ యాదవ్, జల వనరుల శాఖ మంత్రి రైతుల మేలు కోసమే.. రైతు భరోసా ప్రోత్సాహకం మొత్తాన్ని ఒకేసారి కాకుండా విత్తనాలు కొనుక్కునే విధంగా అక్టోబర్‌లో కొంత మొత్తం ఇవ్వాలని రైతులు అడిగారు. అందువల్లే మే, అక్టోబర్, జనవరి నెలల్లో మూడు దఫాలుగా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ పథకం కింద మరింత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలు సడలించాలని సీఎం సూచించారు. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి రైతు మరణిస్తే అతని భార్యకు భరోసా.. రైతు మరణిస్తే.. అతని భార్యకు రైతుభరోసా ఇచ్చేలా మార్గదర్శకాల్లో మార్పు చేయండి. పిల్లలు ఉద్యోగులై ఆదాయపు పన్ను కడుతున్నా, వ్యవసాయం చేస్తున్న వారి తల్లిదండ్రులకూ ఈ పథకాన్ని వర్తింపు చేయాలి. రైతుభరోసా కింద ఇచ్చే మొత్తాన్ని బ్యాంకులు మినహాయించుకోలేని విధంగా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాలకే నగదు జమ కావాలి. అర్హులైన వారికి పథకం వర్తించలేదంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ -
అగ్రికల్చర్ మిషన్‌పై సీఎం జగన్ సమీక్ష
-
రేపే రైతు భరోసా.. సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : అగ్రికల్చర్ మిషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి అమలుకానున్న వైఎస్సార్ రైతు భరోసా పథకంపై, ధరల స్థిరీకరణ నిధి, రబీ సాగు కార్యాచరణపై రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించారు. వర్షాలు ఆలస్యంగా కురిసినందున పంటలు దెబ్బతిన్నాయని రైతు సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఖరీఫ్ స్థాయిలో సాగు లేదని చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఇచ్చే సొమ్మును రెండు, మూడు విడతలుగా ఇచ్చిననా అభ్యంతరం లేదన్నారు. సంక్రాంతి సమయంలో ఎంతో కొంత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఇచ్చే రూ.12,500లు ఒకే సారి ఇచ్చే బదులు మే నెలలో ఒకసారి, పంటకోసే సమయంలో, రబీ అవసరాల కోసం ఎంతో కొంత పెంచి మొత్తాన్ని సంక్రాంతి కానుకగా రైతులకు ఇవ్వాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్, ఎంవీఎస్ నాగిరెడ్డి, పాలగుమ్మి సాయినాథ్, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రైతు భరోసా అమలును నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. దీంతో ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ. 67,500 పెట్టుబడి సాయం రైతులకు అందనుంది. రేపే రైతు భరోసా.. రూ. 5,510 కోట్లు విడుదల రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15న నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి సీఎం చేరుకుంటారు. ఆ తర్వాత కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు. రైతులకు రైతుభరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకానికి రూ. 5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పలుసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
నేడు వ్యవసాయ మిషన్ సమావేశం
సాక్షి, అమరావతి/వెంకటాచలం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం వ్యవసాయ మిషన్ సమావేశం జరగనుంది. సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కింద రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించడం, రబీ పంటల సాగు కార్యాచరణ, ధరల స్థిరీకరణపై సోమవారం వ్యవసాయ మిషన్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. వ్యవసాయ మిషన్‌లోని నిపుణులు పాలగుమ్మి సాయినాథ్, స్వామినాథన్, రైతు సంఘాల నాయకులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15న నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి సీఎం చేరుకుంటారు. ఆ తర్వాత కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు. రైతులకు రైతుభరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకానికి రూ. 5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పలుసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, నేతలు విక్రమసింహపురి వర్సిటీలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులు ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు తలశిల రఘురాం, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వి.వరప్రసాదరావు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ఏర్పాట్లపై నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబుతో చర్చించి పలు సూచనలు ఇచ్చారు. -
మిషన్ అగ్రికల్చర్
-
అగ్రి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్‌పై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి : వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌పై అత్యుత్తమ నిపుణులతో ఒక సెల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మిషన్‌పై సమీక్ష నిర్వహించారు. అగ్రి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్‌పై ఆరా తీశారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం ఎలా వస్తుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్‌పై సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని సూచించారు. ప్రత్నామ్నాయ విధానం కూడా ఉండాలని స్పష్టం చేశారు. అగ్రికల్చర్ కమిటీల నుంచి వచ్చే సమాచారాన్ని బేరీజు వేసుకోవడానికి మరో యంత్రాంగం అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. పంటల ధరలను స్థిరీకరించడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ మిషన్ తదుపరి సమావేశంలో రాబోయే పంటల దిగుబడులు, వాటికి లభించే మద్దతు ధరల అంచనాలు, మార్కెట్లో పరిస్థితులను నివేదించాలాని అధికారులను ఆదేశించారు. సమీక్షలో చర్చించిన మరిన్ని అంశాలు మినుములు, పెసలు, శెనగలు, టమోటాలకు సరైన ధరలు రావడంలేదని అధికారులు చెప్పారు. ప్రభుత్వం వద్ద, రైతుల వద్ద నిల్వలు ఉన్నాయని, దీంతోపాటు దిగుమతి విధానాలు సరళతరం చేయడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని చెప్పారు. వచ్చే రబీ సీజన్లో పప్పు దినుసలకు తక్కువ ధరలు నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఉల్లి ధరలు వినియోగదారుల మార్కెట్లో కాస్త పెరుగుతున్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు ఈ పంటలకు సంబంధించి కొనుగోళ్లకోసం ప్రణాళిక వేశారా? లేదా? అని సీఎం అడిగి తెలుసుకున్నారు. తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా? లేదా? అని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మద్దతు ధరలు దొరక్క, కొనుగోలు కేంద్రాలద్వారా కొనుగోలు చేయక గత ప్రభుత్వం హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎం అన్నారు. గతంలో వ్యాపారులు, రాజకీయ నాయకులు రైతుల ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారని సమావేశంలో ప్రస్తావించారు. కొన్ని జిల్లాల్లో ఈ ఘటనలు అధికంగా జరిగాయని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి నిధుల సహకారం లేదు. పంటలకు ధర పడిపోయిన తర్వాత... ఆ నిధులు తెచ్చుకునే సరికి పుణ్యకాలం కాస్త గడచిపోయేదని అధికారులు సీఎంకువివరించారు. పంట చేతికి వచ్చే సమయానికే కొనుగోలు కేంద్రాలు సిద్దంకావాలని సీఎం ఆదేశించారు. అక్టోబరు 15 నాటికే మినుములు, పెసలు,శెనగల తదితర పంటల కొనుగోలుకోసం కేంద్రాలు తెరవాలని అధికారులకు సూచించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర ఇవ్వడానికి మంచి విధానాలపై ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలవద్ద వారికి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా పలానా పంటలు వేశామంటూ రైతులు సులభంగా రిజిస్ట్రేషన్ చేయింకునేలా చూస్తామని అధికారులు తెలిపారు. గ్రామవాలంటీర్ల సహాయంతో ప్రతిరైతూ రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చేస్తామని, దీనిద్వారా సరైన మద్దతు లభించేలా ప్రభుత్వ తీసుకునే చర్యల ద్వారా లబ్ధి రైతుకు లభిస్తుందని అధికారుల వెల్లడించారు. ఈ డేటా ఆధారంగా ఆపంటకు కచ్చితంగా మద్దతు ధర ఇచ్చేలా చూస్తున్నామని అధికారులు తెలిపారు. రబీ పంటనుంచి ఈ పద్ధతిని అనుసరించడానికి ప్రయత్నాలుచేస్తామని వెల్లడించారు. పంట చేతికి వచ్చినప్పుడే కొనుగోలు చేస్తే.. రైతులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ధరలస్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకోవడంతోపాటు, కొనుగోలు కేంద్రాలద్వారా తీసుకున్న వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్ కల్పించే పద్ధతుల ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రాష్ట్ర వర్షపాతం, పంటసాగు వివరాలను సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరువు కారణంగా ఆయా జిల్లాల్లో పరిస్థితులను సీఎం జగన్‌కు అధికారులు నివేదించారు. వివిధ వరద జలాలను సమర్థవంతంగా వినియోగించుకునే ప్రణాళికలు ఆలోచించాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 1830 కోట్లలను ఈ నెలాఖరులో రైతులకు ఇస్తామని అధికారులు తెలిపారు. వచ్చే నెలలో ప్రభుత్వం అందించే రైతు భరోసా,ఇన్‌పుట్‌సబ్సిడీలు రైతులకు అండగా ఉంటాయని సీఎం అభిప్రాయపడ్డారు. తృణధాన్యాల సాగుమీద దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.వర్షపాతం లోటు ఉన్న అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో తృణధాన్యాల సాగును ప్రోత్సహించాలని సీఎం సూచించారు. తృణధాన్యాల సాగును ప్రోత్సహించడమే కాకుండా.. ప్రాససింగ్ యూనిట్ల ఏర్పాటు కూడా కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు.ఆమేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టమోటా ధరలు తగ్గడంపై సమావేశంలో చర్చ టమోటా ధరలు తగ్గడంపై వ్యవసాయ మిషన్ సమావేశంలో ప్రస్తావను వచ్చింది. ధరలు తగ్గడానికి గల కారణాలపై సీఎం జగన్ ఆరా తీశారు. కర్ణాటక, మహారాష్ట్రలలో టమోటా దిగుమతులు అధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీవర్షాలు, వరదలు కూడా రవాణాకు అడ్డంకిగా మారి ధరలు పెరిగాయని అధికారులు వివరించారు. టమోటా ధరలు పడిపోకుండా చూడడానికి ఏం చేయాలన్న దానిపై సీఎం జగన్ అధికారుల నుంచి సలహాలు తీసుకున్నారు. చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ తదితర మార్కెట్లకు పంపించడం ద్వారా కొంత మేర ధరల నిలబెట్టవచ్చని అధికారులు సూచించారు. అయితే తక్షణమే అలాంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే రవాణా ఖర్చులను సబ్సిడీగా భరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతున్నప్పుడు డైనమిక్‌గా వ్యవహరించాలంటూ అధికారులకు ఆదేశించారు. పశువుల కోసం వినియోగిస్తున్న ఔషధాల్లో ప్రమాణాలు, నాణ్యత ఉండడంలేదని సమావేశంలో ప్రస్తావించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు, నాణ్యత ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఎండిపోతున్న మామిడి, చీనీ తదితర పంటలను కాపాడేందుకు నీటిసరఫరాకోసం పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదలచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
అగ్రికల్చర్ మిషన్‌పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: అగ్రికల్చర్ మిషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై సమావేశంలో చర్చిస్తున్నారు. అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్ యాదవ్, ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.