Anaparthy
-
కాకినాడ జిల్లా అనపర్తిలో చంద్రబాబు హైడ్రామా
-
వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు: ఎమ్మెల్యే సూర్యనారయణరెడ్డి
-
చంద్రబాబుకు దమ్మంటే నాపై పోటీచేయాలి: సూర్య నారాయణ సవాల్
సాక్షి, అనపర్తి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే సూర్య నారాయణ రెడ్డి సీరియస్ అయ్యారు. చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2వేల మంది కూడా పట్టని చోట సభ పెట్టాలనుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, సూర్యనారాయణ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దౌర్జాన్యానికి దిగడం దారుణం. టీడీపీ నేతల చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ హయంలో ఏరోజూ అనపర్తిని పట్టించుకోలేదు. అనపర్తిలో ఎప్పుడూ కులాల ప్రస్తావన లేదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి కులాల ప్రస్తావన తెస్తున్నారు. చంద్రబాబు పక్కన ఉన్న అవినీతిపరుల గురించి అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ప్రజలే బుద్ధిచెబుతారు. చంద్రబాబుకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో నాపై పోటీ చేసి గెలవాలి అని సవాల్ విసిరారు. -
మేమింతే..! తండ్రీకొడుకులం మారమంతే..!
సాక్షిప్రతినిధి, కాకినాడ: ఇరుకు సందులో సభ నిర్వహించడం ద్వారా మొన్న కందుకూరులో ఎనిమిది మంది మృత్యువాత పడటానికి కారణమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడులో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రజలు ఏమైపోతేనేం తనకు మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం రావాలన్నదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు ఎక్కడ సభలు నిర్వహించినా జనం రావడం లేదు. చిన్నా చితక లీడర్లను బతిమాలి, బెదిరించడం ద్వారా వెయ్యి మందిని రప్పించాలనుకుంటే తీరా వంద మందిని సమీకరించడం కూడా గగనమైపోతోంది. బహిరంగ ప్రదేశాల్లో, మైదానాల్లో సభలు నిర్వహిస్తే జనం కనిపించక.. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తుండటంతో పరువు పోతోంది. దీంతో చిన్నపాటి సందులను ఎంచుకుని సభలు నిర్వహిస్తూ.. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం ద్వారా ఎక్కువ మంది వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో తోపులాటలు చోటుచేసుకుని జనం ప్రాణాలమీదకు వస్తోంది. అయితే ఇవేమీ పట్టనట్లు ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు.. ఇటీవల పాదయాత్ర మొదలు పెట్టిన చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా ఇదే బాట ఎంచుకున్నారు. తొలుత ఒకటి.. రెండు చోట్ల బహిరంగ ప్రదేశాల్లో సభలు నిర్వహించినప్పుడు జనం లేక వెలవెలబోవడంతో తండ్రిబాటలోనే పయనిస్తున్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇరుకు సందుల్లో సభలొద్దని జీవో–1ను జారీ చేసిన ప్రభుత్వంపై, పోలీసులపై నోరు పారేసుకుంటూ.. సీఎం జగన్‌ను ఇష్టానుసారం తిడుతూ తండ్రీకొడుకులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తాజాగా శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ‘ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ’ పేరుతో నిర్వహించతలపెట్టిన సభను బహిరంగ ప్రదేశంలో పెట్టుకోవాలని చెప్పిన పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. అనపర్తిలో టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనం అద్దాన్ని ధ్వంసం చేసిన దృశ్యం పోలీసులపై దౌర్జన్యం ‘అనపర్తిలో ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబునాయుడు బహిరంగ సభ కోసం అనుమతికావాలని ఆ పార్టీ నేతలు కోరారు. పోలీస్‌యాక్ట్ , జీవో నంబర్–1ను అనుసరించి రోడ్డుపై సభకు అనుమతి ఇవ్వలేమని చెప్పాం. వారి సభ నిర్వహణకు అనుకూలంగా ఉండేలా కళాక్షేత్రంతో పాటు, ఒక లే అవుట్‌ను సూచించాం. అక్కడ పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పాం. అయినా వారు మా మాట వినిపించుకోకుండా రోడ్డుపై సభ పెట్టారు. ఇటు పోలీసులు, అటు ప్రజలకు ఇబ్బంది కలిగించారు’ అని తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి తెలిపారు. దీన్నిబట్టి ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబు అలజడి సృష్టించాలని, ఘర్షణ ధోరణి అవలంబించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహంతో ఉన్నారని స్పష్టమవుతోంది. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట నుంచి వేట్లపాలెం కెనాల్ రోడ్డు మీదుగా రోడ్‌షోతో చంద్రబాబు అనపర్తి వైపు బయలుదేరారు. పోలీసులు వాహనాలను నిలుపుదల చేసే ప్రయత్నం చేయగా.. చంద్రబాబు, టీడీపీ నాయకులను ఉసిగొల్పారు. వారు పోలీసులతో వాగ్వావాదానికి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఒక్కసారిగా రెచ్చిపోయి దౌర్జన్యంగా పోలీసులను తోసేశారు. దీంతో పలువురు పోలీసులు కిందపడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. బారికేడ్లను ఎత్తి పడేశారు. దీంతో పోలీసులు నేలపై కూర్చుని బతిమిలాడారు. అయినా చంద్రబాబు వినిపించుకోకుండా పార్టీ నేతలు, పార్టీ శ్రేణులతో కలిసి వాహనాలతో ముందుకు కదిలారు. లక్ష్మీనరసాపురంలో పోలీసు వాహనాన్ని అడ్డుపెట్టారు. కారులో ఉన్న చంద్రబాబు కిందకు దిగి.. అక్కడే ఉన్న మీడియా వాహనాన్ని ముందుకు పిలిపించి ఆ వాహనం పైకి ఎక్కి మాట్లాడారు. మాకు అనుమతి ఉంది, మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తామని రెచ్చగొట్టడంతో పార్టీ కార్యకర్తలు పోలీసు వాహనంపై రాళ్లతో దాడి చేశారు. అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు అనపర్తి దేవీచౌక్ సెంటర్‌కు చేరుకుని సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. -
బిగ్ క్వశ్చన్: అనపర్తిలో చంద్రబాబు ఓవరాక్షన్
-
అనపర్తిలో చంద్రబాబు ఓవరాక్షన్.. రెచ్చిపోయిన పచ్చగ్యాంగ్
-
అనపర్తిలో చంద్రబాబు హైడ్రామా.. రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు!
సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపైనే సభ పెట్టెందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు.. ఎంత చెప్పినా తన అనుచరులతో బాబు వీరంగం సృష్టించారు. ఇక, చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బారికేడ్డు తొలగించి పోలీసులపై టీడీపీ కార్యకర్తలు జులం చూపించారు. దీంతో, స్థానికులు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓవరాక్షన్‌పై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. పోలీసు ఆజ్ఞలను చంద్రబాబు ధిక్కరిస్తున్నారు. అనపర్తిలో నడిరోడ్డుపై సభ వద్దని చెప్పినా వినడం లేదు. నిబంధనలు పాటించాలి అన్నందుకు బాబు పేట్రేగిపోయారు. దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. జీవో-1 అమలులో ఉందని హైకోర్టు చెప్పినా.. బాబు పట్టించుకోవడం లేదు. తనకు ప్రత్యేక రాజ్యాంగం ఉందని అనుకుంటున్నారు. నడిరోడ్డుపై సభ వద్దన్నందుకు డ్రామా మొదలుపెట్టారు. కన్నబాబు మాట్లాడుతూ.. జెడ్‌ప్లస్ కమాండోల రక్షణ ఉందని చంద్రబాబు బరితెగిస్తున్నారు. 11 మందిని బలి తీసుకున్నాక కూడా అదే పంథాలో వెళ్తున్నారు. చట్టం కన్నా తాను ఎక్కవని చంద్రబాబు అనుకుంటున్నారు. -
పోలీసుల కళ్లుగప్పి స్టేషన్లోనే పిట్టల వేటగాడు దొంగతనం
అనపర్తి: అనపర్తి పోలీస్ స్టేషన్లో గతేడాది సెప్టెంబర్‌లో మిస్సయిన తుపాకీ బుధవారం బయటపడింది. రాయవరం మండలం వెదురుపాకకు చెందిన ఓ వ్యక్తి దీనిని అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. సీఐ ఎన్వీ భాస్కరరావు బుధవారం ఈ విషయం విలేకర్లకు తెలిపారు. 2019 సాధారణ ఎన్నికల సందర్భంగా కర్రి దొరయ్యరెడ్డి అనే వ్యక్తి తన రెండు తుపాకులను పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేశారు. వాటిని 2020లో అనపర్తి లాకప్‌లో భద్రపరిచారు. అందులో డీబీబీఎల్ తుపాకీ కనిపించలేదు. ఈ సంఘటనలో అప్పటి ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్, ఏఎస్సై గురవయ్య, కానిస్టేబుళ్లు అబ్దుల్ దురాని, జె.వరప్రసాద్‌లు సస్పెండయ్యారు. జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ ఇటీవల దీనిపై దృష్టి పెట్టారు. లోతుగా ఆరా తీశారు. రాయవరం మండలం వెదురుపాకకు చెందిన సంగడాల శ్రీను, వెదరుపాక సావరానికి చెందిన వెలుగుపూడి లోవరాజుతో పాటు మరో మైనర్‌ను గతేడాది అక్టోబర్ 5న అనుమానాస్పదంగా తిరుగుతున్నారని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. కరోనా సమయంలో తిరగవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. వీరిలో తుపాకీతో పిట్టలను వేటాడే సంగడాల శ్రీను లాకప్‌లో ఉన్న డీబీబీఎల్ తుపాకీని పోలీసుల కన్నుగప్పి తీసుకువెళ్లాడని తాజా విచారణలో తేలింది. తుపాకీ స్వా«దీనం చేసుకున్నారు. శ్రీనుతోపాటు మరో ముగ్గురిని బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
హత్యకేసు: అనపర్తి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి, తూర్పుగోదావరి : అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హత్య కేసుకు సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల కిత్రం నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బావ వరుస అయిన సత్తిరాజు రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ హత్య కేసులో రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ సత్తిరాజురెడ్డి సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరిపి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం రామకృష్ణారెడ్డిని కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని కాకినాడ సబ్‌జైలుకు తరలించారు. -
అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
-
అనపర్తి, బిక్కవోలు మండలాల్లో హైటెన్షన్
తూర్పు గోదావరి : జిల్లాలోని అనపర్తి, బిక్కవోలు మండలాల్లో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య మరోసారి రాజకీయ విబేధాలు భగ్గుమన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇరు మండలాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన అవినీతి చిట్టాను బయటపెడతానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన అవినీతిని రుజువు చేసేందుకు తనతో పాటు సాక్షులుతో సత్యప్రమాణాలు చేయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు బిక్కవోలు వినాయక గుడి లో మధ్యాహ్నం 2.30గంటలకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తన భార్య తో కలసి సత్యప్రమాణం చేయనున్నారు. ఇదే సమయంలో రామకృష్ణారెడ్డి కూడా సతీ సమేతంగా అదే గుడిలో సత్యప్రమాణానికి సిద్ధమయ్యారు. దీంతో అక్కడ ఏం జరగనుందనే దానిపై రాజకీయ వర్గాల్లో హైటెన్షన్ నెలకొంది. కాగా ఇరు వర్గాలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. -
బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం
సాక్షి, తూర్పుగోదావరి(అనపర్తి) : స్థానిక ఎన్టీఆర్ కాలనీకి చెందిన సుమారు పదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు ఆదివారం అత్యాచారయత్నం చేశాడు. స్థానికులు, బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ కాలనీ పుల్లారెడ్డి గారి వీధిలో అనుపోజు ప్రసాద్ (70) తన భార్య వరలక్ష్మితో కలిసి అద్దె ఇంటిలో ఉంటున్నాడు. గత నెల 25న ఆ ఇల్లు ఖాళీ చేసి రెండు వీధుల ముందర మరో ఇంట్లోకి అద్దెకు వెళ్లారు. ఆ ఇంటికి సమీపంలో ఉన్న కిరాణా షాపు వద్దకు ఆదివారం సాయంత్రం Výæతంలో ప్రసాద్ అద్దెకు ఉండే ఇంటికి సమీపంలో నివసించే బాలిక వచ్చింది. ఆమెను ప్రసాద్ తమ ఇల్లు చూసేందుకు రమ్మని పిలిచాడు. ఇంట్లోకి ఆమె వచ్చాక తలుపు గడియ వేసి ఆమె నోరు నొక్కి అత్యాచార యత్నం చేశాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన వరలక్ష్మి కిటికీలోంచి చూసి భర్తపై కేకలు వేయగా ప్రసాద్ తలుపులు తెరిచి పారిపోయాడు. తమకు ఏ విధమైన ఫిర్యాదూ అందలేదని పోలీసులు తెలిపారు. -
బూరెలతో మొక్కు తీర్చుకున్నారు..
సాక్షి, తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు ఆయనపై తమకున్న అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని చాలా మంది తమ ఇష్ట దైవాలకు మొక్కుకున్నారు. ఆ కోరిక నెరవేరడంతో ఇప్పుడు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని పీరా రామచంద్రపురం గ్రామానికి చెందిన చిర్ల సత్తిరెడ్డి, పద్మావతి దంపతులు తమ కోరిక నెరవేరడంతో ఆదివారం మొక్కు చెల్లించుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా, డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే బూరెలతో తులాభారం వేస్తామని సత్తిరెడ్డి దంపతులు మొక్కుకున్నారు. ఇప్పుడు వారి మొక్కు ఫలించడంతో అనపర్తి వీరుళ్లమగుడి ప్రాంగణంలో ఆదివారం 500 బూరెలతో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి తులభారం వేసి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ అభిమానులు హాజరయ్యారు. -
స్థల వివాదంలో కుటుంబ బహిష్కరణ!
సాక్షి,పెదపూడి: మండలంలోని పైన గ్రామంలో ఓ కుటుంబంపై సాంఘిక బహిష్కరణ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉలిసే సుబ్బారావు, అతని కొడుకు సాయిరామ్, కుమార్తె, భార్య నివసిస్తున్నారు. బాధితుడు సుబ్బారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో రామాలయం సమీపంలో తమ నివాస గృహం ఎదురుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ పెద్దలు సిమెంటు రోడ్డు నిర్మించారు. అ రోడ్డు నిర్మాణ విషయంలో సుబ్బారావు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.అయినా సరే స్థానిక పంచాయతీ పెద్దలు కొంత మంది రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఈ విషయంపై బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆగ్రహించిన గ్రామంలో కొంతమంది పెద్దలు బహిష్కరణ వేటు వేశారు. గ్రామ మాజీ సర్పంచి మట్టపర్తి వీరభద్రరావు, తదితరులు తమపై కావాలనే ఇలా బహిష్కరణ చేసినట్లు ఆ కుటుంబ సభ్యులు ఆరోపించారు. గ్రామంలో ఏ వస్తువు కొనాలని వెళ్లినా, తమకు సహకరించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి వెళితే ‘మీకు అమ్మకాలు జరపబోమని’ విక్రయదారులు చెబుతున్నారని ఆయన వివరించారు. ఒకవేళ పంచాయతీ పెద్దలను కాదని వస్తువులను అమ్మితే రూ.6 వేలు జరిమానా విధిస్తారని పెద్దలు విక్రయదారులకు హెచ్చరించారంటూ బాధితుడు వివరించారు. ఈ బహిష్కరణ విషయమై గతంలో పెదపూడి పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. బహిష్కరించలేదు ఉలిసే సుబ్బారావు కుటుంబాన్ని బహిష్కరించలేదు. రామాలయం వద్ద దేవుని కార్యక్రమాలు చేయడానికి ఆ ప్రాంతంలో గ్రామ పెద్దల అందరి సమక్షంలో సీసీరోడ్డు నిబంధనల ప్రకారం చేపట్టాం. ఎలాంటి ఆక్రమణాలు చేయలేదు. – మట్టపర్తి వీరభద్రం ,మాజీ సర్పంచి -
పల్లె.. తల్లడిల్లె..!
సాక్షి, మండపేట: పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తామని గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించింది. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసింది. ప్రజలతో ఎన్నికైన పాలకవర్గాన్ని కాదని, తెలుగు తమ్ముళ్లతో ఏర్పాటు చేసిన కమిటీలకు పెత్తనం అప్పగించింది. మరోపక్క పంచాయతీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ప్రజలను ఇబ్బందులు పాల్జేసింది. నిధులున్నా తరచూ ట్రెజరీ ఆంక్షలతో వినియోగించుకోలేని దుస్థితిలోకి పంచాయతీలను నెట్టేసింది. అభివృద్ధి పనులు ముందుకు సాగక, ఉద్యోగులకు జీతాలు చెల్లించక గ్రామ పాలన పడకేసింది. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపురం, రంపచోడవరం డివిజన్ల పరిధిలో మొత్తం 779 క్లస్టర పరిధిలో 1,069 పంచాయతీలకు గాను గ్రేడ్ –1 పరిధిలో 300 పంచాయతీలు ఉండగా, గ్రేడ్–2 పంచాయతీలు 231, గ్రేడ్ –3 పంచాయతీలు 308, గ్రేడ్–4 పంచాయతీలు 230 ఉన్నాయి. రిజిస్ట్రార్ విలువ ఆధారంగా పన్నుల భారాన్ని భారీగా పెంచిన చంద్రబాబు సర్కారు ఆ స్థాయిలో సదుపాయాల కల్పనను విస్మరించింది. జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) పోస్టు ఖాళీ అయ్యి మూడున్నరేళ్లు కావస్తున్నా ఇన్చార్జి పాలనలో ఉండడం గమనార్హం. కాకినాడ డీఎల్పీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జిలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామ పాలనలో ప్రధాన భూమిక నిర్వర్తించే కార్యదర్శులకు కొరత సమస్య పట్టిపీడిస్తోంది. ధృవపత్రాల మంజూరు, ఫించన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామ సభల నిర్వహణ, ఉపాధిహామీ సేవలు, స్మార్ట్ గ్రామాలు, తాగునీటి సరఫరా, పన్నుల వసూలు, ఇతర పాలనాపరమైన విధులను వీరు నిర్వర్తిస్తున్నారు. 779 క్లస్టర్లకుగాను 539 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులు ఉండడంతో 230 క్లస్టర్ల పరిధిలోని పంచాయతీలకు కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. అధికశాతం పంచాయతీల్లో కీలకమైన పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఆయా ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఏలికలు లేకుండానే పల్లెపాలన పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించారు. నగర, పురపాలక సంస్థల్లో సమీప గ్రామాలను విలీన ప్రతిపాదనలపై కోర్టు వివాదాలు నేపథ్యంలో 2013లో జిల్లాలోని 42 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని రాజమహేంద్రవరం కార్పొరేషన్, మండపేట మున్సిపాల్టీల్లో సమీప గ్రామాల విలీన ప్రతిపాదనలతో 27 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోగా, కాకినాడ డివిజన్లోని కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది పంచాయతీలు, పెద్దాపురం డివిజన్లోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీల సమీపంలోని ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. రంగంపేట మండలం జి.దొంతమూరులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించడంతో ప్రత్యేకపాలనలో ఉంది. 2014 ఆగస్టు నాలుగో తేదీతో అనపర్తి పంచాయతీ పదవీకాలం ముగియగా, నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక పాలనలో ఉంది. పలువురు సర్పంచుల రాజీనామాలు, మరణాల నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా 15 పంచాయతీల్లో సర్పంచ్ పదువులకు ఎన్నికలు జరపాల్సి ఉన్నా వాటిని పక్కన పెట్టేశారు. సకాలంలో వీటికి ఎన్నికలు జరపకపోవడంతో ప్రత్యేక పాలనలోనే మగ్గాయి. ఎన్నో ఇబ్బందుల్లో ప్రజలు పాలకులు లేకపోవడంతో వెలగని వీధిలైట్లు, డ్రైన్లో పారని మురుగునీరు, పనిచేయని కుళాయిలు, వీధి మలుపులో తొలగని చెత్త, క్షీణించిన పారిశుద్ధ్యంతో వెంటాడుతున్న రోగాలు, అందుబాటులో ఉండని అధికారులు, అడుగుపడని అభివృద్ధి, పాలకవర్గాలు లేక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితిలో ఎనిమిదేళ్లుగా విలీన ప్రతిపాదిత గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎప్పుడు వస్తారో తెలియదు. నిధుల వ్యయం, అభివృద్ధి పథకాల అమలు అంతా అయోమయం. పట్టించుకునే వారు లేక గ్రామ ప్రజలకు అవసరమైన సేవలతో పాటు పంచాయతీలకు విడుదలయ్యే నిధుల వినియోగంలోను పారదర్శక లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. . పాలకులపై పెత్తనం పంచాయతీల్లో ప్రజలతో ఎన్నుకోబడిన పాలకవర్గం పాలన సాగిస్తోంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక, అభివృద్ధి పనుల నిర్వహణలో పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేవారు. రాజ్యాంగ బద్ధంగా సాగే ఈ ప్రక్రియను తుంగలోకి తొక్కి జన్మభూమి కమిటీల పేరిట అధికారపార్టీ నేతలకు పెత్తనం అప్పగించారు సీఎం చంద్రబాబు. అర్హులందరికీ అందాల్సిన సంక్షేమ ఫలాలను జన్మభూమి కమిటీల ద్వారా తమకు కావాల్సిన వారికి కట్టబెట్టుకున్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, గృహనిర్మాణం, కార్పొరేషన్ రుణాలు తదితర ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా కమిటీ సభ్యులను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి. పథకాల మంజూరులో తెలుగు తమ్ముళ్ల చేతివాటం దాఖలాలు జిల్లా వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. సిబ్బందికి జీతాలు అందక.. ట్రెజరీ నిధులపై ప్రభుత్వ ఆంక్షల నేపధ్యంలో పంచాయతీ సిబ్బంది జీతాలు అందకపోవడంతో పాటు, అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిలో 5,600 మంది, రెగ్యులర్‌గా 318 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. తరచూ ట్రెజరీ ఆంక్షలతో సకాలంలో జీతాలు అందక సిబ్బంది ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. అభివృద్ధి పనులకు ఆంక్షలు ఆటంకంగా మారాయి. కోట్లాది రూపాయల మేర బిల్లు బకాయిలు పేరుకుపోతుండడంతో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. బిల్లులు విడుదల కాక ఏం చేయాలో పాలుపోనిస్థితిలో కాంట్రాక్టర్లు కొట్టుమిట్టాడుతున్నారు. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికన అధికారపార్టీ నేతలతో ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో ప్రజలతో ఎన్నుకోబడిన పాలకవర్గం కేవలం ప్రేక్షకపాత్ర పోషించాల్సి వచ్చింది. -చింతా ఈశ్వరరావు, మండల సర్పంచుల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, పెదకొత్తూరు, కరప మండలం అధికారులు లేక ఇక్కట్లు పంచాయతీల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. ఒక్కో కార్యదర్శి రెండు నుంచి ఐదు పంచాయతీల వరకు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. కార్యదర్శుల కొరతతో ఏ పనీ సకాలంలో జరగక ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. -కసిరెడ్డి ఆంజనేయులు, మాజీ సర్పంచ్, లూతుకుర్రు, మామిడికుదురు మండలం జీతాలు చెల్లించలేని దుస్థితి ట్రెజరీ ఆంక్షలతో సిబ్బందికి జీతాలు చెల్లించలేని దుస్థితికి పంచాయతీలను ప్రభుత్వం తీసుకువచ్చింది. సకాలంలో బిల్లులు విడుదలవ్వక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. సమస్యలు పరిష్కారమవ్వక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. -పండా రామకృష్ణదొర, పందిరిమామిడి, ఏజెన్సీ డివిజన్ సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు మండలం -
కర్రలతో దాడిచేసుకున్న టీడీపీ నేతలు
సాక్షి, అనపర్తి/తూర్పు గోదావరి : మండలంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. వివాహేతర సంబంధం వ్యవహారంపై కొప్పవరంలో టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ నేతలు వెంకట్రామిరెడ్డి, సర్రెడ్డి వర్గీయులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. వివాహేతర సంబంధంలో సెటిల్మెంట్ బెడిసికొట్టడంతో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంపీటీసీ సర్రెడ్డికి గాయలయ్యాయి. దీంతో వెంకట్రామిరెడ్డి ఇంటిపై సర్రెడ్డి వర్గీయులు దాడికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో టీడీపీ మండలాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తలకు గాయమైంది. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఘర్షణలు చెలరేగకుండా గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడానికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగినట్టు సమాచారం. -
కర్రలతో దాడిచేసుకున్న టీడీపీ నేతలు
-
ప్రజాసంకల్పయాత్ర: ఎగిసిపడుతున్న జన కెరటాలు
-
వైఎస్ జగన్ పాదయాత్ర 212వ రోజు ప్రారంభం
సాక్షి, అనపర్తి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఊలపల్లి నుంచి 212వ రోజు పాదయాత్రను జననేత ప్రారంభించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. బిక్కవోలు మీదుగా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. గొల్లల మామిడాడలో సాయంత్రం బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. -
అనపర్తి మాజీ ఎమ్మెల్యేకు పుత్ర వియోగం
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే టి. రామారెడ్డికి పుత్ర వియోగం కలిగింది. ఆయన కుమారుడు రాంబాబు బుధవారం ఉదయం రైలు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తూ కాలు జారిపడి మృతి చెందినట్టు సమాచారం. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. -
సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
అనపర్తి: టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ఈ నెల 4న అనపర్తిలో సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై కలెక్టర్ నీతూప్రసాద్ బుధవారం అనపర్తి పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. స్థానిక దేవీచౌక్ సెంటరులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభా వేదిక వద్ద, సీఎం పర్యటనలో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే పారిశుధ్య పనులు వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖలతో పాటు వివిధ శాఖలు ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్‌కు సంబంధించిన అంశాలపై ఆయా శాఖల అధికారులను ఆరా తీశారు. సీఎం మాట్లాడనున్న సభా వేదిక స్థలాన్ని, జీబీఆర్ విద్యా సంస్థ క్రీడా మైదానంలో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్‌ను ఎమ్మెల్యేలతో కలసి కలెక్టర్ పరిశీలించారు. అనపర్తి మండలం పొలమూరుకు బదులుగా పీరా రామచంద్రపురంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని సీఎంతో ప్రారంభింపజేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ నిర్ణయించారు. పీరా రామచంద్రపురంలో ఏర్పాటు చేయనున్న వాటర్ ప్లాంట్ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. 4న మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం అనపర్తి రాక ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం అనపర్తి చేరుకుంటారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆ రోజు తొలుత మండపేట నియోజకవర్గంలోని అంగరలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొని అనంతరం అనపర్తి వస్తారన్నారు. జెడ్పీటీసీ కర్రి ధర్మారెడ్డి (దొరబాబు), టీడీపీ సీనియర్ నాయకులు సత్తి దేవదానరెడ్డి, సిరసపల్లి నాగేశ్వరరావు, కర్రి వెంకటరామారెడ్డి, దత్తుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంగరలో సీఎం పర్యటన స్థలాల పరిశీలన అంగర (కపిలేశ్వరపురం): ఈ నెల 4న సీఎం చంద్రబాబు నాయుడు కపిలేశ్వరపురం మండలంలోని అంగరలో పర్యటించే స్థలాలను బుధవారం కలెక్టర్ నీతూ ప్రసాద్ పరిశీలించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలసి హెలీప్యాడ్, బహిరంగ సభ, పథకాలను ప్రారంభించే ప్రదేశాలను చూశారు. హెలీప్యాడ్కోసం అంగర, పడమర ఖండ్రిక గ్రామాల్లోని రైస్‌మిల్లు, పాఠశాలల స్థలాలను పరిశీలించి జెడ్పీ ఉన్నత పాఠశాల వెనుక ఉన్న ఖాలీ స్థలం అనువైనదిగా నిర్ణయించారు. సీఎం గ్రామంలోకి రాగా పాత వాటర్ ట్యాంకు సమీపంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథ కంలో భాగంగా వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించేలా, అనంతరం ఊర చెరువు సమీపంలోని ఖాళీ స్థలంలో బహిరంగ సభ నిర్వహించేలా నిర్ణయించారు. తొలుత ఎమ్మెల్యే వేగుళ్ల, ఏజేసీ మార్కండేయులు, హౌసింగ్ పీడీ సెల్వరాజ్, హ్యేండ్లూమ్ శాఖ ఏడీ సీహెచ్ లక్ష్మణ రావు, ఇన్చార్జి డీఎం అండ్ హెచ్‌వో పవన్‌కుమార్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ సదానంద, ఆర్డీవో సుబ్బారావు, పశు సంవర్థక శాఖ ఏడీ రామకోటేశ్వరరావు, డీఎల్పీవో కె.చంద్రశేఖర్‌రావు, రామచంద్రపురం డీఎస్పీ రవీంద్రనాథ్‌తో సీఎం పర్యటనపై కలెక్టరు చర్చించారు. పటిష్ట ఏర్పాట్లు చేయాలి కాకినాడ సిటీ: సీఎం చంద్రబాబునాయుడు పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లో వివిధశాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 4న ఉదయం 10.20 గంటలకు విమానంలో సీఎం రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి హెలిక్టాపర్లో 11 గంటలకు కపిలేశ్వరపురం మండలం అంగర ఉన్నత పాఠశాల హెలిప్యాడ్‌కు చేరుకుంటారన్నారు. అక్కడ సభావేదిక వద్దకు చేరుకుని ఆరోగ్య శిబిరాలను సందర్శించిన అనంతరం ఐదు ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం అనపర్తి చేరుకుని ఐదు ప్రచార అంశాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, అదనపు జేసి మార్కండేయులు, డీఆర్వో యాదగిరి పాల్గొన్నారు. సదరమ్ వివరాలు ఆన్లైన్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద వికలాంగులకు రూ.1500 వంతున పింఛన్లు అందించనున్న నేపథ్యంలో జిల్లాలో సదరమ్ సర్టిఫికెట్లు జారీ చేసిన వికలాంగుల వివరాలను బుధవారం రాత్రికే పూర్తిస్థాయిలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని డీఆర్ డీఏ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వారం రోజులుగా రాష్ట్రంలో ఏ జిల్లాలోను చేయని విధంగా ప్రత్యేక మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి సుమారు 10వేల మంది వికలాంగులను సదరమ్ సర్టిఫికెట్ల జారీకి పరీక్షించామన్నారు. -
నవంబర్ నెలాఖరుకు రైతు రుణ మాఫీ
అనపర్తి : రైతు రుణాలను నవంబర్ నెలాఖరునాటికి అంచెలంచెలుగా మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. మంత్రి చినరాజప్ప గురువారం అనపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతర ం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణాలను నిబంధనల మేరకు మాఫీ చేసేందుకు వచ్చే నెల నుంచి శ్రీకారం చుట్టనున్నారన్నారు. తొలి విడతలో సుమారు రూ. 50 వేల వరకూ ఉన్న రుణాలు రద్దవుతాయని తెలిపారు. అలాగే డ్వాక్రా రుణాలు కూడా రద్దవుతాయని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఐటీ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. అలాగే పరిశ్రమలను నెలకొల్పే దిశలో ప్రభుత్వం పయనిస్తుందన్నారు. శాసన మండలి విప్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వం విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ 100 రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు సమకూర్చుకున్న జిల్లా ఎమ్మెల్యేల్లో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ముందున్నారన్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, తుని నియోజక వర్గ ఇన్‌ఛార్జి యనమల కృష్ణుడు మాట్లాడుతూ ఐదేళ్ల టీడీపీ పాలనలో అనపర్తి నియోజకవర్గం ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలుస్తుందన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి(దొరబాబు), రాష్ట్ర టీడీపీ రైతు విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి సిరసపల్లి నాగేశ్వరరావు, పార్టీ ప్రచార కార్యదర్శి సత్తి దేవదానరెడ్డి, రాష్ట్ర సర్పంచ్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు పడాల వెంకటరామారెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘జోలె’ పట్టిన దొర.. ‘జాలి’చూపిన పాలేరు
అనపర్తి: కోట్లకు పడగలెత్తిన వారుసైతం అక్కడ జోలెకట్టి బిక్షాటన చేస్తుంటారు.. కూటికి కూడా లేనివారు వారిపై జాలిచూపి ఐదో,పదో సమర్పిస్తారు. ఎలాంటి బిడియం లేకుండా భూస్వామి పట్టిన జోలెలో అతడి పొలంలో కూలిపని చేసేవారి కష్టార్జితమూ పడుతుంది. ఇది ఆ ఊళ్లో అందరూ మనసావాచాకర్మణా భక్తిశ్రద్ధలతో తరతరాలుగా ఆచరిస్తున్న సంప్రదాయం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో కొలువు తీరి, ‘కర్రి’ వంశీకుల ఆడపడుచుగా పరిగణన పొందుతూ, నిత్యపూజలందుకునే గ్రామదేవత సత్తెమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ సంప్రదాయాన్ని కళ్లారా చూడొచ్చు. అమ్మవారి జాతర రెండేళ్లకోసారి మూడురోజుల పాటు జరుగుతుంది. అంతకు ముందు తమ కోరికలు తీర్చమని అమ్మవారికి మొక్కుకున్న పురుషులు.. అవి తీరితే జాతరలో చివరి రోజున.. చిత్రవిచిత్ర వేషాలతో ఊరి వీధుల్లో భిక్షాటన చేస్తారు. నిత్యం వారిని చూసేవారే గుర్తించలేనంతగా ఈ వేషాలు రక్తి కట్టడం విశేషం. సోమవారం జాతర ముగింపు సందర్భంగా మహానేత వైఎస్, సాయిబాబా, పండితులు, పాములవాళ్లు, వికలాంగులు, గీత కార్మికులు, హిజ్రాలు, పలు దేవతల వేషాలు ఆకట్టుకున్నాయి. -
చేతులు కట్టి.. గోచీలు పెట్టి..చెప్పులతో కొట్టి..
-
చేతులు కట్టి.. గోచీలు పెట్టి..చెప్పులతో కొట్టి..
కొప్పవరం (అనపర్తి), న్యూస్‌లైన్ :భర్త, ఇద్దరు పిల్లల ఎదుటే ప్రయాణికురాలిని వికృత చేష్టలతో వేధించి, లైంగికదాడికి యత్నించిన ఆటోడ్రైవర్లను గ్రామస్తులు చెప్పులతో కొట్టి గుణపాఠం చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో పాటు గత 26న క్రైస్తవ సభలకు గుంటూరు వెళ్లారు. బుధవారం సాయంత్రం విజయవాడలో కాకినాడ పాస్ట్ పాసింజర్ ఎక్కి రాత్రి 10.30కి అనపర్తి వచ్చారు. అక్కడినుంచి కొప్పవరం వెళ్లేందుకు రైల్వేస్టేషన్ వద్ద దుప్పలపూడికి చెందిన ఆటోడ్రైవర్ కర్రి గంగిరెడ్డితో బేరం కుదుర్చుకున్నారు. రాజమండ్రి క్వారీ ఏరియాకి చెందిన మరో డ్రైవర్ చిట్టూరి శివాజీని వెంటబెట్టుకుని గంగిరెడ్డి తన ఆటోలో వీరిని తీసుకుని బయలుదేరాడు. ఆటోను వారు నేరుగా కాకుండా అనపర్తి శివారు కొత్తూరు శ్మశాన వాటిక మీదుగా తీసుకువెళ్లారు. ఆటోను శివాజీ నడుపుతూ ఉండగా, గంగిరెడ్డి పక్కనే కూర్చుని వెనుకనున్న మహిళతో వికృతచేష్టలు ప్రారంభించాడు. ఆమెపై చేతులు వేస్తూ ఇబ్బంది పెట్టాడు. శ్మశానవాటిక వద్ద ఆటో ఆపిన డ్రైవర్లు ఆమె చేయి పట్టుకుని లాగబోయారు. దీంతో భార్యాభర్తలు భయంతో బిక్కుమంటూ ఆటోలోనే కూర్చునిపోయారు. పరిస్థితి దిగజారుతున్నా అర్ధరాత్రి కావడం, పక్కనే బిడ్డలు ఉండడంతో భర్త వారిని ఎదిరించలేదు. డ్రైవర్లకు అనుమానం రాకుండా సెల్ ఫోన్లో బంధు మిత్రులకు కాల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే అర్ధరాత్రి కావడంతో ఎవరూ ఫోన్ తీయలేదు. ఈలోగా శ్మశానవాటికకు దాపునే ఉన్న కెనాల్ రోడ్లో వాహన సంచారం కనిపించడంతో అక్కడ అనుకూలంగా లేదనుకున్న డ్రైవర్లు ఆటోను ముం దుకు తీసుకువెళ్లారు. మద్యం మత్తులో ఉన్న గంగిరెడ్డి, శివాజీ బాధితురాలి భర్తను దారి గురించి అడిగారు. లక్ష్మీనర్సాపురంలో తాను పనిచేసే రైసుమిల్లు ఉండడంతో అటువైపు ఆటోను తరలించాలని భావించిన భర్త అటు జనసంచారం ఉండదని వారితో చెప్పాడు. దీంతో డ్రైవర్లు ఆటోను అటే మళ్లించారు. రైసుమిల్లు దాటిన తర్వాత ఒక నిర్జన ప్రదేశంలో ఆటోను ఆపిన డ్రైవర్లు కిందికి దిగి తమ ప్లాన్ అమలుపై మాట్లాడుకుంటుండగా, భర్త ఫోన్ ద్వారా తన స్నేహితునికి పరిస్థితి తెలిపాడు. ఈలోగా మరో ఇద్దరు అతడికి ఫోన్ చేశారు. వారికి చోటు చెప్పి వెంటనే రమ్మన్నాడు. దీంతో వారందరూ హుటాహుటిన బయలుదేరి ఆటో ఉన్న ప్రాంతానికి వచ్చారు. డ్రైవర్లు ఇద్దరినీ వారు కొప్పవరం లాక్కెళ్లి బాధితుల ఇంటికి చేరువలో స్తంభాలకు కట్టేశారు. వారి బట్టలు ఊడదీయించి గోచీలు పెట్టించారు. అర్ధరాత్రి ఈ సంగతి గ్రా మంలో దావానంలా వ్యాపించడంతో అంద రూ అక్కడకు చేరుకున్నారు. సాటి మహిళకు జరిగిన అవమానంపై కోపోద్రిక్తులైన మహిళలు గంగిరెడ్డి, శివాజీలను చెప్పులతో చావగొట్టారు. సమాచారం అందుకున్న అనపర్తి పోలీసులు గురువారం ఉదయం వారిద్దరినీ పోలీసు స్టే షన్‌కు తరలించారు.