Bellamkonda Ganesh Babu
-
అఫీషియల్: ఓటీటీకి వచ్చేస్తోన్న 'నేను స్టూడెంట్ సర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బెల్లంకొండ గణేశ్, అవంతిక దస్సాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాంది సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. (ఇది చదవండి: టచ్ చేసేందుకు ఒప్పుకోలేదు.. హీరోయిన్ తీరుపై నటుడు కామెంట్స్!) ఈ మూవీ ఈనెల 14నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో సునీల్, సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. నేను స్టూడెంట్ సార్ బెల్లంకొండ గణేష్ నటించిన రెండో చిత్రం కాగా.. అలనాటి ప్రముఖ నటి భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దాసాని ఈ మూవీతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుతోని ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. (ఇది చదవండి: ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!) Ee Student vachesthunnadu...!🙋♂️ Get ready for a thrilling experience..😯 Premieres July 14 🥳#GaneshBellamkonda@NaandhiSATISH#rakhiuppalapati@avantikadassani @suneeltollywood@thondankani pic.twitter.com/0xNtW4wn65 — ahavideoin (@ahavideoIN) July 3, 2023 -
ఈ సినిమా చేయడానికి కారణం ఇదే...!
-
హీరో హీరోయిన్ కి మాత్రమే గొడుగులు ఎందుకు పడతారంటే..
-
'నేను స్టూడెంట్ సార్' మూవీ ట్విటర్ రివ్యూ
బెల్లంకొండ గణేశ్, అవంతిక దస్సాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాంది’ సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నేడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఓవరీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్ షో పూర్తయింది. ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ సినిమాపై తమ అభిప్రాయాలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. నేను స్టూడెంట్ సార్ మూవీపై ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుందని కొందరు ట్వీట్స్ పెడుతున్నారు. మరికొందరు ఈ సినిమా సరికొత్త థ్రిల్ అందించిందని పేర్కొంటున్నారు. కొందరేమో ఫుల్ ఎమోషనల్ డ్రామా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. Dialogues bagunnay, comedy ga start ayyindhi cinema#NenuStudentSir! pic.twitter.com/QBBHJYIeSe — D kalyan (@emptypockettss) June 2, 2023 Picha comedy ra aiyya 😂#NenuStudentSir pic.twitter.com/iV3tEL1Gpb — The Sanjay Siva (@SanjaySiva01) June 2, 2023 This is an really an good concept movie with good action thriller movie and with good drama entertainment in theatre's book your tickets now and watch it today. All the best team#NenuStudentSir 🎟️ https://t.co/Nlv9ZFR0vM#GaneshBellamkonda #RakhiUppalapati @NaandhiSATISH @SV2Ent — Bharani (@PrabhasSeenu1) June 1, 2023 Edi cinema ante elanti good and interesting concept tho movie vasthe 💥 blockbuster talk easy ga vastadi Releasing today on theatre book your tickets now 😁#NenuStudentSir! 🎟️ https://t.co/LFP5XOyaUu#GaneshBellamkonda #RakhiUppalapati @NaandhiSATISH @SV2Ent — Natrajan (@Siddharthroy031) June 1, 2023 -
ఆడియన్స్ థ్రిల్ అవుతారు
‘‘నేను స్టూడెంట్ సర్’లోని ఎమోషన్స్‌కు ఎక్కువగా స్టూడెంట్స్, యూత్ కనెక్ట్ అవు తారు. స్క్రీన్ ప్లే క్యూరియాసిటీతో నడుస్తుంది. ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అన్నారు బెల్లంకొండ గణేశ్. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్, అవంతిక దస్సాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా.. ‘‘ప్రేక్షకుల టైమ్, డబ్బు వృథా కావు’’ అన్నారు రాకేష్. ‘‘థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు సతీష్ వర్మ. ‘‘డబ్బే ఒక ఐడియాలజీ అనేది ఈ సినిమా రూట్ కాన్సెప్ట్’’ అన్నారు ఈ చిత్రకథారచయిత కృష్ణ చైతన్య. -
నటుడిగా నేను సక్సెస్ అయ్యా: బెల్లంకొండ గణేశ్
‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా రంగప్రవేశం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్'తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. అవంతిక దస్సాని హీరోయిన్గా నటిస్తోంది. జూన్ 2న నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో బెల్లంకొండ గణేష్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ► నేను ఎప్పుడూ స్టూడెంట్‌లానే ఫీలవుతాను. రియల్ లైఫ్‌లో జరిగే పరిస్థితులు ఇందులో ఎక్కువగా ఉంటాయి. చివరి వరకూ చాలా క్యూరియాసిటీ ఉంటుంది. క్లైమాక్స్ వచ్చే వరకు అసలు విలన్ ఎవరనేది ఊహించలేరు. అది మాత్రం వందశాతం హామీ ఇవ్వగలము. ► ఈ కథని కృష్ణ చైతన్య గారు రాశారు. రాకేష్ గారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారు. కృష్ణ చైతన్య గారు కథ చెప్పినపుడు ఇందులో ఉన్న ఎమోషన్, క్యారెక్టర్ ఆర్క్ కి బాగా కనెక్ట్ అయ్యాను. ► ఈ పాత్ర నా కెరీర్‌కు చాలా ప్లస్ అవుతుంది. చాలా మంది పెద్ద హీరోలు వారి రెండో సినిమాలో స్టూడెంట్ పాత్ర చేశారు. ఇది నాకు మంచి బూస్ట్ అవుతుంది. ► భాగ్యశ్రీ మా అన్నయ్య సినిమాలో నటించారు. అదే సమయంలో వారి అమ్మాయిని తెలుగులో లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. ఈ సినిమాకు ఒక కొత్త అమ్మాయి అయితే బావుంటుందనిపించి అవంతికని తీసుకున్నాం. ► నాందితో మంచి విజయం అందుకున్న నిర్మాత సతీష్ వర్మ ఈ సినిమా కోసం చాలా ప్యాషన్‌తో పని చేశారు. అందరికంటే ముందు సెట్‌కు వచ్చి అందరికంటే చివర్లో వెళ్ళేవారు. సినిమాకి ఏం కావాలో అది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు. ► స్వాతిముత్యం రిలీజ్ చేసినప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారి సినిమాలతో కలసి రావడం వలన బ్యాడ్ రిలీజ్ డేట్ అనే మాట వినిపించింది. ఉన్నవాట్లో మనదొక్కటే ఫ్యామిలీ సినిమా పండక్కి ఆడే ఛాన్స్ ఉంటుందనే నమకంతో నిర్మాతలు ఆ డేట్‌కు విడుదల చేశారు. అది ఇంకా బాగా ఆడాల్సింది. అయితే ఓటీటీలో దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి సినిమా చేశారని ప్రశంసిస్తున్నారు. ఈ విషయంలో నటుడిగా నేను సక్సెస్ అయ్యాననే భావిస్తాను. ఇప్పుడు ‘నేను స్టూడెంట్ సర్' పై మాకు పూర్తి నమ్మకంగా వుంది. మంచి సినిమాని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది. ► మహతి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి సినిమా చుశామనే అనుభూతితో పాటు మంచి ఆర్ఆర్ విన్నామనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు బయటికి వస్తారు. -
నాంది క్రేజ్‌ని ‘నేను స్టూడెంట్’ నిలబెడుతుంది: సతీష్ వర్మ
‘‘బాహుబలి, హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం’ లాంటి కొన్ని సినిమాలు తప్పితే చాలావరకు ఏ సినిమానీ నేను రెండోసారి చూడలేదు. కానీ ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రాన్ని నాలుగు సార్లు చూశాను.. ఎక్కడా బోర్ కొట్టదు. కోవిడ్ కారణంగా 40 ఏళ్లకు పైబడిన వారు ‘నాంది’ సినిమాని ఎక్కువగా థియేటర్‌కి వచ్చి చూడలేదు. కానీ ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రం అన్ని వయసుల వారు థియేటర్‌కి వచ్చి చూసేలా ఉంటుంది’’ అని నిర్మాత ‘నాంది’ సతీష్ వర్మ అన్నారు. బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని జంటగా రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’.సతీష్ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా సతీష్ వర్మ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నేను స్టూడెంట్ సర్’లో యూనివర్సిటీలో స్టూడెంట్ లైఫ్‌ని చూపించాం. గణేష్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. మంచి థ్రిల్లర్ జోనర్లో కథ సాగుతుంది. ‘నాంది’కి వచ్చిన క్రేజ్‌ని ఈ సినిమా నిలబెడుతుందని భావిస్తున్నాను. కృష్ణ చైతన్యగారి కథని రాకేష్ ఉప్పలపాటి చక్కగా తీశారు. నటి భాగ్యశ్రీ గారి అమ్మాయి అవంతికని మా సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం చేయడం హ్యాపీ. మా తర్వాతి సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలోనే ఉంటుంది’’ అన్నారు. -
ప్రతిభ ఉంటే సరిపోదు, టైం కూడా కలిసిరావాలి
‘‘ఇండస్ట్రీలో దర్శకుడిగా అవకాశం రావాలంటే ప్రతిభతో పాటు సరైన టైమ్ కూడా కలిసిరావాలని నమ్ముతాను. ఎందుకంటే ఫిల్మ్‌నగర్, కృష్ణానగర్‌లో దర్శకులు కావాలనుకునే కొందరితో నేను మాట్లాడుతున్నప్పుడు వారిలో నా కన్నా ఎక్కువ ప్రతిభ ఉన్నట్లు అనిపిస్తుంటుంది’’ అని డైరెక్టర్ రాకేష్ ఉప్పలపాటి అన్నారు. బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్!’. రాకేష్ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాకేష్ ఉప్పలపాటి మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం భీమడోలు. నాన్నగారి వ్యాపారం నిమిత్తం తాటిపాకకు మారాం. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ సినిమాకు దర్శకత్వ విభాగంలో పనిచేశాను. ఆ తర్వాత తేజగారి దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేశాను. కృష్ణ చైతన్యగారి కథతో ‘నేను స్టూడెంట్ సర్’ సినిమా చేశాను. హీరోకి ఇష్టమైన ఫోన్, అవసరమైన ఐడెంటిటీ.. భయపెట్టే గన్.. ఈ మూడు అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హీరోకి, ఓ పోలీస్ కమిషనర్‌కు మధ్య ఎలాంటి యుద్ధం నెలకొంది? అనేది ఇందులో ఆసక్తిగా ఉంటుంది. నిర్మాత ‘నాంది’ సతీష్గారితోనే మరో సినిమా చేస్తాను’’ అన్నారు. -
నేను స్టూడెంట్ సార్ అనేవాణ్ణి
‘‘నేను ప్రతిరోజూ విద్యార్థిలానే భావిస్తాను. ‘నేను స్టూడెంట్ సర్’ టైటిల్ విన్నప్పుడు నా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. ఏదైనా తింగరి పని చేసి పోలీసులకు దొరికినప్పుడు ‘నేను స్టూడెంట్ సార్’ అనేవాణ్ని’’ అన్నారు హీరో విశ్వక్ సేన్. బెల్లంకొండ గణేశ్ హీరోగా రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘24/7 ఒకటే ధ్యాస..’ అనే పాటని విశ్వక్ సేన్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నేను స్టూడెంట్ సర్’ టీజర్ బాగుంది. సినిమా మంచి హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఫోన్ కొనడానికి కష్టపడే సమయంలో వచ్చే మాంటేజ్ సాంగ్ ‘24/7 ఒకటే ధ్యాస..’’ అన్నారు బెల్లంకొండ గణేశ్. ‘‘మా సినిమాని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాఖీ ఉప్పలపాటి. ‘‘హీరో క్యారెక్టర్ ఏంటో ఈ పాట ద్వారా చెప్పాం’’ అన్నారు సతీష్ వర్మ. కథారచయిత కృష్ణ చైతన్య, పాటల రచయిత హర్ష, హీరోయిన్లు అవంతిక, రితిక మాట్లాడారు. -
నేను స్టూడెంట్ సార్ రిలీజ్ డేట్ వచ్చేసింది
స్టూడెంట్‌గా థియేటర్స్‌కు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు బెల్లకొండ గణేశ్. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లకొండ గణేశ్ హీరోగా ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూండెట్ సార్!’. ఇందులో అవంతిక దస్సాని హీరోయిన్గా నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జూన్ 2న రిలీజ్ చేస్తున్నట్లు శుక్రవారం యూనిట్ ప్రకటించింది. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్. -
వాయిదా పడిన బెల్లంకొండ గణేష్ మూవీ.. కారణమిదే!
బెల్లండకొండ గణేశ్ నటిస్తున్న రెండో చిత్రం నేను స్టూడెంట్ సర్.రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అవంతిక దస్సానీ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే రిలీజైప పోస్టర్స్, టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను 10న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విద్యర్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకొని సినిమాను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. వేసవి సెలవుల్లో కలుద్దాం అంటూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా ఓ కాలేజీ స్టూడెంట్‌కి ఎదురైన సమస్య నుంచి అతను ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు. #NenuStudentSir! is postponed from March 10th! 👍🏻 Wishing every student all the best for their exams & Meet you all during SUMMER HOLIDAYS ⛱️#GaneshBellamkonda @avantikadassani @NaandhiSATISH #RakhiUppalapati #MahathiSwaraSagar @adityamusic pic.twitter.com/Xf2i3iKH3c — 𝐒𝐕𝟐 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 (@SV2Ent) February 27, 2023 -
నేను స్టూడెంట్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్
స్టూడెంట్‌గా బెల్లంకొండ గణేష్ థియేటర్స్‌కి వచ్చే సమయం ఖరారైపోయింది. బెల్లంకొండ గణేష్ హీరోగా రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నాంది’ ఫేమ్ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సార్..!’. ఇందులో అవంతిక దస్సాని హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను మార్చి 10న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు మేకర్స్. ‘‘ఇది ఇంటెన్స్ యాక్షన్ మూవీ’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, కెమెరా: అనిత్ మధాడి. -
ఆకట్టుకుంటున్న 'మాయే మాయే' లిరికల్ సాంగ్.. విన్నారా?
యువ హీరో బెల్లంకొండ గణేశ్,అవంతిక దస్సానీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’ రాఖీ ఉప్పలపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదల చేసిన మాయే మాయే సాంగ్ ప్రోమో మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తూ సాగుతుంది. తాజాగా మాయే మాయే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. హీరోహీరోయిన్లు గణేశ్, అవంతిక సాగే జర్నీ నేపథ్యంలో వచ్చే ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తునడంలో ఎలాంటి సందేహం లేదు. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సాంగ్ లిరికల్ వీడియో లింక్‌ను షేర్ చేశాడు. ఈ పాటను కృష్ణ చైతన్య రాయగా.. కపిల్ కపిలన్, మహతి స్వరసాగర్ ఈ సాంగ్ పాడారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని హీరోయిన్ తండ్రి అర్జున్ వాసుదేవన్‌గా అనే పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుండగా..సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ‘నాంది’ ఫేం సతీశ్ కుమార్ నిర్మిస్తున్నారు. నేను స్టూడెంట్ సర్ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ దీప్, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. -
బెల్లంకొండ గణేష్ 'నేను స్టూడెంట్ సర్' టీజర్ విడుదల
బెల్లంకొండ గణేష్, అవంతిక జంటగా నటింన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. కృష్ణచైతన్య కథ, స్క్రీన్ ప్లేతో రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శనివారం ఈ సినివ టీజర్‌ను లాంచ్ చేసిన దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘టీజర్ బాగుంది. ఈ సినిమాతో గణేష్‌కు మరో విజయం దక్కాలి. ‘నాంది’ వంటి సినిమాను నిర్మించిన సతీష్ వర్మ సంస్థలో గణేష్ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. దర్శకుడు రాఖీతో పాటు చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రం ‘స్వాతిముత్యం’తోనే ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేయడం సంతోషంగా అనిపింంది. అయితే ఆ సినిమా రిలీజ్ కాక ముందే నన్ను నమ్మి, ‘నేను స్టూడెంట్ సర్’ను నిర్మింన సతీష్‌గారికి ధన్యవాదాలు. ఈ కథలో మంచి కంటెంట్ ఉంది. అందుకే యాక్సెప్ట్ చేశాను’’ అన్నారు గణేష్. ‘‘నిర్మాతగా నా తొలి చిత్రం ‘నాంది’ సక్సెస్ అయ్యింది. ‘నేను స్టూడెంట్ సర్’లో కూడా మంచి కంటెంట్ ఉంది’’ అన్నారు సతీష్ వర్మ. ‘‘గణేష్ కథతో పాటే ట్రావెల్ చేస్తారు. సతీష్గారిలాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు రాఖీ. -
ఓటీటీకి సిద్ధమైన స్వాతిముత్యం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అయిన తొలి చిత్రం 'స్వాతి ముత్యం'. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించింది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. డిజిటల్ ప్రీమియర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. ఈ చిత్రం ఈ నెల 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లలో సక్సెట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది. (చదవండి: Varsha Bollamma: వర్ష బొల్లమ్మ 'స్వాతిముత్యం' రిలీజ్ డేట్ ఫిక్స్..) కథ ఎలా ఉందంటే: 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల, ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం 'స్వాతిముత్యం'. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా 'స్వాతిముత్యం'ను దర్శకుడు లక్ష్మణ్ తీర్చిదిద్దారు. Overall ga #SwathimuthyamOnAHA, pakka entertainer 😉 Premieres Oct 28@VarshaBollamma #GaneshBellamkonda @vamsi84 @Lakshmankkrish2 @adityamusic pic.twitter.com/dO9W6yUFvD — ahavideoin (@ahavideoIN) October 18, 2022 -
గణేష్‌కు ఆ అదృష్టం దక్కింది
‘‘నా చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమైన ‘స్వాతిముత్యం’తోనే ప్రేక్షకులు తనను నటుడిగా అంగీకరించడం నాకు హ్యాపీగా ఉంది. దర్శకుడు లక్ష్మణ్‌ను కూడా ప్రేక్షకులు అంగీకరించారు. తొలి సినిమాతోనే ప్రేక్షకాదరణ పొందాలంటే అదృష్టం ఉండాలి. అది ‘స్వాతిముత్యం’తో గణేష్‌కు దక్కడం హ్యాపీ’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజైంది. సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ– ‘‘స్వాతిముత్యం’ రిలీజైన తొలి రోజు, రెండో రోజు కలెక్షన్స్ చూసి భయపడ్డాం. కానీ మూడో రోజు నుంచి వసూళ్లు పెరుగుతున్నాయి. మరోవైపు చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’ సినిమా ఉన్నా ‘స్వాతిముత్యం’కూ ప్రేక్షకాదరణ లభించింది. ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్లో చిరంజీవిగారు ‘స్వాతిముత్యం’ సినిమాను కూడా ఆదరించాలని చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు. గణేష్‌ను హీరోగా లాంచ్ చేసిన నాగవంశీ, చినబాబులకు రుణపడి ఉంటాను. ఓ నిర్మాతగా నేను కూడా ఇలాంటి లాంచింగ్‌ను గణేష్‌కు ఇచ్చి ఉండేవాడిని కాదేమో! ఇక బాలకృష్ణగారి ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాను రీ రిలీజ్ చేయడం వల్ల వచ్చిన ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలను బసవతారకం ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వనున్నాం. ఎన్టీఆర్‌గారి ‘ఆది’ సినిమాను కూడా రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఇక ‘జగదేకవీరుని కథ’ సినిమాను మళ్లీ తీయాలన్నది నాకున్న లక్ష్యాల్లో ఒకటి. ఎప్పటికైనా తీస్తా’’ అన్నారు. ‘‘తొలి సినిమాతోనే నటుడిగా నాకు ఇంత మంచి పేరు వస్తుందని ఊహించలేదు’’ అన్నారు గణేష్. ‘‘రిపీట్ ఆడియన్స్ ఉన్న చిత్రం ‘స్వాతిముత్యం’. నన్ను నమ్మి, ప్రోత్సహించిన నాగవంశీ, చినబాబు, బెల్లంకొండ గణేష్గార్లకు ధన్యవాదాలు. దర్శకుడిగా నా రెండో సినిమా కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే ఉంటుంది’’ అన్నారు లక్ష్మణ్ కె. కృష్ణ. -
బెల్లంకొండ గణేష్ కంటే బాల మురళీగానే తృప్తి కలిగింది : హీరో
బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజైంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ – ‘‘తెరపై గణేష్ కాదు.. బాలమురళీయే (సినిమాలో గణేష్ పాత్ర) కనిపిస్తున్నాడన్నప్పుడు నటుడిగా ఓ పది మార్కులు సాధించాననే తృప్తి కలిగింది. ఈ కథను నా దగ్గరకు తీసుకు వచ్చి, నా నుంచి నటనను రాబట్టుకున్న లక్ష్మణ్‌కు థ్యాంక్స్. ఈ కథను ఎక్కువగా నమ్మి, నిర్మించిన నాగవంశీగారికి రుణపడి ఉంటాను’’ అని అన్నారు. ‘‘ఓ సాధారణ కుటుంబంలో అనుకోని సమస్య వస్తే వారు ఏ విధంగా స్పందిస్తారు? అనే అంశం ఆధారంగా ఈ సినిమా చేశాం. కథ చెప్పగానే అంగీకరించిన గణేష్‌కు, కథను నమ్మి.. అదే నమ్మకాన్ని మా అందరిపై ఉంచిన నాగవంశీగారికి ధన్యవాదాలు’’ అన్నారు లక్ష్మణ్ కె. కృష్ణ. ‘‘స్వాతిముత్యం’ రిలీజ్‌కు ముందు చిరంజీవిగారు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు చిరంజీవిగారి ‘గాడ్‌ఫాదర్’, ‘స్వాతిముత్యం’ చిత్రాలు విజయాలు సాధించి నందుకు హ్యాపీగా ఉంది. ‘స్వాతిముత్యం’ సినిమాకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది’’ అన్నారు నాగవంశీ. దివ్య శ్రీపాద, సురేఖా వాణి పాల్గొన్నారు. -
మూవీ ఆఫర్స్ రావట్లేదు.. ఎందుకో కారణం తెలీదు: సురేఖవాణి
ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతో కంటే సోషల్ మీడియాతో మరింత పాపులర్ అయిన సురేఖవాణి కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట తెగ రచ్చ చేస్తుంటుంది. మోడ్రన్ డ్రస్సుల్లో కూతురితో పోటీపడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారామె. ఈ క్రమంలో సురేఖ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఈమధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖవాణి ఇటీవలె స్వాతిముత్యం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సందర్భంగా మూవీ టీం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆమె సినిమాలు ఎందుకు చేయట్లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. 'చాలామంది సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతున్నారు. అసలు మాదాకా వస్తే కదా చేయడానికి? మా వరకు అసలు అవకాశాలు రావట్లేదు. అలా ఎందుకు అవుతుందో నాకు కూడా తెలియదు. నేను సినిమాలు మానేశాను అని అనుకుంటున్నారు. అస్సలు కాదు. మంచి ఛాన్సులు వస్తే తప్పకుండా నటిస్తా. స్వాతిముత్యం సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చినందుకు సినిమా టీమ్‌కు ధన్యవాదాలు' అంటూ సురేఖవాణి ఎమోషనల్ అయ్యింది. -
ఆ స్టార్స్ పక్కన నా పోస్టర్ ఉండటం హ్యాపీ
‘‘సినిమా అంటే కేవలం ఫైట్స్, యాక్షనే అని నేను అనుకోవడం లేదు. కథలో పర్టిక్యులర్‌గా ఫలానా అంశాలు, లక్షణాలు ఉండాలని కోరుకోను. సినిమా బాగుంటే ఏ రకం జానర్ అయినా ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి చూస్తారు’’ అని బెల్లంకొండ గణేష్ అన్నారు. బెల్లకొండ గణేష్ హీరోగా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘స్వాతిముత్యం’. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్.. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో బెల్లంకొండ గణేష్ చెప్పిన విశేషాలు... ► చిన్నతనం నుంచే నాకు యాక్టర్ కావాలన్న ఆలోచన ఉన్నప్పటికీ 2016 నుంచే సీరియస్‌గా తీసుకున్నాను. 2017లో ముంబైలో, 2018లో యూస్‌లో యాక్టింగ్ కోర్సులు చేశాను. 2019 నుంచి కథలు వినడం మొదలుపెట్టాను. అలా 2020లో ‘స్వాతిముత్యం’ కథ విన్నాను. ఈ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఓ నటుడిగా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మి నిర్మాత నాగవంశీగారి దగ్గరకు వచ్చాను. ఆయనకూ ఈ కథ నచ్చింది. ► స్పెర్మ్ డోనేషన్ ఆధారంగా హిందీలో ‘విక్కీ డోనర్’ వచ్చింది. కానీ మా ‘స్వాతిముత్యం’ ఈ ఒక్క పాయింట్ ఆధారంగానే సాగదు. మరికొన్ని కొత్త అంశాలు ఉన్నాయి. వీటికి ఆడియ కనెక్ట్ అవుతారు. ► మా నాన్నగారు (నిర్మాత బెల్లంకొండ సురేష్) ‘స్వాతిముత్యం’ కథ విన్నారు. అయితే కథల ఎంపికలో నాదే తుది నిర్ణయం. ఈ సినిమాను మా బ్యానర్లోనే చేసి ఉండొచ్చు. అయితే మరో ప్రముఖ బ్యానర్లో చేయడం, లాంచ్ కావడం అనేది నాకు మరింత గౌరవాన్ని తీసుకువస్తుంది. మా నాన్న నిర్మాత కావడంతో నా చిన్నతనం నుంచే సెట్ వాతావరణం నాకు అలవాటు ఉంది. అయితే అప్పుడు కెమెరా వెనుక... ఇప్పుడు యాక్టర్‌గా కెమెరా ముందు. ► నా తొలి పది సినిమాలను పది రకాల జానర్స్‌లో చేయాలనుకుంటున్నాను. నా నెక్ట్స్ మూవీ ‘నేను.. స్టూడెంట్’ ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్. ఇక నేను హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో మొదలైన సినిమా షూటింగ్ యూఎస్‌లో చేయాలి. కోవిడ్ వల్ల అప్పట్లో కుదర్లేదు. ఇప్పుడు దర్శక–నిర్మాతలు ఓకే అంటే నేను రెడీ. ఎందుకంటే ఈ సినిమా సబ్జెక్ట్ కూడా బాగుంటుంది. ► చిరంజీవిగారి ‘గాడ్‌ఫాదర్’, నాగార్జునగారి ‘ది ఘోస్ట్’ సినిమాలు విడుదలవుతున్న రోజునే నేను హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘స్వాతి ముత్యం’ కూడా రిలీజ్ అవుతుండటం కాస్త టెన్షన్ గానే ఉంది. మల్టీప్లెక్స్‌లలో ఆ స్టార్ హీరోల సినిమా పోస్టర్స్‌తో పాటు నా సినిమాల పోస్టర్స్ కూడా కనిపిస్తుండటం కొంచెం హ్యాపీగా ఉంది. యాక్టర్‌గా నాకు వెంకటేశ్‌గారు స్ఫూర్తి. దర్శకులు రాజమౌళిగారి సినిమాలో నటించాలనేది నా డ్రీమ్. -
‘స్వాతిముత్యం’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
‘స్వాతిముత్యం’లో కాంట్రవర్షియల్ టాపిక్‌ని టచ్ చేశాం
బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘స్వాతిముత్యం’. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్ కె. కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ తాజాగా విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ‘స్వాతిముత్యం’ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. థియేటర్స్‌లో సినిమా చూశాక నవ్వుకుంటూ బయటకు వస్తారు. ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఇందులో టచ్ చేశాం. ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ని ఫన్ టోన్ లో చెప్పాం. ► ఇప్పుడొస్తున్న కొత్త డైరెక్టర్లు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. లక్ష్మణ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా తాను అనుకున్నది తీశాడు. మేం చిన్న చిన్న సలహాలు మాత్రమే ఇచ్చాం. ► కోవిడ్ తర్వాత ప్రతివారం కనీసం రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. మా చిత్రం కూడా గాడ్ఫాడర్, ఘోస్ట్ చిత్రాలతో విడుదలవుతుంది. ఇది కొంచెం రిస్కే కానీ తప్పలేదు. దసరా సీజన్ కాబట్టి బరిలో రెండు పెద్ద సినిమాలున్నా రిస్క్ తీసుకుంటున్నాం. ► గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మా సినిమా గురించి ప్రస్తావించడం ఆనందంగా ఉంది. చిన్న సినిమాలను ఆదరించమని చిరంజీవి ఎప్పుడూ కోరతారు. చిన్న సినిమాలను అభినందిస్తారు. అందుకే ఆయన ఇండస్ట్రీ పెద్ద అయ్యారు. ► ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ అమాయకంగా ఉంటుంది కాబట్టి స్వాతిముత్యం టైటిల్ సరిగ్గా సరిపోతుందని పెట్టాం. పైగా చిన్న సినిమాకి క్లాసిక్ ఫిల్మ్ టైటిల్ పెడితే మా సినిమా ప్రేక్షకులలోకి త్వరగా వెళ్తుందన్న ఉద్దేశంతో పెట్టాం. అయితే సినిమా చూశాక ఇది యాప్ట్ టైటిల్ అని అందరికీ అనిపిస్తుంది. ► బెల్లంకొండ సురేష్ గారు పెద్దబ్బాయిని సమంతను హీరోయిన్ గా పెట్టి గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇది అలా కాదు. ఈ సినిమాతో మంచి కాన్సెప్ట్ తో వచ్చాడన్న పేరు గణేష్‌కు వస్తుంది. -
మన ఇంటి కథలా ఉంటుంది : బెల్లంకొండ గణేష్
‘‘స్వాతిముత్యం’ లో నన్ను నేను మొదటిసారి బిగ్ స్క్రీన్‌పై చూసుకుంటే టెన్షన్‌గా ఉంది. ట్రైలర్లో చూసినట్టుగానే ఈ సినిమా చాలా సరదాగా మన ఇంట్లోనో, మన పక్కింట్లోనో జరిగే కథలాగా ఉంటుంది’’ అని బెల్లంకొండ గణేష్ అన్నారు. లక్ష్మణ్.కె.కృష్ణ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలసి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. అనంతరం బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ– ‘‘లక్ష్మణ్ చెప్పిన ‘స్వాతిముత్యం’ కథ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మాను. ఈ సినిమా అద్భుతంగా రావడానికి ప్రధాన కారణం వంశీగారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘స్వాతిముత్యం’ రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు.. కొత్త పాయింట్ ఉంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నాగవంశీఅన్నకు థ్యాంక్స్’’ అన్నారు లక్ష్మణ్.కె.కృష్ణ. ‘‘స్వాతిముత్యం’ సినిమా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వర్ష బొల్లమ్మ. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. ∙నాగవంశీ, వర్ష, గణేశ్, లక్ష్మణ్ -
అది నిర్మాతల నిర్ణయం.. కాస్త భయంగా ఉంది: ‘స్వాతిముత్యం’డైరెక్టర్
బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘స్వాతిముత్యం’. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్ కె. కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో లక్ష్మణ్ చెప్పిన విశేషాలు. ► సినిమాలంటే ఆసక్తితో ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే ఇండస్ట్రీకి వచ్చేశాను. ‘లాస్ట్ విష్’, ‘కృష్ణమూర్తిగారింట్లో..’ అనే షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ‘కృష్ణమూర్తిగారింట్లో..’కి మంచి ఆదరణ లభించింది. దీంతో ఓ సినిమా అవకాశం వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ నెక్ట్స్ నేను ‘సదా నీ ప్రేమలో..’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. ఆ తర్వాత ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేయాలనుకుని ‘స్వాతిముత్యం’ కథ రాశాను. ► ‘స్వాతిముత్యం’లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలమురళీ కృష్ణగా బెల్లంకొండ గణేష్ నటించారు. బాలమురళీ కృష్ణ ప్రభుత్వోద్యోగం సంపాదిస్తాడు. ఆ తర్వాత కుటుంబసభ్యులు అతనికి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నదే కథ. మా చుట్టుపక్కల గ్రామాల్లోని ఘటనలను కూడా పొందుపరిచాను. ► ఈ సినిమాకు ‘స్వాతిముత్యం’ టైటిల్‌ను నిర్మాత చినబాబుగారు సూచించారు. ఎక్కువగా అమాయక పాత్రలు ఉన్నాయి కాబట్టి ఈ టైటిల్ అయితే బాగుంటుందని భావించారాయన. ► చిరంజీవిగారికి నేను వీరాభిమానిని. ఆయన ‘గాడ్ ఫాదర్’ విడుదలవుతున్న రోజునే నా దర్శకత్వంలోని సినిమా రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. చిరంజీవి, నాగార్జున గార్లు వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న సమయంలో మా సినిమాను రిలీజ్ చేయడం అనేది నిర్మాతల నిర్ణయం. కానీ నాకు కాస్త భయంగానే ఉంది. మా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో.. ఫెస్టివల్‌కు రిలీజ్ అయితే బాగుంటుందని మేం భావించాం. -
నేను స్టూడెంట్ సార్
బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘నేను స్టూడెంట్ సార్!’. డైరెక్టర్ తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ‘నాంది’ వంటి హిట్ సినిమా నిర్మించిన ‘నాంది’ సతీష్ వర్మ ‘నేను స్టూడెంట్ సార్!’ని నిర్మించారు. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘నాంది’ సతీష్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. దర్శకుడు కృష్ణ చైతన్య మంచి కథ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. సముద్ర ఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రమోదిని ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: అనిత్ మధాడి. -
కాళ్లు కడిగిన హీరో, 'నువ్వు వర్జినా?' హీరోయిన్ సూటి ప్రశ్న
గణేష్ బెల్లంకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'స్వాతిముత్యం'. వర్ష బొల్లమ్మ కథానాయిక. లక్ష్మణ్ కె.కృష్ణ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని స్వాతిముత్యం ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర బృందం. 'ఏరా అమ్మాయిని కలిశావా..? పంతులు గారుతో ఇప్పుడే మాట్లాడాను...అమ్మాయి వాళ్ళ నాన్నకి పట్టింపులు ఎక్కువ పద్దతి అది ఇది అని బుర్ర తినేస్తాడంటాడేంటి?' అనే రావు రమేష్ మాటలతో వీడియో మొదలవుతుంది. హీరోయిన్ నువ్వు వర్జినా? అని ముఖం మీదే అడిగేసరికి ఖంగు తిన్నాడు హీరో. ఇక చివర్లో హీరో కాబోయే మామగారి కాళ్లు కడగడంతో.. ఎదవ... ఎదవ సన్నాసి నువ్వు కాదు.. ఆళ్లు నీ కాళ్ళు కడగాలి.. నా పరువు తీసేస్తున్నాడు ఈడు అంటూ రావు రమేష్ విసుక్కుంటాడు. అయితే గణేష్ మాత్రం.. కాళ్ళు ఎవరు కడిగితే ఏంటి నాన్న అని బదులివ్వడం నవ్వు పుట్టిస్తోంది. పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.