Bhagyashri Borse
-
ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిన భాగ్యశ్రీ కి వరుస ఆఫర్లు..
-
ఫీల్ గుడ్ షురూ
రామ్ పోతినేని హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేనిలు దర్శకుడు మహేశ్‌కు స్క్రిప్ట్ అందజేశారు. ‘‘యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కనున్న సినిమా ఇది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
టాలీవుడ్‌ను రూల్ చేయనున్న హీరోయిన్స్ విలే..
-
తెలుగులో తొలి మూవీ ప్లాఫ్.. ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్
సాధారణంగా హీరోయిన్లు నటించిన సినిమాలు ప్లాఫ్ అయితే కొత్తగా అవకాశాలు రావడం తక్కువ. అలాంటిది 'మిస్టర్ బచ్చన్' బ్యూటీకి మాత్రం క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు వస్తున్నాయి. భాగ్యశ్రీ.. తొలుత 'యారియన్ 2' అనే హిందీ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది. రవితేజ మూవీతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అయిపోయింది. మూవీ డిజాస్టర్ అయినప్పటికీ.. భాగ్యశ్రీ డ్యాన్సులు, గ్లామర్‌కి మార్కులు పడ్డాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)ఇప్పుడదే గ్లామర్ మరికొన్ని అవకాశాలు తీసుకొస్తోంది. ఇప్పటికే దుల్కర్ 'కాంత' సినిమాలో భాగ్యశ్రీ నటిస్తుండగా.. తాజాగా రామ్ పోతినేని కొత్త మూవీలోనూ ఈమెనే హీరోయిన్గా తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు.'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీతో ఆకట్టుకున్న డైరెక్టర్ మహేశ్ బాబు.. రామ్-భాగ్యశ్రీ సినిమాని తీస్తున్నాడు. నవంబర్ 21న ఈ ప్రాజెక్ట్ లాంచ్ కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ట్రెడీషనల్ లుక్స్‌లో కుర్రకారు మనసు దోచేస్తున్న భాగ్యశ్రీ... (ఫొటోలు)
-
మిస్టర్ బచ్చన్ హీరోయిన్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..
-
మరికొద్ది గంటల్లో ఓటీటీకి మిస్టర్ బచ్చన్.. ఎక్కడ చూడాలంటే?
మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సో జంటగా నటించిన చిత్రం'మిస్టర్ బచ్చన్'. హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఊహించని ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఓటీటీ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన మిస్టర్ బచ్చన్.. ఓటీటీ ప్రియులను అలరిస్తుందేమో చూడాలి.అసలు కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్‌కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
మద్రాస్ నేపథ్యంలో...
దుల్కర్ సల్మాన్ హీరోగా ‘కాంత’ సినిమా షురూ అయింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ– ‘‘ సురేశ్ ప్రోడక్షన్స్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మా స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు సరైన చిత్రం ‘కాంత’. సోమవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం’’ అన్నారు.‘‘మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన కథ ‘కాంత’’ అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. ‘‘1950 మద్రాస్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. మానవ బంధాలు, సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పంచేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని సెల్వమణి సెల్వరాజ్ పేర్కొన్నారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సాయికృష్ణ గద్వాల్, లైన్ ప్రోడ్యూసర్: శ్రవణ్ పాలపర్తి, కెమెరా: డాని శాంచెజ్ లోపెజ్, సంగీతం: జాను.దుల్కర్ చేతికి ‘క’ మలయాళ రిలీజ్ హక్కులుకిరణ్ అబ్బవరం హీరోగా నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలో విడుదలకానుంది. కాగా ‘క’ సినిమా మలయాళ థియేట్రికల్(వరల్డ్ వైడ్) రైట్స్‌ను హీరో దుల్కర్ సల్మాన్ ప్రోడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది. -
క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మిస్టర్ బచ్చన్ భామ.. ఆ హీరోతో మూవీ!
రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ చిత్రంలో మెప్పించిన ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఈ మూవీతో తన గ్లామర్‌తో తెలుగు అభిమానులను కట్టిపడేసింది. సితార్ సాంగ్‌లో తన అందచందాలతో ముగ్ధుల్ని చేసింది. మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో వస్తోన్న కాంత మూవీలో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ. ఇటీవలే దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో జరిగిన ఈ మూవీకి టాలీవుడ్ హీరో వెంకటేశ్ క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. 1950లో మద్రాసు నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వేఫేరర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. A collaboration of two creative powerhouses for an epic tale💥 @DQsWayfarerFilm and @SpiritMediaIN join forces for an exciting multilingual film #Kaantha ❤️🔥Starring @dulQuer #BhagyashriBorse Directed by #SelvamaniSelvaraj Produced by @DQsWayfarerFilm@RanaDaggubati pic.twitter.com/d0r91YIkM3— Wayfarer Films (@DQsWayfarerFilm) September 9, 2024 -
మిస్టర్ బచ్చన్ ప్లాప్ తో బోరుమంటున్నబోర్సే
-
హరీశ్ శంకర్ గురించి నేను అలాంటి కామెంట్ చేయలేదు: నిర్మాత
రవితేజ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్స్ మీడియా బ్యానర్‌పై నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈక్రమంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన క్రిటిసిజం, ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకుని ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నుంచి 13 నిమిషాల నిడివి తగ్గించారు. అయినా కూడా టికెట్లు మాత్రం తెగలేదు. ఈ సినిమా డిజాస్టర్ కావడానికి డైరెక్టర్ హరీశ్ శంకర్ అని నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ కామెంట్లు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ అంశం గురించి వారిద్దరూ ఒక క్లారిటీ ఇచ్చారు.స్క్రిప్ట్ బలంగా లేదు: టీజీవీ విశ్వప్రసాద్ మిస్టర్ బచ్చన్ సినిమాపై డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సినిమా రిజల్ట్ గురించి ఆయన ఇలా చెప్పారు.' సినిమా స్క్రిప్ట్ మరింత బలంగా ఉండాల్సింది. ఈ విషయంలో మేము మిస్‌ఫైర్ అయ్యాం. కొంత ఎడిట్ చేసింటే బాగుండేది. మిస్టర్ బచ్చన్ సెకండాఫ్ కాస్త నిరాశపరిచింది. అయితే, కొంతమంది సోషల్ మీడియాలో పనికట్టుకుని సినిమాపై తప్పుడు ప్రచారం చేశారు.'అని ఆయన చెప్పారు.టీజీ విశ్వప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు తమకు నచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. సినిమాను హరీశ్ శంకర్ నాశనం చేశాడని విశ్వప్రసాద్ అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా విశ్వప్రసాద్ తన ఎక్స్ పేజీలో రియాక్ట్ అయ్యారు. హరీష్ శంకర్ తనకు మంచి స్నేహితుడని ఆయన పేర్కొన్నారు. హరీశ్ శంకర్ గురించి తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, తాను అనని మాటలను మీడియా పెద్దవిగా చూపుతూ ప్రచారం చేసిందని చెప్పారు. హరీశ్ శంకర్ సినిమా మేకింగ్ మీద తనకు చాలా నమ్మకం ఉందని మరో సినిమా ఆయనతో కలిసి చేసేందుకు ఎదురుచూస్తున్నట్టుగా రాసుకొచ్చారు.డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా టీజీ విశ్వప్రసాద్ గురించి రియాక్ట్ అయ్యారు.. మీ సపోర్ట్ గురించి నాకు తెలుసు సార్.. అయితే, మీడియాలో మీరు అన్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం ఉందని నేను ఒక్క క్షణం కూడా నమ్మలేదు. మీతో కలిసి చేయబోయే తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తున్నా.. మంచి విజయాన్ని తప్పకుండా అందుకుంటాం. అయితే, మిస్టర్ బచ్చన్ విడుదల సమయంలో మీడియాపై హరీశ్ శంకర్ చేసిన కామెంట్ల వల్లే సినిమాపై వేగంగా నెగిటివ్ టాక్ వ్యాప్తికి కారణమైందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. -
రవితేజస్ మిస్టర్ బచ్చన్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రవితేజ-భాగ్యశ్రీ కాంట్రవర్సీ స్టెప్.. స్పందించిన హరీశ్ శంకర్
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలై మిక్స్డ్ టాక్ని సంపాదించుకుంది. కథ-కథనం బాలేకపోయినా.. సంగీతం మాత్రం అదిరిపోయిందని అంతా అంటున్నారు. పాటల విషయంలో హరీశ్ మరోసారి తన మార్క్ చూపించారని కొనియాడుతున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్కే సినిమాకు ప్లస్ పాయింట్ అని పలు వెబ్సైట్లు తమ రివ్యూల్లో పేర్కొన్నాయి. అయితే ‘సితార్’ పాటలో రవితేజ-భాగ్యశ్రీ బోర్సే వేసిన ఓ స్టెప్పు మాత్రం కాంట్రవర్సీకీ దారి తీసింది. (చదవండి: మిస్టర్ బచ్చన్ రివ్యూ)కొంతమంది నెటిజన్స్ ఆ స్టెప్పు తాలుకు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హరీశ్ శంకర్‌ని ట్రోల్ చేస్తున్నారు. చర్చనీయాంశమైన ఆ స్టెప్పు గురించి తాజాగా హరీశ్ శంకర్ స్పందించాడు. పాటలకు హీరోహీరోయిన్లు చేసే డ్యాన్స్‌ని ఫ్లోలో చూస్తే బాగుంటుందని.. స్క్రీన్ షాట్ తీస్తే ఇబ్బందిగానే కనిపిస్తుందని అని అన్నాడు.‘వాస్తవానికి ఆ పాటకు ఆ స్టెప్ అవసరం లేదని నాక్కుడా అనిపించింది. అయితే షూటింగ్ మొదటి రోజే ఆ పాటను షూట్ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆయన చాలా పెద్ద కొరియోగ్రాఫర్. ఆయన కంపోజ్ చేసిన మూమెంట్‌ని మొదటి రోజే నేను వద్దు అంటే బాగోదేమో అని ఆగిపోయాను. షూటింగ్ బిజీలో పడి అది పట్టించుకోలేదు. సెన్సార్‌లో కూడాఫ్లోలో చూశారు కాబట్టి ఓకే అయింది. ఎప్పుడైనా పాటల్లో డ్యాన్స్‌ని ఫ్లోలో చూడాలి. అలా కాకుండా స్క్రీన్ షాట్ తీసి చూస్తే చాలా వరకు ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంది’ అని హరీశ్ చెప్పుకొచ్చాడు. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రష్మిక ని డేంజర్ లో పెట్టిన Mr. బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ
-
'మిస్టర్ బచ్చన్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. ఎప్పుడు రావొచ్చు?
రవితేజ లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' థియేటర్లలోకి వచ్చేసింది. చాలా నమ్మకంతో ముందు రోజే ప్రీమియర్లు వేశారు కానీ టాక్ అయితే పాజిటివ్‌గా రాలేదు. రవితేజ ఎనర్జీ, కొత్తమ్మాయి భాగ్యశ్రీ గ్లామర్ పరంగా ఏ లోటు లేనప్పటికీ మిగతా విషయాలు పరమ రొటీన్‌గా ఉన్నాయని చూసిన వాళ్లు అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఎవరనేది కూడా తేలిపోయింది.(ఇదీ చదవండి: ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ)2018లో హిందీలో వచ్చిన సినిమా 'రైడ్'. ఓ సాధారణ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.. పలుకుబడి ఉన్న పెద్ద మనిషి ఇంటిపై రైడ్ చేసి ఎలా చెమటలు పట్టించాడనేదే స్టోరీ. దీనికి కాస్త ఎంటర్టైన్మెంట్ , రవితేజ మార్క్ వినోదం జోడించి తీసిన తెలుగు సినిమా 'మిస్టర్ బచ్చన్'. హీరోయిన్గా చేసిన భాగ్యశ్రీ గ్లామర్, డ్యాన్సుల వల్ల కాస్త హైప్ పెరిగింది. కానీ ఈ అంచనాల్ని మూవీ అందుకోలేకపోయిందని అంటున్నారు.ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో వచ్చిన మూవీస్ అన్నీ థియేటర్లలో రిలీజైన 28 రోజుల తర్వాత వచ్చేస్తున్నాయి. బచ్చన్ కూడా నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే సెప్టెంబరు రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అంతకంటే ముందే వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
తమ్ముళ్లూ... ఇరగదీయబోతున్నాం: రవితేజ
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాని మా డీవోపీ అయాంక చాలా కలర్ఫుల్గా, లడ్డూలా చూపించారు. ‘మిస్టర్ బచ్చన్’లో నేను, భాగ్యశ్రీ చాలా అందంగా కనిపించడానికి కారణం ఆయనే. మా డ్యాన్స్ మాస్టర్ భాను రెండు పాటలను ఇరగదీశాడు. భాస్కరభట్ల నాకు ఎన్నో పాటలు రాశాడు. ఈ మధ్య నాకు కాసర్ల, సాహితీ కూడా రాస్తున్నారు. కొత్త యాక్షన్ కో–ఆర్డినేటర్ పృథ్వీ చాలా కామ్‌గా ఉంటాడు. నాలుగు ఫైట్స్‌లో ఒక్క ఫైట్ తప్ప మిగతా మూడూ తనే చేశాడు. ఫైట్స్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు. ఇంకా ఇతర టీమ్ సభ్యులు కూడా బాగా హార్డ్‌వర్క్ చేశారు. మిక్కీ జే మేయర్ నుంచి అసలు ఇలాంటి మ్యూజిక్ వస్తుందని ఊహించలేదు. ఫస్ట్ టైమ్ ట్యూన్స్ వినిపించినప్పుడు ‘ఇది మిక్కీనా’ అనిపించింది. అంత మంచి పాటలు ఇచ్చాడు. వివేక్‌గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి. విశ్వప్రసాద్గారూ... మీ ఫ్యాక్టరీ ఇలానే రన్ అవ్వాలి. పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి. హరీష్ చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయి, మా కాంబినేషన్లో నెక్ట్స్ సినిమా హ్యాట్రిక్‌కి నాంది కావాలి. తమ్ముళ్లూ (అభిమానులను ఉద్దేశించి) ఇరగదీయబోతున్నాం’’ అన్నారు. ‘‘ఒక్కసారి కాదు మళ్లీ మళ్లీ చూసే సినిమా ఇది’’ అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఈ వేడుకలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేశ్ అతిథులుగాపాల్గొన్నారు. -
రష్మికా, త్రిప్తి డిమ్రికి షాక్.. నయా నేషన్ క్రష్ గా భాగ్యశ్రీ బొర్సే..
-
ఆ ఈలలు అమితానందాన్నిచ్చాయి: భాగ్యశ్రీ బోర్సే
‘‘నటి అవ్వాలనుకున్నప్పుడు భవిష్యత్ ఎలా ఉంటుందా అనిపించింది. దీనికి తోడు కొందరు కెరీర్లో వేగంగా ముందుకు వెళ్తుంటారు. వారిలా అవకాశాలు నాకు ఎప్పుడు వస్తాయా? అనే ఆలోచన కూడా ఉండేది. అయితే ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో నేను వేదికపైకి రాగానే ప్రేక్షకులు చేసిన హంగామా, ఈలలు చూసి నాకు అమితానందం కలిగింది. ఆ సమయంలో నాకు కన్నీళ్లొచ్చాయి (ఆనందంతో..)’’ అన్నారు భాగ్యశ్రీ బోర్సే. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో భాగ్యశ్రీ బోర్సే చెప్పిన సంగతులు.⇒ నా స్వస్థలం మహారాష్ట్రలోని ఔరంగాబాద్. మా నాన్నగారి ఉద్యోగ రీత్యా నైజీరియాలోని లాగోస్‌కు షిఫ్ట్ అయ్యాం. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ కోసం ముంబై వచ్చాను. గ్రాడ్యుయేషన్‌లో ఉండగానే మోడలింగ్ చేయమని నన్ను చాలామంది ప్రోత్సహించడంతో ట్రై చేద్దామనుకున్నాను. ఈ ఫీల్డ్ నాకు బాగా నచ్చింది. మెల్లిగా కెమెరా భయం కూడా ΄ోయింది. ఆ తర్వాత కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను ⇒ ‘మిస్టర్ బచ్చన్’లో తెలుగు మార్వాడీ అమ్మాయి జిక్కీపాత్రలో కనిపిస్తాను. కథలో జిక్కీపాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. మిస్టర్ బచ్చన్ (రవితేజపాత్ర)ను మోటివేట్ చేసేలా నా రోల్ ఉంటుంది. అయినా మహిళలు లేకుండా ఏ కథ పూర్తి కాదని నా అభి్ర΄ాయం. తెలుగు భాష మీద పట్టు సాధించి, జిక్కీపాత్రకు నేనే డబ్బింగ్ చెబుతానని హరీష్ శంకర్‌గారిని అడిగితే ఆయనప్రోత్సహించారు ⇒ హీరోగా రవితేజగారికి చాలా అనుభవం ఉంది. కానీ ఆయన ఓ కొత్త నటుడిగా సెట్స్‌లో కష్టపడతారు. పీపుల్ మీడియా వంటి ప్రముఖ సంస్థ ద్వారా హీరోయిన్గా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది. నాకు డ్యాన్స్ బ్యాగ్రౌండ్ లేదు. కానీ ఈ సినిమాలోని ‘రెప్పల్ డప్పుల్’, ‘సితార’పాటలకు మంచి స్పందన లభిస్తుండటం సంతోషాన్నిచ్చింది. ఇక నా నెక్ట్స్ మూవీస్ గురించి త్వరలో చెబుతాను. -
బ్లాక్ డ్రెస్‌లో కుర్రకారును మత్తెక్కిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ (ఫొటోలు)
-
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ అదిరిపోయే HD స్టిల్స్
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ ఫ్రెండ్‌షిప్‌డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
తెలుగు నేర్చుకుని మరీ...
ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే అవలీలగా తెలుగు మాట్లాడారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ద్వారా ఆమె తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలోని తనపాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆమె మాతృభాష తెలుగు కాదు. అయినప్పటికీ కష్టపడి తెలుగు నేర్చుకొని తనపాత్రకు డబ్బింగ్ చెప్పి అందర్నీ సర్ప్రైజ్ చేశారామె.ఆమె అంకితభావం ప్రశంసనీయం అని చిత్రబృందం పేర్కొంది. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది. -
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్.. అందానికే ఆధార్‌లా ఉందిరోయ్! (ఫొటోలు)
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)