bhuvaneswar kumar
-
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్‌గా
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైనప్పటకి ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బంతితో మాయ చేశాడు. 125 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ప్రోటీస్ బ్యాటర్లను చక్రవర్తి ముప్పుతిప్పలు పెట్టాడు. మార్క్రమ్, క్లాసెన్, హెండ్రిక్స్, మిల్లర్, జాన్సెన్ వంటి కీలక వికెట్లు పడొట్టి ఆతిథ్య జట్టును ఓటమి కోరల్లో చిక్కుకునేలా చేశాడు. కానీ ప్రోటీస్ బ్యాటర్ స్టబ్స్ అద్బుత పోరాటంతో తన జట్టును ఓటమి నుంచి తప్పించాడు. ఈ మ్యచ్‌లో వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఓ అరుదైన ఈ తమిళనాడు స్పిన్నర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.తొలి భారత బౌలర్‌గా..👉అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరపున ఐదు వికెట్ల హాల్ సాధించిన అతి పెద్ద వయుష్కుడిగా వరుణ్ రికార్డులకెక్కాడు. చక్రవర్తి 33 సంవత్సరాల 73 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(32 సంవత్సరాల, 215 రోజులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భువీ ఆల్‌టైమ్ రికార్డును వరుణ్ బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా ఓ టీ20 మ్యాచ్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత స్పిన్నర్‌గా చక్రవర్తి నిలిచాడు. ఈ జాబితాలో స్టార్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.👉ఓవరాల్‌గా టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా వరుణ్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో యజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ (రెండుసార్లు), భువనేశ్వర్ కుమార్ (రెండుసార్లు) ఉన్నారు.చదవండి: చాలా గర్వంగా ఉంది.. ఈ రోజు కోసమే అతడు ఎంతో కష్టపడ్డాడు: సూర్య pic.twitter.com/T5ZdA4gCWt— viratgoback (@viratgoback) November 10, 2024 -
బ్యాటింగ్‌లోనూ ఇరగదీసిన షమీ తమ్ముడు.. టాప్ స్కోరర్‌గా..!
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ తమ్ముడు మొహమ్మద్ కైఫ్ రంజీ ట్రోఫీ 2024లో ఇరగదీస్తున్నాడు. బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కైఫ్.. యూపీతో జరుగుతున్న మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. ఆంధ్రతో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి పర్వాలేదనిపించిన కైఫ్.. బెంగాల్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 4, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి అన్నకు తగ్గ తమ్ముడనిపించుకున్నాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కైఫ్ యూపీతో మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన కైఫ్.. 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 45 పరుగులు చేసి, తన జట్టుకు అతి మూల్యమైన పరుగులను అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. కైఫ్ (4/14), సూరజ్ సింధు (3/20), ఇషాన్ పోరెల్ (2/24) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే కుప్పకూలింది. అనంతరం టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ (8/41) విజృంభించడంతో బెంగాల్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (188) పరిమితమైంది. ఆఖర్లో కైఫ్ (45 నాటౌట్) రాణించకపోయి ఉంటే, యూపీకి పట్టిన గతే బెంగాల్‌కు కూడా పట్టి ఉండేది. బెంగాల్ ఇన్నింగ్స్‌లో కైఫ్‌దే అత్యధిక స్కోర్ కావడం విశేషం. అనంతరం కైఫ్ యూపీ రెండో ఇన్నింగ్స్‌లోనూ బంతితో (3/72) చెలరేగాడు. కైఫ్‌తో పాటు సూరజ్ సింధు ఓ వికెట్ తీయడంతో యూపీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 50 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
'టీమిండియా అత్యుత్తమ జట్టు.. మేము గట్టి పోటీ ఇస్తాం'
టీమిండియాతో టీ20 సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని ఐర్లాండ్ ఆల్‌రౌండర్ గ్రెత్ డెన్లీ తెలిపాడు. భారత జట్టులో భువనేశ్వర్ కుమార్, సుర్యకూమార్ యాదవ్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని డెన్లీ పేర్కొన్నాడు.ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. తొలి టీ20 ఆదివారం(జూన్ 26) డబ్లిన్ వేదికగా జరగనుంది. ఇక ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ కారణంగా కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా, షమీ వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో తొలి సారి ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా భారత జట్టుకు సారథ్యం వహించబోతున్నాడు. అయితే సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ.. కిషన్, శాంసన్, గైక్వాడ్, హార్షల్ పటేల్ వంటి యువ ఆటగాళ్లు ఉన్న భారత్‌ను ఓడించడం ఐర్లాండ్‌కు అంత సులభం కాదు. "సూర్యకుమార్ యాదవ్‌కి బౌలింగ్ చేయాలని ఉంది. అతడు 360 డిగ్రీల కోణంలోనూ షాట్స్ ఆడగల అధ్బుతమైన ఆటగాడు. అదే విధంగా భువనేశ్వర్ కుమార్ ప్రపంచ టీ20 క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. టీ20ల్లో అతడు చాలా తక్కువ ఎకానమీ రేటును కలిగి ఉన్నాడు. మేము ముందు ముందు ఆడేబోయే మ్యాచ్‌లకు ఈ సిరీస్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో ఆడడం ఎంతో సంతోషంగా ఉంది. టీ20ల్లో నెం1 జట్టుకు వ్యతేరేకంగా ఆడడం మాకు కఠినమైన సవాలు. అయితే ఈ రెండు మ్యాచ్‌లలోనూ భారత్‌కు గట్టి పోటీ ఇస్తామని" డెన్లీ పేర్కొన్నాడు చదవండి: ENG vs NZ: సెంచరీతో చెలరేగిన బెయిర్‌స్టో.. ఇంగ్లండ్ స్కోర్: 264/6 -
జట్టులో అతడు తప్ప వికెట్లు తీసే బౌలర్లు లేరు: సునీల్ గావస్కర్
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో 211 పరుగుల భారీ స్కోర్‌ను డిఫెండ్ చేయలేక చతకిలపడ్డ భారత బౌలర్లు.. కటక్ వేదికగా జరిగిన రెండో టీ20లోను చేతులుత్తేశారు. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటిస్ను పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ కుమార్ దెబ్బకొట్టాడు. అయితే మిగితా బౌలర్లు తీవ్రంగా విఫలమయ్యారు. యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ భారీగా పరుగులు సమర్పించకున్నారు. కాగా మ్యాచ్ అనంతరం టీమిండియా ఓటమిపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తీవ్రంగా నిరాశపరిచారని గావస్కర్ తెలిపాడు. “ఈ జట్టులో భువనేశ్వర్ కుమార్ తప్ప వికెట్లు తీసే బౌలర్లు లేకపోవడమే ప్రధాన సమస్య. సరైన సమయంలో వికెట్లు పడగొడితేనే.. ప్రత్యర్థి జట్టును ఒత్తిడికి గురిచేయవచ్చు. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ భువనేశ్వర్ కుమార్ మినహా ఎవరైనా వికెట్లు సాధించేలా కనిపించలేదు. అతడు బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడు. తొలి టీ20లో 211 పరుగులను డిఫెండ్ చేయలేకపోవడానికి కారణం కూడా బౌలర్లు విఫలం కావడమే అని గావస్కర్ పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022: 'టీ20 ప్రపంచకప్ భారత జట్టులో అతడు ఖచ్చితంగా ఉండాలి' -
'అతడొక యంగ్ కెప్టెన్.. రానున్న మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణిస్తాడు'
ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగిన తొలి టీ20లో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. 212 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేయడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. ఇక ఈ సిరీస్‌లో భారత జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే భారత్ ఓటమి పాలవ్వడంతో అతడిపై కొంతమంది విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో పంత్‌కు భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ మద్దతుగా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో బౌలర్లు విఫలమైనప్పటికీ.. రెండో టీ20లో తమ బౌలర్లు బలంగా తిరిగి వస్తారని భువనేశ్వర్ తెలిపాడు. "అతడు యంగ్ కెప్టెన్, అదే విధంగా కెప్టెన్‌గా అతడికి ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్. సిరీస్‌లో రానున్న మ్యాచ్‌ల్లో అతడు కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తాడు. కెప్టెన్ ఒక్కడే సరిగ్గా ఉంటే కాదు.. జట్టు మొత్తం రాణిస్తేనే విజయం సాధిస్తాము. తొలి మ్యాచ్‌లో మా బౌలింగ్ విభాగం తీవ్రంగా నిరాశపరిచింది. మేము బాగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించి ఉంటే.. అందరూ పంత్ నిర్ణయాత్మక నైపుణ్యాలను ప్రశంసించేవారు. కాగా మా తదుపరి మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణిస్తారని ఆశిస్తున్నాను" అని భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 కటక్ వేదికగా ఆదివారం జరగనుంది. చదవండి: ZIM vs AFG: నజీబుల్లా మెరుపు ఇన్నింగ్స్.. జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపు -
భువనేశ్వర్‌ను తీసేయండి.. అతడిని తీసుకోండి
Shardul Thakur: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా భారత్ నేడు కీలక మైన పోరులో న్యూజిలాండ్‌తో తలపడబోతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠత ఇంకా కొనసాగుతోంది. ఇక ఫామ్ కోల్పోయిన భువనేశ్వర్ కుమార్ స్ధానంలో తుది జట్టులో శార్ధూల్ ఠాకూర్‌కు అవకాశం కల్పించాలని మాజీలు, క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కోవలోనే భారత్ మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా కూడా చేరాడు. న్యూజిలాండ్‌తో జరగబోతున్న ఈ కీలకమైన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్‌ను తప్పించి శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్లో వీడియో షేర్ చేసిన ఆకాష్ చోప్రా.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ మార్పులు చేయాలా? వద్దా? అనే ఆంశంపై చర్చించాడు. "నా అభిప్రాయం ప్రకారం.. శార్దూల్ ఠాకూర్ గురించి టీమిండియా ఆలోచించాలి. నేనైతే అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని సూచిస్తాను. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలర్ అయినప్పటీకీ.. ప్రస్తుతం ఫామ్‌లో లేడు. ఠాకూర్‌కి వికెట్లు తీసే సత్తా ఉంది. అతడు పవర్‌ప్లేలో ఒక ఓవర్, మిడిల్ ఓవర్లలో ఒకటి లేదా రెండు ఓవర్లు, చివర్లో ఒక ఓవర్ వేయగలడు. నిజం చెప్పాలంటే ఫాస్ట్ బౌలర్ల విషయంలో శార్దూల్ తప్ప వేరే ఆప్షన్ టీమిండియాకు లేదు" అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: కోహ్లిని వెంటాడుతున్న ఆ చెత్త రికార్డు.. సోధి మళ్లీ మెరుస్తాడా! -
భువీ స్థానంలో అతనికి అవకాశం ఇస్తే మంచిదేమో!
Bhuvaneswar Repalce By Any Of These 3 Bowlers.. టి20 క్రికెట్లో బ్యాటింగ్ ఎంత ముఖ్యమో.. బౌలింగ్ కూడా అంతే అవసరం. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి టీమిండియాకు ఎంపికైన 15 మంది ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్నారు. బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించినప్పటికీ అక్టోబరు 10వరకు జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. ఐపీఎల్లో ఆటగాళ్లు చేసే ప్రదర్శన బట్టి వారి స్థానాలు మారిపోయే అవకాశం ఉందంటూ సెలక్టర్లు ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: T20 World Cup 2021: సూర్య, ఇషాన్‌లు ఫామ్‌లో లేరు.. ఆ స్థానాల్లో వీరే కరెక్ట్ ఇప్పటికే బ్యాటింగ్ విభాగంలో కీలకంగా భావిస్తున్న మిడిలార్డర్లోఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు ఫామ్ పేలవంగా ఉండడంతో వారి స్థానాల్లో శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, మయాంక్ అగర్వాల్ లాంటి బ్యాటర్స్‌కు అవకాశం ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా బౌలింగ్ విభాగంలోనూ ఆ కలవరం మొదలైంది. బుమ్రా, షమీలకు తోడుగా ఎంపిక చేసిన భువనేశ్వర్ కుమార్ అనుకున్నంత ఫామ్ కనబరచడం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న భువీ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో 8.53 ఎకానమీ రేటుతో కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. పేస్ బౌలింగ్ విభాగంలో హార్దిక్ పాండ్యా ఉన్నప్పటకీ అతని ఫిట్‌నెస్‌పై నమ్మకం లేదు. మ్యాచ్ జరిగేవరకు అతను బౌలింగ్ చేస్తాడా లేదా అనేది అనుమానమే. దీంతో భువీకి ప్రత్యామ్నాయంగా మరో పేస్ బౌలర్ అవసరం కనిపిస్తుంది. స్టాండ్ బై ప్లేయర్లలో శార్ధూల్ ఠాకూర్, దీపక్ చహర్ లాంటి నాణ్యమైన బౌలర్లు కనిపిస్తున్నప్పటికీ ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఆవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్‌లాంటి బౌలర్లకు అవకాశమిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం. దీపక్ చహర్: వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం దీపక్ చహర్ ప్రత్యేకత. బ్యాటర్ పొరపాటున బంతి వదిలేశాడో క్లీన్ బౌల్డ్ అవడం ఖాయం. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరే దీపక్ ప్రస్తుతం ఐపీఎల్లో సీఎస్కేకు ప్రధాన బౌలర్‌గా వ్యవహరిస్తున్నాడు. టి20 ప్రపంచకప్‌కు సంబంధించి భువీ స్థానంలో సరిగ్గా సరిపోయే పేస్ బౌలర్‌గా దీపక్ కనిపిస్తున్నాడు. డెత్ ఓవర్లలో యార్కర్లు సంధించడంలో దీపక్ చహర్ స్పెషలిస్ట్. సీఎస్కే తరపున 10 మ్యాచ్‌లాడిన చహర్ 7.75 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు.అంతేగాక టీమిండియాకు అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగలడు. చదవండి: Kohli-Rohit Rift: వాళ్లిద్దరి మధ్య విభేదాలా!.. మరోసారి నిరూపితమైంది మహ్మద్ సిరాజ్: టీమిండియా బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు. సిరాజ్ కెరీర్లో ఆసీస్ పర్యటన ఒక టర్నింగ్ పాయింట్. అక్కడినుంచి అతను టీమిండియాలో కీలక బౌలర్‌గా మారిపోయాడు. కానీ ఎందుకనో టి20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికచేయలేదు. ప్రస్తుత ఫామ్ దృశ్యా సిరాజ్ సేవలు టీమిండియాకు చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంది. టెస్టుల్లో స్థిరమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న సిరాజ్ అవకాశమొస్తే టి20ల్లోనూ చెలరేగే సత్తా ఉన్నవాడే. తన చూపులతో ప్రత్యర్థి బ్యాటర్స్‌ను భయపెట్టే సిరాజ్ ఆరంభ, డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు పరుగులు చేయకుండా అడ్డుపడుతూనే కీలక సమయంలో వికెట్లు తీయగలడు. ఇక ఐపీఎల్లో కోహ్లి సారధ్యంలోని ఆర్సీబీలో ఉన్న సిరాజ్‌పై కెప్టెన్ ఎంతో నమ్మకముంచాడు. ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లే తీసినప్పటికీ ఆర్సీబీ ప్రధాన బౌలర్‌గా కనిపిస్తున్నాడు. ఆవేశ్ ఖాన్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ప్రస్తుతం ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. ఇషాంత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆవేశ్ ఖాన్ వైవిధ్యమైన బౌలింగ్‌తో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో వికెట్లు రాబట్టడం ఆవేశ్ ఖాన్ ప్రత్యేకత. అదే అతన్ని ఢిల్లీకి ప్రధాన బౌలర్‌ను చేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7.55 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. చదవండి: T20 World Cup: టీమిండియాలోకి శ్రేయస్..? ఆ నలుగురిపై వేటు పడనుందా..? -
'ఏంటి భువీ.. మెహందీ వేయమంటే కరోనా డిజైన్ వేశావ్'
ఢిల్లీ: శ్రీలంక పర్యటన అనంతరం స్వదేశానికి చేరుకొన్న టీమిండియా స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో భువీ.. తన భార్య నుపుర్ నగర్‌తో మెహందీ డిజైన్ పోటీ పెట్టుకున్నాడు. నుపుర్ మెహందీ డిజైన్‌ను చక్కగా వేయగా.. భువీ మాత్రం మెమందీ డిజైన్ వేయమంటే.. కరోనా పోలిన డిజైన్ వేశాడు. ఇది చూసిన నుపుర్ ఊరుకోకుండా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరి మెహందీ ఫోటోలను షేర్ చేసింది. భువీని ట్రోల్ చేస్తూ.. '' మా ఆయన వేసిన డిజైన్ కరోనాను పోలి ఉంది.. మీరు ఒక లుక్కేయండి'' అంటూ కామెంట్ చేసింది. నుపుర్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''భువీకి ఇంకా కరోనా భయం పోలేదనుకుంటా.. మంచి డిజైన్ వేయమంటే కరోనా డిజైన్ వేశాడు..'' అంటూ కామెంట్లు చేశారు. ఇక భువనేశ్వర్ ఇటు బౌలర్‌గా.. అటు వైస్ కెప్టెన్‌గా శ్రీలంక పర్యటనలో అదరగొట్టాడు. మూడు వన్డేల సిరీస్‌లో మూడు వికెట్లు తీసి భారత్ 2-1తో సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక టీ20 సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లోనూ 4 వికెట్లు తీసిన భువీ ఆ తర్వాతి మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శనే కనబరిచాడు. అయితే టీమిండియా టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. కాగా భువనేశ్వర్ ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీల్లో ఆడేందుకు త్వరలోనే యూఏఈకి వెళ్లనున్నాడు. -
క్రీజులోకి వచ్చాడు కాబట్టి సరిపోయింది.. లేదంటే
కొలంబో: టీమిండియాతో జరిగిన రెండో టీ20లో శ్రీలంక బౌలర్ వనిందు హసరంగ ఒక అద్భుతమైన త్రోతో మెరిశాడు. భారత ఇన్నింగ్స్ సమయంలో హసరంగ కనీసం వెనక్కి కూడా తిరగకుండా బంతిని వికెట్ల మీదకు విసిరేయడం.. బంతి నేరుగా వెళ్లి వికెట్లు గిరాటేయడం జరిగిపోయింది. అయితే అప్పటికే భారత బ్యాట్స్‌మన్ క్రీజులోకి వచ్చేయడంతో రనౌట్ అయ్యే అవకాశం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. హసరంగ చేసిన ఈ ఫీట్‌ను భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చాలాసార్లు ప్రయోగించాడు.. అందులో కొన్నిసార్లు సక్సెస్ కాగా.. మరికొన్నిసార్లు విఫలమయ్యాడు. ఇక విషయంలోకి వెళితే.. భారత్ ఇన్నింగ్స్ సమయంలో హసరంగ వేసిన 18వ ఓవర్ రెండో బంతిని భువనేశ్వర్ కుమార్ మిడాన్ దిశగా షాట్ ఆడాడు. భువీ రెండో పరుగుకు పిలుపునివ్వడంతో నితీష్ రాణా పరిగెత్తాడు. ఇంతలో పీల్డర్ విసిరిన బంతిని అందుకున్న హసరంగ వెనుకవైపు నుంచే బంతిని వికెట్లకు గిరాటేశాడు. అప్పటికే నితీష్ రాణా క్రీజులోకి వచ్చేశాడు. '' క్రీజులోకి వచ్చేశాడు కాబట్టి సరిపోయింది.. లేదంటే హసరంగ అద్భుత త్రోకు రాణా పెవిలియన్ చేరేవాడే'' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. మ్యాచ్ విషయానికి వస్తే... తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (42 బంతుల్లో 40; 5 ఫోర్లు), తొలి మ్యాచ్ ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (18 బంతుల్లో 21; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. అకిల ధనంజయ రెం డు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి గెలుపొందింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధనంజయ డిసిల్వా (34 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), చమిక కరుణరత్నే (6 బంతుల్లో 12 నాటౌట్; 1 సిక్స్) కడదాక క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో సమమైంది. నేడే సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టి20 జరగనుంది. Watch Wanindu Hasaranga attempt an MS Dhoni 😮 Tune into Sony Six (ENG), Sony Ten 1 (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/QYC4z57UgI) now! 📺#SLvINDOnlyOnSonyTen #HungerToWin #MSDhoni pic.twitter.com/kjlZOYSwk2 — Sony Sports (@SonySportsIndia) July 28, 2021 -
సరిగ్గా నాలుగేళ్ల క్రితం; ఇదే శ్రీలంక.. అప్పుడు భువీనే
కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా సూపర్ విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) విజయంలో కీలకపాత్రపోషించగా.. చివర్లో భువనేశ్వర్ కుమార్ 19 నాటౌట్‌తో అతనికి సహకరించాడు. ఇద్దరి మధ్య ఎనిమిదో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం నమోదు అయింది. ఈ విజయంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా అచ్చం ఇదే తరహాలో 2017లో ఇదే శ్రీలంకపై భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో కూడా భువీనే ఉండడం విశేషం. ధోనితో కలిసి 8వ వికెట్‌కు 100 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడమే గాక అర్థసెంచరీతో రాణించాడు. ఆ మ్యాచ్ విషయానికి వస్తే.. 47 ఓవర్లలో 231 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉండగా.. లంక బౌలర్ అఖిల ధనుంజయ(6 వికెట్లు) దెబ్బకు భారత జట్టు 22 ఓవర్లలో 131 పరుగులకే ఏడు వికెట్ల కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. ఈ దశలోనే కెప్టెన్ ధోని అద్భుతం చేశాడు. భువనేశ్వర్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన ధోని 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడమేగాక జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక టీమిండియా ఆడిన వన్డేల్లో ఎనిమిదో వికెట్‌కు ధోని-భువీల సెంచరీ భాగస్వామ్యం తొలి స్థానంలో ఉండగా.. తాజాగా దీపక్ చహర్, భువీల మధ్య నమోదైన 84 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానంలో ఉంది. ఇక 2009లో ఆసీస్‌తో జరిగిన వన్డేలో ప్రవీణ్ కుమార్, హర్భజన్ జంట ఎనిమిదో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం నాలుగు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఇక మ్యాచ్ అనంతరం వైస్ కెప్టెన్ హోదాలో భువీ మాట్లాడుతూ.. '' ఈరోజు మ్యాచ్ అచ్చం నాలుగేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌ను తలపించింది. 276 పరుగులు చేధనలో 193 పరుగుల వద్ద నేను క్రీజులోకి అడుగుపెట్టాను. ఏం జరిగినా సరే దీపక్ చహర్‌కు అండగా చివరి వరకు నిలబడాలని గట్టిగా అనుకున్నా.. అంతా మ్యాజిక్‌లా జరిగిపోయింది. నేను చేసింది 19 పరుగులే కావొచ్చు.. కానీ నా కెరీర్‌కు ఇది చాలా బూస్టప్‌ను ఇస్తుంది. 2017లో జరిగిన మ్యాచ్‌లోనూ అంతే.. 131 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ధోని భయ్యాకు సహకరిస్తూ అర్థ సెంచరీ నమోదు చేశాను.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా నామమాత్రమైన చివరి వన్డే జూలై 22న జరగనుంది. Highest 8th wicket partnerships for India in ODIs - 1. MS Dhoni, Bhuvneshwar Kumar - 100* vs Srilanka, 2017 2. Deepak Chahar, Bhuvneshwar Kumar - 84* vs Srilanka, 2021#INDvSL #deepakchahar #bhuvaneshwarkumar #RahulDravid #MSDhoni pic.twitter.com/TAXgaar3Hq — Athul Sreevatsan (@AthulSreevatsan) July 20, 2021 DEEPAK CHAHAR HAS DONE THE IMPOSSIBLE. TAKE A BOW! India win the match & the series! 🤩 Final ODI, Friday on Sony Six (ENG), Sony Ten 1 (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV📺#SLvINDOnlyOnSonyTen #HungerToWin #SLvIND pic.twitter.com/fiujunPQQs — Sony Sports (@SonySportsIndia) July 20, 2021 -
ద్రవిడ్ టెన్షన్‌ను చూడలేకపోయాం.. ఓడిపోయుంటే
కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో దీపక్ చహర్ అద్బుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఓడిపోతున్నామన్న దశలో చహర్.. భువనేశ్వర్‌తో కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జోడించి మ్యాచ్‌ను గెలిపించడమేగాక .. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్న వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ విజయం అనంతరం పోస్ట్ ప్రెజంటేషన్లో స్పందించాడు. ''ఈరోజు ఒక అద్భుతమైన మ్యాచ్ చూశా. దీపక్ చహర్ సూపర్ ఇన్నింగ్స్ మమ్మల్ని నిలబెట్టింది. నా వరకు కీలక సమయంలో మరో వికెట్ పడకుండా అతనికి సహకరించడం సంతోషంగా ఉంది. ఇక మా కోచ్ రాహుల్ ద్రవిడ్ విజయం తర్వాత సంతోషంగా ఉంటారనుకుంటున్నా. ఎందుకంటే మ్యాచ్ సమయంలో ద్రవిడ్ కొన్ని సార్లు టెన్షన్‌కు లోనైనట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా దీపక్ చహర్ ఆడుతున్నప్పుడు అతని సోదరుడు రాహుల్ చహర్‌తో ద్రవిడ్ మాట్లాడడం కనిపించింది. అంతేగాక మ్యాచ్ సమయంలోనూ పదేపదే అటు ఇటు తిరగసాగాడు. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయుంటే పరిస్థితి ఎలా ఉండేదో.. ఈ సిరీస్‌కు ఆయన కోచ్‌గా ఉండడం మాకు సవాల్. ఇక మ్యాచ్ విజయం తర్వాత ద్రవిడ్‌లో మళ్లీ ఆ కూల్ కనిపించింది.ఇక క్లీన్ స్వీప్‌పై దృష్టి పెట్టాం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు.భారత బౌలర్లలో చహల్ (3/50), భువనేశ్వర్ (3/54), దీపక్ చహర్ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది. Some advice from Rahul Dravid to Rahul Chahar for passing to Deepak Chahar. #SLvIND pic.twitter.com/zItAYkkTzE — Johns. (@CricCrazyJohns) July 20, 2021 DEEPAK CHAHAR HAS DONE THE IMPOSSIBLE. TAKE A BOW! India win the match & the series! 🤩 Final ODI, Friday on Sony Six (ENG), Sony Ten 1 (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV📺#SLvINDOnlyOnSonyTen #HungerToWin #SLvIND pic.twitter.com/fiujunPQQs — Sony Sports (@SonySportsIndia) July 20, 2021 -
3093 బంతులు, దాదాపు ఆరేళ్లు.. ఒకే ఒక్క నోబాల్
కొలొంబో: లంకలో పర్యటిస్తున్న భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భువనేశ్వర్ కుమార్.. ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో నోబాల్ వేసిన భువీ.. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ తప్పును చేశాడు. 2015 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో చివరిసారిగా నోబాల్ వేసిన అతను.. 3093 బంతుల తర్వాత తిరిగి నోబాల్ వేశాడు. మొత్తంగా భువీ తన అంతర్జాతీయ కెరీర్లో కేవలం 5 నోబాల్స్ మాత్రమే వేయడం మరో విశేషం. Bhuvneshwar Kumar has bowled a No Balls after 5 years and 3093 international deliveries. — Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2021 8 ఏళ్లకు పైబడిన కెరీర్లో ఇన్ని తక్కువ నోబాల్స్ వేసిన బౌలర్ కేవలం భువీ మాత్రమే అయ్యిండొచ్చని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాగా, భువీ ఖాతాలోని నోబాల్ రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే మంగళవారం లంకతో జరిగిన మ్యాచ్‌లో భువీ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు. మొత్తంగా అంతర్జాతీయ కెరీర్లో 119 వన్డేలు, 21 టెస్ట్‌లు, 48 టీ20లు ఆడిన భువీ.. అతి తక్కువ ఎకానమీతో 247 వికెట్లు పడగొట్టాడు. That was Bhuvneshwar Kumar's first no-ball after October 2015 😳#SLvIND — Priya 🦋🦋 (@BabesPatiyala) July 20, 2021 Bhuvneshwar Kumar has bowled a No ball after 6 years in International Cricket. #INDvsSL #INDvSL pic.twitter.com/BNdPE4KVW1 — Noman Views (@Noman2294) July 20, 2021 -
కెప్టెన్‌గా గబ్బర్.. వైస్‌కెప్టెన్‌గా భువీ
ముంబై: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తొలిసారి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీమిండియా రెండో జట్టు జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పర్యటనకు వెళ్లే జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించింది. ధావన్ కెప్టెన్‌గా.. భువనేశ్వర్ కుమార్ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలనే దానిపై కొన్నిరోజులగా చర్చ నడుస్తుంది. రెండు రోజల క్రితం గబ్బర్ పేరు ఖరారైనట్లు వార్తలు రావడం.. తాజాగా అతనికే పగ్గాలు అప్పజెప్పడంతో చర్చకు బ్రేక్ పడింది. ఇక జట్టు విషయానికి వస్తే 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా.. ముందుగా ఊహించనట్టుగానే పృథ్వీ షా, పడిక్కల్, నితీష్ రాణా, సామ్సన్, రుతురాజ్, దీపక్ చహర్, చేతన్ సకారియాలు జట్టులో చోటు సంపాదించారు. అంతకముందు ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడిన సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు తన స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇక నెట్ బౌలర్లుగా ఇషాన్ పొరేల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్జిత్ సింగ్ ఉండనున్నారు.జూలైలో శ్రీలంకతో మూడు వన్డేలు.. మూడు టీ20లు ఆడనుంది. జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, యజువేంద్ర చహల్, రాహుల్ చహర్, కె.గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా. నెట్ బౌలర్లు: ఇషాన్ పొరేల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్జిత్ సింగ్ చదవండి: టీమిండియా ప్రాక్టీస్ అదుర్స్.. ఈ పర్యటనలో ఇదే తొలిసారి -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా భువీ..
దుబాయ్: మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎంపికైనట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం భువీతో పాటు జింబాబ్వే ప్లేయర్ సీన్ విలియమ్స్, అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్లు పోటీపడగా చివరికు ఈ అవార్డు భువీనే వరించింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన భువీ.. 4.65 ఎకానమీతో 6 వికెట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో అతను 6.38 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో భువీ ఏకంగా 17 డాట్ బాల్స్ వేయడం విశేషం. ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తున్న నేపథ్యంలో వరుసగా మూడో నెల కూడా టీమిండియా ఆటగాడినే ఈ అవార్డు వరించడం మరో విశేషం. జనవరి నెలకు వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఫిబ్రవరి నెలకు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్ లీ ఎంపికయ్యారు. ఈ విభాగంలో లిజెల్ లీతో పాటు రేసులో ఇద్దరు భారత అమ్మాయిలు(రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ రౌత్) ఉన్నప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లిజెల్ వైపే ఐసీసీ మొగ్గు చూపింది. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో టీమిండియా పేసర్
దుబాయ్: మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు నామినేట్ అయిన క్రికెటర్ల జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం ప్రకటించింది. పురుషుల విభాగంలో భారత్ తరఫున సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, జింబాబ్వే తరఫున సీన్ విలియమ్స్, అఫ్గనిస్థాన్ నుంచి రషీద్ ఖాన్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడిన భువీ.. 4.65 ఎకానమీతో 6 వికెట్లు, ఐదు టీ20ల సిరీస్‌లో 6.38 ఎకానమీతో 4 వికెట్లు సాధించాడు. వికెట్ల పరంగా భువీ కాస్త వెనుకపడినప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో పూర్తిగా సఫలమయ్యాడు. స్లాగ్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి, టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో 11 వికెట్లు, 3 టీ20ల సిరీస్‌లో 6 వికెట్లు సాధించి, భువీకి ప్రధాన పోటీదారుడిగా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్ సీన్ విలియమ్స్ 264 పరుగులతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. అదే జట్టుతో జరిగిన 3 టీ20ల సిరీస్‌లో అతను 128.57 స్ట్రయిక్ రేట్‌తో 45 పరుగులు సాధించాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ మహిళల విభాగంలో ఇద్దరు భారత అమ్మాయిల(రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ రౌత్)తోపాటు సౌతాఫ్రికా లిజెల్ లీ నామినేట్ అయ్యారు. కాగా, ఐసీసీ ఈ అవార్డులను ఈ ఏడాది జనవరి నుంచి ప్రకటిస్తూ వస్తుంది. పురుషుల విభాగంలో తొలి అవార్డు రిషబ్ పంత్(జనవరి) దక్కించుకోగా, ఫిబ్రవరి నెలకు గాను అశ్విన్ కైవసం చేసుకున్నాడు. మహిళల విభాగంలో జనవరి నెలకు షబ్నిమ్ ఇస్మాయిల్(దక్షిణాఫ్రికా), ఫిబ్రవరి నెలకు ట్యామి బీమౌంట్(ఇంగ్లండ్) ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. చదవండి: ముంబై ఇండియన్స్ కాకపోతే సన్‌రైజర్స్‌కే ఆ ఛాన్స్.. -
IND vs ENG 3rd ODI: భారత్ తీన్మార్
సిరీస్ విజేతను తేల్చే ఆఖరి పోరులో భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన చివరి వన్డేలో కోహ్లి బృందం ఏడు పరుగుల తేడాతో ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌పై నెగ్గింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను 3–1తో, టి20 సిరీస్‌ను 3–2తో దక్కించుకున్న టీమిండియా వన్డే ఫార్మాట్లోనూ పైచేయి సాధించి తమ సత్తా చాటుకుంది. 51 రోజులపాటు సాగిన ఈ సుదీర్ఘ పర్యటనలో పలుమార్లు ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ కీలక సమయాల్లో భారత్ దూకుడు ముందు తడబడి మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌లను సమర్పించుకొని తిరుగుముఖం పట్టింది. పుణే: ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన నిర్ణాయక సమరంలో భారత్ ఒత్తిడిని జయించి విజయాన్ని హస్తగతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో, అనంతరం బౌలింగ్‌లో తమ సత్తా చాటుకుంది. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఏడు పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున 200వ మ్యాచ్‌లో కెప్టెన్సీ చేసిన కోహ్లి మరోసారి టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులవద్ద ఆలౌటైంది. ధావన్ (56 బంతుల్లో 67; 10 ఫోర్లు), పంత్ (62 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన ఆటతో అర్ధ సెంచరీలు సాధించారు. రోహిత్ శర్మ (37 బంతుల్లో 37; 6 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (21 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్స్‌లు) కూడా రాణించారు. అనంతరం 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసి ఓడిపోయింది. మలాన్ (50 బంతుల్లో 50; 6 ఫోర్లు), స్టోక్స్ (39 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (31 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్స్) రాణించినా కీలక తరుణంలో అవుట్ అయ్యారు. అయితే స్యామ్ కరన్ (83 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) పట్టుదలతో ఆడి ఎనిమిదో వికెట్‌కు ఆదిల్ రషీద్ (22 బంతుల్లో 19; 2 ఫోర్లు)తో 57 పరుగులు... తొమ్మిదో వికెట్‌కు మార్క్ వుడ్ (21 బంతుల్లో 14; ఫోర్)తో 60 పరుగులు జోడించి ఇంగ్లండ్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. భారత్‌కు సునాయాసంగా దక్కాల్సిన విజయాన్ని తీవ్రంగా శ్రమించి మ్యాచ్ ఆఖరి బంతికి అందుకునేలా చేశాడు. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన పోరులో భారత్ నెగ్గినా... స్యామ్ కరన్ తన అసాధారణ పోరాటం తో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఆఖరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. భారత బౌలర్ నటరాజన్ నేర్పుతో బౌలింగ్ చేసి స్యామ్ కరన్‌ను కట్టడి చేసి కేవలం ఆరు పరుగులిచ్చి టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు. భారత బౌలర్లు భువనేశ్వర్ (3/42), శార్దుల్ (4/67) కీలక వికెట్లు తీశారు. స్యామ్ కరన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... బెయిర్‌స్టోకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. శతక భాగస్వామ్యం... భారత ఇన్నింగ్స్‌లో ధావన్, రోహిత్ తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. మెయిన్ అలీ బౌలింగ్‌లో రోహిత్ బౌల్డ్ కావడం... ఆ తర్వాత ధావన్, కోహ్లి (7), కేఎల్ రాహుల్ (7) వెంటవెంటనే అవుటవ్వడంతో భారత్ 157 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే పంత్–హార్దిక్ ఐదో వికెట్‌కు 99 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. పంత్, హార్దిక్ అవుటయ్యాక కృనాల్‌తో కలిసి శార్దుల్ ఠాకూర్ 45 పరుగులు జత చేయడంతో భారత స్కోరు 300 దాటింది. అయితే ఒక్కసారిగా భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది. 8 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోయి పూర్తి 50 ఓవర్లు ఆడకుండానే భారత్ 329 పరుగులవద్ద ఆలౌటైంది. సూపర్ భువనేశ్వర్... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఈసారి శుభారంభం లభించలేదు. ఫామ్‌లో ఉన్న జేసన్ రాయ్, బెయిర్‌స్టోలను భువనేశ్వర్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడింది. ఆ తర్వాత స్టోక్స్, మలాన్, బట్లర్, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ క్రీజులో నిలదొక్కుకుంటున్న క్రమంలో అవుట్ కావడంతో ఇంగ్లండ్ 200 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదలు కుంది. కానీ స్యామ్ కరన్ అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను ఆఖరి ఓవర్ వరకు తెచ్చినా ఇంగ్లండ్‌ను విజయతీరానికి చేర్చలేకపోయాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) రషీద్ 37; ధావన్ (సి అండ్ బి) రషీద్ 67; కోహ్లి (బి) అలీ 7; పంత్ (సి) బట్లర్ (బి) స్యామ్ కరన్ 78; రాహుల్ (సి) అలీ (బి) లివింగ్‌స్టోన్ 7; హార్దిక్ (బి) స్టోక్స్ 64; కృనాల్ (సి) రాయ్ (బి) వుడ్ 25; శార్దుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 30; భువనేశ్వర్ (సి) స్యామ్ కరన్ (బి) టాప్లీ 3; ప్రసిధ్ కృష్ణ (బి) వుడ్ 0; నటరాజన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్) 329 వికెట్ల పతనం: 1–103, 2–117, 3–121, 4–157, 5–256, 6–276, 7–321, 8–328, 9–329, 10–329. బౌలింగ్: స్యామ్ కరన్ 5–0–43–1; టాప్లీ 9.2–0–66–1; వుడ్ 7–1– 34–3; స్టోక్స్ 7–0–45–1; రషీద్ 10–0–81–2; అలీ 7–0–39–1; లివింగ్‌స్టోన్ 3–0–20–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (బి) భువనేశ్వర్ 14; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) భువనేశ్వర్ 1; స్టోక్స్ (సి) ధావన్ (బి) నటరాజన్ 35; మలాన్ (సి) రోహిత్ శర్మ (బి) శార్దుల్ 50; బట్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 15; లివింగ్‌స్టోన్ (సి అండ్ బి) శార్దుల్ 36; మొయిన్ అలీ (సి) హార్దిక్ (బి) భువనేశ్వర్ 29; స్యామ్ కరన్ (నాటౌట్) 95; రషీద్ (సి) కోహ్లి (బి) శార్దుల్ 19; వుడ్ (రనౌట్) 14; టాప్లీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 322 వికెట్ల పతనం: 1–14, 2–28, 3–68, 4–95, 5–155, 6–168, 7–200, 8–257, 9–317. బౌలింగ్: భువనేశ్వర్ 10–0–42–3; నటరాజన్ 10–0–73–1; ప్రసిధ్ కృష్ణ 7–0–62–0; శార్దుల్ ఠాకూర్ 10–0–67–4; హార్దిక్ పాండ్యా 9–0–48–0; కృనాల్ పాండ్యా 4–0–29–0. -
Ben Stokes: పెద్ద సీక్రెట్ రివీల్ చేసిన స్టోక్స్!
పుణె: టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో విశ్వరూపం ప్రదర్శించి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా, జట్టుకు కీలకమైన సమయంలో అతడు చేసిన 99 పరుగులు వంద కంటే ఎక్కువ విలువైనవి అనడంలో అతిశయోక్తి లేదు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్, 4 ఫోర్లు, 10 సిక్సర్లు బాది సత్తా చాటాడు. ఇక భువనేశ్వర్ బౌలింగ్‌లో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న స్టోక్స్, చివరికి అతడి బౌలింగ్‌లోనే పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా సుదీర్ఘంగా సాగుతున్న భారత పర్యటనలో ఇంతవరకు తన స్థాయి ప్రదర్శన కనబరచని స్టోక్స్ ఈ మ్యాచ్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో నిన్నటి నుంచి ట్రెండింగ్‌లో ఉన్న స్టోక్స్.. తమ జట్టుకు సంబంధించిన ఓ సీక్రెట్‌ను వెల్లడించి సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాడు. ఇంతకీ ఆ రహస్యం ఏమిటంటే.. ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లంతా మ్యాచ్ ముందు, మహిళలు వాడే డియోడ్రెంట్లే ఉపయోగిస్తారట. ఈ విషయం గురించి స్టోక్స్ మాట్లాడుతూ.. ‘‘ఆ సువాసన ఎంతో బాగుంటుంది. నాకైతే దానిమ్మకు సంబంధించిన ఫ్లేవర్ ఇష్టం. నేనొక్కడినే కాదు, మా టీం మొత్తం వుమెన్ డియోడ్రింట్లే ఉపయోగిస్తారు’’ అని చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై నెటిజన్లు తమదైన శైలిలో జోకులు పేలుస్తున్నారు. చదవండి: కోహ్లి మాస్టర్‌క్లాస్ కావొచ్చు.. అయితే నాకేంటి!? సారీ నాన్న.. ఆ మార్క్‌ను అందుకోలేకపోయా -
మాకే ఎందుకిలా జరుగుతుంది : వార్నర్
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గాయాల బెడద వదలడం లేదు. మిచెల్ మార్ష్ గాయంతో ఇప్పటికే టోర్నీకి దూరమవగా.. తాజాగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయపడ్డాడు. మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మొదటి బాల్ వేస్తుండగా ఎడమ తొడ కండరం పట్టేసింది. దీంతో ఓవర్ పూర్తి చేయకుండానే వెనుదిరిగాడు. కాగా ఖలీల్ అహ్మద్ మిగిలిన ఓవర్‌ను పూర్తి చేశాడు. మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భూవీ గాయంపై స్పందించాడు. (చదవండి :‘కోహ్లి కాన్ఫిడెంట్ అలా ఉంటుంది’) 'ఈ సీజన్లో మా జట్టును గాయాల బెడద పట్టి పీడిస్తుంది. మొన్నటికి మొన్న మార్ష్ గాయంతో వెనుదిరిగడం.. కేన్ విలియమ్సన్ గాయంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమవ్వడం.. తాజాగా భూవీ కూడా గాయపడడం చూస్తే మాకే ఎందుకిలా జరుగుతుంది అనే ప్రశ్న వస్తుంది. అయితే భూవీ గాయంపై ఇంకా క్లారిటీ లేదు. బౌలింగ్ చేస్తున్న సమయంలో భూవీ ఎడమకాలి తొండరం పట్టేసింది. దీంతో అతను పూర్తి ఓవర్ వేయకుండానే వెనుదిరిగడంతో ఖలీల్ అహ్మద్ మిగిలిన పని పూర్తి చేశాడు. అయితే గాయం తర్వతా భూవీ కొంచెం నడవడానికి ఇబ్బంది పడ్డాడు. భూవీ గాయం ఎంత తీవ్రం అనేది ఫిజియోథెరపీ పరిశీలించాకే తేలుతుంది. ఒకవేళ భూవి గాయంతో మ్యాచ్‌లకు దూరమవుతే మాకు పెద్ద దెబ్బే అని తెలిపాడు. కాగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైనా తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సన్‌రైజర్స్ మళ్లీ పోటీలో నిలిచింది. కాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రియమ్ గార్గ్ (26 బంతుల్లో 51 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, అభిషేక్ శర్మ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), మనీశ్ పాండే (21 బంతుల్లో 29; 5 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసి ఓడింది. జడేజా (35 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ ధోని (36 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. (చదవండి : 'ఆ ఎమోషన్‌ను చాలా మిస్సవుతున్నాం') -
యూవీ పోస్ట్: అందరి కళ్లు భువీ పైనే!
న్యూఢిల్లీ: జెండర్-స్వాప్ ఫేస్ యాప్ ద్వారా టీమిండియా ఆటగాళ్లను అమ్మాయిలుగా మార్చిన ఫొటోలను మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మీ స్నేహితురాలిగా వీరిలో ఎవరిని ఎంచుకుంటారు?’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తుంది. ప్రత్యేకించి పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు మంచి స్పందన లభిస్తోంది. అమ్మాయిగా భువీ చాలా అందరంగా ఉన్నాడంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘నా స్నేహితురాలిగా భువీని ఎంచుకుంటాను’ అంటూ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కామెంట్ చేయగా.. మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా భార్య రష్మా తాను కూడా అంటూ భజ్జీతో ఏకిభవించారు. (రోహిత్.. నువ్వు చాలా క్యూట్: చహల్) View this post on Instagram Who will you select as your 👯♀️ girlfriend’? 🤔🤣 I will reply tomorrow 🤪 A post shared by Yuvraj Singh (@yuvisofficial) on Jun 22, 2020 at 7:28am PDT అంతేగాక బాలీవుడ్ నటుడు ఆశిష్ చౌదరి ‘భువీ హాటెస్ట్’ అంటూ కామెంటు చేయగా, కరణ్ వాహి ‘నా ఓటు భువనేశ్వర్ కే’ అంటూ కామెంట్ చేశాడు. ‘నేను భువీని ఎంచుకుంటాను’ అంటూ భువనేశ్వర్ కూడా తనకు తానే ఎంచుకున్నాడు. టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ స్పందిస్తూ ‘‘ఈ జాబితాలో మీది కూడా ఉండాలని కోరుకుంటున్నాను యూవీ పా’’ అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. కాగా పొడవాటి లీవ్ హేర్‌స్టైల్, స్టైలిష్ లుక్‌లో ఆటగాళ్లంతా అమ్మాయిలుగా చాలా అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇంతకు ముందు చహాల్ కూడా ఈ యాప్ ద్వారా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను అమ్మాయిగా మార్చి ‘‘మీరు చాలా అందంగా ఉన్నారు రోహితా శర్మా భయ్యా’’ అంటూ షేర్ చేయడంతో అది వైరల్ అయిన విషయం తెలిసిందే. (‘యువీ.. నువ్వు ఇంకా ఆడతావనుకున్నా’) -
విండీస్‌తో టీమిండియా జట్టు ఇదే; భూవీకి పిలుపు
కోల్‌కతా : స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ 20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ కోల్‌కతాలో సమావేశమై జట్టును ప్రకటించింది. బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లి విండీస్‌తో జరిగే సిరీస్‌లో ఆడనున్నాడు. అయితే బంగ్లాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌శర్మకు ఈ సిరీస్‌కు విశ్రాంతినిస్తారని భావించినా వన్డే, టీ20 జట్లకు ఎంపిక చేశారు. ఇక ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న మరో ఓపెనర్ శిఖర్ ధవన్ మాత్రం తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇక స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి వన్డే, టీ20ల్లోకి పునారగమనం చేశాడు. తాజాగా ప్రకటించిన వన్డే, టీ20 జట్టు వివరాలు.. టీమిండియా వన్డే జట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ టీమిండియా టీ20 జట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ -
భువీ, బుమ్రా వచ్చేశారు
న్యూఢిల్లీ: టీమిండియా పేస్ బౌలింగ్ ప్రధాన అస్త్రాలైన భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా వెస్టిండీస్‌తో జరుగనున్న మిగతా మూడు వన్డేలకు జట్టులోకి వచ్చారు. సెలక్షన్ కమిటీ గురువారం జట్టును ప్రకటించింది. ఇందులో ఉమేశ్ యాదవ్ చోటు కాపాడుకోగా... మొహమ్మద్ షమీని తప్పించారు. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టును యథాతథం గా కొనసాగించారు. గాయం నుంచి కోలుకున్నా కేదార్ జాదవ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. మొదటి రెండు వన్డేలకు భువీ, బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. జాదవ్‌కు చోటు లేదు! ప్రస్తుత సిరీస్‌లో అనుకూల పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ చెలరేగుతుండటంతో ఇరు జట్ల బౌలర్లు చేసేదేమీ లేకపోతోంది. ముఖ్యంగా హిట్టింగ్‌కు పేరుగాంచిన విండీస్ బ్యాట్స్‌మెన్‌ను మన పేసర్లు, స్పిన్నర్లు అనుకున్నంతగా కట్టడి చేయలేకపోతున్నారు. రెండు వన్డేల్లో కలిపి ఉమేశ్ 142, షమీ 140 పరుగులిచ్చారు. అయితే, తొలి మ్యాచ్‌లో విఫలమైన షమీ... విశాఖపట్నంలో మెరుగ్గా (1/59) బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లలో యార్కర్లతో పరుగులు నిరోధించాడు. ఈ విషయంలో ఉమేశ్ కంటే మెరుగైన షమీని తప్పించడం ఆశ్చర్యకరంగా ఉంది. మరోవైపు బౌలింగ్ ఇలాగే ఉంటే వన్డే సిరీస్ నెగ్గడం కష్టమని భావించారో, ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టు కుని పూర్తి స్థాయి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం అనుకున్నారో కాని భువీ, బుమ్రాల విశ్రాంతిని ముగించారు. ఇక, ఫిట్నెస్ సంతరించుకుని గురువారం దేవధర్ ట్రోఫీలో భారత్ ‘ఎ’ తరఫున బ్యాట్‌తో రాణించి, ఐదు ఓవర్లు కూడా వేసిన జాదవ్‌ను తీసుకోకపోవడమూ కొంత చర్చకు తావిచ్చింది. నన్నెందుకు తీసుకోలేదో?: జాదవ్ విండీస్‌తో తదుపరి మూడు వన్డేలకు ఎంపిక చేయకపోవడంపై సెలక్షన్ కమిటీ నుంచి తనకెలాంటి సమాచారం లేదని ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ పేర్కొన్నాడు. ఢిల్లీలో దేవధర్ ట్రోఫీ ఆడుతోన్న అతడిని... టీమిండియాలోకి తీసుకోకపోవడం గురించి మీడియా అడగ్గా ‘ఈ విషయం మీ ద్వారా ఇప్పుడే తెలిసింది. నన్నెందుకు ఎంపిక చేయలేదో ఆలోచించాల్సి ఉంది. జట్టుతో లేను కాబట్టి వారి ప్రణాళికలేమిటో నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించాడు. తాను పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్తో ఉన్నట్లు తెలిపాడు. గాయాల నుంచి కోలుకున్నట్లు ఎన్సీఏ ప్రకటిస్తేనే ఏ టోర్నీ అయినా ఆడిస్తారని అన్నాడు. గురువారం భారత్ ‘ఎ’ తరఫున ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్ ఆడిన జాదవ్... 25 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ను ముగ్గురు జాతీయ సెలక్టర్లు వీక్షించడం గమనార్హం. కేదార్ జాదవ్ గాయాల చరిత్రే కారణం: ఎమ్మెస్కే కేదార్ జాదవ్‌ను టీమిండియాలోకి తీసుకోకపోవడానికి అతడి గాయాల చరిత్రే కారణమని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ‘గతంలో కోలుకొని జట్టులోకి వచ్చిన వెంటనే జాదవ్ గాయాలకు గురయ్యాడు. ఇటీవల ఆసియా కప్‌లో కూడా అదే జరిగింది. దీంతో పాటు దేవధర్ ట్రోఫీలో భారత్ ‘ఎ’ గురువారం నెగ్గి ఉంటే... అతడికి ఫైనల్ రూపంలో మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉండేది. అప్పుడు తన ఫిట్‌నెస్‌పై మేం పూర్తి భరోసాకు వచ్చేవాళ్లం. నాలుగో వన్డేకు భారత జట్టులోకి అదనపు ఆటగాడిగా తీసుకునేవాళ్లమేమో. జట్టు ఎంపిక సందర్భంగా మేం ఓ పద్ధతి అనుసరిస్తున్న తీరును ఆటగాళ్లు అర్థం చేసుకోవాలి’ అని ఎమ్మెస్కే పేర్కొన్నారు. -
భువనేశ్వర్ మారిపోయాడు!
‘భారత జట్టు ఆడే ప్రతీ టెస్టులో ఉండే అర్హత భువనేశ్వర్ కుమార్‌కు ఉంది. మా ప్రణాళికల్లో, ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో అతను కీలక భాగం కానున్నాడు’ కోల్‌కతా టెస్టులో అద్భుత ప్రదర్శన కనబర్చిన పేస్ బౌలర్ భువనేశ్వర్ గురించి మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంస ఇది. శ్రీలంకతో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భువీ ప్రదర్శన తర్వాత కెప్టెన్ అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. వన్డేలు, టి20ల్లో భువనేశ్వర్ ఆటపై అభినందనలు కొత్త కాకపోయినా... ఈసారి టెస్టు మ్యాచ్‌లో ప్రదర్శన ఒక్కసారిగా భువీ స్థాయిని పెంచేసింది. తన కెప్టెన్సీలో ఏడో టెస్టు మ్యాచ్ ఆడిన భువీపై కోహ్లి మొదటిసారి పూర్తి స్థాయిలో విశ్వాసం ప్రకటించడం విశేషం. రాబోయే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలను దృష్టిలో ఉంచుకొని అతను ఈ వ్యాఖ్యలు చేయగా... మారిన ఆటతీరుతో భువనేశ్వర్ కూడా దానికి తగిన అర్హత ఉందని నిరూపించుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం: భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించి సరిగ్గా ఐదేళ్లవుతుంది. ఈ మధ్య కాలంలో వన్డేల్లో, టి20ల్లో అతను తనదైన ముద్ర చూపించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను మొదట్లోనే పడగొట్టి శుభారంభం ఇచ్చినా... డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా చివర్లో కట్టడి చేసి మన జట్టుకు విజయం అందించినా అది భువీకే చెల్లింది. వన్డేల్లో బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారిస్తున్న ఈ రోజుల్లోనూ కేవలం 4.94 ఎకానమీతో అతని బౌలింగ్ సాగుతుండటం చూస్తే పరుగులు ఇవ్వడంలో భువీ ఎంత పొదుపరినో అర్థమవుతోంది. అయితే టెస్టులకు సంబంధించి మాత్రం భువనేశ్వర్ ఆ నమ్మకాన్ని కలిగించలేకపోయాడు. పిచ్ స్వింగ్‌కు అనుకూలిస్తుందని కచ్చితంగా అనిపించినప్పుడు మాత్రమే తుది జట్టులో అతనికి చోటు దక్కుతూ వచ్చింది. ఎవరికైనా ప్రత్యామ్నాయంగానే తప్ప రెగ్యులర్ బౌలర్‌గా స్థానం లేకపోవడంతో భువీ ఇప్పటికి 19 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. అయితే వచ్చే సిరీస్‌లలో భారత్ ఆడే ప్రతీ టెస్టులోనూ అతను ఉండే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌లో చెలరేగినా... భువీ కెరీర్లో తొలి ఆరు టెస్టుల్లో సొంతగడ్డపై అంతంత మాత్రం ప్రదర్శనే కనబర్చాడు. వీటిలో మొత్తం 9 వికెట్లు మాత్రమే అతను పడగొట్టగలిగాడు. అయితే కొంత విరామం తర్వాత అతనికి 2014 ఇంగ్లండ్ సిరీస్‌లో అవకాశం దక్కింది. అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రధానంగా స్వింగ్‌పై ఆధారపడే తన బౌలింగ్ శైలి కలగలిసి భువీ చెలరేగిపోయాడు. ఐదు టెస్టుల్లో కేవలం 26.63 సగటుతో 19 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ముఖ్యంగా లార్డ్స్ టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయంలో అతని 6 వికెట్ల పాత్ర కూడా ఉంది. అయితే కాలి మడమ గాయానికి తోడు వన్డేల్లో వైఫల్యం కారణంగా 2015లో అతను ఒక్క టెస్టుకే (సిడ్నీ) పరిమితమై అందులోనూ విఫలమయ్యాడు. ఇక ఆ తర్వాతి నుంచి టెస్టు జట్టులో రెగ్యులర్‌గా చోటు కరువైంది. అయితే లోపాలు సరిదిద్దుకొని దాదాపు ఏడాదిన్నర తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన అతను 7 టెస్టుల్లో మూడు సార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఘనతను నమోదు చేయడం విశేషం. సీమ్ బౌలింగ్‌కు అనుకూలించిన గ్రాస్ ఐలెట్‌లో (వెస్టిండీస్‌పై) 6 వికెట్లు, గత ఏడాది కోల్‌కతాలో (న్యూజిలాండ్)పై 6 వికెట్లు, ఇప్పుడు కోల్‌కతాలోనే లంకపై 8 వికెట్లు తన సత్తాను చూపిస్తున్నాయి. బలం, వేగం పెరిగాయి... కెరీర్ ఆరంభంలో భువనేశ్వర్ శారీరక దారుఢ్యం అంత గొప్పగా లేదు. బౌలింగ్‌లో కూడా గంటకు 125 కి.మీ. సాధారణ వేగంతో మిలిటరీ మీడియం పేస్‌తోనే అతను తన ఆట కొనసాగించాడు. అయితే వికెట్‌కు ఇరు వైపులా బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం భువీకి వికెట్లు తెచ్చి పెట్టింది. రెండేళ్ల క్రితం వేగం పెంచుకునే ప్రయత్నంలో తన బలమైన స్వింగ్‌ను కూడా కోల్పోయి రెండు రకాలుగా అతను నష్టపోయాడు. అయితే ఆ తర్వాత అతను తన లోపాలు సరిదిద్దుకున్నాడు. ముందుగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి ఫాస్ట్ బౌలర్‌కు తగిన విధంగా తన శరీరాన్ని మలచుకున్నాడు. ‘అతని బౌలింగ్‌లో వేగం పెరిగింది. అతని బంతి బ్యాట్‌కు చాలా బలంగా కూడా తగులుతోంది’ అని కోహ్లి చెప్పడం భువీలో వచ్చిన మార్పును సూచిస్తోంది. ప్రస్తుతం భువనేశ్వర్ బౌలింగ్ వేగం గంటకు 140 కిలోమీటర్లకు పెరగడం విశేషం. నిజానికి చాలా మంది పేసర్లు ఆరంభంలో బాగా వేగంగా బంతులు విసిరినా... రాన్రాను గాయాల భయంతోనో, మరో కారణంగానో వారిలో వేగం తగ్గిపోతుంది. కానీ భువీ అందుకు రివర్స్‌లో వేగం పెంచుకోవడం అసాధారణం అని మాజీ సెలక్టర్ విక్రమ్ రాథోడ్ చేసిన వ్యాఖ్య భువీ గురించి చెబుతోంది. దక్షిణాఫ్రికా పిలుస్తోంది... ‘తన బలం స్వింగ్‌ను ఎక్కడా కోల్పోకుండా దానికి వేగాన్ని కూడా జోడించడంతో ఇప్పుడు భువనేశ్వర్ ప్రమాదకరంగా మారాడు. సాంకేతికంగా చూస్తే అతను మణికట్టును వాడే తీరు అటు అవుట్ స్వింగర్, ఇటు ఇన్‌స్వింగర్‌ను అద్భుతంగా వేయడానికి ఉపయోగపడుతుంది’... మారిన భువీ ఆట గురించి భారత మాజీ పేసర్, కోచ్ వెంకటేశ్ ప్రసాద్ విశ్లేషణ ఇది. తాజా ప్రదర్శనను బట్టి చూస్తే దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో అద్భుతంగా బౌలింగ్ చేయగల సామర్థ్యం అతనికి ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. తన స్వల్ప కెరీర్లో భువనేశ్వర్ ఇంకా దక్షిణాఫ్రికాతో ఒక్క టెస్టు కూడా ఆడలేదు. అయితే ఇప్పుడు సఫారీ గడ్డపై తన సత్తాను ప్రదర్శించడంతో పాటు 2018లో ఇతర విదేశీ పర్యటనల్లో కూడా భారత రాతను మార్చడంలో కీలకం అవుతాడనడంలో సందేహం లేదు. పెళ్లి కొడుకాయెనె... స్వస్థలం మీరట్‌లో నేడు భువనేశ్వర్ వివాహం జరగనుంది. తన చిన్ననాటి స్నేహితురాలు నుపుర్ నాగర్‌ను గురువారం అతను వివాహమాడనున్నాడు. పెళ్లి కారణంగా శ్రీలంకతో జరిగే తర్వాతి రెండు టెస్టులకు కూడా భువీ దూరమయ్యాడు. భువీ వివాహ నేపథ్యంలో ‘మా జట్టులో మరో పులి బిడ్డ ఇకపై భార్యకు బానిస కాబోతున్నాడు’ అని ఓపెనర్ శిఖర్ ధావన్ సరదా వ్యాఖ్యతో అతడిని ఆట పట్టించగా...‘దానిని ప్రేమ అంటారు’ అంటూ భువీ అదే రీతిలో జవాబిచ్చాడు. నేను కెరీర్ ఆరంభంలో స్వింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడేవాడిని. అయితే అంతర్జాతీయ క్రికెట్ ఇంకా ఎక్కడ మెరుగవ్వాలో నేర్పిస్తుంది. నా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఫలితాలను అందిస్తోంది. – భువనేశ్వర్ -
విజయాన్ని చీకటి కమ్మేసింది!
-
విజయాన్ని చీకటి కమ్మేసింది!
ఈడెన్ గార్డెన్స్‌లో దురదృష్టం భారత జట్టుతో భుజం కలిపి నడిచింది. టెస్టు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ రోజు నేనున్నానంటూ మ్యాచ్ వెంట వచ్చిన చీకటిదే చివరకు పైచేయి అయింది. మరి కొద్ది సేపట్లో విజయానందంలో మునగాల్సిన జట్టు నిరాశగా పోరును ముగించాల్సి వచ్చింది. ముచ్చటగా మూడు వికెట్లు తీస్తే చాలు... తొలి టెస్టులో టీమిండియా గెలుపు ఖాయమనుకున్న సమయంలో వెలుతురులేమితో ఆట ఆగిపోయింది. ఈ దశలో 75/7 స్కోరుతో ఓటమికి చేరువైన లంక ఊపిరి పీల్చుకుంది. దాంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసిపోయింది.వర్షం బారిన పడి సగానికి పైగా ఓవర్లు తుడిచి పెట్టుకుపోయిన మ్యాచ్ ఆఖరి రోజు ఆటను విరాట్ కోహ్లి ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేశాడు. సహచరులు విఫలమైనా... అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ కెరీర్లో 50వ సెంచరీ సాధించి ప్రత్యర్థికి 231 పరుగుల లక్ష్యంతో సవాల్ విసిరాడు. భువనేశ్వర్, షమీ రివర్స్ స్వింగ్ దెబ్బకు తల్లడిల్లిన లంక ఏ దశలోనూ గెలుపు గురించి ఆలోచించలేకపోయింది. అయితే తొలి బంతి నుంచి అనూహ్య రీతిలో సాగిన టెస్టుకు ఐదో రోజు ఉత్కంఠభరిత ముగింపు లభించడం విశేషం. కోల్‌కతా: టపటపా వికెట్లు పడిపోతున్నాయి... ఒక వైపు భారత జట్టు ఆటగాళ్లలో ఆనందం కనిపిస్తుంటే మరోవైపు లంక జట్టులో ఆందోళన పెరిగిపోయింది. ఆటను కావాలని మరింత ఆలస్యం చేసే ప్రయత్నం, బంతి కనిపించడం లేదనే ఫిర్యాదు ఒకవైపు... అసహనంతో దానికి అభ్యంతరం చెప్పిన జట్టు మరోవైపు... అరుదైన రీతిలో భారత్, లంక ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం, అంపైర్ల జోక్యం... తొలి టెస్టులో చివరి రోజు ఘట్టాలు ఇవి! చివరకు ఇరు జట్లు సమంగా నిలిచాయి. భారత్, శ్రీలంక మధ్య ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. 231 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన శ్రీలంక.. మ్యాచ్ ముగిసే సమయానికి 26.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. భువనేశ్వర్ 4, షమీ 2 వికెట్లు తీశారు. దాదాపు మరో 20 ఓవర్ల ఆట మిగిలి ఉన్నా... వెలుతురులేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 352 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (119 బంతుల్లో 104 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) టెస్టుల్లో 18వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 8 కీలక వికెట్లు తీసిన భువనేశ్వర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో టెస్టు ఈ నెల 24 నుంచి నాగపూర్‌లో జరుగుతుంది. మళ్లీ లక్మల్ దెబ్బ... ఓవర్‌నైట్ స్కోరు 171/1తో చివరి రోజు ఆట కొనసాగించిన భారత్ తక్కువ వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లాగే పదునైన బంతులతో చెలరేగిన లక్మల్ మొదటి గంటలో భారత్‌ను దెబ్బ తీశాడు. ఆదివారం స్కోరుకు మరో ఆరు పరుగులు మాత్రమే జోడించిన రాహుల్ (125 బంతుల్లో 79; 8 ఫోర్లు) లక్మల్ బంతికి క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఒకే ఓవర్లో లక్మల్ మళ్లీ చెలరేగాడు. అతని అద్భుతమైన బౌన్సర్‌ను ఆడలేక పుజారా (22) స్లిప్‌లో క్యాచ్ ఇవ్వగా... రహానే (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. రహానే రివ్యూ చేసినా లాభం లేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన జడేజా (9) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. దాంతో లంచ్ సమయానికి భారత్ స్కోరు 251/5కి చేరింది. విరాట్ జోరు... లంచ్ తర్వాత 80 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరో ఎండ్‌లో అశ్విన్ (7), సాహా (5)లను షనక వెంటవెంటనే అవుట్ చేసి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ దశలో 58 పరుగులతో (93 బంతుల్లో) ఉన్న కోహ్లి ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. శ్రీలంక కొత్త బంతిని తీసుకోగానే అతను దూకుడు ప్రదర్శిస్తూ లక్మల్, షనక ఓవర్లలో బౌండరీలతో చెలరేగిపోయాడు. కోహ్లికి డీఆర్ఎస్ రూపంలో అదృష్టం కూడా కలిసొచ్చింది. అతను 72 పరుగుల వద్ద ఉన్నప్పుడు లక్మల్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించారు. అయితే కోహ్లి రివ్యూ కోరగా... రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లుగా తేలింది. ఎనిమిదో వికెట్‌కు కోహ్లితో 40 పరుగులు జోడించిన తర్వాత భువనేశ్వర్ (8) వెనుదిరిగాడు. చివరకు లక్మల్ బౌలింగ్‌లోనే ఎక్స్ట్రా కవర్ మీదుగా భారీ సిక్సర్ కొట్టి కోహ్లి తన సెంచరీని పూర్తి చేసుకోగానే భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సాహా అవుటయ్యాక కోహ్లి 26 బంతుల్లో 46 పరుగులు చేయడం విశేషం. భువీ జోరుకు... 231 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన శ్రీలంక భువనేశ్వర్, షమీ బౌలింగ్ ధాటికి కకావికలమైంది. వీరిద్దరి అద్భుత బౌలింగ్‌కు తోడు లంక బ్యాట్స్‌మెన్ స్వయంకృతం కూడా ఆ జట్టును ప్రమాదంలో పడేసింది. భువీ వేసిన తొలి ఓవర్లో దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి సమరవిక్రమ (0) వికెట్లపైకి ఆడుకున్నాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లో కరుణరత్నే (1) కూడా సరిగ్గా ఇదే తరహాలో అవుట్ కావడంతో టీ విరామానికి లంక 2 వికెట్లకు 8 పరుగుల వద్ద నిలిచింది. చివరి సెషన్లో కూడా భారత బౌలింగ్ జోరు కొనసాగింది. తిరిమన్నె (7)ను అవుట్ చేసి భువీ మరో దెబ్బ కొట్టగా, ఉమేశ్ చక్కటి బంతితో మాథ్యూస్ (12)ను ఎల్బీగా అవుట్ చేయడంతో లంక మరో కీలక వికెట్ కోల్పోయింది. ముందుగా అంపైర్ తిరస్కరించినా కోహ్లి రివ్యూతో ఈ వికెట్ భారత్ ఖాతాలో చేరింది. ఈ దశలో చండిమాల్ (20), డిక్వెలా (36 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి జట్టును రక్షించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు 54 బంతుల్లోనే 47 పరుగులు జత చేశారు. అయితే షమీ అద్భుత బంతితో చండిమాల్‌ను బౌల్డ్ చేసి ఈ జోడీని విడదీయగా, అదే స్కోరు వద్ద డిక్వెలాను భువీ అవుట్ చేశాడు. తన తర్వాతి ఓవర్లో అతను పెరీరా (0) ఆట కూడా ముగించాడు. ఈ దశలో శ్రీలంక ఓటమి ఖాయమనిపించింది. అయితే ఏడు బంతుల తర్వాత ‘లైట్ రీడింగ్’ ప్రమాణాల ప్రకారం తగినంత వెలుతురు లేదంటూ అంపైర్లు ఆట నిలిపివేయడంతో లంక బతికిపోయింది. సెంచరీల ‘హాఫ్ సెంచరీ’ విరాట్ కోహ్లి పరుగుల ప్రవాహం ఎల్లలు దాటి పరవళ్లు తొక్కుతూనే ఉంది. ఇప్పటికే తన పేరిట పలు రికార్డులు లిఖించుకున్న భారత కెప్టెన్ ఇప్పుడు అరుదైన జాబితాలో తనూ భాగమయ్యాడు. సోమవారం లంకపై సాధించిన శతకంతో అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు కలిపి) 50 సెంచరీలు సాధించిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (100) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడు విరాట్ కాగా... ఓవరాల్‌గా ఎనిమిదో ఆటగాడు. ఇతర ఆటగాళ్ళలో రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా–71 సెంచరీలు), సంగక్కర (శ్రీలంక–63), జాక్ కలిస్ (దక్షిణాఫ్రికా–62), హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా–54), జయవర్ధనే (శ్రీలంక–54), బ్రియాన్ లారా (విండీస్–53 సెంచరీలు) మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నారు. తన 348వ ఇన్నింగ్స్‌లో 50వ సెంచరీని అందుకున్న కోహ్లి, ఆమ్లా (348)తో సమానంగా అందరికంటే వేగంగా ఈ రికార్డు నమోదు చేశాడు. 2017లో కోహ్లికి ఇది 9వ సెంచరీ కావడం విశేషం. పుజారా ‘ఐదు రోజుల షో’ భారత బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా కోల్‌కతా టెస్టులో ఆసక్తికర ఘనతను నమోదు చేశాడు. ఒక టెస్టులో ఐదు రోజులు కూడా బ్యాటింగ్ చేసిన 9వ ఆటగాడిగా అతను నిలిచాడు. భారత్ తరఫున గతంలో ఎంఎల్ జయసింహ, రవిశాస్త్రి గతంలో ఐదు రోజుల పాటు ఏదో ఒక దశలో బ్యాటింగ్ చేశారు. ఈ ముగ్గురు కూడా ఈడెన్ గార్డెన్స్‌లో దీనిని సాధించడం విశేషం. బాయ్‌కాట్ (ఇంగ్లండ్), కిమ్ హ్యూస్ (ఆస్ట్రేలియా), అలెన్ లాంబ్ (ఇంగ్లండ్), గ్రిఫిత్ (వెస్టిండీస్), ఫ్లింటాఫ్ (ఇంగ్లండ్), అల్విరో పీటర్సన్ (దక్షిణాఫ్రికా) ఐదు రోజులు క్రీజ్‌లో గడిపిన ఇతర ఆటగాళ్లు. శ్రీలంకతో టెస్టులో తొలి రోజు 8 పరుగుల వద్ద నిలిచిన పుజారా, రెండో రోజు 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడో రోజు 52 పరుగుల వద్ద అవుటైన అతను, నాలుగో రోజు 2 పరుగుల స్కోరుతో అజేయంగా ఉన్నాడు. చివరి రోజు బ్యాటింగ్ కొనసాగించి 22 పరుగుల వద్ద అవుటయ్యాడు. ►1 సొంతగడ్డపై భారత స్పిన్నర్లు ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఇదే తొలిసారి కాగా మన పేసర్లు స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లో 17 వికెట్లు పడగొట్టడం కూడా మొదటిసారి కావడం విశేషం. మనకు అందుబాటులో ఉన్న సమయంలోనే ఫలితం రాబట్టడం ముఖ్యం. ఐదు రోజుల్లో పరిస్థితులు చాలా మారిపోయాయి. తొలి రెండు రోజులు వెనుకబడ్డ మేం మా అసలు సత్తాను ప్రదర్శించాల్సి వచ్చింది. ఇలాంటి పిచ్‌పై పట్టుదలగా ఆడితే తప్ప నిలవలేం. మొత్తంగా మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నాం. భువనేశ్వర్ బౌలింగ్‌లో వేగం పెరిగింది. అవకాశం లభించిన ప్రతీసారి భువీ తనను తాను నిరూపించుకున్నాడు. అతను ప్రతీ టెస్టులో ఉండాల్సిన ఆటగాడు. ముఖ్యంగా విదేశాల్లో అతని పాత్ర కీలకం. లంక కొత్త బంతిని తీసుకోగానే ఎదురు దాడి చేయాలని నిర్ణయించుకున్నాను. 50 సెంచరీలు సాధించడం సంతోషంగా ఉంది. సెంచరీలకంటే కూడా కీలక సమయంలో బాధ్యతతో బాగా ఆడటమే నాకు ఎక్కువ ఆనందాన్నిస్తుంది. నేను ఆటనుంచి తప్పుకునే వరకు కూడా నా ఆలోచనా ధోరణి ఇలాగే ఉంటుంది. – కోహ్లి, భారత కెప్టెన్ -
భువీ జోడీకి రెడీ...
న్యూఢిల్లీ: భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ బ్యాచిలర్ లైఫ్‌కి బైబై చెప్పేసి... త్వరలో ఓ ఇంటివాడవుతున్నాడు. అతని ఇంట పెళ్లి బాజా మోగనుంది. ఈ విషయాన్ని అభిమానులతో అతనే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. నుపుర్ నాగర్‌తో తనకు వివాహం జరుగనుందని చెప్పేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోను పోస్ట్ చేసిన భువీ ‘ఇదిగో ఈమె నా భాగస్వామి. పేరు నుపుర్ నాగర్’ అని పేర్కొన్నాడు. సరిగ్గా గత మే 11న తన పెళ్లి ముచ్చటను, పెళ్లి కూతుర్ని త్వరలోనే పోస్ట్ చేస్తానని ఇదే ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. అన్నట్లుగానే చెప్పేశాడు.